ముంబై: ప్రభుత్వరంగ పంజాజ్ నేషనల్ బ్యాంక్, పతంజలి ఆయుర్వేద్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్(ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించాయి. ఎన్‌పీసీఐ రూపే ప్లాట్‌ఫామ్‌లో పీఎన్‌బీ రూపే ప్లాటినమ్, పీఎన్‌బీ రూపే వేరియంట్లలో లభిస్తాయి.
ఈ కో–బ్రాండెడ్ కార్డుల ద్వారా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, లాయల్టీ పాయింట్లు, బీమా కవరేజీతో పాటు పలు రకాల ప్రయోజనాల్ని పొందవచ్చు. పతంజలి సోర్టలో రూ.2,500 పైబడిన కొనుగోళ్లపై రెండుశాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఆకస్మిక మరణంపై ప్లాటినం కార్డు రూ.రెండు లక్షల జీవిత భీమాను, సెలెక్ట్ కార్డు ద్వారా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే ప్లాటినం కార్డుపై గరిష్టంగా రూ.5 లక్షలు, సెలెక్ట్ కార్డుపై రూ.10 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. పట్టణ, నగరాల్లోని కస్టమర్లకు సులభమైన డిజిటల్ చెల్లింపు సేవలను అందించేందుకు పీఎన్‌బీఐ, ఎన్‌పీసీఐలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు.
చదవండి: డిజిటల్ చెల్లింపులు.. అంత ఈజీనా? లక్ష్యం నెరవేరేనా ?
Comments
Please login to add a commentAdd a comment