యోగాగురు రామ్‌దేవ్ బాబాకు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలికి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లోని టెస్టింగ్ లాబొరేటరీలో పతంజలి ఆహార ఉత్పత్తి నాణ్యతా పరీక్షలో విఫలమవడంతో పితోర్‌ఘర్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్‌తో సహా ముగ్గురికి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
వివరాల్లోకి వెళ్తే.. 2019లో ఉత్తరాఖండ్ పితోర్‌ఘర్‌లోని బెరినాగ్ ప్రధాన మార్కెట్‌లోని లీలా ధర్ పాఠక్ దుకాణంలో పతంజలి నవరత్న ఎలైచి సోన్ పాపిడి నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన తర్వాత, సోన్‌పాపిడి నమూనాలను సేకరించి డిస్ట్రిబ్యూటర్‌కు, పతంజలి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
నాణ్యత పరీక్షలో పతంజలి సోన్‌పాపిడి విఫలం కావడంతో రుద్రపూర్‌లోని టెస్టింగ్ లేబొరేటరీ.. రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి నోటీసు పంపింది. ఈ ఘటన తర్వాత దుకాణదారుడు లీలా ధర్ పాఠక్, డిస్ట్రిబ్యూటర్ అజయ్ జోషి, పతంజలి అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ కుమార్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురికి వరుసగా రూ. 5,000, రూ.10,000, రూ.25,000 చొప్పున జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
Comments
Please login to add a commentAdd a comment