Patanjali
-
కారంపొడిలో కలుషితాలు.. ఆ బ్యాచ్‌లో తయారైన ప్యాకెట్లు వెనక్కి..
బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని ఎఫ్ఎంసీజీ (FMCG) సంస్థ పతంజలి ఫుడ్స్‌కు (Patanjali Foods) గట్టి దెబ్బ తగిలింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని కారణంగా ఒక బ్యాచ్‌లో తయారైన మొత్తం ఎర్ర కారం పొడి ప్యాకెట్లను (chilli powder) రీకాల్ చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఆదేశించినట్లు పతంజలి ఫుడ్స్ తాజాగా ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలియజేసింది."ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2025 జనవరి 13 నాటి (2025 జనవరి 16న అందింది) ఆర్డర్ ప్రకారం బ్యాచ్ నెంబర్ AJD2400012 లో తయారైన పదార్థాలు (ఎర్ర కారం పొడి పాకెట్లు) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (కలుషితాలు, టాక్సిన్స్, అవశేషాలు) నిబంధనలు, 2011కి అనుగుణంగా లేనందున మొత్తం బ్యాచ్‌ను రీకాల్ చేయమని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌ని ఆదేశించిందని తెలియజేస్తున్నాం" ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.పతంజలి ఫుడ్స్ షేర్లు గురువారం (జనవరి 23) బీఎస్ఈలో దాదాపు అర శాతం తగ్గి రూ.1,855.30 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్‌పై సంవత్సర కాలంలో రాబడి దాదాపు 19 శాతం. పతంజలి ఫుడ్స్ గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్‌గా ఉండేది. 2019 డిసెంబర్లో రూ. 4,300 కోట్లకు పైగా వెచ్చించి బాబా రామ్‌దేవ్ కొనుగోలు చేశారు. గోధుమ పిండి నుండి నూనెలు, డెయిరీ.. పలు విభిన్న ఉత్పత్తులను ఎఫ్ఎంసీజీ సంస్థ విక్రయిస్తోంది. -
విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!
పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సహా వ్యవస్థాపకులు, యోగా గురువు బాబా రామ్‌దేవ్ అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారతదేశంలో లక్షల మంది సింథటిక్ డ్రగ్స్ వల్ల మరణిస్తున్నారని చెప్పారు. విదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు హానికరమైన మందులు తయారు చేసి వాటిపై ఆధారపడేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారతదేశంలో అల్లోపతి మందుల వాడకం వల్ల లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. విదేశీ ఫార్మా కంపెనీలు సింథటిక్ డ్రగ్స్‌పై ఆధారపడుతున్నాయి. ప్రజలకు తెలియకుండానే ఆ విషపూరిత మందులకు అలవాటు పడేలా చేస్తున్నాయి. ‘పతంజలి స్వదేశీ ఉద్యమం’లో అందరూ భాగస్వాములు కావాలి. స్వదేశీ, సహజ ఆరోగ్య సంరక్షణ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: నదులు, కాలువల ద్వారా సరుకు రవాణా..!పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పదోవ పట్టించేలా ఉన్నాయని గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆయా ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పడంతో కోర్టు వాటిని అంగీకరించింది. -
పతంజలికి రూ.4 కోట్లు జరిమానా: బాంబే హైకోర్టు
పతంజలి సంస్థకు బాంబే హైకోర్టు సోమవారం రూ.4 కోట్ల జరిమానా విధించింది. మంగళం ఆర్గానిక్స్ లిమిటెడ్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసుకు సంబంధించి.. కంపెనీ కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధిస్తూ 2023 నాటి మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ఈ జరిమానా విధించింది.పతంజలి కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని జస్టిస్ ఆర్ఐ చాగ్లా బెంచ్ పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం పతంజలికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ధర్మాసనం పేర్కొంది. కోర్టు గతంలో ఆదేశించినప్పటికీ కంపెనీ ఉత్పత్తి విక్రయాలు, తయారీని కొనసాగించడాన్ని గమనించిన బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.పతంజలి కంపెనీ మునుపటి డైరెక్టర్‌కు న్యాయవాది జల్ అంధ్యారుజిన కోర్టు ఆదేశాలను తెలియజేసినప్పటికీ.. ఆయన అనుసరించలేదని ప్రస్తుత డైరెక్టర్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు.. పాత డైరెక్టర్ తరపున ప్రస్తుత డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. అయితే జస్టిస్ చాగ్లా పతంజలికి రూ. 4 కోట్లు జరిమానా విధించింది. -
నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
యోగాగురు రామ్‌దేవ్ బాబాకు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలికి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లోని టెస్టింగ్ లాబొరేటరీలో పతంజలి ఆహార ఉత్పత్తి నాణ్యతా పరీక్షలో విఫలమవడంతో పితోర్‌ఘర్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్‌తో సహా ముగ్గురికి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు.వివరాల్లోకి వెళ్తే.. 2019లో ఉత్తరాఖండ్ పితోర్‌ఘర్‌లోని బెరినాగ్ ప్రధాన మార్కెట్లోని లీలా ధర్ పాఠక్ దుకాణంలో పతంజలి నవరత్న ఎలైచి సోన్ పాపిడి నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన తర్వాత, సోన్‌పాపిడి నమూనాలను సేకరించి డిస్ట్రిబ్యూటర్‌కు, పతంజలి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.నాణ్యత పరీక్షలో పతంజలి సోన్‌పాపిడి విఫలం కావడంతో రుద్రపూర్‌లోని టెస్టింగ్ లేబొరేటరీ.. రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి నోటీసు పంపింది. ఈ ఘటన తర్వాత దుకాణదారుడు లీలా ధర్ పాఠక్, డిస్ట్రిబ్యూటర్ అజయ్ జోషి, పతంజలి అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ కుమార్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురికి వరుసగా రూ. 5,000, రూ.10,000, రూ.25,000 చొప్పున జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు. -
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: యోగా విషయంలో బాబా రాందేవ్ చేస్తున్న కృషి మంచిదే కానీ.. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పతంజలి ఆయుర్వేద సంస్థ, బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలపై నమోదైన తప్పుడు ప్రకటనల కేసుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రభావం అధికంగా ఉందని. దానిని సరైన మార్గంలో ఉపయోగించాలని బెంచ్ సూచించింది. సుప్రీంకోర్టు జస్టిస్‌లు కోహ్లి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ద్విసభ ధర్మాసనం పేర్కొంది. పతంజలి తరపున సీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్ వాదిస్తూ.. తమ ప్రకటనలు ఇంకా ప్రచురిస్తున్న టీవీ ఛానెల్‌లకు పతంజలి లేఖలు రాసిందని, సందేహాస్పద ఉత్పత్తుల అమ్మకాలను పంజలి నిలిపివేసిందని కోర్టు చెప్పారు. రామ్‌దేవ్ యోగా కోసం చాలా చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రస్తావించగా.. యోగా కోసం ఆయన ఏం చేశారన్నది మంచిదే కానీ పతంజలి ఉత్పత్తుల విషయం భిన్నమైందని జస్టిస్ హిమ కోహ్లీ తెలిపారు. అలాగే బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపును ఇచ్చింది.అనంతరం మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పతంజలిని కోరింది. అఫిడవిట్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెనక్కి తీసుకోవడానికి పతంజలి ఎలాంటి చర్యలు తీసుకుంది, ఉత్పత్తుల స్టాక్స్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. రామ్‌దేవ్, బాలకృష్ణలపై కోర్టు ధిక్కరణ కేసుపై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై తదుపరి విచారణ జూలై 9న చేపడతామని పేర్కొంది. -
మెడికల్ బోర్డు చీఫ్‌పై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోషియేషన్(IMA) అధ్యక్షుడు డా. ఆర్వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తప్పు పట్టింది. భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో తాము అందిరికంటే ముందు ఉంటామని మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యవహరిస్తున్న తీరుపై ఓ ఇంటర్వ్యూలో అశోకన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అమానుల్లా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పతంజలి నకిలీ ప్రకటనల కేసులో అశోకన్ పిటిషన్‌గా ఉన్నారని గుర్తుచేసింది.‘మీ (అశోకన్) నుంచి మరింత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు ఆశించాం.కోర్టు తీర్పుకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలా హఠాత్తుగా మారటానికి కారణం ఏంటీ?’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.ఈ విషయంలో సుప్రీం కోర్టుకు అశోకన్ క్షమాపణలు తెలియజేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణలను ఒకవేళ కోర్టు అంగీకరిస్తే.. మిమ్మల్ని కించపరిచారని కోర్టు ఆశ్రయించారు. అలాంటప్పుడు మీకు ఎలాంటి పరీక్ష పెట్టాలి?’ అని కోర్టు నిలదీసింది. క్షమాపణల అఫిడవిట్‌పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బహిరంగంగా ఎందుకు క్షమాపణలు చెప్పలేదని ప్రశ్నించింది. ‘మీరు నిజంగా క్షమాపణలు చెప్పాలనుకుంటే మీ అఫిడవిట్‌ను ఎందుకు సరిదిద్దుకోలేదు? ఇంటర్వ్యూ అనంతరం మిమ్మల్ని మీరు ఏవింధంగా సరిదిద్దుకున్నారో చెప్పండి’అని ధర్మాసనం ప్రశ్నించింది.‘భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో మేము ముందుంటాము. కానీ స్వీయ నియంత్రణ ఉండాల్సిన సందర్భాలు ఉంటాయి. మీకు నియంత్రణ ఉన్నట్లు ఆ ఇంట ఇంటర్వ్యూలో మాకు కనిపించలేదు’అని జస్టిస్ హిమకోహ్లి అన్నారు. ‘న్యాయమూర్తులుగా మేము విమర్శలు ఎదుర్కొంటున్నా. మేము స్పందించము. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా అహం ఉండదు. మేము ఉన్నతస్థానంలో ఉన్నాం. మేము చర్యలు తీసుకోవడానికి అర్హులం. చాలా అరుదుగా మాత్రమే చర్యలు తీసుకుంటాం’అని జస్టిస్ అమానుల్లా అన్నారు. ‘మీరు ఇలాంటి వ్యాఖ్యలతో కోర్టు గురించి ఏమి చెప్పలేరు. ఇలాంటి వ్యాఖ్యలే మీపైనే చేస్తే ఏం చేసేవారు’అని కోర్టు ప్రశ్నించింది. అశోకన్ సమర్పించిన అఫిడవిట్‌ను చాలా చిన్న, ఆలస్యంతో కూడినదిగా కోర్టు పేర్కొంది.ఈ విషయంలో ఉరట కల్పించాలని అశోకన్ తరుఫు న్యాయవాది కోరగా జస్టిస్ కోహ్లి స్పందింస్తూ. మీరు ప్రతిదీ చెప్పడానికి లేదు. అశోకన్ ట్రాప్‌లో చిక్కుకున్నారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఈ కేసుపై విచారణను సుప్రీం కోర్టు జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. ఇక.. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ ఇప్పటికే రెండుసార్లు క్షమాపణలు తెలిపినా కోర్టు తిరస్కరించింది. -
తప్పుడు ప్రకటనలకు విరుగుడు ఎలా?
తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి సంస్థ విషయంలో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. 1954 నాటి చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. అయినా ఫలానా ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలువలు పలువలుగా చెప్పడం కొనసాగుతూనే ఉంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం ఒక్క సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్సావిధానాలు, మందుల గురించి ప్రచారం జరుగుతోంది. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు; చట్టాల అమలులో ఉదాసీనంగా ఉండటమే అసలు సమస్య.సుప్రీంకోర్టులో ఇటీవల ఓ ఆసక్తికరమైన వ్యవహారం నడిచింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి ఆయుర్వేద వ్యవస్థాప కుడు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేననీ, ధిక్కరణ కేసు విష యంలో క్షమాపణలు స్పష్టంగా, బహిరంగంగా తగు ప్రాధాన్యంతో చెప్పాల్సిందేననీ సుప్రీంకోర్టు పట్టుబట్టిన విషయం తెలిసిందే. తుది తీర్పు మాటెలా ఉన్నా... ఈ కేసు అటు మందుల తయారీదారుకు, ఇటు నియంత్రణ వ్యవస్థలు, ప్రభుత్వాలు, వినియోగదారులకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకీ ఏమిటీ కేసు? అన్నింటికీ కేంద్రంగా ఉన్నవి 1954 నాటి డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనల) చట్టం; 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం... దీని కింద 1945లో రూపొందించిన నిబంధనలను రామ్‌దేవ్ బాబాకు చెందిన సంస్థలు ఉల్లంఘించాయన్నది ఆరోపణ. 1954 చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. కొన్ని రకాల మందుల ప్రకటనకు సంబంధించి పరిమితులు విధిస్తోంది. క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, ఎయిడ్స్, ఊబకాయం, తక్కువ వయసు లోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం, అంధత్వం వంటి సమస్యల పరిష్కారానికి మందులున్నాయని ప్రకటనలు జారీ చేయకూడదు... ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలు వలు పలువలుగా చెప్పడం వంటివి. 1940 నాటి చట్టం... భారత్‌లో మందులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాలు తదితరాల తయారీ, పంపిణీ, అమ్మకాలకు సంబంధించిన ప్రాథమిక చట్టం.పతంజలి సంస్థ మధుమేహం మొదలుకొని థైరాయిడ్ సంబంధిత సమస్యలు, ఆఖరికి క్యాన్సర్ వ్యాధికీ మూలిక సంబంధిత మందులు ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ సంస్థ వ్యాధిని నయం చేస్తుందని చెబుతూ ‘కరోనిల్’ను ప్రవేశ పెట్టింది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీనికి మద్దతు పలికారు. ఈ మందుపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు మార్కెటింగ్‌లో ‘చికిత్స’ స్థానంలో ‘నిర్వహణ’ అని మార్చి చేతులు దులుపుకుంది పతంజలి. ఎన్నో వ్యాధులకు చికిత్స కల్పిస్తామని ప్రక టనలు జారీ చేయడమే కాకుండా, ఆధునిక వైద్య పద్ధతినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ అంశంపై విసుగు చెందిన కొందరు ఆరోగ్య కార్యకర్తలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు.. చట్టాల ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదు చేశారు. కోర్టు తగదని వారించినా తప్పుడు ప్రకటన జారీ మాత్రం ఆపలేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణకూ పాల్పడినట్లు అయ్యింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం పతంజలి సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. నిర్దిష్ట సమయాల్లో దేశంలోనిపత్రికలు, న్యూస్ ఛానెళ్లు కూడా ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్స పద్ధతులు, మందుల గురించి ప్రచారం చేస్తూంటాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనైతే ఇలాంటివి కుప్పలు తెప్పలు! తాజాగా సోషల్ మీడియా ‘ఇన్ఫ్లుయెన్సర్లు’ రంగంలోకి దిగారు. ప్రమాదకరమైన ఉత్పత్తులను కూడా వీరు ఆరోగ్యం పేరిట అమ్మడం, ప్రచారం చేయడం మొదలుపెట్టారు. పెద్ద కంపెనీలు నేరుగా ప్రకటనలు జారీ చేసే విషయంలో కొంత నిగ్రహం పాటిస్తాయి. బదులుగా పెయిడ్ న్యూస్, వైద్య సంబంధిత సదస్సుల ప్రాయోజకత్వం, వైద్యులకు గిఫ్టులు ఇవ్వడం వంటి అనైతిక చర్యల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేస్తూంటాయి. కొన్నేళ్ల క్రితం తగినన్ని సాక్ష్యాలు లేకపోయినా కొన్ని ఔషధాల సామర్థ్యం విషయంలో ఐఎంఏ స్వయంగా మద్దతు పలకడం చెప్పుకోవాల్సిన అంశం. వైద్యుల అనైతిక చర్యల విషయంలోనూ ఐఎంఏ రికార్డు ఏమంత గొప్పగా లేదు. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు. ప్రభుత్వాలు చట్టాలను అమలు చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూండటమే అసలు సమస్య. నియంత్రణ సంస్థలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి.హెచ్ఐవీ/ఎయిడ్స్‌కు చికిత్స కల్పిస్తామంటూ రామ్‌దేవ్ చేసిన ప్రకటనలను 2008లో నేను ఖండించాను. స్వయంగా వైద్యుడైన అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రామ్‌దేవ్‌కు నోటీసు జారీ చేసింది. కొంత కాలం గడిచిందో లేదో... మంత్రి ‘యూ టర్న్’ తీసుకున్నారు. గురుగ్రామ్‌లో రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగా సెషన్ లో కనిపించారు. ఆ వేదికపై కూడా రామ్‌దేవ్ హెచ్ఐవీ/ఎయిడ్స్‌ల చికిత్సకు తన మందులు ఉపయోగపడతాయని ప్రకటించుకున్నారు. దాదాపు ఈ సమయంలోనే సీపీఎం ఎంపీగా ఉన్న బృందా కారత్ ఈ రామ్‌దేవ్ వ్యవ హారాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రస్తుత కేసు సంగతికి వద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా ఉదాసీన వైఖరిని అవలంబించాయి. ఫలితంగా రామ్‌దేవ్ బాబా తన తప్పుడు ప్రకటనల జారీని యథేచ్ఛగా కొనసాగించగలిగారు. కేరళకు చెందిన ఆరోగ్య కార్యకర్త, ఆర్టీఐ ఉద్యమకారుడు డాక్టర్ కేవీ బాబు పతంజలి సంస్థపై వరుసగా ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని స్టేట్ లైసెన్సింగ్ అథారిటీకి పలుమార్లు లేఖలు రాశారు. దాంతో అధికారులు పతంజలి సంస్థ అలాంటి ప్రకటనలు జారీ చేయడం మానుకోవాలని లేఖ రాశారు. అంతేగానీ, అధికారం ఉన్నప్పటికీ చర్యలు చేపట్టలేదు. పైగా తప్పించుకునేందుకు మార్గమూ చూపించారు. 1954 చట్టం కింద కాకుండా డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్‌లోని నిర్దిష్ట నిబంధన కింద నోటీసు జారీ చేశారు. ఈ నిబంధనపై అప్పటికే ముంబై హైకోర్టులో ఓ కేసు నడుస్తూ ఉంది. దీంతో పతంజలి సంస్థ ఆ కేసును చూపి ప్రకటనల జారీ కొనసాగించింది. ప్రశ్నార్థకమైన ఈ నిబంధనను 2018లో ఒక సవరణ ద్వారా కలిపారు. ఆరోగ్య సంబంధిత ప్రకటనల జారీలో ముందస్తు అనుమతులను అది తప్పనిసరి చేసింది.ఆహార పదార్థాల ప్రకటనల్లో సెలబ్రిటీలు పాల్గొనడం, వాటి గురించి ఊదరగొట్టడం కూడా ఒక సమస్య. ఇలాంటి కేసుల్లోనూ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ పనితీరును నత్తను తలపించేదే. న్యూట్రాస్యూ టికల్స్, ఫుడ్ సప్లిమెంట్స్లకు సంబంధించిన ప్రకటనల విషయంలో ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో మారిపోతున్న మీడియా వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుంటే... ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలకు ఉన్న అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల (ఔషధాలు, సౌందర్య సాధనాలకు సంబంధించినవి) సంపూర్ణ సమీక్ష అవసరం. మందులు, ఆహార పదార్థాలు, సప్లిమెంట్ల వంటి అన్ని అంశాలకు సంబంధించిన, భారతీయ వైద్య విధానానికి సంబంధించిన చట్టాలను కూడా పూర్తిగా సమీక్షించాలి. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ప్రస్తుతమున్న చట్టాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీల పని తీరునూ సమీక్షించాలి. తగినన్ని వనరులు, అధికారాలు సమ కూర్చడం, స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించడం ద్వారా పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సుప్రీం ఆగ్రహం.. మరోసారి యాడ్‌తో క్షమాపణలు చెప్పిన పతంజలి
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘షరతులు లేని బహిరంగ క్షమాపణ’ పేరుతో యాడ్ ఇచ్చారు. ఈ కేసులో పతంజలి పత్రికల్లో క్షమాపణలు చెప్పడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. ముందుగా సోమవారం కూడా క్షమాపణలు కోరుతూ యాడ్స్ఇచ్చారు.కాగా కోవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి సంస్థ గతంలో ఇచ్చిన ప్రకటనల వివాదంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కోర్టు పలుమార్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. మంగళవారం విచారణ సందర్భంగా రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు చెప్పినా.. ‘ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. కోర్టుకు చెప్పినట్లే నేడు పెద్ద సైజులో యాడ్ ఇచ్చారు.సంబంధిత వార్త: నాటి అడ్వర్టైజ్మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా? -
పతంజలి ధిక్కార కేసులో మళ్లీ అక్షింతలు
న్యూఢిల్లీ, సాక్షి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. తదనంతర కోర్టు ధిక్కారణ పరిణామాల వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ తీరును తప్పుబట్టడంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం విచారణలోనూ ఆ కంపెనీ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై సుప్రీం కోర్టు మండిపడింది. పేపర్లో క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇచ్చినా కూడా.. కోర్టు వాళ్లను వదలకపోవడం విశేషం. ‘‘ఇవాళ్టి న్యూస్పేపర్లో ఇచ్చిన క్షమాపణల ప్రకటన.. గతంలో పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఫుల్‌పేజీ ప్రకటనల మాదిరే ఉన్నాయా?.. ఆ క్షమాపణల తాలుకా అక్షరాల సైజు కూడా ప్రకటనలప్పుడు ఇచ్చిన సైజులోనే ఉన్నాయా?’’ అంటూ ద్విసభ్య ధర్మాసనం పతంజలి ఆయుర్వేద్ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలను ప్రశ్నించింది. అయితే.. క్షమాపణల కోసం పతంజలి లక్షలు వెచ్చిందని, సమారు రూ.10 లక్షల ఖర్చుతో 67 పత్రికల్లో ఈ ప్రకటన ఇచ్చిందని పతంజలి తరఫు న్యాయవాది రోహత్గీ కోర్టుకు తెలియజేశారు. అలాంటప్పుడు.. గతంలో ఇచ్చిన ప్రకటనల మాదిరే ఈ క్షమాపణల ప్రకటన ఉందా? అని జస్టిస్ హిమా కోహ్లీ, పతంజలి న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రకటనల కోసం పతంజలి భారీగా ఖర్చు చేసిందని రోహత్గీ చెప్పగా.. దానివల్ల మాకొచ్చిన ఇబ్బందేం లేదంటూ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరోవైపు పతంజలిపై కేసు వ్యవహారంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌కు రూ.100 కోట్ల జరిమానా విధించాలంటూ ఒక విజ్ఞప్తి వచ్చిందని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై అనుమానాలున్నాయని బెంచ్ పేర్కొంది. అయితే ఆ అభ్యర్థనతో తమ క్లయింట్లకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది రోహత్గి కోర్టుకు వివరణ ఇచ్చారు. మరోవైపు పత్రికల్లో క్షమాపణలు మరింత పెద్ద సైజులో ప్రకటనలుగా ఇస్తామని రాం దేవ్ చెప్పడంతో ఈ కేసు విచారణను మరో వారం వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఇదిలా ఉంటే.. డయాబెటిస్, బీపీ లాంటి వ్యాధులను తమ కంపెనీ ఉత్పత్తులు నయం చేస్తాయని పతంజలి ఆయుర్వేద్ గతంలో ప్రకటనలు ఇచ్చుకుంది. అయితే ఆ తప్పుడు ప్రకటనల కేసులో ఇవాళ విచారణ ఉండగా, పతంజలి ఆయుర్వేద్ దేశవ్యాప్తంగా పలు ప్రముఖ జాతీయ దినపత్రికల్లో క్షమాపణలు చెబుతూ ప్రకటన ఇచ్చింది. కోర్టును తాము ఎప్పుడూ గౌరవిస్తామని, తప్పులు మరోసారి చేయబోమంటూ అందులో పేర్కొన్నారు. -
మీరేమీ అమాయకులు కాదు.. బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. బాబా రాందేవ్ అంత అమాయకుడు ఏం కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాందేవ్ బాబాది బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన అని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పు పట్టింది. పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును మంగళవారం జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన సుప్రీకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బాబా రాందేవ్, బాలకృష్ణ ఇద్దరూ సుప్రీకోర్టు విచారణకు భౌతికంగా హాజరయ్యారు. ‘మేము చేసిన తప్పిదాలకు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఆ సమయంలో మేము చేసింది సరైంది కాదు. మేము చేసిన తప్పును భవిష్యత్తులో కూడా మళ్లీ జగరకుండా గుర్తు పెట్టుకుంటాం’ అని బాబా రాందేవ్ కోర్టుకు విన్నవించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు ఏమి చేసినా.. అది మీ బాధ్యత మాత్రమే. మా ఆదేశాలను అనుసరించి క్షమాపణలు చెప్పారు. నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయలేరని మీకు తెలియదా?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దానికి రాందేవ్ స్పందిస్తూ.. తాము అనే పరీక్షలు చేశామని కోర్టుకు తెలిపారు. ‘మీది చాలా బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన. మీ క్షమాపణలు ఆమోదించాలా? వద్దా? అనే అంశంపై మేము ఆలోచిస్తాం. మీరు పదేపదే మా ఆదేశాలు ఉల్లంఘించారు’ అని జస్టిస్ హిమా కోహ్లి సీరియస్ అయ్యారు. ‘మీ క్షమాపక్షణలు హృదయం నుంచి రావటం లేదు’ అని మరో న్యామమూర్తి జస్టిస్ ఏ అమానుల్లా అన్నారు. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం ఏప్రిల్ 23కు వాయిదా వేసింది. చదవండి: మేమేం గుడ్డివాళ్లం కాదు.. బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం -
పతంజలి కేసు.. రాందేవ్‌పై మళ్లీ సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ, సాక్షి: కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. తామేం అంధులం కాదని, ఈ కేసులో ఉదారంగా ఉండాలని అనుకోవడం లేదంటూ ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో క్షమాపణలు తెలియజేస్తూ పతంజలి నిర్వాహకులిద్దరూ దాఖలు చేసిన అఫిడవిట్లను సైతం కోర్టు బుధవారం తిరస్కరించింది. అంతేకాదు.. తప్పుడు ప్రకటన విషయంలో నిర్లక్ష్యం వహించిన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంపైనా సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ‘‘వాళ్లు ఏదో పేపర్ మీద మొక్కుబడిగా క్షమాపణలు రాసి మాకు ఇచ్చారు. ఆ క్షమాపణల్ని మేం తిరస్కరిస్తున్నాం. పైగా ఉద్దేశపూర్వక ఉల్లంఘనలుగానే పరిగణిస్తాం’’ అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ‘ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. నిర్ణీత సమయంలోపు మాకు అఫిడవిట్లు పంపాలన్న ధ్యాసే వాళ్లకు లేనట్లు ఉంది. పైగా రాం దేవ్, బాలకృష్ణలు తమ క్షమాపణలను ముందుగా మీడియాకు తెలియజేశారు. వాళ్లు పబ్లిసిటీనే నమ్ముకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అది చిన్న తప్పా? ఆ సమయంలో పతంజలి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అఫిడవిట్లలో లోపం ఉందని ధర్మాసనానికి వివరించబోయారు. అయితే ‘లోపం’ అనే మాట చాలా చిన్నదంటూ ధర్మాసనం రోహత్గీకి బదులిచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా తప్పులు చేయడం ఏంటని మండిపడింది. ఈ కేసులో తాము ఉదారంగా ఉండాలని అనుకోవట్లేదని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ‘‘ ఈ వ్యవహారంలో ఉత్తరాఖండ్ అధికారులు ఏం చేయలేదు. లైసెన్సింగ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు సక్రమంగా పని చేయలేదు?. ఆ ముగ్గురు అధికారుల్ని ఒకేసారి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది’’ అని బెంచ్ అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, బాధ్యుల్ని చీల్చిచెండాడి తీరతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో కోర్టుకు హాజరు కాకుండా రాందేవ్, బాలకృష్ణ విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేశారని, ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంపై ఫైర్ పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఉత్తరాఖండ్ డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీపై సుప్రీం కోర్టు మండిపింది. ‘‘తప్పుడు ప్రకటన విషయంలో.. 2021లోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి లేఖ రాసింది. దానికి బదులుగా లైసెన్సింగ్ అథారిటీకి సదరు కంపెనీ బదులిచ్చింది. అయినప్పటికీ అథారిటీ కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టింది అని కోర్టు పేర్కొంది. ఇలా ఆరుసార్లు జరిగినా ఉత్తరాఖండ్ అధికార యంత్రాగం మౌనంగా ఉండిపోయిందని, పైగా కేంద్రం లేఖలు రాసినా ఎలాంటి నివేదిక రూపొందించలేదని కోర్టు గుర్తు చేసింది. కాబట్టే, ఆ అధికారుల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆ సమయంలో కోర్టుకు హాజరైన ఉత్తరాఖండ్ ఫుండ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ మిథిలేష్ కుమార్ రెండు చేతులు జోడించి ధర్మాసనం ఎదుట క్షమాపణలు చెప్పారు. తాను 2023లో బాధ్యతలు స్వీకరించానని, అంతకుముందే ఇది జరిగిందని, తనను వదిలేయాలంటూ ఆయన కోర్టుకు వివరించారు. అయితే కోర్టు మాత్రం కనికరించలేదు. ఆ మందులు తీసుకున్న అమాయకుల పరిస్థితి ఏంటంటూ కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలపగా.. చర్యలు ఇప్పుడు తీసుకున్నారా? అంటూ జస్టిస్ హిమా కోహ్లీ పెదవి విరిచారు. దీంతో క్షమాపణలు తెలిపిన ఆయన.. కఠిన తీసుకుంటామంటూ కోర్టుకు స్పష్టం చేశారు. ఎట్టకేలకు అఫిడవిట్లు.. ఇదిలా ఉంటే.. పతంజలి నుంచి తప్పుడు ప్రకటన వ్యవహారంలో సుప్రీం కోర్టు గతంలోనే ఈ ఇద్దరు నిర్వాహకుల్ని హెచ్చరించింది. దీంతో.. చట్టం, వాణిజ్య ప్రకటనలు, మార్కెట్ నిబంధనలను ఇకపై ఉల్లంఘించబోమంటూ సర్వోన్నత న్యాయస్థానానికి గత ఏడాది నవంబరు 21న పతంజలి తరఫున వీరు ప్రమాణ పత్రం సమర్పించారు. అయినప్పటికీ ఆ హామీలను పాటించకపోవడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం గత వారం వారిద్దరిపై కోర్టు ధిక్కారం కింద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ప్రమాణ పత్రం ఉల్లంఘనలపై చిత్తశుద్ధితో విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఈ పొరపాటును పునరావృతం కానివ్వబోమని వాగ్దానం చేశారు. దీనికిగాను వారిద్దరూ విడివిడిగా మంగళవారం సాయంత్రం అఫిడవిట్లు దాఖలు చేశారు. అదే సమయంలో.. ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అల్లోపతి ఔషధాల ప్రభావశీలతను తక్కువ చేసినందుకుగానూ పతంజలి ఆయుర్వేద సంస్థ తీరును ఆ అఫిడవిట్లో కేంద్రం తప్పుబట్టింది. పైగా కరోనాను తగ్గిస్తుందంటూ కరోనిల్ పేరిట పతంజలి చేసిన ప్రచారంపై సంస్థను అప్పట్లోనే హెచ్చరించినట్లు వెల్లడించింది. అయితే ఈ నివేదికపైనా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. IMA పిటిషన్.. తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఈ పిటీషన్ పైనే ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణల్లో.. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీం కోర్టు గత విచారణల్లో ఆదేశించింది. ఆ సమయంలో ఆ ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కళ్లు మూసుకుని ఉందంటూ కేంద్రంపై మండిపడింది సర్వోన్నత న్యాయస్థానం. -
బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఫైర్
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తప్పుడు ప్రకటన కేసులో ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వెల్లగక్కింది. ఈసారి కోర్టుకు హాజరైన ఆయనపై నేరుగానే మండిపడింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ సందర్భంలో బేషరతుగా ఆయన చెప్పిన క్షమాపణలను సైతం కోర్టు తోసిపుచ్చింది. పతంజలి కేసులో తమ ఆదేశాల్ని పాటించడం లేదంటూ రాందేవ్ బాబాతో పాటు ఆయన అనుచరుడు బాలకృష్ణపై కోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో మంగళవారం ఈ ఇద్దరు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘చర్యలకు సిద్ధంగా ఉండండి.. మరోసారి కోర్టుకు రండి’ అంటూ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో కిందటి నెలలో పతంజలి తరఫున వాళ్లు చెప్పిన బేషరతు క్షమాణలను సైతం కోర్టు తోసిపుచ్చింది. ‘‘మీ వివరణతో మేం సంతృప్తి చెందలేదు. మీ క్షమాపణల్ని మేం అంగీకరించం’’ అని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే వ్యక్తిగతంగా ఆ ఇద్దరు కోర్టుకు హాజరయ్యారని.. ఇక్కడి నుంచే క్షమాపణలు చెబుతున్నారని.. కోర్టు ఏం ఆదేశిస్తే దానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని.. వాళ్ల తరఫు లాయర్ చేతులు జోడించి మరీ బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేస్తూ విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ‘‘కోర్టు ఆదేశించినా కూడా మీరు అదే ప్రకటనలు ఇచ్చారంటే ఎంత ధైర్యం?. అసలు ఆ ప్రకటనల్లో శాశ్వత ఉపశమనం అన్నారు. అంటే దానర్థం ఏంటి?.. పూర్తిగా వ్యాధిని నయం చేస్తారనా?..’’ అని కోర్టు పతంజలి నిర్వాహకులిద్దరినీ ప్రశ్నించింది. అఫిడవిట్లో వీరు ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. వారం రోజుల్లోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది. మరోవైపు పతంజలి తప్పుడు ప్రకటనల వ్యవహారంలో కళ్లు మూసుకుని కూర్చుందంటూ గత విచారణలో(ఫిబ్రవరి 27న) కేంద్రంపైనా సుప్రీం కోర్టు మండిపడింది. బాబా పతంజలి స్పందన లేకపోవడంతో.. రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు గతంలోనే పలుమార్లు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెర్బల్ ఉత్పత్తులపై మోసపూరిత ప్రకటనలు చేస్తే ఒక్కొక్క ఉత్పత్తిపై భారీ జరిమానా తప్పదని తెలిపింది. కంపెనీ చేస్తున్న నిరాధారమైన, మోసపూరితమైన ప్రకటనలను ఆపివేయాలని, లేకపోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని తీవ్రంగా హెచ్చరించింది. అంతేకాదు..ఆ యాడ్స్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది కూడా. ఈ క్రమంలో.. జారీ చేసినా నోటీసులకు పతంజలి స్పందించలేదు. ఆపై విచారణలో.. ‘మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదు..?’ అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దానిలో భాగంగా ఇటీవల పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని వ్యాఖ్యానిస్తూ.. క్షమాపణలు తెలియజేసింది. తాజాగా వారు కోర్టు ముందుకు వచ్చారు. IMA పిటిషన్.. తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఈ పిటీషన్ పైనే ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణల్లో.. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీం కోర్టు గత విచారణల్లో ఆదేశించింది. పతంజలి సంస్థ కూడా డాక్టర్లను కించపరిచేలా వ్యవహరించటం సరికాదని పేర్కొంది. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి ప్రకటనలు చేయవద్దని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఆ ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ కంపెనీ
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేసినందుకుగాను పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. అసత్య ప్రచారాలను వెంటనే నిలిపేయాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే కంపెనీ ప్రతినిధులను ఆదేశించింది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు నోటీసులు పంపింది. అయితే నోటీసులకు సమాధానం చెప్పకపోవడంతో కోర్టు మరోసారి మందలించింది. దాంతో డైరెక్టర్ బాలకృష్ణ సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. పలు రకాల వ్యాధులను నయం చేస్తుందంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని గతంలో సుప్రీంకోర్టు సంస్థకు సూచించింది. వెంటనే ఆ తరహా ప్రకటనలు నిలిపివేయాలంది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అయితే ఆ హామీలను సంస్థ విస్మరించింది. ఈ వ్యవహారంపై ఇటీవల కోర్టు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయవద్దని మరోసారి సూచించింది. ఆ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వారిని ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు కోర్టు ఎదుట హాజరుకావాలని తెలిపింది. ఇదీ చదవండి: తండ్రిని ఇంట్లో నుంచి గెంటేసి తాజాగా ఆశీస్సులు కోరిన వైనం ఈ తరుణంలో పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని సంస్థ డైరెక్టర్ బాలకృష్ణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ తరహా ప్రకటనలు జారీ చేయకుండా చూసుకుంటామని చెప్పారు. కోర్టు నోటీసులకు బదులు చెప్పకుండా ఉన్నందుకు కోర్టుకు క్షమాపణలు తెలిపారు. -
కోర్టు ధిక్కారం.. బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు తమ ఎదుట స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు విధించింది. పతంజలి ఆయుర్వేదం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు(యాడ్స్)జారీ చేసిన క్రమంలో కోర్టు ధిక్కార నోటీసుపై స్పందించడంలో విఫలమైనట్లు కోర్టు తెలిపింది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రసారం చేస్తుందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌లు హిమా కోహ్లీ, అమానుల్లాతో కూడిన ద్విసభ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రామ్‌దేవ్‌పై సుప్రీం తీవ్ర స్థాయిలో మండిపడింది. గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ కేసులో స్పందన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్‌కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేయడమే కాకుండా.. కోర్టు ధిక్కారానికి సంబంధించి ఆయనపై ఎందుకు చర్చలు చేపట్టకూడదో వివరించాలని కోరింది. విచారణ సందర్భంగా బాబా రామ్‌దేవ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని కోర్టు ధిక్కార నోటీసుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. తమ క్లయింట్ అయిన రామ్‌దేవ్ బాబాను కోర్టుకు హాజరు కావాలని కోరింది. రామ్‌దేవ్‌తోపాటు పతాంజలి ఆయుర్వేదిక్ ఎండీ ఆచార్య బాలకృష్ణను కూడా కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. ఈ కేసులో బాబా రామ్‌దేవ్‌ను పార్టీగా చేర్చవద్దని రోహత్గీ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇద్దరినీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేయబోమని కూడా తెలిపింది. కాగా ఫిబ్రవరి 27న రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, ఊబకాయం వంటి ఇతర వ్యాధులకు సంబంధించి పతంజలి ఆయుర్వేదం అందించే మందులపై ప్రకటనలను ప్రచురించకుండా సుప్రీంకోర్టు నిషేధించింది. ఈ మేరకు పతంజలి ఆయుర్వేద్ ఎంపీ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు ధిక్కార నోటీసు జారీ చేసింది. అయినా పతంజలి కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీం సీరియస్‌గా వ్యవహరించింది. -
ఇక టెక్ గురూ.. సాఫ్ట్వేర్ బిజినెస్‌లోకి రాందేవ్ బాబా!
యోగాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాందేవ్ బాబా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భారతీయ యోగా, పురాతన ఆయుర్వేద చికిత్సల ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. యోగాతో పాటు ఆయుర్వేదం, వ్యాపారంలో సైతం ఆయన రాణిస్తున్నారు. తాజాగా రాందేవ్ బాబా నేతృత్వంలోని కంపెనీ సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెక్నాలజీ సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేసేందుకు పతంజలి ఆయుర్వేద్ ఆసక్తిని వ్యక్తం చేసింది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పుణేకు చెందిన అష్దాన్ ప్రాపర్టీస్ రోల్టాకు అత్యధిక బిడ్డర్‌గా ప్రకటించిన కొద్ది వారాలకే బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 830 కోట్లు ఆఫర్ చేసింది. పతంజలి ఆయుర్వేద్ తన ఆఫర్‌ను చేర్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని ఆశ్రయించింది. బిడ్డింగ్ ప్రక్రియలో సంస్థ చేరికను ప్యానెల్ నిర్ణయిస్తుంది. మూడుసార్లు దివాలా.. కమల్ సింగ్ అనే వ్యక్తి రోల్టాను డిఫెన్స్ ఫోకస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీగా ప్రమోట్ చేశారు. ఈ సంస్థ జనవరి 2023లో దివాలా ప్రక్రియలో చేరింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రూ. 7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని విదేశీ బాండ్ హోల్డర్లకు మరో రూ. 6,699 కోట్లు బకాయిపడింది. రోల్టా మొదటిసారిగా 2016లో విదేశీ కరెన్సీ రుణాలను డిఫాల్ట్ చేసింది. మూడుసార్లు దివాలా తీసివేసిన తర్వాత ఆఖరికి యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌తో ఎన్సీఎల్టీకి చేరింది. ఇదీ చదవండి: టెక్ ప్రపంచాన్ని శాసించిన బ్యాంకర్! ఇన్నాళ్లకు తెరపైకి.. కంపెనీ డిఫెన్స్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, పవర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, హెల్త్‌కేర్‌లలో సేవలు అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కాగా ఈ కాలంలో ఆదాయం రూ.38 కోట్లు మాత్రమే. రోల్టాకు ఉన్న రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ముంబైలోని ఆస్తులు బిడ్డర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. తమ హోమ్ డెలివరీ అప్లికేషన్ కోసం రోల్టా ఐటీ మౌలిక సదుపాయాలను పతంజలి ఆయుర్వేద్ పరిశీలిస్తున్నట్లు ఈటీ నివేదిక పేర్కొంది. -
పతంజలి యోగపీఠ్, భారత ఆర్మీ ఎంవోయూ
న్యూఢిల్లీ: పతంజలి ఇన్స్టిట్యూషన్స్, భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే, భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్లు, ఆటోమేషన్‌పై పని చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. సైనికుల ఆరోగ్యం కోసం యోగ, ఆయుర్వేద ఔషధాలపై పతంజలి పరిశోధన నిర్వహించనుంది. మరోవైపు, విశ్రాంత సైనిక ఉద్యోగులను నియమించుకునేందుకు పతంజలి, దాని అనుబంధ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. -
Patanjali: అది నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే: బాబా రామ్‌దేవ్
ఆధునిక వైద్య విధానాన్ని, అల్లోపతి ముందులను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత బాబా రామ్‌దేవ్ అల్లోపతి ‘డాక్టర్ల ముఠా’ తన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాబా రామ్‌దేవ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, సనాతన విలువలకు వ్యతిరేకంగా కొందరి వైద్యుల బృందం ప్రచారం చేస్తోంది. రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, కీళ్లనొప్పులు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల సమస్యలు వంటివాటికి పరిష్కారం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పతంజలి మందుల ద్వారా వ్యాధులు నయం అయ్యాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం ద్వారా మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, అధిక రక్తపోటు, ఉబకాయం వంటి ఎన్నో వ్యాధులను నయం చేస్తున్నాం. సుప్రీంకోర్టు, దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మేము నిజంగానే తప్పుగా ప్రచారం చేస్తే జరిమానా విధించండి. వైద్యుల బృందం అన్నట్లుగా మేము నిరాధార ఆరోపణలు చేసినట్లు నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. శతాబ్దాలుగా ఉన్న యోగా, నేచురోపతి, ఆయుర్వేద వైద్యాలపై గత ఐదేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనలు, ప్రీ, పోస్ట్ క్లినికల్ ట్రయల్స్, ప్రోటోకాల్‌లను కలుపుకొని పతంజలి 500 అధ్యయనాలు నిర్వహించింది’ అని రామ్‌దేవ్ అన్నారు. ఇదీ చదవండి: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు అల్లోపతి ఔషధాలకు వ్యతిరేకంగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు పతంజలిని ఆదేశించింది. ఇలాంటి ఉల్లంఘనను కోర్టు తీవ్రంగా పరిగణించనున్న కోర్టు ప్రతి తప్పుడు క్లెయిమ్‌కు గరిష్టంగా రూ.1 కోటి వరకు జరిమానా తప్పదని హెచ్చరించింది. -
యోగా గురు రామ్‌దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
Ramdev Land Rover Defender 130: యోగా గురువు ,పతంజలి ఆయుర్వేదానికి చెందిన రామ్‌దేవ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారా? దాదాపు 1.5 కోట్ల విలువైన కారును డ్రైవ్ చేస్తున్నవీడియో ఒకటి ప్రస్తుం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు నడుపుతూ రామ్‌దేవ్ దర్జా ఒలకబోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఆయన ఇతర లగ్జరీకార్ల కలెక్షన్స్, పతంజలి సంపద హాట్‌టాపిక్‌గా నిలిచింది. లగ్జరీ కార్ల కలెక్షన్ యోగా గురు రామ్‌దేవ్ కార్ల కలెక్షన్ కూడా ఆసక్తికరం. మహీంద్రా XUV700, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ ఎవోక్ , జాగ్వార్ XJLలాంటి లగ్జరీ కార్లు అతని గ్యారేజ్‌లో ఉన్నాయి. మహీంద్రా నుంచి ల్యాండ్ రోవర్ కి ప్రమోట్ అయ్యారంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు బాబా రామ్‌దేవ్ ఎప్పుడూ భారతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ విదేశీ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.రామ్‌దేవ్‌బాబా నేతృత్వంలోని పతంజలి మార్కెట్ క్యాప్ రూ. 46,000కోట్లు. (చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్ షురూ!) వీడియోలో కనిపిస్తున్న ఎస్యూవీ సెడోనా రెడ్ కారును రాందేవ్ కొన్నారా అనేది స్పష్టత లేదు. ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్130 రేంజ్-టాపర్ అండ్ బిగ్గెస్ట్ కారు. కాగా సెడోనా రెడ్ కలర్ ఆప్షన్ డిఫెండర్ 130 2023 ఎడిషన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయింది. డెలివరీలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వెర్షన్‌గా కొనసాగింపుగా తీసుకొచ్చిన డిఫెండర్ 130 అదే వీల్‌బేస్‌ను కలిగి ఉంది, అయితే కంపెనీ వెబ్సైట్ ప్రకారం, బాడీ 340 మిమీ పొడవు ఉంటుంది. మూడు వరుస సీట్లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సింగిల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటింగ్, కూలింగ్,మెమరీ ఫంక్షన్లతో కూడిన 14-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా లాంటి ఇతర ఫీచర్లున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్) View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) -
దూసుకుపోతున్న పతంజలి గ్రూప్ ఏకంగా లక్ష కోట్లు టార్గెట్
-
భారీ లక్ష్యాల దిశగా పతంజలి గ్రూప్ - ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి గ్రూప్ భారీ లక్ష్యాలపై దృష్టి పెట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల ఆదాయం సాధించాలని చూస్తోంది. విభిన్న ఉత్పత్తులతో అన్ని రకాల వినియోగదారులకూ చేరువకావడం ద్వారా రూ. లక్ష కోట్ల టర్నోవర్ మైలురాయిని చేరుకోవాలని భావిస్తున్నట్లు పతంజలి గ్రూప్ చీఫ్ రామ్‌దేవ్ తాజాగా పేర్కొన్నారు. ఈ బాటలో లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్(రుచీ సోయా ఇండస్ట్రీస్) రూ. 45,000– 50,000 కోట్ల టర్నోవర్‌ను అందుకునేందుకు ప్రణాళికలు వేసినట్లు వెల్లడించారు. వెరసి గ్రూప్ లక్ష్య సాధనలో పతంజలి ఫుడ్స్ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. పోర్ట్‌ఫోలియోలో ప్రీమియం ఉత్పత్తులను జతచేసే వ్యూహంలో భాగంగా పౌష్టికాహారం(న్యూట్రాస్యూటికల్స్), హెల్త్ బిస్కట్స్, చిరు ధాన్య ఆధార ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ తదితరాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా దృష్టి దేశీ మార్కెట్‌పైనే విశ్వాసముంచిన కంపెనీ ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీ (విదేశీ దిగ్గజాలు)తో పోటీ పడనున్నట్లు రామ్‌దేవ్ తెలియజేశారు. ప్రస్తుతం యూనిలీవర్ మినహా.. మిగిలిన అన్ని ఎంఎన్‌సీలనూ అధిగమించినట్లు పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం పతంజలి గ్రూప్ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌ను అందుకుంటుందని చెప్పినప్పుడు తాము అతిగా అంచనా వేస్తున్నట్లు పలువురు భావించారని ప్రస్తావించారు. ప్రస్తుతం పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ. 45,000 కోట్లను తాకినందుకు గర్వంగా ఉన్నట్లు చెప్పారు. అందుబాటు ధరల్లో... పతంజలి ఆయుర్వేద్ ద్వారా అందుబాటు ధరల్లో విభిన్న ప్రొడక్టులను అందిస్తూ వచ్చినట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఇకపై ఎగువ మధ్యతరగతిని లక్ష్యంగా పెట్టుకుని పతంజలి ఫుడ్స్ ద్వారా ప్రీమియం ఉత్పత్తులకు తెరతీస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచస్థాయిలోనూ పతంజలి గ్రూప్ ఎఫ్ఎంసీజీ విభాగంలో విస్తరిస్తున్నట్లు చెప్పారు. 200 దేశాలలో 200 కోట్లమందికి చేరువైనట్లు తెలియజేశారు. దేశీయంగా 70 కోట్లమందిని చేరుకున్న కంపెనీ 100 కోట్లపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ రూ. 31,000 కోట్లకు చేరినట్లు ఈ సందర్భంగా పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్తానా వెల్లడించారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్ల ఆదాయాన్ని అందుకోగలమని అంచనా వేశారు. ప్రీమియం ప్రొడక్టుల నుంచి 10% టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో పతంజలి ఫుడ్స్ షేరు దాదాపు 2 శాతం బలపడి రూ. 1,140 వద్ద ముగిసింది. -
భారీ లక్ష్యాల దిశగా పతంజలి ఫుడ్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్ భారీ లక్ష్యాలపై దృష్టి పెట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. 5,000 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించాలని చూస్తోంది. ఈ బాటలో రూ. 50,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్ఎంసీజీ బిజినెస్, ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్ ద్వారా లక్ష్యాలను సాధించాలని ఆశిస్తోంది. గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్‌గా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీ ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగాలను భారీ వృద్ధి బాట పట్టించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు కంపెనీ చీఫ్ రామ్‌దేవ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రుచీ సోయాను 2019 సెప్టెంబర్‌లో దివాలా పరిష్కారంలో భాగంగా పతంజలి గ్రూప్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్‌ను సైతం భారీ స్థాయిలో పెంచేందుకు వీలుగా ఐదేళ్ల విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు రామ్‌దేవ్ వెల్లడించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ, ఫుడ్ బిజినెస్‌లో భారీ కంపెనీగా ఆవిర్భవించాలని లక్షిస్తున్నట్లు తెలియజేశారు. గతేడాది ఓకే మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కంపెనీ రూ. 886 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22)లో రూ. 806 కోట్ల నికర లాభం నమోదైంది. ఇబిటా రూ. 1,577 కోట్లుకాగా.. మొత్తం ఆదాయం రూ. 24,284 కోట్ల నుంచి రూ. 31,821 కోట్లకు జంప్ చేసింది. దీనిలో వంట నూనెల విభాగం నుంచి రూ. 25,253 కోట్లు లభించింది. వీటి ద్వారా 2021–22లో రూ. 22,469 కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. (ఇదీ చదవండి: అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఏ కారుపై ఎంతంటే?) ఇక ఫుడ్, ఎఫ్ఎంసీజీ బిజినెస్ టర్నోవర్ దాదాపు నాలుగు రెట్లు ఎగసి రూ. 6,218 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది కేవలం ఈ విభాగపు ఆదాయం రూ. 1,683 కోట్లకే పరిమితమైంది. కాగా.. తాజా లక్ష్యాలను చేరుకునేందుకు పలు కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు రామ్‌దేవ్ తెలియజేశారు. గేదె నెయ్యి, ప్రీమియం విభాగంలో బిస్కట్లు, కుకీస్, డ్రై ఫ్య్రూట్స్, మసాలా దినుసులతోపాటు పౌష్టికాహార ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు వివరించారు. కంపెనీ ఇప్పటికే పలు రాష్ట్రాలలో 39,000 మందికిపైగా రైతుల ద్వారా 63,816 హెక్టార్లకుపైగా ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ రుచీ గోల్డ్, మహాకోష్, సన్‌రిచ్, న్యూట్రెలా, రుచీ సన్‌లైట్ తదితర బ్రాండ్లను కలిగి ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 81 శాతం వాటా ఉంది. ఎన్ఎస్ఈలో పతంజలి ఫుడ్స్ షేరు 1 శాతం క్షీణించి రూ. 1,014 వద్ద ముగిసింది. -
రాందేవ్ బాబా సేవలు ప్రశంసనీయం: అమిత్ షా
హరిద్వార్: భారతీయ వేద విద్య, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించేందుకు రాందేవ్ బాబా చేస్తున్న కృషి ప్రశంసనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొనియాడారు. హరిద్వార్‌లోని యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ సన్యాస్ దీక్షా మహోత్సవం సందర్భంగా ఆయన పతంజలి యూనివర్సిటీ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ‘‘గడిచిన పాతికేళ్లలో యోగ, ఆయుర్వేద, స్వదేశీ పరిశ్రమకు రాందేవ్ బాబా గణనీయమైన సేవలు అందించారు. ఇప్పుడు అదే స్పూర్తితో విద్యా రంగంపై దృష్టి సారించారు. రానున్న రోజుల్లో పతంజలి గ్రూప్ దేశాభివృద్ధికి ఎంతోగానూ తోడ్పడుతుంది’’ అని అన్నారు. పతంజలి యూనివర్సిటీ, భారతీయ శిక్షా బోర్డు ద్వారా ప్రాచీన విద్యను నేటి తరానికి అందించి ఉత్తమ సమాజ స్థాపనకు తమ వంతు కృషి చేస్తామని రాందేవ్ బాబా తెలిపారు. -
ఎఫ్‌పీవో యోచన లేదు: పతంజలి ఫుడ్స్
న్యూఢిల్లీ: కంపెనీలో పబ్లిక్ వాటాను పెంచేందుకు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కి (ఎఫ్‌పీవో) వచ్చే యోచనేదీ లేదని స్టాక్ ఎక్సే్చంజీలకు పతంజలి ఫుడ్స్ తెలిపింది. అయితే, ఆఫర్ ఫర్ సేల్, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) వంటి మార్గాలు పరిశీలిస్తున్నట్లు వివరించింది. పతంజలి ఫుడ్స్‌లో తమ వాటాలను నిర్దేశిత స్థాయిలోపునకు తగ్గించుకోనందుకు గాను 21 ప్రమోటర్ సంస్థల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. దివాలా తీసిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ను 2019లో పతంజలి గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పట్లో గ్రూప్‌నకు 98.87 శాతం వాటాలు ఉండేవి. తర్వాత ఎఫ్‌పీవోకి వచ్చాక పబ్లిక్ వాటా 19.18 శాతానికి పెరగ్గా.. ప్రమోటర్ల వాటా 80.82 శాతానికి తగ్గింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి పబ్లిక్ వాటాను 25 శాతానికి చేర్చాల్సి ఉన్నప్పటికీ అలా చేయకపోవడంతో ప్రమోటర్ల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేశాయి. -
పతంజలి ఫుడ్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం వృద్ధితో రూ. 269 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 234 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాంత ఎగసి రూ. 7,964 కోట్లకు చేరింది. గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్‌గా కార్యకలాపాలు సాగించిన కంపెనీ గత క్యూ3లో రూ. 6,301 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) నికర లాభం రూ. 572 కోట్ల నుంచి రూ. 623 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 17,608 కోట్ల నుంచి రూ. 23,858 కోట్లకు జంప్‌చేసింది. చదవండి: రికార్డు స్థాయిలో సేల్స్.. ఎగబడుతున్న జనం, ఆ ఇళ్లకి యమడిమాండ్! -
పతంజలి పేరు ఇకపై వాడొద్దు! బాబా రాందేవ్‌పై ఫైర్
లక్నో: పతంజలి బ్రాండ్ పేరిట పలు విక్రయాలు చేపడుతున్న బాబా రామ్‌దేవ్, ఆ కంపెనీ ఎండీ బాలకృష్ణన్‌పై మండిపడ్డారు బీజేపీ నేత ఒకరు. మహానుభావుడైన పతంజలి పేరుతో అమ్మకాలను నిర్వహించొద్దని గురువారం డిమాండ్ చేశారు. పేరు మార్చకుంటే ఉద్యమం చేపడతానని హెచ్చరించారు ఆ బీజేపీ నేత. యూపీ కైసర్‌గంజ్ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. రామ్‌దేవ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్నోకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోండా జిల్లా కొండార్ గ్రామ పంచాయతీలో జరిగిన ఓ కార్యక్రమంలో గురువారం బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ.. పతంజలి బ్రాండ్‌పై మండిపడ్డారు. యోగా పితామహుడైన మహర్షి పతంజలి లాంటి వ్యక్తి పేరును వాడుకుని పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామ్‌దేవ్.. పతంజలి పుట్టిన గ్రామానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ‘‘వారి వ్యాపారం గురించి నాకు అనవసరం. కానీ, నెయ్యి, సబ్బులు, ప్యాంట్లు, చివరకు.. లోదుస్తులకు ఆయన పేరు వాడుకోవడం ఎంత వరకు సమంజసం? అయినా వారికి ఆ హక్కు ఎవరిచ్చారు?’’ అని ప్రశ్నించారు బ్రిజ్ భూషణ్. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. రామ్‌దేవ్, పతంజలి ఎండీ బాలకృష్ణ వెంటనే తమ బ్రాండ్‌కు పతంజలి పేరును వాడడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అయోధ్యకు వచ్చే యాత్రికులు కొండార్‌ను సందర్శించాలని, పతంజలి పేరుతో నెయ్యి తింటున్న వారు ఆ మహానుభావుడి స్వగ్రామం ఎలా ఉందో ఓ సారి చూడాలని విజ్ఞప్తి చేశారు. బ్రిజ్ భూషణ్ ఇలా తన ప్రకటనలతో వార్తల్లో నిలవడం కొత్తేం కాదు. ఇదీ చదవండి: సచిన్ పైలట్‌పై గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు -
ఐదు పతంజలి ఔషధాలపై నిషేధం ఎత్తివేత
డెహ్రాడూన్: పతంజలి ఔషధాలు ఐదింటిపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆయుర్వేద, యునాని సర్వీసెస్ లైసెన్సింగ్ అధికారి పతంజలి ఔషధ ఉత్పత్తి సంస్థ దివ్య ఫార్మసీకి ఒక లేఖ రాస్తూ, ‘పొరపాటున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని వివరించారు. గత వారం లైసెన్సింగ్ అథారిటీ ‘తప్పుదోవ పట్టించే ప్రకటనలు’ కారణంగా చూపుతూ ఐదు ఔషధాల ఉత్పత్తిని నిలిపివేయాలని పతంజలి ఉత్పత్తులను తయారు చేసే దివ్య ఫార్మసీని ఆదేశించింది. బీపీగ్రిట్, మధుగ్రిట్, థైరోగ్రిట్, లిపిడొమో, ఐగ్రిట్ గోల్డ్ ట్యాబ్లెట్లు ఇందులో ఉన్నాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
‘అద్భుతం మహా అద్భుతం’ ,హిమాలయాల్లో అరుదైన మూలికలు
హరిద్వార్: ఆచార్య బాలకృష్ణ నేతృత్వంలోని పతంజలి బృందం హిమాలయాల్లో అరుదైన మూలికలను కనుగొంది. హిమాలయాలలోని కొన్ని అధిరోహించలేని, చేరుకోలేని శిఖరాలను సైతం ఎక్కి ఈ మూలికలను గుర్తించినట్లు ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, పతంజలి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఇందుకు సంబంధించి ఏర్పాటైన ఒక స్వాగత కార్యక్రమం చిత్రాన్ని తిలకించవచ్చు. ఈ కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం)ప్రిన్సిపాల్ కల్నల్ అమిత్ బిష్త్‌తో సహా పలువురు పాల్గొన్నారు. అరుదైన విజయాన్ని సాధించినందుకుగాను పతంజలి బృందాన్ని పలువురు ప్రశంసించారు. ఇది గర్వకారణ చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. -
‘ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’.. బాబా రామ్‌దేవ్‌కు హైకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మొట్టికాయలు వేసింది ఢిల్లీ హైకోర్టు. అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని స్పష్టం చేసింది. కోవిడ్-19 బూస్టర్ డోస్ సామర్థ్యం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీకా తీసుకున్నా కరోనా బారినపడిన అంశంపై మాట్లాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, కరోనిల్ కోవిడ్‌పై పని చేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రామ్‌దేవ్ బాబాకు చురకలు అంటించింది ధర్మాసనం. ‘ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయి. బాబా రామ్‌దేవ్ చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. మీరు ఏది చెప్పినా నమ్మే అనుచరులను కలిగి ఉండటాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.’ అని పేర్కొన్నారు జస్టిస్ అనుప్ జైరాం భంభాని. మరోవైపు.. పతాంజలి కరోనిల్‌ను సవాల్ చేశారు డాక్టర్స్ అసోసియేషన్ తరఫు సీనియర్ న్యాయవాది అఖిల్ సిబాల్. ఎలాంటి ట్రయల్స్, సరైన ధ్రువీకరణ లేకుండానే కరోనిల్ కోవిడ్-19ను నయం చేస్తుందని పతాంజలి చెబుతోందని కోర్టుకు తెలిపారు. గతంలోనే బాబా రామ్‌దేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం(ఐఎంఏ) ఫిర్యాదు చేసింది. కరోనా ఉగ్రరూపం దాల్చిన క్రమంలో కరోనిల్‌పై ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. ఇదీ చదవండి: బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..! -
భారత సంప్రదాయ ఔషధాలపై అంతర్జాతీయ సదస్సు..
హరిద్వార్: పతంజలి రిసెర్చ్ ఫౌండేషన్ అండ్ పతంజలి యూనివర్సిటీ హరిద్వార్‌లో ‘భారతీయ సంప్రదాయ ఔషధాలు: ఆధునికీకరణ’ అన్న అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. సొసైటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ ప్లాంట్, న్యూఢిల్లీ అలాగే నాబార్డ్, డెహ్రాడూన్ భాగస్వామ్యంతో జరిగిన ఈ సదస్సులో వైద్య రంగంలో నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆయుర్వేదంలో నిష్ణాతులు ఆచార్య శ్రీ బాలకృష్ణ జీ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక ఆవిష్కరణ కార్యక్రమంలో యోగా గురు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ తదితరులు. -
బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..!
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా పేరు మారనుంది. పతంజలి ఫుడ్స్‌గా నామకరణం చేసే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే పతంజలి ఆయుర్వేద పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫుడ్ బిజినెస్‌ను సంస్థలో విలీనం చేసే అంశంలో అత్యంత సమర్థవంతమైన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఇటీవలే రుచి సోయా రూ.4,300 కోట్లు సమీకరించింది. పతంజలి ఆయురేŠవ్ద ఫుడ్ వ్యాపారాన్ని రుచి సోయాకు కొన్ని నెలల్లో బదిలీ చేయనున్నట్టు గత నెలలో రామ్‌దేవ్ ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద ఆహారేతర, సంప్రదాయక ఔషధాలు, వెల్నెస్ విభాగాల్లో పనిచేస్తుందని వెల్లడించారు. రుచి సోయా కేవలం వంట నూనెలు, ఆహారం, ఎఫ్ఎంసీజీ, న్యూట్రాస్యూటికల్స్, ఆయిల్ పామ్ సాగు విభాగాలపై దృష్టిసారిస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం రుచి సోయా 57,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తోంది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెద్ద ఎత్తున పెంచాలన్నది ప్రణాళిక. బిస్కెట్స్ వ్యాపారాన్ని పతంజలి ఆయుర్వేద గతేడాదే రూ.60 కోట్లకు రుచి సోయాకు బదిలీ చేసింది. పతంజలి ఆయుర్వేద, రుచి సోయాను వచ్చే అయిదేళ్లలో భారత్‌లో అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని రామ్‌దేవ్ స్పష్టం చేశారు. హిందుస్తాన్ యూనిలీవర్ తర్వాత రెండవ అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద నిలిచిందన్నారు. చదవండి: గోద్రెజ్ ఇండస్ట్రీస్ అనూహ్య నిర్ణయం...ఇప్పుడు ఆ రంగంలోకి కూడా ఎంట్రీ..! -
పతంజలి క్రెడిట్ కార్డు! ప్రయోజనాలు ఇలా..
ముంబై: ప్రభుత్వరంగ పంజాజ్ నేషనల్ బ్యాంక్, పతంజలి ఆయుర్వేద్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్(ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించాయి. ఎన్పీసీఐ రూపే ప్లాట్ఫామ్లో పీఎన్బీ రూపే ప్లాటినమ్, పీఎన్బీ రూపే వేరియంట్లలో లభిస్తాయి. ఈ కో–బ్రాండెడ్ కార్డుల ద్వారా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, లాయల్టీ పాయింట్లు, బీమా కవరేజీతో పాటు పలు రకాల ప్రయోజనాల్ని పొందవచ్చు. పతంజలి సోర్టలో రూ.2,500 పైబడిన కొనుగోళ్లపై రెండుశాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఆకస్మిక మరణంపై ప్లాటినం కార్డు రూ.రెండు లక్షల జీవిత భీమాను, సెలెక్ట్ కార్డు ద్వారా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే ప్లాటినం కార్డుపై గరిష్టంగా రూ.5 లక్షలు, సెలెక్ట్ కార్డుపై రూ.10 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. పట్టణ, నగరాల్లోని కస్టమర్లకు సులభమైన డిజిటల్ చెల్లింపు సేవలను అందించేందుకు పీఎన్‌బీఐ, ఎన్‌పీసీఐలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. చదవండి: డిజిటల్ చెల్లింపులు.. అంత ఈజీనా? లక్ష్యం నెరవేరేనా ? -
రుణ రహితంగా పతంజలి: రాందేవ్ భారీ ప్రణాళికలు
సాక్షి, న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి గ్రూపు 2020–21లో రూ.30,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ముఖ్యంగా రుచి సోయా రూపంలో రూ.16,318 కోట్ల ఆదాయం సమకూరడం కలిసొచ్చింది.. దివాలా పరిష్కారానికి వచ్చిన రుచిసోయా కంపెనీని గతేడాది పతంజలి దక్కించుకున్న విషయం తెలిసిందే. 3-4 ఏళ్లలో గ్రూపులోని కంపెనీల రుణాలను పూర్తిగా తీర్చేసి, రుణ రహితంగా మారాలనే లక్ష్యంతో ఉన్నట్టు బాబా రామ్‌దేవ్ మంగళవారం వర్చవల్‌గా నిర్వహించిన సమావేశంలో మీడియాకు వెల్లడించారు. రుచి సోయా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) రూపంలో వచ్చే నిధుల్లో అధిక మొత్తాన్ని రుణాల చెల్లింపునకు వినియోగించనున్నామని రామ్‌దేవ్ తెలిపారు. పతంజలి గ్రూపులోని ఎఫ్ఎంసీజీ వ్యాపారమైన పతంజలి ఆయుర్వేద్ లిస్టింగ్‌పై త్వరలోనే సమాచారం ఇస్తామంటూ ఐపీవోపై సంకేతం ఇచ్చారు. ఎంత మేర వ్యాపారాన్ని వేరు చేయాలి? పతంజలి ఆయుర్వేద్‌ను ఎప్పుడు లిస్ట్ చేయాలన్నది త్వరలోనే తెలియజేస్తామన్నారు. 10-24 శాతం మధ్య వృద్ధి పతంజలి గూటికి చేరిన రుచిసోయా పనితీరుపై ఎదురైన ప్రశ్నకు.. ‘‘రుచి సోయా వ్యాపారంలో 24 శాతం పురోగతి ఉంది. పతంజలి టర్నోవర్ రూ.11,000 కోట్ల నుంచి 2020-21 లో రూ.14,000 కోట్లకు పెరిగింది. గ్రూపు కంపెనీల్లో 10-24 శాతం మధ్య వ్యాపార వృద్ధి నెలకొంది. త్వరలోనే పతంజలి గ్రూపు రూ.4,300 కోట్ల మేర రుచి సోయా ఎఫ్‌పీవో నిర్వహించనుంది. రుచి సోయాకు రూ.3,300 కోట్ల రుణ భారం ఉంది. ఎఫ్‌పీవో రూపంలో సమీకరించే నిధుల్లో 40 శాశాన్ని రుణాలను తీర్చేందుకు వినియోగిస్తాం’’ అని బాబా రామ్‌దేవ్ వివరించారు. గ్రూపు మొత్తం రుణ భారం ఎంతన్నది ఆయన వెల్లడించలేదు. కరోనా కారణంగా తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం లేదన్నారు. పతంజలి పరివాహన్ పేరుతో తమకు సొంత రవాణా విభాగం ఉన్నట్టు చెప్పారు. 3-4 ఏళ్లలో గ్రూపు కంపెనీల రుణ భారాన్ని పూర్తిగా తీర్చివేసే ప్రణాళికలతో ఉన్నట్టు పతంజలి ఆయుర్వేద్ ఎండీ ఆచార్య బాలకృష్ణ సైతం తెలిపారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులు పతంజలి గ్రూపు పెట్టుబడుల గురించి బాబా రామ్‌దేవ్ వివరిస్తూ.. రానున్న ఐదేళ్లలో రూ.5,000-10,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. -
పతాంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు!
న్యూఢిల్లీ: అల్లోపతి ఓ పిచ్చిసైన్స్ అనే కామెంట్ల వీడియోతో దుమారం రేపిన రాందేవ్ బాబా.. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన ఐఎంఏకు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పతాంజలి డెయిరీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ బన్సాల్ కరోనాతో చనిపోవడంతో తమ వైద్యవిధానంపై విమర్శలు రాకముందే ముందస్తు జాగ్రత్తగా పతాంజలి స్పందించింది. సునీల్‌కి జరిగిన కొవిడ్-19 ట్రీట్మెంట్లో పతాంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యాభై ఏడేళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన భార్య రాజస్థాన్ ఆరోగ్య విభాగంలో సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఆమే ఆయన ట్రీట్మెంట్ను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్ ట్రీట్మెంట్లో పతాంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం’’ అని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది రాజస్థాన్ పతాంజలి విభాగం. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ద్వారా పతాంజలి మరోసారి అల్లోపతి వైధ్యవిధానంపై సెటైర్ వేసినట్లయ్యింది. లక్ష కరోనిల్ బాబా రాందేవ్-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్మెంట్ కోసం లక్ష పతాంజలి కరోనిల్ కిట్లను కొనుగోలు చేసింది. ఈమేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించాడు. ఇందుకోసం సగం ఖర్చును పతాంజలి సంస్థ భరిస్తుందని, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు. हरियाणा में कोविड मरीजों के बीच एक लाख पतंजलि की कोरोनिल किट मुफ्त बांटी जाएंगी । कोरोनिल का आधा खर्च पतंजलि ने और आधा हरियाणा सरकार के कोविड राहत कोष ने वहन किया है। — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 24, 2021 -
రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేస్తారా?
న్యూఢిల్లీ: యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామదేవ్ బాబాను అరెస్టు చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. కరోనా విరుగుడుకు పతంజలి సంస్థ నుంచి ‘కొరొనిల్’ మందును తయారు చేసి ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదల సమయంలో కొరొనిల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సర్టిఫికెట్ ఉందని చెప్పి రామ్‌దేవ్ బాబా అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రజలను మోసం చేయాలని చూసిన యోగా గురును అరెస్టు చేయాలని పలు ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్య ప్రతాప్ సింగ్ సైతం ఆయనను అరెస్టు చేయాలని న్యూఢిల్లీ పోలీసులను ఉద్దేశిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. ‘డియర్ ఢిల్లీ పోలీసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరణ పేరుతో కోట్ల మంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేస్తారా? ఇది అంతర్జాతీయ మోసంగా పరిగణించాలి. దీనికి కఠిన చర్యలు ఉండేలా చూడాలి’ అంటూ ట్విటర్ వేదికగా కోరారు. కాగా ఈనెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో రామ్‌దేవ్ బాబా కొరొనిల్ మందును విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్ ఉందని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్ జారీ చేయలేదని ట్విటర్లో స్పష్టం చేసింది. Dear @DelhiPolice will you #ArrestRamdev for misguiding millions of people on the name of WHO certification? This is international fraud, Strictest action should be ensured. — Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) February 22, 2021 చదవండి: కొరొనిల్’ ప్రమోషన్‌పై దుమారం.. కేంద్రమంత్రిపై ఆగ్రహం పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్ -
కొరొనిల్’ ప్రమోషన్‌పై దుమారం.. కేంద్రమంత్రిపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ బాబా రూపొందించిన కరోనా మందు ‘కొరొనిల్’ ప్రమోషన్‌పై భారత వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ ఆర్గనైజేషన్- ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేని మందుపై ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించింది. రామ్‌దేవ్ బాబా మందుపై కేంద్ర మంత్రులు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది. తప్పుడు, అశాస్త్రీయ మందును ప్రజల ముందుకు ఎలా తీసుకొస్తారని నిలదీసింది. కరోనాకు విరుగుడుగా పతాంజలి సంస్థ రూపొందించిన ‘కొరొనిల్’ మందును ఈనెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో రామ్‌దేవ్ బాబా విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్ ఉందని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్ జారీ చేయలేదని ట్విటర్లో తెలిపింది. అయితే దీనిపై సోమవారం భారత వైద్యుల సంఘం స్పందించింది. కొరొనిల్ మందును తాము ఎలాంటి పరీక్షలు చేయలేదని భారత వైద్య సంఘం (ఐఎంఏ) తెలిపింది. తాము పరీక్షించని మందుకు ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా ఎలా గుర్తించినట్లు రామ్‌దేవ్ బాబా చెప్పుకుంటారని ఐఎంఏ ప్రశ్నించింది. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ముందు పచ్చి అబద్ధాలు రామ్‌దేవ్ బాబా చెప్పారని ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రామ్‌దేవ్ బాబా చెప్పిన ప్రకటనపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పందించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించింది. కరోనాను ఏ సంప్రదాయక మందుకు తాము సర్టిఫికెట్ జారీ చేయలేదని ఈ సందర్భంగా ఐఎంఏ స్పష్టం చేసింది. వైద్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీన్ని ఎలా సమర్ధిస్తారని మండిపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తిరస్కరించిన మందును ఒక వైద్యుడిగా ఉన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఎలా సమర్ధించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రామ్‌దేవ్ తీసుకొచ్చిన ఆ మందుకు అంత సామర్థ్యం ఉంటే రూ.32వేల కోట్లు ఖర్చు చేసి ఎందుకు వ్యాక్సినేషన్ చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ఐఎంఏ డిమాండ్ చేసింది. అయితే రామ్‌దేవ్ బాబా గతేడాదే ఈ మందును తీసుకువచ్చారు. అయితే ఈ మందు కరోనా నివారణకు పనికి రాదని, కేవలం రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేసే మందుగా అమ్మాలని అప్పట్లో ఆయుశ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. The Indian Medical Association issues a strongly worded statement on the Patanjali shenanigans and calls it a shame on the behalf of the Health Minister. pic.twitter.com/0kAHBkycGI — Abhishek Baxi (@baxiabhishek) February 22, 2021 -
కోకాకోలా, బిస్లేరి, రామ్‌దేవ్‌బాబాకు షాక్: కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కంపెనీలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో మూడు పెద్ద కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్ల సేకరణకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో కోక్, పెప్సీ, బిస్లేరీ కంపెనీలపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ మూడు కంపెనీలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆ మూడు కంపెనీలకు కలిపి దాదాపు రూ.72 కోట్ల జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. వీటిలో బిస్లేరీ సంస్థకు రూ.10.75 కోట్లు, పెప్సీకి రూ.8.7 కోట్లు, కోకాకోలా కంపెనీకి రూ.50.66 కోట్ల జరిమానా విధించింది. వీటితో పాటు రాందేవ్ బాబాకు చెందిన పతాంజలి సంస్థకు రూ. కోటి, మరో సంస్థకు రూ.85.9 లక్షల జరిమానా వేసింది. జరిమానాలను 15 రోజుల్లోగా చెల్లించాలని పీసీబీ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్‌బిలిటీ (ఈపీఆర్) అనేది పాలసీ కొలత. దీని ఆధారంగా ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసే కంపెనీలు ఉత్పత్తులను పారవేసేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బిస్లేరి: ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 9 నెలల్లో సుమారు 21,500 టన్నులుగా తేలింది. టన్నుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10.75 కోట్లు జరిమానా విధించింది. పెప్సీ: 11,194 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. కోకాకోలా బెవరేజెస్ సంస్థలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 4,417 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఈపీఆర్ లక్ష్యం లక్షా 5 వేల 744 టన్నుల వ్యర్థాలు. ఈ విధంగా ఒక్కో సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను బట్టి జరిమానాను కాలుష్య నియంత్రణ మండలి విధించింది. మేం బాధ్యతతో ఉన్నాం: బిస్లేరి అయితే ఈ వార్తలపై తాజాగా బిస్లేరీ యాజమాన్యం స్పందించింది. తాము బాధ్యతతో ఉన్నామని.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ‘‘కాలుష్య నియంత్రణ మండలి ఇతర పర్యావరణ సంస్థల నియమనిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం. ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన పత్రాలు సమర్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మేం నిబద్ధతతో పని చేస్తున్నాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్, వేరు చేయు విధానంపై మేం సమాజంలో అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలలతో పాటు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేస్తున్నాం. మాపై వచ్చిన ఫిర్యాదులను మా బృందం పరిశీలిస్తోంది. వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుంది’’ బిస్లేరీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. -
పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్
లండన్: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన స్వసారి–కరోనిల్ కిట్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ ఔషధం కరోనాను తరిమికొడుతుందని, మహమ్మారి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. జనం కరోనిల్ కిట్లను ఎగబడి కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు రూ.250 కోట్ల విలువైన 25 లక్షల కిట్లు విక్రయించినట్లు పతంజలి సంస్థ స్వయంగా ప్రకటించింది. అయితే, స్వసారి–కరోనిల్ కిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, కరోనా వైరస్ నుంచి ఏమాత్రం రక్షణ కల్పించలేదని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. వృక్ష సంబంధిత పదార్థాలతో రూపొందిన కరోనిల్‌లో కరోనాను ఎదుర్కొనే సామర్థ్యంలేదని వెల్లడైంది. కనీసం రోగ నిరోధక శక్తిని పెంచేదీ అస్పష్టమేనని వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ వెల్లడించారు. యూకేలో పతంజలి స్వసారి–కరోనిల్ కిట్ల విక్రయానికి అనుమతి ఇవ్వలేదని బ్రిటిష్ వైద్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్ఆర్ఏ) స్పష్టం చేసింది. అనుమతి లేని ఔషధాలు, వైద్య ఉత్పత్తులను యూకే మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. బాబా రాందేవ్ జూన్ 23న కరోనిల్ కిట్లను విడుదల చేశారు. -
కల్తీ తేనె కలకలం: మరింత కరోనా ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: రోగనిరోధక శక్తి పెంచుతుంది.. యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ బూస్టర్ అంటూ కరోనా కాలంలో తేనెను తెగ లాగించేస్తున్నారా? అయితే మీకొక షాకింగ్ రిపోర్టు.. చైనా సుగర్ సిరప్‌తో గుర్తు పట్టలేనంతగా దేశంలో కల్తీ తేనెను చలామణీ చేస్తున్నవ్యవహారం కలకలం రేపుతోంది. చిన్నా పెద్ద సహా దాదాపు అన్ని బ్రాండ్ల తేనె చక్కెర సిరప్‌తో కల్తీ చేస్తున్నారని తమ అధ్యయనం తేలిందని ప్రకటించింది. దేశంలోని 13 ప్రధాన బాండ్లలో డాబర్, పతంజలి, బైద్యనాథ్ జండుతో సహా మొత్తం 10 సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీమయమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి చెప్పింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు తేనెకు బదులుగా, ఎక్కువ చక్కెరను తింటున్నారని, ఇది కోవిడ్-19 ప్రమాదాన్నిమరింత పెంచుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. తేనెలో చైనా చక్కెరతో కలిపి కల్తీ తేనెను విక్రయిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్వాలిటీ పరీక్షల్లో నిర్దారణ అయిందని తెలిపింది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (కాల్‌ఎఫ్)లో వీటి నమూనాలను పరీక్షించారు. జర్మనీలోని ఒక ప్రత్యేక ప్రయోగశాలలో ఎన్ఎంఆర్ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షించినప్పుడు, చాలా బ్రాండ్లు విఫలమయ్యాయి. పరీక్షించిన 13 బ్రాండ్లలో మూడు బ్రాండ్లు మాత్రమే ఎన్ఎంఆర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయని సీఎస్ఈ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను డాబర్, పతంజలి, జండు ప్రతినిధులు ఖండించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగానే ఉందని వాదిస్తున్నాయి. సీఎస్ఈ విడుదల చేసిన రిపోర్టు అవాస్తవమైందనీ, ఇండియన్ నాచురల్ హనీ ఇండస్ట్రీని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ప్రముఖ ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల సంస్థ డాబర్ స్పందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ తేనె డాబర్ హనీ అని, తమ తేనె 100 శాతం స్వచ్ఛమైంది, సురక్షితమైందని తెలిపింది. తమ తేనెలో కల్తీ జరగలేదని ట్వీట్ చేసింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తేనె అమ్మకాలు పెరిగినప్పటికీ ఉత్తర భారతదేశంలో తేనెటీగల పెంపకందారులు లాభాలు క్షీణించాయని, దీంతో దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరేన్ తెలిపారు. శీతల పానీయాలపై 2003, 2006 సంవత్సరాల్లో తాముచేపట్టిన పరిశోధనలో పరిశోధనలలో కనుగొన్న దానికంటే దుర్మార్గమైన, దారుణమైన మోసాన్ని గుర్తించామన్నారు. అతి ఘోరమైన, అధునాతన కల్తీ ఇదని, ఇప్పటివరకు గుర్తించినదానికంటే చాలా ఎక్కువ హానికరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నరేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 పై పోరులో భాగంగా చాలామందితేనెను విరివిగా వినియోగిస్తున్న తరుణంలో ఈ ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తేనెలోకల్తీని గుర్తించడం కష్టమని ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సిన్స్ టీం ప్రోగ్రామ్ డైరెక్టర్ అమిత్ ఖురానా అన్నారు. సీఎస్ఈ అధ్యయనం ప్రకారం , ప్రారంభంలో తేనెలో తీపిని పెంచేందుకు మొక్కజొన్న, చెరకు, బియ్యం, బీట్రూట్ నుండి తీసిన చక్కెరను తేనెలో కల్తీ చేసేవారు. ఇది సీ3, సీ4 పరీక్షల్లో బయటపడుతుంది. కానీ ఈ కొత్త కల్తీ ‘చైనీస్ సుగర్’ ను న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎన్ఎంఆర్) అనే పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించగలం. ప్రముఖ బ్రాండ్లైన డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండు, హిత్కారీ, అపిస్ హిమాలయా సంస్థలనుంచి సేకరించిన తేనె నమూనాలు ఎన్ఎంఆర్ పరీక్షలో విఫలమయ్యాయి. మారికో సఫోలా హనీ, మార్క్‌ఫెడ్ సోహ్నా, నేచర్ నెక్టా మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి. World's No. 1 Dabur Honey is 100% Pure & Safe! ✅We are NMR profiled ✅We are 22 FSSAI tests compliant. Dabur Honey clears all FSSAI tests and has the first corporate-owned NMR machine in India to ensure 100% purity. Read the complete report here, https://t.co/hLlEEMzh2M pic.twitter.com/J36fBkvnKG — Dabur India Ltd (@DaburIndia) December 2, 2020 -
రికార్డు సృష్టించిన ‘కరోనిల్ కిట్’....
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణ ఔషధం పేరుతో పతంజలి విడుదల చేసిన ‘కరోనిల్ కిట్’పై ఎంత దుమారం రేగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కిట్‌లో "దివ్య స్వసరి వతి", "దివ్య కొరోనిల్ టాబ్లెట్", "దివ్య అను తైల్" అనే ఔషధాలుంటాయి. అయితే తొలుత దీన్ని కరోనాని తగ్గించే మందుగా.. ఆ తర్వాత నివారణ ఔషధంగా పేర్కొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి కంపెనీకి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికి జనాలు మాత్రం ‘కరోనిల్ కిట్’ని బాగానే వాడారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఈ కిట్ 250 కోట్ల రూపాయల బిజినేస్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఈ కిట్‌ని అమ్మినట్లు తెలిపింది. అక్టోబర్ 18 వరకు పతంజలి ఆయుర్వేద కంపెనీ దాదాపు 2.5 మిలియన్ల కరోనిల్ కిట్లను అమ్మిందని.. వీటి విలువ సుమారు 250 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ఇండియాతో పాటు విదేశాల్లో ఆన్లైన్, పతంజలి స్టోర్లు, డైరెక్ట్ మార్కెటింగ్, మెడికల్ షాపుల ద్వారా 25మిలియన్ల కిట్లు అమ్మినట్లు తెలిపింది. (కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు) ఇక ‘కరోనిల్ కిట్’ని ఈ ఏడాది జూన్ 23న లాంచ్ చేసింది. ఈ ఉత్పత్తి కరోనా వైరస్‌ని తగ్గిస్తుందని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఇక కరోనిల్ లాంచ్‌తో దేశవ్యాప్తంగా వివాదం రేగడంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కిట్ ట్రయల్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమకు అందిచాల్సిందిగా ఆదేశించింది. అంతేకాక ‘కరోనిల్ కిట్’.. కోవిడ్‌కి ఔషధం అంటూ ఇచ్చిన ప్రకటనలను కూడా బ్యాన్ చేసింది. అమ్మకాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో పతంజలి కరోనిల్ గురించి చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకున్నారు. ఇది కరోనాని తగ్గించదని.. కేవలం రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ఈ ప్రకటన తర్వాత ఆయూష్ మంత్రిత్వ శాఖ రోగనిరోధక శక్తి పెంచే కిట్‌గా కరోనిల్ అమ్మకాలకు అనుమతిచ్చారు. దాంతో గత నాలుగు నెలల్లో కరోనిల్ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. 250 కోట్ల రూపాయలు విలువ చేసే 25 కిట్లను అమ్మినట్లు తెలిపారు. -
స్పాన్సర్లు కావలెను
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం బీసీసీఐ ప్రధాన (టైటిల్) స్పాన్సర్ వేటలో పడింది. ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. అనేక పరిణామాల మధ్య ‘వివో’ అనూహ్యంగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు బోర్డు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సి వచ్చింది. ఐపీఎల్–13 సీజన్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో జరగనుంది. అయితే ఈ డీల్ కాలపరిమితి (ఆగస్టు 18 నుంచి డిసెంబర్ 31) నాలుగున్నర నెలలే! బిడ్లను ఈ నెల 14 వరకు దరఖాస్తు చేయవచ్చు. ఇతర నిబంధనలు, ఒప్పంద వివరాలు, స్పాన్సర్‌షిప్‌తో చేకూరే ప్రయోజనాలు తదితర అంశా లు తెలుసుకున్న తర్వాత ఆగస్టు 18 వరకు సదరు కంపెనీలు తుది బిడ్లు దాఖలు చేయాల్సి ఉం టుంది. స్పాన్సర్షిప్ కోసం బిడ్ వేసే కంపెనీ టర్నోవర్ కనీసం రూ. 300 కోట్లు ఉండాలని బీసీసీఐ నిబంధన విధించింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ‘వివో’ ప్రతి ఏడాది రూ. 440 కోట్లు చెల్లించింది. ఇప్పుడు దీంతో పోలిస్తే తక్కువ మొత్తానికి కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రేసులో పతంజలి... యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీ కూడా ఐపీఎల్‌కు స్పాన్సర్షిప్ అందించేందుకు ఆసక్తి చూపిస్తుండటం విశేషం. తమ ఉత్పత్తులకు ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. దీనిని పతంజలి ప్రతినిధులు నిర్ధారించారు. ‘ఐపీఎల్ స్పాన్సర్షిప్ అంశం మా పరిశీలనలో ఉంది. మన భారతీయ కంపెనీపై అంతర్జాతీయ స్థాయిలో దృష్టి పడాలనేదే మా కోరిక. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజారావాలా చెప్పారు. పతంజలి గ్రూప్ ఏడాది టర్నోవర్ సుమారు రూ. 10 వేల కోట్లుగా ఉంది. -
ఐపీఎల్ 2020 : బిడ్డింగ్ రేసులో పతంజలి
సాక్షి,న్యూఢిల్లీ : మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో నిష్క్రమించిన తరువాత, యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి రేసులో ముందుకు వచ్చింది. తన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే వ్యూహంలో పంతాంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామంటూ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా ధృవీకరించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు. (‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)13 వ ఎడిషన్ టైటిల్ స్పాన్సర్ల వివాదం నేపథ్యంలోస్వదేశీ బ్రాండ్ పతంజలి రంగంలోకి దిగింది. తద్వారా తమ బ్రాండ్ కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని భావిస్తోంది. హరిద్వార్‌కు చెందిన పతంజలి గ్రూప్ టర్నోవర్ సుమారు10,500 కోట్ల రూపాయలు. అదానీ గ్రూపుతో పోటీ పడి పరీ భారీ అప్పుల్లో కూరుకుపోయిన రుచీ సోయాను కొనుగోలు చేసింది. అయితే ఇటీవల ఆయుర్వేద మందు కరోనిల్ కరోనా నివారణకు విజయవంతంగా పనిచేస్తుందని ప్రకటించి వివాదంలో పడింది. (ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు) కాగా చైనా-ఇండియా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా కంపెనీలతో సహా అన్న స్పాన్సర్ షిప్ లను కొనసాగిస్తూ బీసీసీఐ తీసుకున్ననిర్ణయం విమర్శలకు దారితీసింది. ఇప్పటికే అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 వంటి టాప్ బ్రాండ్స్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. -
కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా నివారణకు పతంజలి ఆయుర్వేద ఔషధంలో మరో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కోవిడ్-19 క్లినికల్ ట్రయల్‌కు సంబంధించిన అన్ని పత్రాలను ఆయుష్ మంత్రిత్వ శాఖతో పంచుకున్నామని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖకు, పతంజలికి మధ్య అభిప్రాయ భేదాలు లేవంటూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ మందులు కరోనా నివారణకు పనిచేస్తాయని ఎప్పుడూ పేర్కొనలేదని పతంజలి సీఈవో బాలకృష్ణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం విశేషం. (పతంజలి కరోనా మందుకు బ్రేక్!) కరోనా కిట్‌లో "దివ్య స్వసరి వతి", "దివ్య కొరోనిల్ టాబ్లెట్", "దివ్య అను తైల్" అనే ఔషధాలను భారతదేశం అంతటా తయారు చేసి పంపిణీ చేయడానికి మంత్రిత్వ శాఖ అనుమతి ఉందని పతంజలి తాజాగా ప్రకటించింది. తమ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ పత్రాలను ఆయుష్, భారత ప్రభుత్వంతో పంచుకున్నట్లు పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది. కోవిడ్-19 నిర్వహణపై తగిన విధంగా పనిచేసిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టంగా అంగీకరించిందని ప్రకటించింది. ఈ ఔషధాన్ని తీసుకున్న కరోనా రోగులు 3 రోజుల్లో 67 శాతం, 7 రోజుల చికిత్స అనంతరం 100 శాతం కోలుకున్నారని పునరుద్ఘాటించింది. అలా మొత్తం 45 మందికి తమ చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ ఫలితం వచ్చిందని తెలిపింది. (మాట మార్చిన ‘పతంజలి’.. అది కోవిడ్ మందు కాదు!) కాగా ఆయుర్వేద కంపెనీ పతంజలి కరోనా మహమ్మారికి కరోనిల్ కిట్ పేరుతో ఆయుర్వేద మందు కనుగొన్నామంటూ సంచలన ప్రకటన చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పూర్తి వివరాలను ప్రకటించాలని నిర్వాహకులకు నోటీసులు లిచ్చింది. దీంతో పతంజలి ఆయుర్వేద మందుపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. Patanjali claims that "#COVID19 patients group that received its medicines, showed 67% recovery in 3 days & 100% recovery in 7 days of treatment, that is, all 45 patients became COVID negative"; says all clinical trial documents have been shared with AYUSH Ministry. pic.twitter.com/jSMTxCwLp8 — ANI (@ANI) July 1, 2020 -
కరోనా మందు : మరిన్ని చిక్కుల్లో రాందేవ్
సాక్షి, పట్నా : కరోనా కట్టడికి ఆయుర్వేద ఔషధం కరోనిల్ కిట్ అంటూ అట్టహాసంగా ప్రకటించిన పతంజలి అధినేత, యోగా గురు రాందేవ్ ఇపుడు చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. సంస్థ కన్వీనర్ రాందేవ్, చైర్మన్ బాలకృష్ణపై కేసు నమోదు చేయాలంటూ సామాజిక కార్యకర్త తమన్నా హష్మి ఫిర్యాదు చేశారు. కోవిడ్-19 నివారణకు “కరోనిల్ ” వంద శాతం పనిచేస్తుందని ప్రకటించిన రాందేవ్, బాలకృష్ణపై మోసం, నేరపూరిత కుట్ర, ఇతర అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం తమన్నా హష్మి ఫిర్యాదు చేశారు. ప్రాణాంతక మహమ్మారికి మందు అంటూ లక్షలాది మంది ప్రజలను తప్పు దారి పట్టించి, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టివేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ బ్రేక్ అటు పతంజలి వివాదాస్పద కరోనిల్ మందుకు సంబంధించి ఆ సంస్థ వాదనలో వాస్తవాలు, శాస్రీయ అధ్యయనంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మంగళవారం బహిరంగంగా ప్రకటించింది. తమ పూర్తి పరిశీలన జరిగేంతవరకు ఈ ఔషధానికి సంబంధించి ఎలాంటి ప్రచారం చేయవద్దని పతంజలి సంస్థను ఆదేశించింది. అలాగే ఈ డ్రగ్ అనుమతులపై వివరాలను కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటిసులిచ్చింది. (పతంజలి కరోనా మందుకు బ్రేక్!) ఉత్తరాఖండ్ ప్రభుత్వ స్పందన ఈ నోటీసులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. పతంజలి తన 'కరోనిల్ మెడిసిన్' అనుమతికోసం దరఖాస్తును సమర్పించినప్పుడు "కరోనావైరస్" గురించి ప్రస్తావించలేదని ఉత్తరాఖండ్ ఆయుర్వేద శాఖ లైసెన్స్ ఆఫీసర్ వై ఎస్ రావత్ బుధవారం స్పష్టం చేశారు. రోగనిరోధక శక్తి పెంచే ఔషధంగా మాత్రమే పేర్కొంటూ జూన్ 10న దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. దగ్గు, జ్వరం నివారణ మందుగానే తాము లైసెన్స్ ఆమోదించామని తెలిపారు. కోవిడ్-19 కిట్ తయారు చేయడానికి వారికి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ, ఆ సంస్థకు నోటీసులు పంపించనున్నామని చెప్పారు. దీంతో వివాదం మరింత ముదిరింది. As per Patanjali's application, we issued them license. They didn't mention coronavirus, we only approved license for immunity booster, cough & fever. We'll issue them a notice asking how they got permission to make the kit (for COVID19): Licence Officer, Uttarakhand Ayurved Dept pic.twitter.com/I7CWKoJhbK — ANI (@ANI) June 24, 2020 కాగా సుమారు 150 ఔషధ మూలికలతో పతంజలి రీసెర్చ్ సెంటర్, ఎన్ఐఎంఎస్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జైపూర్) సంయుక్త కృషితో కరోనా నివారణకు ఆయుర్వేద మందు తయారు చేశామని రాందేవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అప్లికేషన్లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు
న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు తెచ్చిన కరోనిల్, స్వాసరి మందులపై ఇస్తున్న వాణిజ్య ప్రకటనలను వెంటనే నిలిపేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలి సంస్థను బుధవారం ఆదేశించింది. ఇటీవల మందుల తయారీ, మార్కెటింగ్ గురించి సంస్థ పెట్టుకున్న అప్లికేషన్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, పతంజలి ఆ అప్లికేషన్ లో కరోనా మందు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ‘పతంజలి అప్లికేషన్ ప్రకారం రోగ నిరోధక శక్తి, దగ్గు, జ్వరానికి మందు తయారు చేస్తామని పేర్కొన్నారు. వాళ్లకు కోవిడ్–19 కిట్ ను తయారు చేసే అనుమతి ఎలా వచ్చిందో నోటీసులు పంపి తెలుసుకుంటాం’ అని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద డిపార్టు మెంట్ లైసెన్సింగ్ ఆఫీసర్ వెల్లడించారు.(ప్రతి ఇంటికి కరోనా పరీక్షలు!) జైపూర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎన్ఐఎంఎస్)తో కలిసి కరోనా చికిత్సకు మందులు కనుగొన్నట్లు పతంజలి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థను ప్రమోట్ చేస్తున్న రామ్ దేవ్ బాబా స్వయంగా తానే రెండు మందులను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. కరోనిల్, స్వాసరి మందులను ఢిల్లీ, అహ్మదాబాద్, మీరట్ లలో క్లినికల్ ట్రయల్స్ కూడా చేశామని పతంజలి చెప్పింది. (హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!) పతంజలి మందులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్నివివరణ కోరినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. కరోనిల్, స్వాసరి మందులను పరిశీలించి, ఆమోదించే వరకూ ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయొద్దని సంస్థను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. -
కోవిడ్‌కి పతంజలి ఔషధం
హరిద్వార్/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వ్యాధిని మట్టుబెట్టే మందును కనుగొన్నట్లు యోగా గురువు రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద ఔషధ కంపెనీ ప్రకటించింది. ‘కరోనిల్, శ్వాసరి’అనే ఈ ఔషధాలు కోవిడ్‌ని ఏడు రోజుల్లో నయం చేస్తాయని కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ ఔషధం వివరాలను తమకు సమర్పించాలనీ, దీనిపై ఎటువంటి ప్రకటనలు చేయరాదని పతంజలి సంస్థను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనిల్, శ్వాసరి అనే రెండు ఆయుర్వేద మందులూ వెంటిలేటర్‌పై ఉన్న వారు మినహా ఇతర కోవిడ్ పేషెంట్లపై ప్రయోగించినప్పుడు 100 శాతం ఫలితాలిచ్చాయని రామ్‌దేవ్ హెర్బల్ మెడిసిన్ కంపెనీ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా (సీటీఆర్ఐ) అనుమతితో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు రామ్‌దేవ్ వెల్లడించారు. అన్ని ప్రొటోకాల్స్ని అనుసరించి, నియంత్రిత వైద్యపరీక్షల ఆధారంగా, హరిద్వార్‌లోని పతంజలి రీసెర్చ్ సెంటర్, జైపూర్‌లోని ప్రైవేటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఈ ఔషధాన్ని అభివృద్ధి పరిచినట్టు తెలిపారు. పతంజలి యాంటీ కోవిడ్ టాబ్లెట్, దివ్య కరోనిల్ ట్యాబ్లెట్‌ను తులసి, అశ్వగంధ, తిప్పతీగలతో తయారుచేశారు. ఈ ఔషదాన్ని 15 నుంచి 80 ఏళ్ల వారు వాడవచ్చునని పతంజలి ఔషధ సంస్థ సూచించింది. కరోనిల్‌తోపాటు, శ్వాసరి, అను టెల్ మందులను వాడాల్సి ఉంటుంది. వచ్చే సోమవారం నుంచి మొబైల్ యాప్ ద్వారా ఈ మందుల కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చన్నారు. రూ.545 ఖరీదైన ఈ కరోనా కిట్‌లో 30 రోజులకు సరిపడా మందులు ఉంటాయి. -
పతంజలి కరోనా మందుకు బ్రేక్!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నివారణకు ఆయుర్వేద మందును లాంచ్ చేసిన యోగా గురు రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఆయుర్వేద ఔషధం కరోనిల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థను ఆదేశించింది. అంతేకాదు అప్పటివరకూ ఎలాంటి ప్రచారాన్ని చేపట్టవద్దని కూడా మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. పతంజలి చెబుతున్న అంశాలపై వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు మంత్రిత్వ శాఖకు తెలియదని పేర్కొంది. ('కరోనిల్' 80 శాతం సక్సెస్‌ను చూపించింది) పతంజలి అట్టహాసంగా కరోనిల్ మందును ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19 నివారణకు గాను పతంజలి తయారు చేసిన ఆయుర్వేద మందును ఏ మోతాదులో, ఏయే ఆసుపత్రిలలో పరిశీలించారు, సంబంధిత పరిశోధన ఫలితాల తాజా డేటా, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్, సీటీఆర్ఐ రిజిస్ట్రేషన్ వివరాలను తమకు అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. వీటిని సమగ్రంగా పరిశీలించేంతవరకు ప్రచారాన్ని ఆపాలని పతంజలి సంస్థను ఆదేశించింది. దీంతోపాటు కరోనిల్ తయారీకి మంజూరు చేసిన లైసెన్స్ కాపీలు, అనుమతి వివరాలను అందించాలని మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరింది. పతంజలి ప్రధాన కార్యాలయం హరిద్వార్‌లో ఉంది, ఇది ఉత్తరాఖండ్ అధికార పరిధిలోకి వస్తుంది. రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో 150కి పైగా ఔషధ మూలికలతో కరోనిల్ ఔషదాన్ని రూపొందించామని పతంజలి సంస్థ ప్రకటించింది. క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని రాందేవ్ వెల్లడించారు. తమ మందు వాడిన కరోనా వైరస్ రోగులలో ఎక్కువ మంది 14 రోజుల్లో, దాదాపు 80 శాతం కోలుకున్నారని పతంజలి సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా భారతదేశంలో 425,000 మందికి పైగా కరోనావైరస్ బారిన పడగా, 14,000 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య తొమ్మిది మిలియన్లను దాటింది. మరణాల సంఖ్య 470,000 పైకి చేరుకుంది. -
పతంజలి భారీ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై : ఎఫ్ఎంసీజీ సెక్టార్లో దూసుకొచ్చిన దేశీయ సంస్థ బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ పలు ఉత్పత్తులపై పరిమిత కాలానికి ప్రత్యేక డిస్కౌంట్లను, కాంబో ఆఫర్లను అందిస్తోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా విక్రయాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో వినియోగ దారులను ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా భారీగా విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా అయిదారు రకాల ఆహారోత్పత్తులు, ఆయిల్స్, డ్రింక్స్, ఆటా, ఓట్స్, రడీ టూ ఈట్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా మూడు వస్తువులు కొంటే మూడు వస్తులను ఉచితంగా అందిస్తోంది. అలాగే కొన్ని ఆహార ఉత్పతులను ధరలను సగానికిపైగా తగ్గించి వినియోదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇంకా షాంపూలు, ఫేస్‌వాష్, ఇతర సౌందర్య సాధనాలపై కాంబో ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకునేందుకు, వినియోగదారులకు భారీగా ఆకట్టుకునేందుకు తొలిసారిగా పతంజలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా రసాయన రహిత, సహజసిద్ద ఉత్పత్తులంటూ దేశీయ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ప్రవేశించిన పతంజలి ఆయుర్వేద సంస్థ అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారతీయ రంగ సంస్థగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ బాలకృష్ణ సీఈవోగా హరిద్వార్ కేంద్రంగా నడుస్తున్న పతంజలి లాభాలను ఎన్డీయే సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ దెబ్బ కొట్టింది. అలాగే విదేశీ కంపెనీలు పోటీగా నిలవడంతో అమ్మకాల్లో, లాభాల్లోనూ వెనకబడింది. సీఏఆర్ఈ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018లో వెయ్యికోట్ల రూపాయలు కోల్పోయింది. కంపెనీ 2016-17లో రూ.9030 కోట్లు అమ్మకాలు సాధించగా.. 2017-18లో రూ.8135కోట్లకు పడిపోయింది. -
పుట్టింటికొచ్చి...
రాబ కొండల్నించి బావగారికి బుచ్చిబాబు ఒక అడవి పంది పిల్లని తెచ్చాడు. అది ముచ్చటగా వుండేది. ఆ పిల్లముండ కళ్లతో మాటాడేది. నన్నేం చెయ్యికండర్రా! అంటున్నట్టుండేవి దాని కళ్లు. ఆకలేస్తున్నాది, పాలు బువ్వ కలిపి పట్టుకు రండర్రా అనేవా కళ్లు. బుచ్చిబాబు బావ పేరు డాక్టరు గోపాలరాజు. అప్పగారి పేరు సీతమ్మ. ఆరుగురు కొడుకులూ, ఒక కూతురూ వాళ్లకి. లైకా అని ఒక కుక్క, ఒక జెర్సీ ఆవు. ఒక నెమలీ, రెండు పిల్లులూ, రెండు జతల చౌకీ బాతులు, ఓ రెండు డజన్ల గిన్నీ కోళ్లు, ఓ ఇరవై నాటుకోళ్లు, మూడెకరాల స్థలంలో పెద్ద నాలుగిళ్ల లోగిలి చుట్టూ ప్రహరీ. ఇంటి చుట్టూ సపోటా, జామ, నిమ్మ, దబ్బ, రాచ ఉసిరి, కొబ్బరి, మామిడి, పనస చెట్లున్నాయి. ఆ చెట్ల మీద పిట్టలున్నాయి. ఉడతలున్నాయి, మిడతలున్నాయి.డాక్టరు గారికి ఇవన్నీ అంటే చాలా ఇష్టం. సీతమ్మగారికీ ఇష్టమేగానీ వాటికి పెట్టే తిండికీ, వాటివల్ల కలిగే లాభానికీ పొంతన లేనందుకు చిరాకుగా వుండేది. పందిపిల్ల ఇంట్లో మనిషిలాగా అన్ని గదులూ తిరిగేది. పాలగచ్చు మీద కాలుజారి పడిపోయి చిన్నపిల్లలాగా ఏడిచేది. లైకాతో కలిసి సాటి పందిపిల్లతో ఆడినట్టు ఆడేది. ఆ కుక్క ఎందుకనోగానీ పందిపిల్లని దయగా చూసేది. పెరిటిలో జెర్సీ ఆవు దగ్గరకు వెళ్లి, దాని కుడితి గోళెంలోకి దిగిపోయి, అడుగునున్న దాణా, చిట్టు, అన్నం మెతుకులూ కలబడి తినేసి, ఆవుకు ఒట్టి కుడితి నీళ్లు మిగిల్చేది. చవికీ బాతుల మీదకి దూకుడుగా పరిగెత్తి వెళ్లేది. పెరటిలోను, ఇంటిముందూ పిల్లలు వేసిన కరివేపాకు మొక్కల్నీ, వంగ మొక్కల్నీ ఉత్త పుణ్యానికి పీకి పారేసేది. డాక్టరుగారి పిల్లలు దాన్ని ‘కొండీ’ అని పిలిచేవారు. అందరూ ముద్దు చేసేవారు. క్రమంగా పెరిగి అది మూడున్నర జానలు ఎత్తయింది. కుర్రతనం మాయమైపోయింది. మనుషుల సావాసం తగ్గించేసింది. వేళకు తినేది. కడమా అపుడు కూలిన ప్రహరీ గోడ సందులోంచి బైటకు వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వచ్చేది. గంటల తరబడి మామిడి చెట్ల మొదట నేలకి మోర ఆన్చి పడుకునేది. దాని కళ్లలోని తళుకు తగ్గిపోయింది. ఓరోజు పొద్దునే కరివేపాకు కోయడానికి వచ్చిన డాక్టరుగారి అయిదో కొడుకు బగ్గీకి అది కనిపించలేదు. కొండీ కొండీ అని పిలిచాడు. అలికిడి లేదు. బైటకు ఎక్కడికో వెళ్లి ఉంటుందని బగ్గీ లోపలికి వెళ్లిపోయాడు. ఆ మధ్యాహ్నమూ, ఆ సాయంత్రం కూడా అది రాలేదు. ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. ఏ వేటకుక్కలో అందేసి వుంటాయేమోనని భయపడ్డారు. మరునాటి ఉదయం బగ్గీ ఊరిలో వేటకుక్కలు పెంచే రాజుల ఇళ్లన్నీ తిరిగి, వాకబు చేశాడు. జగ్గు అనే జ్ఞాతిని తీసుకుని కొవ్వాడ కొండలకు వెళ్లి గొంతెత్తి ‘కొండీ’ ‘కొండీ’ అని పిలిచాడు. ఆ పిలుపు కొండలో ఇంకిపోయింది. ‘‘కుక్కలు గాకపోతే రేచులు పట్టేస్తాయి. లేదా ఎవరో వేటజట్టు ఈటె బెట్టి పొడిచేస్తారు. నేన్చెపుతూనే వున్నాను. మొన్న దసరాకి కోసేస్తే పోయేది’’ అన్నాడు జగ్గు. బగ్గీ మాటాడలేదు. అతని మనసు బాగాలేదు. ఊరి పొలిమేర చేరేసరికి వెనక ఏదో చప్పుడు. ‘కొండీ’ వెలిగిపోయింది బగ్గీ ముఖం. ఒళ్లంతా నిమిరాడు. సంబరంగా ఇంటికి తీసుకువెళ్లాడు. డాక్టరు గారు దానికి కిలో బెల్లంముక్క చేత్తో తినిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరో నాలుగు రోజుల తర్వాత మళ్లీ కొండి మాయమైపోయింది. కొవ్వాడ కొండల్లో – లేనట్టుంది. కొత్తవలస కొండల్లో – లేనట్టుంది. గొడికొమ్మ కొండల్లో– లేనట్టుంది. ‘‘ఉంటే మన బగ్గీగాడు పిలిస్తే రాకుండా వుండేదా... అడవులు పట్టేసుంటుంది’’ అని సీతమ్మ సరిపెట్టుకుంటే, ‘‘పంది మరుపంటారు. అదీపాటికి మనల్ని మరిచిపోయి వుంటుంది’’ అన్నాడు బుచ్చిబాబు అన్న చినబాబు. బగ్గీ కొవ్వాడ వేటదార్లకు, గంధవరం వేట జట్టుకు కబురు పెట్టాడు. ‘‘మా కొండికి బోరమీద, కుడికాలు మీద వెంట్రుకలు తెల్లగుంటాయి. కనబడితే కొట్టీ కండి.’’ ఫలితం లేకపోయింది. రెండు నెలలు గడిచాయి. అందరూ దాని గురించి మరిచిపోయారు. డాక్టరు గారు కేంపుకెళ్లారు. ఊర్లో దొంగాటకం ఎక్కువగా వుందని సీతమ్మ పెద తమ్ముడు చినబాబు తుపాకి పట్టుకుని, ఆ రోజు ఇంట్లో వుండటానికి వచ్చి తూర్పు గదిలో పడుకున్నాడు. తెల్లవారు రెండు గంటల వేళ– ధడధడమనే శబ్దంతో వీధి తలుపులు ఊగిపోతున్నాయి. తలుపులు బలమైనవి కాకపోతే విరిగిపోయేవి. అందరూ లేచిపోయారు. చినబాబు తుపాకీ పుచ్చుకుని వచ్చాడు. సీతమ్మ, పిల్లలూ వెళ్లి అరుగు మీద నిల్చుని చూస్తున్నారు. ‘ఎవరది?’ కోపంగా అడిగాడు చినబాబు. జవాబు లేదు. తలుపులు విరగ్గొట్టడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. చినబాబు కుడిచేత్తో తుపాకి పట్టుకొని, ఎడమ చేత్తో తలుపు గెడ తీస్తుండగానే ఇంటిలోకి చొరబడిపోయింది కొండి. అది ఘీమంటు నాలుగిళ్ల వాకిటిలో ఇటు అటూ పరుగెత్తింది. నీళ్ల గాబును ముట్టితో కొడితే పది బిందెల నీళ్లున్న అంత గాబూ తిరగబడిపోయింది. పెళ్లరుగు మీద, ఈశాన్యం మూలనున్న తులసికోటను ముట్టితో కొడితే ఆ ఇత్తడి తులసి కోట ఎగిరి అంతదూరం పడింది. బైట నుంచి కోపంగా అరుస్తూ వచ్చిన లైకాను గోడకేసి నొక్కేసింది. అంత కుక్కా కుయ్యోమంది. దాన్నొదిలేసి పెళ్లరుగుమీదున్న సీతమ్మ వైపు పరిగెట్టింది. పిల్లలూ, సీతమ్మా కంగారుగా చెదిరిపోయారు. కొండీ కొండీ అని బగ్గీ పిలుస్తుంటే దురుసుగా వాడి మీదికి వెళ్లిపోయింది. బగ్గీ చటాలున డైనింగ్ టేబుల్ ఎక్కిపోయాడు.పనున్నట్లు అది ఇంట్లోంచి బైటకు పరిగెట్టింది. ‘‘దానికి పిచ్చెక్కినట్టుందోయ్’’ అంది సీతమ్మ భయంగా తమ్ముడితో. చినబాబు బీడీ వెలిగించుకున్నాడు. చినబాబు, బగ్గీ, సీతమ్మ, మిగిలిన పిల్లలూ ఇంట్లోంచి బైటకు వచ్చారు. కోళ్లగూడు విరిగిపోయి వుంది. బాతులు అరుస్తున్నాయి. కొండీ పెళ్లగిస్తే పళ్లతో సహా ఒక బొప్పాయి చెట్టు విరిగిపోయింది. తెల్లారి వెన్నెల్లో కొండీ దయ్యం పట్టినదానిలాగా కనిపిస్తోంది. ‘‘ఎందుకైనా మంచిది మీరందరూ ఆ పిట్టగోడ మీద కూర్చోండి’’ అన్నాడు చినబాబు. లైకా భయపడి పోయి చినబాబు వెనక నిల్చుని భౌభౌమని గోలగా అరుస్తున్నది. కొండి ఉన్నట్టుండి చినబాబు వంక పరిగెత్తుకు రావడం మొదలుపెట్టింది. చినబాబు తుపాకీ ఎక్కుపెట్టాడు. ‘‘ఒద్దోయ్ చినమావయ్యా... ఒద్దు’’ అని బగ్గీ కేకలు వేసి పిట్టగోడ మీంచి దూకుతున్నప్పుడే చినబాబు ట్రిగ్గర్ నొక్కేశాడు. చినబాబుకు ఒక అడుగు దూరంలో కొండీ కూలిపోయింది. ‘‘దాన్ని చంపకపోతే మనం చస్తాం’’ అని వివరించి చినబాబు మరో బీడీ ముట్టించాడు. ‘‘రేపు బావొస్తే గొడవైపోతుంది’’ అన్నది సీతాదేవి భయంగా. ‘‘ఆ సంగతి నాకొదిలీ’’ అన్నాడు చినబాబు తుపాకీ సీతమ్మకు అందిస్తూ. మేనమామ, మేనల్లుళ్లూ కలిసి పట్టుకొని ఆ పందిని ఇంట్లోకి చేరేసి పెళ్లరుగు మీద పడేశారు. చినబాబు పేల్చిన గుండు దాని నుదుటి మీద తగిలింది– నెత్తురు సన్నగా కారుతోంది. గిన్నీ కోళ్లు, బాతులు అరుస్తూనే వున్నాయి. లైకా చచ్చిపడివున్న పంది పక్క కూర్చుని మోర ఎత్తి ‘ఓ ఓ ఓ’మని ఏడిచింది. ఛీ!ఛీ! అని తిట్టి దాన్ని వీధిలోకి తరిమి చినబాబు వీధి తలుపు వేసేశాడు. పొద్దున్న యాతప్పన్నకి కబురు చేస్తే వచ్చి ఆ పందిని పెరటిలోకి చేర్చి దానిని కోశాడు. ‘‘చూలుతో వుందండి బాబు... మూడు పిల్లలున్నాయి పొట్టలో’’ అని చెప్పేడు, తన పని తాను చేసుకుంటూనే. చినబాబు గుండెలో కలుక్కుమంది. విషయం అంతా అతనికి అర్థం అయిపోయింది. ఆడపంది ఎదకొచ్చి జతకోసం అడవికి వెళ్లింది. చూలుతో కానుపు కోసం పుట్టింటికి వచ్చింది. ఆ సంబరంతో పిచ్చి పన్లు చేసింది. బుద్ధిహీనంగా తుపాకి బెట్టి నేను దాన్ని చంపేశాను... కళ్లలో నీళ్లు తిరిగాయి చినబాబుకు. చెంపలు వాయించుకుని భగవంతుడికి క్షమాపణలు చెప్పుకుంది సీతమ్మ. కె.ఎన్.వై.పతంజలి(1952–2009) ‘సీతమ్మ లోగిట్లో’ సంక్షిప్త కథ ఇది. ఆయన ‘వేట కథ’ల్లో ఇదొకటి. ‘ఇది మా ఇంట జరిగినది. ఆ డాక్టరు గారు మా తండ్రిగారు, ఆ సీతమ్మ మా అమ్మయ్య, ఆ చినబాబు మా రెండోమామ’ అని ఆయనే రాసుకున్నారు. పతంజలి ప్రసిద్ధ జర్నలిస్టు, రచయిత. సాక్షి పత్రిక తొలి సంపాదకుడు. గోపాత్రుడు, రాజుగోరు, ఖాకీవనం, వీరబొబ్బిలి, ఓ దయ్యం ఆత్మకథ ఆయన రచనల్లో కొన్ని. కె.ఎన్.వై. పతంజలి -
భూములూ పోయే.. పరిశ్రమా రాకపాయె.. ?
సాక్షి, శృంగవరపుకోట (విజయనగరం): పరిశ్రమలు వస్తాయి.. పది మందికీ ఉపాధి వస్తుంది.. ఉద్యోగాలు వస్తాయి. మీ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి. మీ పిల్లలు ఉద్యోగస్తులు అయిపోతారంటూ పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టి పంటభూముల్ని పరిశ్రమల కోసం లాక్కున్నారు. ఏళ్లు గడిచాయి.. పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి తప్ప పరిశ్రమల జాడలేదు. ఉపాధి, ఉద్యోగాల ఊసే లేదు. పరిశ్రమల పేరుతో పందేరం పతంజలి పరిశ్రమను ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం భూసేకరణకు పూనుకుంది. కొత్తవలస మండలం చినరావుపల్లిలో పతంజలి ప్రాజెక్ట్ కోసం టీడీపీ ప్రభుత్వం తరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న జీడి, మామిడితోటలను బలవంతంగా సేకరించింది. చినరావుపల్లి, పెదరావుపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 350 మంది రైతుల నుంచి 172.84 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. పరిహారం పంపిణీ అరకొరగానే.. భూ సేకరణ సమయంలో రైతులు ఎకరాకి 20 నుంచి 25 లక్షలు నష్టపరిహారం కోరగా ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా రూ. 7 లక్షలు, ఉద్యానవశాఖ ద్వారా మరో 50 వేలు కలిపి ఎకరాకి రూ 7.50 లక్షలు చొప్పున చెల్లించారు. 571 జీఓ ప్రకారం 10 సంవత్సరంలు పైబడి సాగులోఉన్న రైతులకు 7.50 లక్షలు, 10 నుంచి 5 సంవత్సరాల్లోపు సాగులో ఉన్న రైతులకు రూ. 3.25 లక్షలు.. 5 సంవత్సరాల్లోపు సాగులో ఉన్న వారికి అసలు నష్టపరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేసినట్లు రైతులు వాపోతున్నారు. భూ సేకరణలో భాగంగా భూములిచ్చిన 15 ఎస్సీ కుటుంబాలకు, నాలుగు బీసీ కుంటుంబాలకు నేటికీ పరిహారం అందలేదు. నష్టపోయిన ఎస్సీలకు భూమికి ప్రతిగా భూమి, రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని కోర్టులో ఉన్న కేసుల్ని విత్‌డ్రా చేయించి, ఇప్పటికీ భూముల కేటాయింపు చేయలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతుల నుంచి తీసుకున్న భూములను మళ్లీ వారికే అప్పగించాలని పలువురు కోరుతున్నారు. భూములు లాక్కున్నారు చినరావుపల్లిలో సర్వే నంబర్ 95 నుంచి 105, 87/1, 87/3,90లో 2.93/1 నుంచి 44, 94–2, 98 నంబర్లలో 145.64 ఎకరాలు సేకరించగా, పెదరావుపల్లిలో 27.20 ఎకరాలు సేకరించి మొత్తం 172.84 ఎకరాలు పతంజలికి దారాధత్తం చేశారు. ఇందులో ఆక్రమణదారుల నుంచి 41.79 ఎకరాలు, డీ పట్టా భూములు 66.20 ఎకరాలు, ప్రభుత్వభూమి 6.62 ఎకరాలు, పీఓటీ భూములు 22.56 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తుల జిరాయితీ భూములు 8.47ఎకరాలు, పంతంజలి ప్రాజెక్టుకు దారాధత్తం చేశారు. తగ్గించి అమ్మకం.. టీడీపీ ప్రభుత్వంలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి పేరిట ఏపీఐఐసీ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో భూసేకరణ చేసింది. వీటిలో కొత్తవలస, రామభద్రపురం, భోగాపురం మండలాల్లో మాత్రమే పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. చినరావుపల్లిలో రైతుల వద్ద నుంచి ఎకరా 7.50 లక్షల రూపాయలు చెల్లించి తీసుకున్న భూముల్ని ఎకరానికి రూ. 2.50 లక్షలు తగ్గించి కట్టబెట్టి చంద్రబాబు సర్కారు తన ప్రేమను చాటుకుంది. నాడు పరిశ్రమ కోసం మాజీ ఎమ్మెల్యే సహా, ఆమె అనుచరులు, రెవెన్యూ అధికారులు భయపెట్టి భూసేకరణ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి చేశారు... మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుందని.. స్థానికులకు అవకాశం కల్పిస్తారని.. భూములు అతి తక్కువ ధరకే అమ్మేటట్లు రైతులపై ఒత్తిడి తీసుకువచ్చారు. 172.84 ఎకరాలు ఏపీఐఐసీ ద్వారా కొనుగోలు చేశారు. పరిశ్రమలు రానపుడు కేవలం భూములు అమ్ముకొవడం కోసమే ఇదంతా చేశారు. రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాడతా. –బూసాల దేముడు చినరావుపల్లి నమ్మించి మోసం చేశారు.. మాకు అన్యాయం జరుగుతుందని మా జీవనోపాధి పోతోందని కోర్టుకు వెళ్లిన మమ్మల్ని భూమికి భూమి ఇస్తామంటూ నమ్మబలికి ఇప్పుడు రెండు సెంట్ల భూమి చేతిలో పెట్టి పొమ్మంటున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. – పెట్ల నరసింగరావు, చినరావుపల్లి ఒక్కరూపాయి చెల్లిస్తే ఒట్టు.. పతంజలి కంపెనీ కోసం అన్నదమ్ములం సాగు చేసుంటున్న భూమి పీఓటీలో ఉందంటూ బలవంతంగా లాగేసుకున్నారు. తీసుకున్న భూమికి పరిహారం చెల్లిస్తామన్నారు. నేటికి ఒక్క రూపాయికూడా చెల్లించలేదు. టీడీపీ నాయకులు మాకు అన్యాయం చేశారు. – బొబ్బిలి ఎర్రయ్య చినరావుపల్లి -
పతంజలి పేరు వాడొద్దని నోటీసులు
టీ.నగర్: పతంజలి పేరును ఉపయోగించరాదని చెన్నైలోని యోగా విద్యా, పరిశోధనా సంస్థకు బాబా రాందేవ్ సోమవారం నోటీసులు పంపారు. బాబా రాందేవ్, ఆయన స్నేహితుడు బాలకృష్ణ ఆచార్య ‘పతంజలి’ పేరుతో ఆయుర్వేద కేంద్రాన్ని నడుపుతున్నారు. అంతేకాకుండా పతంజలి బ్రాండ్ నేమ్‌తో బిస్కెట్ తదితర వస్తువులను తయారుచేసి మార్కెటింగ్ చేస్తున్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆడియో సంస్థ ఒకటి పతంజలి యోగా సూత్రాలను విడుదల చేసింది. ఈ సంస్థ బాలాజీ విద్యాపీఠం అనే వర్సిటీ నడుపుతోంది. యోగా విద్యా, పరిశోధనా సంస్థకు బాబా రాందేవ్, బాలకృష్ణ ఆచార్య తరఫున నోటీసు పంపారు. పతంజలి పేరును తాము నమోదు చేశామని, దీన్ని ఉల్లంఘించడం 1999 పేటెంట్ చట్టం ప్రకారం నేరమని నోటీసులో పేర్కొన్నారు. -
‘చింతకింది’కి పతంజలి పురస్కారం
కళింగాంధ్ర కథ తీరే వేరు. దాని నడక, దాని తీవ్రత, దాని వెటకారం, దాని సామాజిక ఆదర్శం అన్నీ ప్రత్యేకమే. గుగ్గురువు గురజాడ నుంచి మొదలు పెట్టుకుంటే వర్తమానం వరకూ ఉత్తరాంధ్ర మట్టిలోనే ఏదో మహత్తు ఉన్నట్టుగా ఇక్కడి కథకులు చెలరేగిపోతుంటారు. చాసో, రావిశాస్త్రి, కారామాస్టారు, పతంజలి.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహానుభావులు. తెలుగు ప్రజల హృదయాల్లోకి వాస్తవికతలను బలంగా ప్రసారం చేసినవారు. రచనల ద్వారానే కాదు. సృష్టించిన పాత్రల ద్వారానూ వీరెప్పటికీ చదువరుల మనస్సుల్లో చిరస్థాయిగా కొలువై ఉంటారు. గురజాడ గిరీశాన్నీ, చాసో గవిరిని, రావిశాస్త్రి డోన్ట్ కేర్ మేస్టర్ని, కారామాస్టారి నూకరాజుని, పతంజలి గోపాత్రుణ్ణీ ఎవరయినా ఎలా మరచిపోగలం. కె.ఎన్.వై. పతంజలి రచనల విషయానికే వస్తే అవి మరీ విలక్షణమైనవిగా కళ్లకు కడతాయి. పత్రికా రచయితగా ప్రపంచాన్ని చూసిన అనుభవం ఆయనకు హెచ్చుగా కలిసివచ్చిందని అనిపిస్తుంటుంది. లేకపోతే ఆయన కలం నుంచీ ‘ఖాకీవనం’, ‘పెంపుడు జంతువులు’ వంటి నవలలు వచ్చి ఉండేవి కావేమో. లోకానుభవాన్నీ స్వీయపరిశీలనతో కలగలిపి కల్వంలో నూరి రాయకపోతే పతంజలి గోపాత్రుడు మనల్ని పలకరించేనా? పతంజలి పిలక తిరుగుడు పువ్వు మనందరినీ చూసి నవ్విపోయేనా? అప్పుడెప్పుడో శ్రీశ్రీ రాసిన పాడవోయి భారతీయుడా.. పాట ఇప్పటి దేశస్థితిగతులకూ అతికినట్టుగా ఎలా సరిపోతుందో, అచ్చం అలాగే పతంజలి రచనలు కూడా కాలాతీతమై నేటికీ మన వ్యవస్థ నిజరూపాన్ని బట్టబయలు చేస్తుంటాయి. నాడు ఆయన రాసిన ‘దిక్కుమాలిన కాలేజీ’ ఇప్పటికీ మన దిక్కుమాలిన చదువులను గుర్తుచేస్తూనే ఉంది. ఆయన ‘చూపున్న పాట’ కథలో చిట్లిపోయిన పిల్లనగ్రోవి చిందించిన నెత్తురు పెను ప్రవాహమై సమకాలీన సమాజాన్ని వెక్కిరిస్తూనే ఉంది. అంతెందుకు! ఇరవైయ్యేళ్ల కిందట పతంజలి రాసిన ‘నీ మతం మండా..!’ కవిత భారతీయ సమాజంలో చిచ్చురేపుతున్న తాజా మతోన్మాదులకు గట్టి హెచ్చరిక. విజయనగరం కేంద్రంగా పనిచేస్తున్న సుప్రసిద్ధ సాహిత్య సంస్థ కె.ఎన్.వై. పతంజలి సాంస్కృతిక వేదిక ప్రతీ ఏటా ఆయన జ్ఞాపకార్థం ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తుంటుంది. 2019కిగాను ఈ పురస్కారాన్ని ప్రసిద్ధ కథారచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావుకు ప్రకటించారు. మార్చి 29 పతంజలి జయంతి. ఈ సందర్భంగా విజయనగరంలో సాంస్కృతిక వేదిక ప్రతినిధులు చింతకిందిని అవార్డుతో సత్కరించనున్నారు. కె.ఎన్.వై. పతంజలి వైయక్తిక, సాహిత్య జీవితచరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ కోసం చింతకింది మోనోగ్రాఫ్‌గా రాయడం చెప్పుకోదగ్గది. పతంజలి పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా శ్రీనివాసరావుకు అభినందనలు. (నేడు కె.ఎన్.వై. పతంజలి జయంతి. ఈరోజు విజయనగరంలో పతంజలి పురస్కారాన్ని ప్రముఖ కథారచయిత చింతకింది శ్రీనివాసరావు అందుకుంటున్న సందర్భంగా) ప్రయాగ సుబ్రహ్మణ్యం ‘ మొబైల్ : 80080 01350 -
ఇక పతంజలి జీన్స్..
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద తాజాగా బ్రాండెడ్ దుస్తుల వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. ’పరిధాన్’ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,000 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాబా రాందేవ్ ఈ సందర్భంగా సోమవారమిక్కడ చెప్పారు. పరిధాన్ కింద లివ్‌ఫిట్, ఆస్థా, సంస్కార్ అనే మూడు బ్రాండ్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఏడాది 500– 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే 100 స్టోర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోనున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటిని వచ్చే ఏడాది నాటికి ఆన్లైన్లో కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం‘ అని రాందేవ్ వివరించారు. 2020 నాటికి మొత్తం 500 స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నామని, వీటిలో చాలామటుకు ఫ్రాంచైజీ విధానంలోనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సంస్కార్ బ్రాండ్ పూర్తిగా పురుషుల దుస్తుల శ్రేణి కాగా, ఆస్థా బ్రాండ్ కింద మహిళల దుస్తులు, లివ్‌ఫిట్ బ్రాండ్ పేరిట స్పోర్ట్స్‌వేర్.. యోగా దుస్తులు మొదలైనవి విక్రయించనున్నట్లు రాందేవ్ చెప్పారు. ఎంఎన్‌సీలతో పోటీ.. తమ బ్రాండ్ల సాయంతో అడిడాస్, ప్యూమా వంటి బహుళజాతి సంస్థలతో పోటీపడనున్నట్లు రాందేవ్ చెప్పారు. పరిధాన్ దుస్తుల శ్రేణి ధరలు 30– 40 శాతం చౌకగా ఉంటాయని, సామాన్య ప్రజానీకానికి ఉద్దేశించినవని ఆయన వివరించారు. స్థల లభ్యత, డిమాండ్ తదితర అంశాల ప్రాతిపదికన మూడు బ్రాండ్లు ఒకే దగ్గర విక్రయించే స్టాండలోన్ స్టోర్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని పతంజలి అపారెల్ వ్యాపార విభాగం హెడ్ కేఎం సింగ్ తెలిపారు. సాధారణంగా టెక్స్టైల్ రంగంలో బ్రాండెడ్ సెగ్మెంట్ వాటా 10 శాతం మాత్రమేనని, మిగతా 90 శాతం అసంఘటిత విభాగానికి చెందినవే ఉంటున్నాయని రాందేవ్ చెప్పారు. వీటిలో చెప్పుకోతగ్గ భారతీయ బ్రాండ్స్ పెద్దగా లేవన్నారు. ‘సామాన్య ప్రజానీకం దేశీ బ్రాండ్ దుస్తులను గర్వంగా వేసుకునేలా చేయడం మా లక్ష్యం‘ అని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ జ్యుయలరీ కూడా.. పరిధాన్ బ్రాండ్ కింద ఆర్టిఫిషియల్ జ్యుయలరీ, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన దుస్తులు కూడా ఉంటాయని రాందేవ్ చెప్పారు. పతంజలి జీన్స్ శ్రేణి రూ. 500 నుంచి మొదలవుతుందని, షర్ట్ల ధర రూ. 500–1,700 శ్రేణిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 మంది పైచిలుకు విక్రేతల నుంచి దుస్తులను సోర్సింగ్ చేస్తున్నామని, చిన్న.. మధ్య తరహా సంస్థలను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే హెర్బల్ ఆయుర్వేద, సహజసిద్ధమైన ఉత్పత్తులు, కాస్మెటిక్స్, వ్యక్తిగత సౌందర్య సాధనాలు, పశు దాణా.. బయోఫెర్టిలైజర్లు, పాల ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ వాటర్ తదితర రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న పతంజలికి ఇది తొమ్మిదో వెంచర్ కానుంది. ఇటీవలి కాలంలో గణనీయంగా కార్యకలాపాలు విస్తరించిన పతంజలి.. గత ఆర్థిక సంవత్సరం మాత్రం జీఎస్టీ తదితర అంశాల నేపథ్యంలో స్వల్ప వృద్ధితో రూ.12,000 కోట్ల టర్నోవర్‌కు పరిమితమైంది. 2016–17లో సంస్థ టర్నోవర్ రూ.10,561 కోట్లు. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 111 శాతం అధికం. -
ఇక నుంచి పతంజలి పాలు.. నీళ్లు
న్యూఢిల్లీ : దేశీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రముఖ రిటైల్ స్లోర్లకు గట్టి పోటీ ఇస్తున్న బాబా రామ్‌దేవ్ తన పతంజలి నుంచి మరో ఐదు ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నట్లు ప్రకటించింది. సమర్థ భారత్.. స్వస్థ భారత్ మిషన్‌లో భాగంగా పాలు, పాల ఉత్పత్తులు, నిల్వ చేయడానికి వీలున్న కూరగాయాలు, సోలార్ ఉత్పత్తులు, డ్రింకింగ్ వాటర్, పశువుల మేతకు సంబంధించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు బాబా రాందేవ్ తన ట్విటర్లో ప్రకటించారు. అంతేకాక 2020 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 1000 కోట్ల రూపాయల అమ్మకాలు లక్ష్యంగా ఈ ఉత్పత్తులను తీసుకోస్తున్నట్లు బాబా రామ్‌దేవ్ తెలిపారు. దీని ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించారు. हर बूँद में शुद्धता ! Quench your thirst with Patanjali Divya Jal ! pic.twitter.com/SJDQI8o81S — Swami Ramdev (@yogrishiramdev) September 13, 2018 అంతేకాక తన స్టోర్ల ద్వారా నిత్యం 10లక్షల లీటర్ల పాల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్‌దేవ్ తెలిపారు. పాలతో పాటు, పన్నీర్, పెరుగు లాంటి ఇతర పాల ఉత్పత్తులను సైతం విక్రయించనున్నట్లు ప్రకటించారు. పాడి పరిశ్రమ రైతులను మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇతర సంస్థలు విక్రయించే పాలకన్నా 2 రూపాయలు తక్కువకే పాలను విక్రయిస్తామని స్పష్టం చేశారు. అలాగే ‘దివ్య జల్’ పేరుతో తీసుకోస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ 250 ఎమ్ఎల్, 500 ఎమ్ఎల్, 1 లీటరు, 2 లీటర్లు, 5 లీటర్లు, 20 లీటర్ల ప్యాక్ పరిమాణంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. హరిద్వార్ ప్రధాన కేంద్రంగా కార్యాకలాపాలను నిర్వహిస్తున్న పతంజలి దేశవ్యాప్తంగా 56వేల రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. -
కింభో యాప్ మళ్లీ తుస్సు
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ యాప్ అంటూ కొన్నాళ్లుగా ఊరిస్తున్నపతంజలి మెసేజింగ్ యాప్ లాంచింగ్ మళ్లీనిరాశపర్చింది. తొందరలోనే అధికారిక లాంచింగ్‌పై తేదీని ప్రకటిస్తామని పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణ ట్విటర్ ద్వారా సోమవారం వెల్లడించారు. అత్యంత సురక్షితమైన, సౌకర్యవంతమైన యాప్‌ను అందించేందుకు ట్రయల్స్, రివ్యూలు అప్ గ్రేడేషన ప్రాసెస్ చేస్తున్నాం. అధికారికంగా లాంచింగ్ తేదీని ప్రకటిస్తామంటూ ఆయన ట్వీట్ చేశారు. భద్రతాలోపం కారణంగా గూగుల్ నుంచి మిస్ కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 27న అధికారికంగా కస్టమర్ల ముందుకు రానున్నామని ప్రకటించిన కింభో యాప్ లాంచింగ్ మళ్లీ తుస్సుమంది. కాగా ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం సొంతమైన వాట్సాప్‌కు పోటీగా స్వదేశీయ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ మొబైల్ మెసేజింగ్ యాప్ కింభో పేరుతో విడుదల చేయనున్నామని దేశీయ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ప్రకటించింది. కానీ భద్రతా కారణాల ర్యీతా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యమయ్యింది. అయితే అభివృద్ది పరిచిన గోప్యతా విధానంతో ఆగస్టు 27న అధికారికంగా లాంచ్ కాబోతోందని మళ్లీ పతంజలి ఎండీ బాలకృష్ణ ట్విటర్లో ప్రకటించారు. ఆగష్టు 15న టెస్టింగ్ వెర్షన్‌గా డౌన్‌లోడింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. అయితే రెండవసారి కూడా గోప్యతా కారణాల రీత్యానే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యం కావడం గమనార్హం. We appreciate your excitement over official launch of @KimbhoApp we inform you that trials, review & upgradation is in process to make #किम्भो #Kimbho most safe, convenient & secure #Swadeshi app of your first choice. We will announce new date of official launch asap @ANI pic.twitter.com/hBO0A5tzOU — Acharya Balkrishna (@Ach_Balkrishna) August 27, 2018 -
ఎన్సీఎల్టీలో పతంజలి పిటిషన్
న్యూఢిల్లీ: రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్ బిడ్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ పతంజలి ఆయుర్వేద కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. రూ.12,000 కోట్ల భారీ బ్యాంక్ రుణాల కారణంగా రుచి సోయా కంపెనీపై దివాలాప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రుచి సోయాను టేకోవర్ చేయడానికి అదానీ విల్మర్‌తో పాటు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ కూడా బిడ్లు వేశాయి. రుచిసోయా రుణదాతలు రూ.6,000 కోట్ల అదానీ విల్మర్ బిడ్‌కు ఆమోదం తెలిపాయి. దీనిని ఎన్సీఎల్టీ ఆమోదించాల్సి ఉంది. అయితే రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)ను పతంజలి ఆయుర్వేద్ ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 27న(సోమవారం) విచారణ జరిగే అవకాశాలున్నాయని అంచనా. వివాదమిది... రుచి సోయాను చేజిక్కించుకోవడానికి అదానీ విల్మర్, పతంజలిల మధ్య దీర్ఘకాలంగా పోరు జరుగుతోంది. అదానీ విల్మర్ రూ.6,000 కోట్ల మేర బిడ్‌ను దాఖలు చేయగా, పతంజలి ఆయుర్వేద కంపెనీ రూ.5,700 కోట్ల మేర్ బిడ్‌ను దాఖలు చేసింది. రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్ బిడ్‌కు పచ్చజెండా ఊపారు. ఏ ప్రాతిపదికన అదానీ విల్మర్ బిడ్‌ను ఆమోదించారో వెల్లడించాలని పతంజలి ఆయుర్వేద్ ప్రశ్నించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ), శేలైంద్ర అజ్మీరకు న్యాయ సలహాదారుగా సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ నియామకాన్ని కూడా పతంజలి కంపెనీ తప్పుపట్టింది. అదానీ గ్రూప్‌నకు కూడా సిరిల్ అమర్‌చంద్ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారని వివరించింది. వ్యాఖ్యానించడానికి పతంజలి నిరాకరణ... ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నామని పతంజలి ప్రతినిధి ఎస్.కె. తిజరవాలా పేర్కొన్నారు. మరోవైపు అదానీ గ్రూప్ ప్రతినిధి కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. -
వాట్సాప్‌కు షాక్ : న్యూ లుక్‌తో కింభో రీలాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు గుండెల్లో గుబులు పుట్టించేలా కింభో మళ్లీ వార్తల్లోకొచ్చేసింది. ఈ నెలలోనే ఈ కింభో యాప్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ఖాతాలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. కొత్త, ఆధునిక ఫీచర్లు కింభో యాప్ లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్నామంటూ ట్వీట్ చేశారు. కింభో యాప్‌ను ఆగష్టు 27, 2018 న ప్రారంభించనున్నామని బాలకృష్ణ ట్వీట్ చేశారు. ఈ యాప్ ట్రయిల్ వెర్షన్‌ను ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాదు లాంచింగ్‌కు ముందే యూజర్లు తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు. కాగా యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ వాట్సాప్‌కు పోటీగా కింభో పేరిట కొత్త స్వదేశీ మెసేజింగ్ తీసుకురానున్నట్టు ఈ ఏడాది మే 31న ప్రకటించారు. అచ్చం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో కింభో యాప్‌ను రామ్‌దేవ్ విడుదల చేశారని పతంజలి గ్రూప్ ప్రతినిధి ఎస్కే తిజారావాలా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సంస్కృతంలో కింభో అంటే ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? అనే అర్థాలు వస్తాయని ఈ సందర్భంగా తిజారావాలా తెలిపారు. అయితే సెక్యూరిటీ కారణాల రీత్యా గూగుల్ ప్లే స్టోర్ నుంచి కింభో అదృశ్యమైన సంగతి తెలిసిందే. T-1 स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं आप के विश्वास के लिए पतंजलि परिवार आपके प्रति कृतज्ञ है,आप स्वतंत्रता दिवस के पावन उत्सव के साथ डिजिटल आजादी का जश्न "किम्भो:" के नये और एडवांस फीचर्स के साथ मनाइये| किम्भो: ऐैप में कुछ सूक्ष्म न्यूनताएँ हो सकती है, उनके continues in T-2 pic.twitter.com/bWLk6x6x3Q — Acharya Balkrishna (@Ach_Balkrishna) August 15, 2018 -
కోల్గేట్, ప్యాంటీన్, నెస్లేలకు బ్యాడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు, ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి సహ-వ్యవస్థాపకుడు రాందేవ్ విదేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీలపై మరోసారి ధ్వజమెత్తారు. విదేశీ ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) దిగ్గజ కంపెనీల కథ త్వరలోనే ముగియనుందంటూ జోస్యం చెప్పారు. యునీలీవర్, కోల్గేట్, పాంటీన్, నెస్లే వంటి అగ్రగామి సంస్థలపై బహిరంగంగానే టార్గెట్ చేసిన రాందేవ్ భారతదేశంలో పోటీ తీవ్రంగా సాగుతోంది. ఇక కంపెనీల ఆట కట్టేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కంపెనీలు స్వర్గానికి పోవడం ఖాయమని పేర్కొన్నారు. దీనికోసం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని కేవలం కొద్ది సమయం మాత్రమే మిగిలివుందన్నారు. మనిషి 100 సంవత్సరాల్లో స్వర్గానికి చేరతాడు. ఈ కంపెనీలు కేవలం మరో రెండు రోజుల్లో సమసిపోనున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ రాకతో ఈ కంపెనీలు శీర్షాసనం (తల్లకిందులు) వేశాయని, మరో రెండు రోజుల్లో ఇక మోక్షమేనంటూ తనదైన యోగా భాషలో చెప్పుకొచ్చారు. ‘‘ప్యాంటీన్ ప్యాంట్ తడిచిపోనుంది.. కోల్గేట్ గేటు మూతపడుతుంది.. నెస్లేలో పక్షులు ఎగిరిపోతాయి’’ అన్న 2016 నాటి రాందేవ్ వ్యాఖ్యలు గురించి అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. కాగా ఆయుర్వేద ఉత్తత్పులతో మార్కెట్లోకి దూసుకొచ్చిన 'పతంజలి' 2018 సంవత్సరానికి 20వేలకోట్ల రూపాయలసంస్థగా అవతరించనున్నామని ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఇప్పటివరకూ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఏలిన ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ తదితర సంస్థలకు గట్టి సవాల్ విసిరింది. అంతేకాదు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కష్టంగా మారిన తరుణంలో పతంజలి ఏకంగా మూడంకెల వృద్ధిని సాధించడం విశేషం. -
వాట్సాప్ ప్రత్యర్థి మరో రెండు నెలల్లో వచ్చేస్తోంది
న్యూఢిల్లీ : వాట్సాప్ గట్టి పోటీగా.. స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ... పతంజలి తీసుకొచ్చిన మెసేజింగ్ యాప్ కింభో. ఆ యాప్ మార్కెట్లో ఆవిష్కరణ అయిన 24 గంటల్లోనే తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. దీంతో ఒక్కసారిగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ ఈ యాప్‌ను తొలగించేశారు. కింభో యాప్ చాలా ప్రమాదకరమంటూ ఫ్రెంచ్ నిపుణులుచెప్పేసరికి పతంజలి సైతం తమ యాప్‌లో ఉన్న సమస్యలన్నింటిన్నీ తొలగించాక రీ-లాంచ్ చేస్తామని ప్రకటన చేసింది. తాజాగా ఆ యాప్‌కు మరిన్ని టెస్ట్‌లు చేస్తోంది. ఈ యాప్‌ను బయటికి విడుదల చేయడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముందని యోగా గురు బాబా రాందేవ్ ప్రకటించారు. ‘టెస్టింగ్ దశలోనే ఈ యాప్ భారీ ఎత్తున్న ట్రాఫిక్‌ను ఎదుర్కొంది. ఇది కేవలం పైలెట్ దశ మాత్రమే. ప్రస్తుతం ప్రిపరేషన్స్లు జరుగుతున్నాయి. ఈ యాప్ సెట్ కావడానికి మరో రెండు నెలల పట్టే అవకాశముంటుంది. పెద్ద ఎత్తున్న యూజర్ ట్రాఫిక్‌ను ఎలా నిర్వహించాలో ప్రస్తుతం మేము పరిశీలిస్తున్నాం’ అని శుక్రవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబా రాందేవ్ పేర్కొన్నారు. ‘స్వదేశీ మెసేజింగ్ యాప్’ను భవిష్యత్తులో అధికారికంగా లాంచ్ చేస్తామని చెప్పారు. మార్కెట్లో ఉన్న ప్రస్తుత మెసేజింగ్ యాప్స్‌కు గట్టి పోటీగా పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ యాప్‌ను తయారుచేసినట్టు మే నెలలో కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. సిమ్ కార్డును విడుదల చేసిన అనంతరం, ‘ ఇప్పుడు భారత్ మాట్లాడుతుంది’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ యాప్‌ను తీసుకొచ్చింది. కానీ ఆ యాప్‌లో ప్రైవసీ సమస్యలున్నాయనే కారణంతో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ నుంచి తొలగించారు. -
పతంజలి జీన్స్ వచ్చేస్తున్నాయ్..
న్యూఢిల్లీ : ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేసిన అనంతరం పతంజలి ఆయుర్వేద్ సంస్థ వస్త్ర మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి వరకు ‘పరిధాన్’ పేరుతో క్లాతింగ్(వస్త్ర) బ్రాండ్‌ను లాంచ్ చేయనున్నట్టు పతంజలి ఎండీ, సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ చెప్పారు. వస్త్రాలను ఇన్‌హౌజ్‌లోనే థర్డ్ పార్టీ ద్వారా తయారు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యాపారాల నిర్వహణ కోసం నోయిడాలో ఓ బృందాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వీటి కోసం ఎక్స్‌క్లూజివ్‌గా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో 100 స్టోర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.పతంజలి పరిధాన్ బ్రాండ్ కింద పిల్లల దుస్తులు, యోగా దుస్తులు, స్పోర్ట్స్‌వేర్, టోపీలు, బూట్లు, టవల్స్, దుప్పట్లు, యాక్ససరీస్ వంటి 3000 రకాల వస్తువులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అంతకముందే యోగా గురువు బాబా రాందేవ్ వెల్లడించారు. వీటిలో ముఖ్యంగా స్వదేశీ జీన్స్ ఉండనున్నట్టు, భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా స్వదేశీ జీన్స్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘జీన్స్ అనేది వెస్టరన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌తో మనం రెండింటిన్నీ అనుసరించవచ్చు. ఒకటి వారిని బాయ్‌కాట్ చేయడం లేదా వాటిని స్వీకరించడం. కానీ దేశీయ సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించలేం ఎందుకంటే జీన్స్ చాలా పాపులర్ అయ్యాయి. దీంతో వెస్టరన్ మాదిరిగా కాకుండా.. పూర్తిగా స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ జీన్స్‌ను తయారుచేస్తున్నాం’ అని బాలకృష్ణ కూడా ఓ సందర్భంలో చెప్పారు. దీంతో ఈ జీన్స్ ఎలా ఉండబోతుందోనని వినియోగదారుల్లో ఆసక్తి మొదలైంది. మొత్తానికి ఏడాది చివర్లోనే ఈ జీన్స్ మార్కెట్లోకి రానున్నట్లు బాలకృష్ణ తాజాగా వెల్లడించారు. -
ఫుడ్ పార్క్: రాందేవ్ బాబాకు సీఎం యోగి ఫోన్...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రూ.6వేల కోట్లతో మెగా ఫుడ్ పార్క్ పెట్టాలన్న ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు పతాంజలి సంస్థ ప్రకటించిన నేపథ్యంలో యూపీ సీఎం రంగంలోకి దిగారు. ఫుడ్ పార్క్ రాష్ట్రం నుంచి తరలించవద్దని పతాంజలి సంస్థ సహ వ్యవస్థాపకులైన రాందేవ్ బాబాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి పతంజలి ఆయుర్వేద్ ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ, రాందేవ్ బాబాలతో మాట్లాడారు. పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని యోగి వారికి హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇవ్వడంతో రాందేవ్ కూడా పుడ్ పార్క్‌ను యూపీలోనే ఏర్పాటు చేయడానికి అంగీకరించారని యూపీ పరిశ్రమల మంత్రి సతీశ్ మహానా పేర్కొన్నారు. యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో 425 ఎకరాల్లో పతంజలి మెగా ఫుడ్ పార్క్ పెట్టాలని భావించింది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇందుకు సహకరించడంలేదని పతంజలి ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ మంగళవారం ఆరోపించారు. ‘పుడ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. అనుమతుల కోసం చాలా కాలం ఎదురుచూశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం లేదు. ఇప్పుడు మేము ఈ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చాలని నిర్ణయించాం’ అని బాలకృష్ణ వెల్లడించారు. ఆచార్య బాల క్రిష్ణ ఇలా బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించడంతో యోగి వెంటనే రాందేవ్ బాబాతో మాట్లాడారు. -
యోగిపై విసుగెత్తిన బాబా రాందేవ్ ఏం చేశారంటే..
లక్నో : యోగా గురు బాబా రాందేవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విసుగెత్తిపోయారు. యోగి ఎన్నిరోజులకు కూడా తమ ప్రతిష్టాత్మకమైన ఫుడ్ పార్క్‌కు క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై విసుగుచెందిన బాబా రాందేవ్, చివరికి తన ఫుడ్ పార్క్‌నే ఉత్తరప్రదేశ్ నుంచి తరలించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యమునా ఎక్స్‌ప్రెవేతో పాటు మెగాఫుడ్‌పార్క్‌ను నిర్మించాలనుకున్నారు. అయితే ఈ ఫుడ్ పార్క్ స్కీమ్ కోసం కేంద్రానికి సమర్పించాల్సిన అర్హత పత్రాలను కంపెనీ పొందలేకపోతుందని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ చెప్పారు. పేపర్ వర్క్ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ పోతుందని పేర్కొన్నారు. ‘ ఈ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. క్లియరెన్స్ కోసం చాలా కాలంగా వేచిచూస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించాం’ అని ఆచార్య బాలక్రిష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యామని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ విషయంలో చాలా జాప్యం చేస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్షల మంది వ్యవసాయదారుల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఏర్పాటయ్యే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు కావాల్సిన మిషనరీని కంపెనీ ఇప్పటికే ఆర్డర్ చేసిందని, ఈ ప్రాజెక్ట్‌తో లక్షల కొద్దీ ఉద్యోగవకాశాలు సృష్టిస్తామని చెప్పారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ప్రకారం ఢిల్లీకి దగ్గరిలో గౌతమ్ బుద్ నగర్లో ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ కోసం ఈ ఏడాది జనవరిలోనే తొలి ఆమోదం వచ్చేసింది. కానీ దీనికి కావాల్సిన భూమి, బ్యాంకు రుణానికి సంబంధించిన పేపర్లను కంపెనీ సమర్పించాల్సి ఉంది. తమ షరతులను చేరుకోవడానికి పతంజలికి ఒక నెల పొడిగింపు ఇచ్చామని, ఒకవేళ పతంజలి తమ షరతులను అందుకోలేకపోతే, రద్దు చేయడమే తప్ప.. తమ దగ్గర మరే ఇతర అవకాశం లేదని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ అధినేత జేపీ మీనా అన్నారు. ఈ నెల ఆఖరి వరకు కంపెనీకి సమయం ఉందన్నారు. -
కింభో కథ కంచికేనా ?
స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెక్టార్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి సంస్థ డిజిటల్ రంగంలోనూ తన సత్తా చాటాలనుకుంది. వాట్సాప్‌కి ఈ స్వదేశీ యాప్‌తో సవాల్ విసురుతున్నాం అంటూ కొత్త మెసేజింగ్ యాప్ కింభోను ప్రవేశపెట్టింది. ఇప్పుడు భారత్ మాట్లాడుతోంది అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ యాప్ ప్రవేశపెట్టి 24 గంటలు తిరగక ముందే దాని చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా కింభో అదృశ్యమైంది. ఈ యాప్‌కి ఏ మాత్రం సెక్యూరిటీ లేదన్న విమర్శలు మొదలయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎందుకు తొలగించారు ? కింభో యాప్ తయారీదారులు పతంజలి కమ్యూనికేషన్స్ దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. పూర్తి స్వదేశీ అని చెప్పుకుంటూ వచ్చిన ఈ మెసెంజర్ యాప్‌లో పాకిస్తాన్ నటీమణి మావ్రా హోకేన్ ఫోటోను వాడడం ఇబ్బందికరంగా మారింది. అదీ కాకుండా కింభో యాప్ బోలో అన్న యాప్‌కి మక్కీకి మక్కీ కాపీ అంటూ ట్విట్టర్లో పోస్టులు వెల్లువెత్తాయి. ఇది స్వదేశీ యాప్ కాదు కాపీ క్యాట్ అంటూ రెండు యాప్‌ల స్క్రీన్షాట్లు పక్క పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల్లో ట్రాల్ కావడంతో దీనిని ప్రస్తుతానికి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే అండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో ఈ యాప్ కనిపించకపోవడంపై కింభో సాంకేతిక బృందం వివరణ ఇచ్చింది. తాము ఊహించని దానికంటే అధికంగా స్పందన రావడంతో సర్వర్లు అప్‌గ్రేడ్ చేస్తున్నామంటూ ట్వీట్ చేసింది. కింభో ఒక భద్రతా విపత్తు : ఫ్రెంచి నిపుణులు కింభో యాప్ వచ్చిన ఒక్క రోజులోనే దాని చుట్టూ ఎన్నో వివాదాలు మొదలయ్యాయి. భద్రతాపరంగా అదొక పైఫల్యాల పుట్ట అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కింభో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ఏ మాత్రం సురక్షితం కాదని ఫ్రెంచి సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్‌లోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఫ్రాన్స్‌కు చెందిన నిపుణుడు ఎలియట్ ఆల్డర్సన్ కింభో యాప్‌ని ఒక పెద్ద జోక్ అంటూ అభివర్ణించారు..‘ కింభో యాప్ నిండా సాంకేతిక లోపాలే ఉన్నాయి. దీనిని డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇది అచ్చంగా బోలో అన్న అప్లికేషన్‌కు కాపీలా ఉంది. అంతేకాదు కింభో యాప్ బోలోమెసేంజర్.కామ్‌కి రిక్వెస్ట్ కూడా పంపుతోంది‘ అని అల్డర్సన్ ట్వీట్ చేశారు. ఈ యాప్‌ని వినియోగించే ప్రతీ ఒక్కరికీ తాను యాక్సెస్ అయి వారి మెసేజ్‌లు చదవగలుగుతున్నానని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. కింభో ఎలా ఉంది ? కింభో అచ్చంగా వాట్సాప్‌ని తలపించేలా ఉంది. మెసేజింగ్, ఆడియా చాట్, వీడియో కాలింగ్, గ్రూప్స్ ఏర్పాటు, ఫోటోలు వీడియోల షేరింగ్, స్టిక్కర్స్, క్వికీస్, గ్రాఫిక్స్ ఇలా అన్ని రకాల ఫీచర్లతో వాట్సాప్‌ను పోలి ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇంతే కాకుండా సెలిబ్రిటీలను ఫాలో అయ్యే కొత్త ఫీచర్ కూడా ఇందులో పొందుపరిచారు. కింభో అంటే సంస్కృతంలో ఎలా ఉన్నారు ? ఏంటి కొత్త విషయాలు ? అని అర్థం. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ యాప్‌కి అందరూ అడిగే మొట్టమొదటి కుశల ప్రశ్న ఎలా ఉన్నారు అన్న అర్థం వచ్చేలా కింభో అన్న పేరు పెట్టారు. ఇక లోగో దగ్గర్నుంచి మిగిలినవన్నీ ఇంచుమించుగా వాట్సాప్ మాదిరిగానే ఉన్నాయి. భారత్‌లో మొట్టమొదటి మెసేజింగ్ యాప్ ఇదే.. ‘ఇది మన స్వదేశీ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. వాట్సాప్‌ను సవాల్ చేసేలా ఈ యాప్ డిజైన్ చేశాం.‘ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్.కె. తిజరావాలా ట్వీట్ చేశారు. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన ఒక్క రోజులోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యం కావడంతో దీని కథ ఇక కంచికేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. వాట్సాప్ డౌన్లోడ్లు 100 కోట్లు దాటిపోవడంతో, ఎంత స్వదేశీ రంగు పూసినా ఏ మెసేజింగ్ యాప్‌కి వాట్సాప్‌ని ఎదుర్కొనే సత్తా సమీప భవిష్యత్‌లో ఉండదనే అభిప్రాయమైతే వినిపిస్తోంది. -
వాట్సాప్‌కు షాకిస్తూ...
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌కు పతంజలి సంస్థ షాకిచ్చింది. వాట్సాప్‌కు పోటీగా కొత్త యాప్‌ను రూపకల్పన చేసింది. కింభో పేరిట యాప్ రూపకల్పన చేసి ఆవిష్కరించింది. యోగా గురు రాందేవ్ బాబా ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం పతంజలి ప్రతినిధి ఎస్కే తిజారావాలా ట్వీట్ చేశారు. ‘ఇకపై భారత్ మాట్లాడుతుంది. వాట్సాప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ స్వదేశీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి’ అంటూ తిజారావాలా ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను పతంజలి విడుదల చేసింది. రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా అందించనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు పతంజలి సిమ్ యూజర్లకు ఆ సంస్థ ఉత్పత్తులపై పదిశాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్‌ను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటం విశేషం. -
ఇక పతంజలి సిమ్ కార్డులు..!
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ సిమ్ కార్డ్ చూసుంటాం. వొడాఫోన్, ఐడియా, జియో ఇలా వివిధ కంపెనీలకు చెందిన సిమ్ కార్డ్‌ల గురించి మనకు తెలుసు. రానున్న రోజుల్లో పతంజలి సిమ్ కార్డ్‌లనూ చూడబోతున్నాం. నిజమే!! యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్ కంపెనీ... త్వరలో సిమ్ కార్డుల్ని తీసుకొస్తోంది. ‘స్వదేశీ సమృద్ధి’ పేరిట ఈ సిమ్‌లను బాబా రామ్‌దేవ్ మార్కెట్లోకి విడుదల చేశారు కూడా. పతంజలి సంస్థ సిమ్ కార్డ్ సేవల కోసం ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్తో జట్టుకట్టింది. సిమ్ల ఆవిష్కరణతో పతంజలి టెలికం రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లయింది. పతంజలి ప్రస్తుతం ఫుడ్, ఆయుర్వేద్ మెడిసిన్, కాస్మటిక్స్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ విభాగాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే Patanjaliayurved.net ప్రారంభంతో ఈ–కామర్స్‌లోకి కూడా ప్రవేశించింది. పతంజలి డైవర్సిఫికేషన్ ప్రణాళికలు? ఎలక్ట్రిక్ వెహికల్స్, స్టీల్, మొబైల్ చిప్ తయారీ కంపెనీలు తమ మద్దతును కోరినట్లు పతంజలి ఆయుర్వేద్ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. కొన్ని కంపెనీలు భాగస్వామ్యాన్ని ఆశిస్తే, మరికొన్ని ఆర్థిక సహాయాన్ని కోరాయన్నారు. అయితే తాము ఇప్పటికీ డైవర్సిఫికేషన్‌కు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దేశీ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తామని, అలాగే ఇక్కడి సంస్థలతోనే జతకడతామని తెలిపారు. ‘స్టీల్, ఎలక్ట్రిక్ వెహికల్, యాంటి– రేడియేషన్ మొబైల్ చిప్ సహా దాదాపు అన్ని రంగాలకు చెందిన తయారీదారులు మమ్మల్ని సంప్రతించారు. మేం అన్ని వ్యాపారాలూ చేయలేం. మా బిజినెస్‌కు ఏమైతే అనుకూలమో వాటినే చేస్తాం’ అని వివరించారు. అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెక్నాలజీస్ కొనుగోలుతో పతంజలి.. సోలార్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఎడిబుల్ ఆయిల్ తయారీ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ కొనుగోలు రేసులోనూ ముందుంది. ఆఫర్ ధరను రూ.4,300 కోట్లకు పెంచింది. ఇది అదానీ గ్రూప్ ఆఫర్ కంటే 30 శాతం అధికం. ఈ ఆఫర్లపై చర్చించడానికి రుచి సోయా రుణ దాతల కమిటీ రేపు(బుధవారం) సమావేశం కావచ్చు. పతంజలి ప్రధాన బిజినెస్ ప్యాకేజ్డ్ కన్సూమర్ గూడ్స్. కంపెనీకి రిటైల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ (ఆయుర్వేద్) విభాగాల్లోనూ కార్యకలాపాలున్నాయి. కంపెనీ షాంపు, టూత్‌పేస్ట్ నుంచి బిస్కట్లు, నూడిల్స్, బియ్యం, గోధుమ వరకు చాలా ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఇతర విభాగాల్లోకి ఎందుకంటే.. పతంజలి ఆదాయాల వృద్ధి రేటు నిలిచిపోయింది. రెట్టింపు అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల కారణంగా కంపెనీకి సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం దాదాపు 2016–17 ఏడాది మాదిరిగానే ఉంది. 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.10,561 కోట్లు. అందుకే పతంజలి డైవర్సిఫికేషన్‌కు ప్రాధాన్యమిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు బీ2బీ, బీ2సీ వ్యాపారాల మధ్య చాలా వ్యత్యాసాలుంటాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇవీ... సిమ్ కార్డు విశేషాలు ♦ తొలిదశలో పతంజలి ఉద్యోగులు, కార్యాలయ సిబ్బందే స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డుల ప్రయోజనాలను పొందగలరు. ఈ స్కీమ్ గనక విజయవంతమైతే... వీటిని సామాన్య ప్రజలకూ అందుబాటులోకి తీసుకొస్తామని ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా సంస్థ తెలిపింది. ♦ స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డుల ద్వారా అర్జించిన లాభాలను దేశ ప్రజల సంక్షేమానికి వినియోగిస్తామని పతంజిలి పేర్కొంది. ♦ సిమ్ కార్డులను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తెచ్చిన తర్వాత.. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డ్ తీసుకున్నవారు పతంజలి ప్రొడక్టులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ తెలిపింది. అలాగే ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా ప్రయోజనాలూ ఉంటాయి. ♦ స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డ్‌పై రూ.144 రీచార్జ్‌తో అపరిమిత కాల్స్, 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందొచ్చు. ఈ ప్యాక్ వాలిడిటీ మాత్రం వెల్లడి కాలేదు. ♦ బీఎస్ఎన్ఎల్కు చెందిన ఐదు లక్షల కౌంటర్ల ద్వారా త్వరలో వినియోగదారులు పతంజలి సిమ్ కార్డులను పొందొచ్చని రాందేవ్ బాబా చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది. -
టెలికాం మార్కెట్లోకి పతంజలి బ్రాండు
-
జియోకు పోటీనా? పతంజలి సిమ్ కార్డులు
హరిద్వార్ : టెలికాం మార్కెట్లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియోకు గట్టి పోటీ వచ్చేసింది. దేశంలో అత్యంత నమ్మకమైన కన్జ్యూమర్ గూడ్స్ బ్రాండ్‌గా పేరులోకి వచ్చిన రాందేవ్ బాబా పతంజలి బ్రాండు ఆదివారం టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టింది. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను రాందేవ్ బాబా లాంచ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంలో ఈ సిమ్ కార్డులను ప్రవేశపెట్టారు. తొలుత ఈ సిమ్ కార్డు ప్రయోజనాలను పతంజలి ఉద్యోగులకు, ఆఫీసు బేరర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాందేవ్ బాబా చెప్పారు. రిలయన్స్ జియో కూడా తొలుత తన జియో సిమ్ కార్డును లాంచ్ చేసినప్పుడు, ఉద్యోగులకే మొదట దాని ప్రయోజనాలను అందజేసింది. అనంతరం కమర్షియల్‌గా మార్కెట్లోకి లాంచ్ అయి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పతంజలి లాంచ్ చేసిన ఈ సేవలు పూర్తిగా మార్కెట్లోకి వచ్చిన అనంతరం, ఈ కార్డులతో పతంజలి ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. కేవలం 144 రీఛార్జ్‌తో దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకునే సౌకర్యం, 2జీబీ డేటా ప్యాక్, 100 ఎస్ఎంఎస్లను కంపెనీ ఆఫర్ చేయనుంది.వాటితో పాటు ప్రజలకు ఈ సిమ్ కార్డులపై వైద్య, ప్రమాద, జీవిత బీమాలను పతంజలి అందించనుంది. బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ నెట్వర్క్’ అని ఈ సందర్భంగా రాందేవ్ అన్నారు. పతంజలి, బీఎస్ఎన్ఎల్ ఇరు కంపెనీల ఉద్దేశ్యం కూడా దేశ సంక్షేమమేనని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కున్న ఐదు లక్షల కౌంటర్లలో, పతంజలి స్వదేశీ సమృద్ధి కార్డులు ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పతంజలితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంపై బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునిల్ గార్గ్ ఆనందం వ్యక్తం చేశారు. -
మోదీ నిర్ణయాలను తప్పుపట్టిన ‘పతంజలి’
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగ ఉత్పత్తుల రంగంలో ఆయుర్వేద, సహజ ఉత్పత్తులతో శరవేగంగా దూసుకుపోతున్న పతంజలి కంపెనీకి ఊహించని బ్రేక్ పడింది. 2009లో వినియోగ ఉత్పత్తుల ఆయుర్వేద కంపెనీని ఏర్పాటు చేసిన నాటి నుంచి అనూహ్య లాభాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న పతంజలి కంపెనీ 2018 సంవత్సరానికి తన లాభాలు రెట్టింపు అవుతాయని ఆశించింది. 2017లో సాధించిన ఉత్పత్తుల టర్నోవర్ 10, 500 కోట్ల రూపాయల వద్దనే ఆగిపోయింది. అంటే, 2018 సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ ఒక్క పైసా కూడా పెరగలేదన్న మాట. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడం, జీఎస్టీ పన్నును ప్రవేశ పెట్టడం వల్ల ఎలాంటి పురోగతి సాధించలేకపోయామని పతంజలి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకష్ణ మీడియాకు తెలియజేశారు. 2018 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఇరవై వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేశారు. వ్యక్తిగత వినియోగం నుంచి గృహావసరాలు, ఆహార పదార్థాల వరకు దాదాపు వెయ్యి ఉత్పత్తులను పతంజలి సంస్థ విక్రయిస్తోంది. త్వరలో దుస్తుల రంగంలో కూడా ప్రవేశించాలనుకుంటోంది. ఈసారి టర్నోవర్ పెరగకపోవడానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని కంపెనీ సాకుగా చూపిస్తోందని, వాటి ప్రభావం చాల తక్కువని టెక్నోపాక్ కన్సల్టింగ్ సంస్థ ఉపాధ్యక్షుడు అంకూర్ బైసన్ తెలిపారు. పతంజలి అతి తక్కువ ఉత్పత్తులతోని మార్కెట్లోకి ప్రవేశించడం, స్వచ్ఛ వనమూలికలతోని చేసినవంటూ వాటికి మంచి ప్రచారం కల్పించడం, యోగా గురువుగా పతంజలికి మంచి పేరు ఉండడం, అప్పటికే మార్కెట్ రంగంలో ఉన్న కంపెనీలు తమ ఉత్పత్తులకు అంతగా ప్రచారాన్ని కల్పించక పోవడం వల్ల పతంజలి ఉత్పత్తులు మార్కెట్లో దూసుకుపోయాయని, ఆ తర్వాత పతంజలి తమ ఉత్పత్తులను విపరీతంగా పెంచేయడం, వాటిలో జంతు సంబంధిత అవశేషాలు కూడా వాడుతున్నారని తెలియడం, పతంజలికి పోటీగా ఇతర కంపెనీలు కూడా తమ ఉత్పత్తులకు విస్తత ప్రచారాన్ని కల్పించడం తదితర కారణాల వల్ల పతంజలి ఉత్పత్తుల జోరుకు బ్రేక్ పడిందని ఆయన వివరించారు. కేశాల సంరక్షణకు హిందూలేఖ బ్రాండ్‌ను 2015లో హిందుస్థాన్ లీవర్ కంపెనీ తీసుకరావడం, కాల్గేట్ కంపెనీ కూడా 2016లో హెర్బల్ టూత్‌పేస్ట్‌ను తీసుకరావడం, ఆయుష్ బ్రాండ్ కూడా గతేడాది హెర్బల్ పర్సనల్ కేర్ ఉత్పత్తి తీసుకరావడంతో పతంజలి ఉత్పత్తులకు పోటీ పెరిగిందని బైసన్ తెలిపారు. 2018 సంవత్సరంలో వాస్తవానికి హెర్బల్ ఉత్పత్తుల రెవెన్యూ 13.5 శాతం పెరిగిందని నీల్సన్ ఇండియా కంపెనీ ఓ నివేదికలో వెల్లడించింది. -
రుచి సోయాకు పతంజలి రూ. 4 వేల కోట్ల ఆఫర్
న్యూఢిల్లీ: దివాలా తీసిన వంటనూనెల సంస్థ రుచి సోయా కొనుగోలు కోసం కంపెనీలు పోటాపోటీగా బిడ్లు వేస్తున్నాయి. తాజాగా యోగా గురు బాబా రామ్‌దేవ్‌కి చెందిన పతంజలి ఆయుర్వేద ఏకంగా రూ.4,000 కోట్ల పైచిలుకు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అదానీ విల్మర్, ఇమామి ఆగ్రోటెక్, గోద్రెజ్ ఆగ్రోవెట్ తదితర సంస్థలు రుచి సోయా కోసం పోటీపడుతూ బిడ్లు దాఖలు చేశాయి. ఇండోర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుచి సోయా రుణభారం ప్రస్తుతం రూ.12,000 కోట్లకు పైగా ఉంది. న్యూట్రెలా, మహో కోశ్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి గోల్డ్ తదితర బ్రాండ్స్ పేరిట ఉత్పత్తులు విక్రయిస్తోంది. భారీ మొండిబాకీల నేపథ్యంలో దివాలా చట్టం కింద చర్యలకు ఆదేశించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్... రుణ సమస్య పరిష్కారం దిశగా కంపెనీ అమ్మకానికి ప్రత్యేక నిపుణుడిని (ఐఆర్పీ) నియమించగా.. ప్రస్తుతం బిడ్స్ దాఖలు ప్రక్రియ జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రుచి సోయా షేర్లు 7 శాతం ఎగిశాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు ఇంట్రా–డేలో దాదాపు 20 శాతం పెరిగి 16.05 స్థాయిని తాకి, చివరికి 7.09 శాతం లాభంతో రూ. 14.35 వద్ద క్లోజయ్యింది. అటు ఎన్ఎస్ఈలో 4 శాతం లాభంతో రూ. 14 వద్ద ముగిసింది. బీఎస్ఈలో దాదాపు 33.89 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 3 కోట్ల మేర షేర్లు చేతులు మారాయి. -
త్వరలో మార్కెట్లోకి పతంజలి దుస్తులు
పనాజి: యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి ఆయుర్వేద్ .. త్వరలో దుస్తుల తయారీ విభాగంలో కూడా ప్రవేశించనుంది. వచ్చే ఏడాది వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) నిర్వహిస్తున్న ’గోవా ఫెస్ట్ 2018’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బాబా రాందేవ్ వెల్లడించారు. ‘మార్కెట్లోకి మీ కంపెనీ జీన్స్ ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు అంటూ అందరూ నన్ను అడుగుతున్నారు. అందుకే వచ్చే ఏడాదిలో దుస్తులు కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. పిల్లలు, పురుషులు, మహిళలు .. అందరికీ సంబంధించిన గార్మెంట్స్ ప్రవేశపెడతాం‘ అని ఆయన వివరించారు. అలాగే.. స్పోర్ట్స్, యోగాకు ఉపయోగపడే గార్మెంట్స్ కూడా ప్రవేశపెడతామని బాబా రాందేవ్ తెలిపారు. స్వదేశీ దుస్తుల తయారీ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన గతేడాదే తెలిపారు. పతంజలి ఆయుర్వేద్ ప్రతీ ఏడాది ఆర్థికంగా మరింత మెరుగైన పనితీరు సాధిస్తున్నట్లు, త్వరలోనే టర్నోవర్‌పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఎదగగలదని బాబా రాందేవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమాల కోసం పెద్ద పెద్ద స్టార్స్‌ని తీసుకోకపోవడం వల్ల గణనీయంగా ఆదా అవుతోందని ఆయన చెప్పారు. సాధారణంగా ప్రజానీకంతో తమకు ఉన్న సంబంధాలే .. బ్రాండ్ ఎదుగుదలకు ఉపయోగపడుతోందన్నారు. అయితే, పలు ప్రకటనల నుంచి ఇప్పటికే తాను తప్పుకున్నానని, రాబోయే రోజుల్లో ప్రచార కార్యక్రమాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని రాందేవ్ వివరించారు. ఇతర దేశాలకు కూడా కార్యకలాపాలు విస్తరిస్తున్నామన్నారు. ఆర్థికంగా బలహీన దేశాల్లో వచ్చే లాభాలను మళ్లీ అక్కడే ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించినట్లు రాందేవ్ చెప్పారు. -
సీఎం భార్యకు చేదు అనుభవం
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. శనివారం షోలాపూర్‌లో జరిగిన పతంజలి ఉత్పత్తుల ప్రచార కార్యక్రమానికి హజరైన అమృత ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. పతంజలి ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్‌ను కల్పిస్తున్నారో స్వయం ఉపాధి మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు కూడా అలాంటి మార్కెట్ సదుపాయాలనే కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో మహిళా కార్యకర్తలు వేదికకు వెలుపలకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కార్యక్రమం పూర్తయిన తర్వాత విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరి మీద కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కోన్నారు. పతంజలి ఉత్పత్తులను ప్రజలు గుడ్డిగా నమ్ముతారని అమృత ఫడ్నవీస్ అన్నారు. పతంజలి ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని బాబా రాం దేవ్, దేశ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, రాజ్యసభ ఎంపీ హేమమాలిని కూడా హజరయ్యారు. -
పతంజలి.. మరింత ‘క్లిక్’!!
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ.. ఆన్లైన్ అమ్మకాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, షాప్‌క్లూస్, బిగ్‌బాస్కెట్, 1ఎంజీ, పేటీఎం మాల్, నెట్‌మెడ్స్ వంటి 8 ఈ–కామర్స్ దిగ్గజాలతో జట్టు కట్టింది. ఈ పోర్టల్స్‌లో తమ ఉత్పత్తుల శ్రేణి మొత్తం అందుబాటులో ఉంటుందని బాబా రామ్‌దేవ్ మంగళవారం చెప్పారు. ఆన్లైన్ అమ్మకాల ద్వారా తొలి ఏడాదే రూ.1,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే ’దివ్య జల్’ పేరిట బాటిల్డ్ వాటర్, ’పరిధాన్’ బ్రాండ్ కింద దుస్తులు, పాదరక్షలు ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు రాందేవ్ తెలిపారు. ‘సంప్రదాయ రిటైల్ మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించేందుకు ఆన్లైన్ ఉపయోగపడుతుంది. ఈ ఏడాది రూ.1,000 కోట్ల అమ్మకాల లక్ష్యం పెట్టుకున్నాం. సాధ్యపడితే అంతకు మించి కూడా చేయాలనుకుంటున్నాం‘ అని తెలియజేశారు. 2016–17లో పతంజలి ఆయుర్వేద్ టర్నోవరు రూ. 10,500 కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండు రెట్ల వృద్ధిని లకి‡్ష్యంచుకుంది. సొంత పోర్టల్‌తో డిసెంబర్లో రూ.10 కోట్లు .. ప్రయోగాత్మకంగా తమ సొంత పోర్టల్ ‘పతంజలిఆయుర్వేద్.నెట్’ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల శ్రేణిని ఆన్లైన్లో విక్రయిస్తున్నామని, డిసెంబర్ నెలలో ఏకంగా రూ.10 కోట్ల విక్రయాలు జరిగాయని, మిగతా ఏ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ కూడా ఒక నెలలో ఈ స్థాయి అమ్మకాలు సాధించలేదని రామ్‌దేవ్ తెలియజేశారు. రిటైల్ స్టోర్స్ సంఖ్యను కూడా పెంచుకోనున్నట్లు చెప్పారాయన. గ్రామాల్లోని కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అందుబాటు ధరల్లో మరిన్ని ఉత్పత్తులను చిన్న ప్యాక్‌లలో అందించే ప్రణాళికలు కూడా ఉన్నట్లు తెలియజేశారు. ‘ప్రస్తుతం 5,000 పైచిలుకు ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఉండగా.. వీటిని ఇంకా పెంచుతాం. జనవరి 26న స్వదేశ్ సమృద్ధి పేరిట కొత్తగా లాయల్టీ కార్డును ప్రవేశపెడుతున్నాం‘ అని వెల్లడించారు. బీమా ప్రయోజనం కూడా (మరణం, అంగవైకల్యం) కల్పించే ఈ లాయల్టీ కార్డు ద్వారా అయిదు కోట్ల మందికి చేరువ కావాలని నిర్దేశించుకున్నట్లు రామ్‌దేవ్ చెప్పారు. ప్రస్తుతం తమ ఉత్పత్తులు 15–20 లక్షల కిరాణా దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయంటూ ఈ ఏడాది వీటిని 50 లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. 20వేల మంది నియామకం.. కార్యకలాపాల విస్తరణ ప్రణాళికల నేపథ్యంలో 20,000 మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నామని .. సేల్స్ మేనేజర్, జోనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్ స్థాయి దాకా వివిధ హోదాల్లో ఈ పోస్టులుంటాయని రామ్‌దేవ్ తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా మరింతగా పెంచుకుంటున్నట్లు చెప్పారు. ‘వార్షికంగా రూ. 50,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీ సామర్థ్యం మాకు ఉంది. ఎఫ్ఎంసీజీలో ఇదే అత్యధికం. హరిద్వార్, తేజ్‌పూర్, అసోమ్‌లలో ప్లాంట్లున్నాయి. అటు నోయిడా, నాగ్‌పూర్, ఇండోర్లలో కూడా ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది‘ అని వివరించారు. ప్రిస్క్రిప్షన్ అవసరమయ్యే పతంజలి ఔషధాలు మాత్రమే నెట్‌మెడ్స్, 1ఎంజీ పోర్టల్స్‌లో లభ్యమవుతాయి. పతంజలి ఉత్పత్తులు ఆన్లైన్లో విక్రయిస్తున్నప్పటికీ.. ప్రత్యేక డిస్కౌంట్లేమీ ఉండవు. రిటైల్ అవుట్‌లెట్స్‌కి ధరలపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఎగుమతులు.. నాగ్‌పూర్‌లోని మిహా దగ్గర నిర్మిస్తున్న ఎగుమతి ఆధారిత ప్లాంటు అందుబాటులోకి వచ్చాక.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎగుమతులు కూడా ప్రారంభించనున్నట్లు రామ్‌దేవ్ తెలిపారు. యూఏఈ, అమెరికా, కెనడా, యూరప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికన్ దేశాలతో పాటు పలు ప్రాంతాలకు ఎగుమతులు చేసేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. పతంజలి ఇటీవలే పిల్లలు .. పెద్దల డైపర్స్, చౌక శానిటరీ నాప్కిన్స్ను కూడా ప్రవేశపెట్టింది. సౌర విద్యుదుత్పత్తి పరికరాల తయారీలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. -
‘స్వదేశీ’కి విదేశీ దన్ను!
న్యూఢిల్లీ: స్వదేశీ నినాదంతో బహుళజాతి ఎఫ్ఎంసీజీ సంస్థలకు సవాల్ విసురుతున్న బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్... ఇప్పుడు మరింత బలపడేందుకు విదేశీ నిధుల వేటలో తలమునకలైంది. పలు వెంచర్ ఫండ్స్‌తో చర్చలు ప్రారంభించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.10,500 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ఈక్విటీ ఫండ్స్‌తో సమావేశాలు నిర్వహిం చాం. గత కొన్ని నెలల్లో 12కు పైగా వెంచర్ క్యాపిటలిస్టులతో భేటీ అయ్యాం’’ అని పతంజలి ప్రతినిధి ఎస్కే తిజర్వాలా తెలిపారు. కలసి పనిచేసేందుకు సిద్ధం... పతంజలితో కలసి పనిచేయడానికి ఇష్టమేనని ఫ్రాన్స్‌కు చెందిన ఎల్వీఎంహెచ్ ప్రకటించింది. అయితే, విదేశీ నిధులతో, బహుళజాతి సంస్థలతో పతంజలి కలసి పనిచేయకపోవచ్చని ఎల్‌క్యాటరన్ ఏషియా ఎండీ రవితక్రన్ చెప్పారు. ఎల్‌క్యాటరన్ ఈక్విటీ ఫండ్‌కు ఎల్వీఎంహెచ్ సహ యజమాని. 500 మిలియన్ డాలర్లతో (రూ.3,250 కోట్లు) పతంజలిలో వాటా తీసుకునేందుకు ఆసక్తితో ఉంది. పతంజలి ప్రస్తుత విలువ 5 బిలియన్ డాలర్లు (రూ.32.500 కోట్లు) ఉంటుందని తక్రన్ పేర్కొన్నారు. రుణాలే తీసుకుంటాం ‘‘నాగ్‌పూర్, గ్రేటర్ నోయిడా, అసోం, చండీగఢ్, ఏపీ, తెలంగాణ, హర్యానా, రాజస్తాన్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు, ఔషధ, సుగంధ మొక్కల పెంపకానికి తక్షణమే రూ.5,000 కోట్ల నిధుల అవసరం ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందగలం. కానీ, బ్యాంకుల కంటే తక్కువ రేటుకు భారత కరెన్సీ రూపంలో నిధుల కోసం అన్వేషిస్తున్నాం. ఎవరికీ కంపెనీలో వాటాలిచ్చే ఉద్దేశం లేదు. ఈక్విటీ లేదా షేర్ల రూపంలో నిధులను అంగీకరించం.’’ – ఆచార్య బాలకృష్ణ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సీఈవో -
హరిద్వార్ టు హర్ ద్వార్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి తమ దూకుడును మరింత పెంచింది. తన ఉత్పత్తులతో దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీలకు దడ పుట్టిస్తున్న సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆన్లైన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలిపింది. ఇకపై హరిద్వార్ నుంచి హర్ ద్వార్ దాకా (హరి ద్వారా నుంచి ప్రతి గుమ్మం దాకా) అని తమ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పలు ప్రముఖ ఇ-రీటైలర్లు , అగ్రిగేటర్లతో తమ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీంతో ఇక మీదట ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ఇతర ఈ కామర్స్ సైట్లలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి యోగా గురు రాం దేవ్ మంగళవారం న్యూఢిల్లీలో కీలక ప్రకటన చేశారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు ఇకపై అమెజాన్, ఫ్లిప్‌కార్ల్,షాప్ క్లూస్, బిగ్ బాస్కేట్, నెట్ మెడ్, వన్ ఎంజీ అఫీషియల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. పలు గృహా అవసరాలతోపాటు, ఆయుర్వేద మందులు, పానీయాలు లాంటి పలు రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల సోలార్ ఉత్పత్తులపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఉత్పత్తులు ఇప్పటికే ఇతర విక్రయదారుల ద్వారా అనేక ఆన్లైన్ ప్లాట్ ఫాంలలో లభ్యమవుతున్నప్పటికీ ఇపుడిక ఇకపై ఒక క్రమపద్ధతిలో కస్టమర్ల ముంగిళ్లకు అందుబాటులోకి రానున్నాయి. Now world class Patanjali products will be available from Haridwar to Har Dwar, just on a click #PatanjaliOnline pic.twitter.com/phhiiFIyuc — Swami Ramdev (@yogrishiramdev) January 16, 2018 -
ఆన్లైన్ మార్కెట్‌పై పతంజలి దృష్టి
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్‌కి చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి... తాజాగా ఆన్లైన్ మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. సంస్థకు ఇప్పటికే పతంజలి ఆయుర్వేద్డాట్నెట్ పేరిట సొంత పోర్టల్ ఉన్నప్పటికీ.. మరిన్ని ఈ–కామర్స్ సంస్థలతో చేతులు కలపడం ద్వారా కార్యకలాపాలు మరింత విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 8 ఈ–కామర్స్ సంస్థలతో జట్టు కట్టేందుకు కసరత్తు మొదలెట్టింది. స్వదేశీ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాల కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్, 1ఎంజీ వంటి సంస్థలతో త్వరలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పతంజలి ప్రతినిధి ఎస్.కె.తిజారావాలా ఇటీవలే మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్లో చేసిన ట్వీట్ ఇందుకు ఊతమిస్తోంది. ఆన్లైన్లో భారీగా విస్తరించే దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద ఈ–కామర్స్ కంపెనీలతో త్వరలో జట్టు కట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో అనేక పోర్టల్స్‌లో పతంజలి ఉత్పత్తులు లభ్యం కాగలవని, కంపెనీ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం కాగలదని తిజారావాలా తెలిపారు. ఈ భాగస్వామ్యాలతో తమ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రాగలవన్నారు. ఆన్లైన్ కంపెనీలన్నింటితో భేటీ అయ్యే దిశగా పతంజలి ఈ నెల 16న భారీ కార్యకమ్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ ఆచార్య బాలకృష్ణ కూడా హాజరుకానున్నారు. కొంగొత్త వ్యూహాలతో వృద్ధి.. బ్రోకింగ్ సంస్థల అంచనాల ప్రకారం.. పతంజలి బ్రాండ్ ఆహారోత్పత్తులు ప్రస్తుతం 26 శాతం కుటుంబాలకు, వ్యక్తిగత సౌందర్య సాధనాల ఉత్పత్తులు 53 శాతం కుటుంబాలకు చేరుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది వంద శాతం వృద్ధి. కార్యకలాపాల విస్తరణ కోసం పతంజలి ఆయుర్వేద సంస్థ కొన్నాళ్లుగా వ్యాపార వ్యూహాలకు మరింత పదును పెడుతూ వస్తోంది. ప్రారంభం నుంచి అనుసరిస్తూ వస్తున్న బ్రాండెడ్ ఫ్రాంచైజీ విధానం నుంచి.. ఎఫ్ఎంజీసీ కంపెనీలు అనుసరించే చానల్ డిస్ట్రిబ్యూషన్ మార్గానికి కూడా మళ్లింది. 2020 నాటికల్లా రూ. 1 లక్ష కోట్ల వార్షిక అమ్మకాలు సాధించాలని పతంజలి నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 2019 నాటికల్లా పంపిణీదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 5,000 నుంచి 25,000కు పెంచుకోవాలని పతంజలి భావిస్తోంది. అలాగే, ఆన్లైన్ వ్యాపార ప్రణాళికలు సైతం వ్యాపార వృద్ధికి గణనీయంగా తోడ్పడనున్నాయి. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ రంగంలో ఏడో స్థానంలో ఉన్న పతంజలి.. తాజా వ్యూహాలతో మరింత భారీ మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు.. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 20,000 కోట్ల టర్నోవరు లక్ష్యాన్ని సాధించేందుకు ఆన్లైన్ ప్రణాళికలు దోహదపడే అవకాశాలు ఉన్నాయి. -
సానిటరీ ప్యాడ్స్‌పై పతంజలి దృష్టి
న్యూఢిల్లీ : రాందేవ్ బాబా ఆధ్వర్యంలోని పతంజలి ప్రొడక్ట్స్ రోజురోజుకు తన ఉత్పత్తుల సంఖ్యను పెంచుకుంటూపోతోంది. ఇప్పటికే వివిధ రకాల మార్కెట్లపై దృష్టి సారించిన పతంజలి గ్రూప్ తాజాగా ఆరోగ్యకరమైన న్యాప్కిన్లు, డైపర్ల తయారీపై ఆసక్తి కనబరుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి ఈ రంగంలో రూ. 16వేల కోట్ల మార్కెట్ సాధిస్తామని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే గుప్తా తెలిపారు. 2006లో మొదటిసారి హెర్బల్ ఉత్పత్తులతో ప్రస్థానం ప్రారంభించిన పతంజలి గ్రూప్.. ఆ తర్వాత న్యూడిల్స్, కాస్మోటిక్స్, పిల్లలు వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా పతంజలి స్థానం సంపాదించుకుంది. ఫోర్బ్స్ జాబితాలో గత సంవత్సరం 45వ స్థానంలో ఉన్న పతంజలి గ్రూప్ ఈ ఏడాది 19వ స్థానంలో నిలిచింది. -
నూడుల్స్..బిస్కట్స్..ఇక సోలార్ పవర్
సాక్షి, ముంబై: ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్ మరో కీలకమైన వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. పతంజలి ఉత్పత్తులతో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు సైతం గుండెల్లో గుబులు పుట్టించిన రాందేవ్ తాజాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంపై దృష్టిపెట్టారు. ఇపుడిక చైనా సోలార్ ఉత్పత్తుల సంస్థకు చెక్ పెట్టేలా సోలార్ విద్యుత్తు వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతీ ఇంటికి సోలార్విద్యుత్ లక్ష్యంగా భారీ పెట్టుబడితో సోలార్ కరెంట్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. స్వదేశీ ఉద్యమానికి అనుగుణంగా సోలార్‌పవర్ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తున్నామని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తద్వారా భారతదేశంలో ప్రతి ఇంటికి సోలార్విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేస్తున్నామన్నారు. నాణ్యతలో రాజీపడకుండా భారతదేశంలో సౌర ఫలకాలను తయారు చేస్తాము. కానీ చైనీస్ సోలార్ ప్యానెల్ ధరల యుద్ధంలోకి రామని ఆయన చెప్పారు. డిమాండ్ కనుగుణంగా వ్యాపార విస్తరణను పరిశీలిస్తామని బాలకృష్ణ చెప్పారు. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకుంది. రూ .100 కోట్ల పెట్టుబడితో గ్రేటర్ నోయిడాలోని కర్మాగారాన్ని 20 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో నెలకొల్పనుంది. తదుపరి రెండు నెలల వ్యవధిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. -
ఐదేళ్లలో 2 లక్షల కోట్లకు ‘పతంజలి’
న్యూఢిల్లీ: పతంజలి బ్రాండ్ వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్ల విలువకు ఎదుగుతుందని ఆ సంస్థ అధినేత రామ్‌దేవ్ బాబా అన్నారు. కొత్త విభాగాల్లోకి కంపెనీ ప్రవేశించనుందని, సమీకృత ఆహార పార్కులు, తయారీ కేంద్రాలు వీటిలో ఉన్నాయని చెప్పారు. రానున్న రెండేళ్లలో రూ.లక్ష కోట్ల విలువ తయారీ సామర్థ్యాలు కంపెనీకి ఉంటాయన్నారు. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ద్వారా ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వ్యాపార లక్ష్యాన్ని సాధించాలని కంపెనీ అనుకుంటోంది. మార్కెట్ సైజు రూ.10 లక్షల కోట్లకు పైగా ఉన్న పలు విభాగాల్లో ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయని, వీటిలో రానున్న మూడు నుంచి ఐదేళ్లలో 10–20 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటామని పేర్కొన్నారు. 2016–17లో పతంజలి టర్నోవర్ రూ.10,561 కోట్లుగా ఉంది. డెనిమ్, తాగునీరు, సెక్యూరిటీ సేవల్లోకి అడుగు పెడుతోంది. -
పతంజలికి పోటీగా ఆధ్యాత్మిక గురు స్టోర్స్
ముంబై : యోగా గురు రాందేవ్ బాబా పతంజలి స్టోర్లపై మరో ఆధ్యాత్మిక గురు పోటీకి వస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీశ్రీ రవిశంకర్, ఆయుర్వేదిక్ టూత్‌పేస్టులు, సబ్బులు విక్రయించడానికి 1,000 రిటైల్ స్టోర్లను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. భారత్‌లో హెర్బల్ ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రవిశంకర్ కూడా ఆయుర్వేదిక్ ఉత్పత్తుల స్టోర్లను లాంచ్ చేయబోతున్నట్టు తెలిసింది. దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాతకమైన పౌర సత్కారం పొందిన శ్రీశ్రీ రవిశంకర్, క్లినిక్స్, ట్రీమెంట్మెంట్ సెంటర్లను కూడా లాంచ్చేయబోతున్నారు. దేశీయ కన్జ్యూమర్ ఇండస్ట్రిలో ఆధిపత్య స్థానంలో ఉన్న బహుళ జాతీయ కంపెనీలకు ఇక పతంజలి నుంచి మాత్రమేకాక, శ్రీశ్రీ రిటైల్ స్టోర్ల నుంచి గట్టిపోటీ నెలకొనబోతుంది. ప్రజలు తమ రోజువారీ జీవనంలో ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారని, ప్రస్తుతం మార్కెట్ ప్లేయర్స్ అందిస్తున్న వాటికంటే భిన్నంగా తమ బ్రాండ్ ఉత్పత్తులను ఆఫర్ చేయనున్నట్టు శ్రీశ్రీ ఆయుర్వేద ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తేజ్ కట్పిటియా చెప్పారు. ''శ్రీశ్రీ తత్త్వ'' బ్రాండెడ్ స్టోర్లను ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కంపెనీ మోడరన్ రిటైల్ స్టోర్లు, ఆన్లైన్ ద్వారా హెల్త్ డ్రింక్స్, సబ్బులు, సుగంధాలు, సుగంధద్రవ్యాలును 2003 నుంచి విక్రయిస్తోంది. కానీ ప్రస్తుతం పలు ఆహార, గృహ కేటగిరీల్లో 300కు పైగా ఉత్పత్తులతో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు. ఈ ఉత్పత్తులను కూడా భారత్‌లో మూడు తయారీ యూనిట్లలో ఇన్-హౌజ్గానే ఉత్పత్తిచేస్తున్నారు. మరోవైపు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలివర్ కూడా ఆయుష్ బ్రాండులో ఆయుర్వేదిక్ పర్సనల్ కేర్ ఉత్పత్తులను రీలాంచ్ చేసింది. డాబర్ కూడా తన తొలి ఆయుర్వేదిక్ జెల్ టూత్‌పేస్ట్‌ను డాబర్ రెడ్ ప్రాంచైజ్ కింద ఆవిష్కరించింది. -
రాందేవ్‌పై పతంజలి మాజీ సీఈవో ఫైర్
యోగా గురు బాబా రాందేవ్‌పై పతంజలి సంస్థ మాజీ సీఈవో ఎస్‌కేపాత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 10,561 కోట్ల టర్నోవర్‌తో ఎఫ్‌ఎంసీజీరంగంలో దిగ్జజ కంపెనీలకు దడపుట్టిస్తూ దూసుకుపోతున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదనీ, పైగా దీన్ని సేవగా భావించాలని కోరుతోందని ఆయన ఆరోపించారు. సంస్థలోని ఉద్యోగులకు కంపెనీ చాలా తక్కువ మొత్తంలో చెల్లిస్తోందని తెలిపారు. బాబాజీ (బాబా రాందేవ్) దీనిని సేవగా పిలుస్తున్నారని వివరించారు. ముఖ్యంగా తాను కంపెనీ ఉచితంగా సేవ చేయాలని భావించారన్నారు. అలాగే బాబా రాందేవ్ చెప్పే మాటలకీ, ఆచరణకీ అస్సలు పొంతన వుండదని అభిప్రాయపడ్డారు. అందుకే తాను కంపెనీని వీడినట్టు చెప్పారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు తాను సీఈవోగా ఉన్నప్పుడు పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్‌పార్క్‌లో ఒకేసారి రెండు విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. రెండు ఉద్యోగాలకు వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, ఉల్లంఘించారని ఆరోపించారు. ముందు హామీ ఇచ్చినట్టు కాకుండా ఒక ఉద్యోగానికే వేతనం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు మొత్తం కంపెనీలకు ఉచితంగా సేవలు అందించాలని తనను కోరారన్నారు. పతంజలి సేవ కోసమే పుట్టిందని, ప్రస్తుతం ఆయన వేతనం తీసుకుంటున్నా, తర్వాత అది ఉండదని తనను ఉద్దేశించి పతంజలి ప్రకటించినట్టు తెలిపారు. ఇదే అంశంపై తాను పలుమార్లు బాబా రాందేవ్‌ను సంప్రదించినా ఫలితంలేదన్నారు. తన కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వేతని చెల్లించమని వేడుకున్నట్టు చెప్పారు. ఉద్యోగులకు, సరైన శిక్షణ లేకుండా, ఎలాంటి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న సంస్థను తాను అభివృద్ధి చేశానన్నారు. కంపెనీ అమ్మకాలను రూ. 317 కోట్ల నుంచి రూ .2,500 కోట్లకు పెరిగిగాయని తెలిపారు. అలాగే బాబా రాందేవ్ చాలా షార్ప్.. తనకు తెలియని విషయాలను చాలా ఆసక్తిగా వింటారు..చాలా తొందరగా నేర్చుకుంటారు. అదే అతని బలం. అతని బిజినెస్ టెక్నిక్స్ , శైలి తనకు ఆశ్చర్యాన్ని కలిగించేవని చెప్పారు. ప్రకటనలకు నిధులు వెచ్చించడానికి అస్సలు ఇష్టపడని రాందేవ్, ఒక సందర్భంలో రూ.4 కోట్ల విలువైన ఒక ప్రకటన కోసం ఆ పత్రిక యజమానికి కేవలం రూ. 2 కోట్ల విలువైన చవన్ ప్రాశ చెల్లింపు ద్వారా తనదైన శైలిలో డీల్ చేశారని గుర్తు చేసుకున్నారు. కాగా ఎస్.కె. పత్రా, టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ అండ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ (ఐఐఎంఏ) ఇండియన్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్ధి. 2011-2014 నుండి పతంజలి ఆహార పార్క్ ప్రెసిడెంట్‌గానూ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగాను పనిచేశారు. అంతకుముందు ఎంఎంటిసి లిమిటెడ్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఎసీఎంఈ టెలీ పవర్ సంస్థలకు పనిచేశారు. మరో ఐఐఎం గ్రాడ్యుయేట్ సి.ఎల్. కమల్ అకస్మాత్తుగా కంపెనీని వీడడంతో ఆయన స్థానంలో పాత్ర ఎంపికయ్యారు. మరోవైపు కెమికల్ ఫ్రీ, పూర్తిగా సాంప్రదాయ బద్ద ఉత్పత్తులు అని ప్రచారం చేసుకునే పతంజలి ఉత్పత్తుల్లో కూడా కాన్సర్ కారక రసాయనాలను భారీగా కనుగొన్నట్టు ఇటీవల నివేదికలు రావడం తెలిసిందే. మరి వీటిపై పతంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి. -
కోల్గేట్ కష్టాలు
న్యూఢిల్లీ: ఊళ్లలో ఎక్కువ మంది వినియోగించే టూత్‌పేస్ట్ ఏంటంటే ఠక్కున వచ్చే సమాధానం కోల్గేట్. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్‌లోని మారుమూల గ్రామల్లో సైతం టూత్‌పేస్ట్ అంటే కోల్గేట్ అనే పేరు పాతుకుపోయింది. అలాంటిది తొలిసారి ఆ కంపెనీ తాము కష్టాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. బాబా రామ్‌దేవ్ కంపెనీ పతంజలి నుంచి కోల్గేట్ గట్టి పోటీ ఎదురవుతోందని తెలిపింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.142.58 కోట్ల ఆదాయానికి గండి పడినట్లు చెప్పింది. గతేడాది ఇదే సమయానికి ప్రకటించిన వివరాల్లో కోల్గేట్ రూ.143.27 కోట్ల లాభాలు గడించింది. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన కోల్గేట్ కంపెనీ సీఈవో ఇయాన్ కుక్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. భారత్‌లో మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ప్రొడక్ట్స్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. పతంజలి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వినియోగదారుని అభిరుచిని తెలుసుకుని ఉత్పత్తులను తయారు చేయాలని చెప్పారు. పతంజలి 'దేశీయత' అనే భిన్నమైన కాన్సెప్ట్‌తో మార్కెట్‌ను కొల్లగొడుతోందని, దానికి సరిజోడుగా సహజసిద్ధంగా తయారు చేశామని చెబుతోందని ఇన్వెస్టర్ల కాన్ఫెరెన్స్‌లో చెప్పుకొచ్చారు కుక్. కొల్గేట్ కూడా ప్రజల అభిరుచులకు అనుగుణంగా సహజపద్దతిలో ఉత్పత్తులను తయారుచేసి అందించే మార్గాన్ని అనుసరించాలని సూచించారు.