PNBank
-
ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి కేంద్రం భారీ షాక్!
బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. కేంద్రం ఓ వైపు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తుంది. కటకటాల్లోకి మార్చి 2019లో భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనల మేరకు లండన్‌లో ఉన్న నీరవ్‌ని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం స్థానిక వాండ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆస్తుల వేలం ఈ నేపథ్యంలో పూణేలో ఉన్న నీరవ్ ప్రాపర్టీలను వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో ఆక్షన్ పక్రియ ప్రారంభం కానుందని, ముంబైకి చెందిన డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్-ఐ (డీఆర్టీ-ఐ) విభాగం ఈ వేలం చేపట్టనుంది. రికవరీ అధికారి అషుకుమార్ ఆదేశాలతో నీరవ్‌కు చెందిన రెండు ప్రాపర్టీలపై ఈ- ఆక్షన్ జరగనుంది. అధికారుల దర్యాప్తు ముమ్మరం పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం పేరుతో వేలకోట్ల ఆర్ధిక మోసాలకు పాల్పడ్డ నీరవ్ మోడీ, మోహిల్ చోక్సీలు ప్రధాన నిందితులు. ఇద్దరు బ్యాంకుల్లో వేల కోట్లను అప్పుగా తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో భారత ప్రభుత్వం నిందితులకు ఇచ్చిన రుణాల్ని తిరిగి రాబట్టేందుకు దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులతో దర్యాప్తు చేయిస్తుంది. ప్రాప్టరీ విలువ ఎంతంటే విచారణ కొనసాగుతుండగానే పూణేలోని హదప్సర్లో ఉన్న యో పూణే హౌసింగ్ స్కీమ్‌లోని 398 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఎఫ్ 1 భవనంలోని 16వ అంతస్తు... ఆ పక్కనే 396 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మరో ప్లాట్ ధరల్ని రూ. 8.99కోట్లు, రూ. 8.93 కోట్లుగా నిర్ణయించారు. వాటినే వేలం వేయనున్నారు. నోటీసులు జారీ వేలంపై అధికారులు ఇప్పటికే నీరవ్‌కు చెందిన స్టెల్లార్ డైమండ్స్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్ డైమండ్ ఆర్ యూఎస్, ఏఎన్ఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్డీఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేశారు. -
ఖాతాదారులకు పీఎన్బీ షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నిధుల సమీకరణ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. తాజా సవరణతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.40 శాతానికి చేరింది. ఓవర్‌నైట్, నెల, మూడు నెలల రేట్లు వరుసగా 6.75 శాతం, 6.80 శాతం, 6.90 శాతానికి పెరిగాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.10 శాతానికి పెరిగింది. ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన బ్యాంక్ ఈఎంఐల భారం వినియోగదారులపై పెరగనుంది. హెచ్డీఎఫ్సీ.. నెలలో ‘మూడవ’ వడ్డింపు కాగా, హెచ్డీఎఫ్సీ గత నెల రోజుల్లో మూడవసారి రుణ రేటును పెంచింది. గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును (ఆర్పీఎల్ఆర్) స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త, పాత రుణ గ్రహీతలకు జూన్ 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. తాజా పెంపు అనంతరం క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం ప్రాతిపదికన కొత్త రుణ గ్రహీతలకు రుణ రేట్లు 7.05 శాతం నుంచి 7.50 శాతం శ్రేణిలో ఉంటాయి. ప్రస్తుత కస్టమర్లకు ఈ రేట్లు 7–7.45 శాతం శ్రేణిలో ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానానికి నిర్ణయించిన నేపథ్యంలో బ్యాంకులు తాజా వడ్డీరేట్ల పెంపునకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. -
పీఎన్బీ రుణ రేట్లు పెంపు..జూన్ 1 నుంచి అమల్లోకి!
న్యూఢిల్లీ: రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను వచ్చే నెలలో పెంచనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) చీఫ్ అతుల్ కుమార్ గోయల్ తెలిపారు. రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు) 40 బేసిస్ పాయింట్లు పెరిగిన నేపథ్యంలో తమ విధానం ప్రకారం జూన్ 1 నుంచి అదే పరిమాణంలో రుణాలపై వడ్డీ రేట్ల పెంపు ఉండబోతోందని ఆయన వివరించారు. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా ఆర్బీఐ గత వారం అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో రెపో రేటు 4.4 శాతానికి చేరింది. దీంతో ఇప్పటికే పలు బ్యాంకులు దానికి అనుగుణంగా రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను పెంచేయగా, మరికొన్ని బ్యాంకులు డిపాజిట్ల రేట్లను కూడా పెంచాయి. -
‘పంజాబ్’ మెప్పించేది ఎప్పుడు?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు మెప్పించే పనితీరును మార్చి త్రైమాసికంలో ప్రదర్శించలేకపోయింది. సంస్థ స్టాండలోన్ నికర లాభం 66 శాతం క్షీణించి రూ.202 కోట్లకు పరిమితం అయింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేయాల్సి రావడం లాభాలకు చిల్లు పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకు రూ.586 కోట్లను నమోదు చేయడం గమనార్హం. ఇక స్టాండలోన్ ఆదాయం సైతం రూ.21,386 కోట్ల నుంచి రూ.21,095 కోట్లకు తగ్గింది. వసూలు కాని మొండి రుణాలకు (ఎన్పీఏలకు), కంటింజెన్సీల పేరుతో రూ.4,851 కోట్లను మార్చి త్రైమాసికంలో పక్కన పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.3,540 కోట్లతో పోలిస్తే 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి పీఎన్బీ నికర లాభం రూ.3,457 కోట్లకు దూసుకుపోయింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,021 కోట్లుగానే ఉంది. స్థూల ఎన్పీఏలు 14.12 శాతం నుంచి 11.78 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 5.73 శాతం నుంచి 4.8 శాతానికి దిగొచ్చాయి. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.0.64 చొప్పున డివిడెండ్‌ను బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త! -
పతంజలి క్రెడిట్ కార్డు! ప్రయోజనాలు ఇలా..
ముంబై: ప్రభుత్వరంగ పంజాజ్ నేషనల్ బ్యాంక్, పతంజలి ఆయుర్వేద్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్(ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించాయి. ఎన్పీసీఐ రూపే ప్లాట్ఫామ్లో పీఎన్బీ రూపే ప్లాటినమ్, పీఎన్బీ రూపే వేరియంట్లలో లభిస్తాయి. ఈ కో–బ్రాండెడ్ కార్డుల ద్వారా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, లాయల్టీ పాయింట్లు, బీమా కవరేజీతో పాటు పలు రకాల ప్రయోజనాల్ని పొందవచ్చు. పతంజలి సోర్టలో రూ.2,500 పైబడిన కొనుగోళ్లపై రెండుశాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఆకస్మిక మరణంపై ప్లాటినం కార్డు రూ.రెండు లక్షల జీవిత భీమాను, సెలెక్ట్ కార్డు ద్వారా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే ప్లాటినం కార్డుపై గరిష్టంగా రూ.5 లక్షలు, సెలెక్ట్ కార్డుపై రూ.10 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. పట్టణ, నగరాల్లోని కస్టమర్లకు సులభమైన డిజిటల్ చెల్లింపు సేవలను అందించేందుకు పీఎన్‌బీఐ, ఎన్‌పీసీఐలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. చదవండి: డిజిటల్ చెల్లింపులు.. అంత ఈజీనా? లక్ష్యం నెరవేరేనా ? -
మారుతి మాజీ ఎండీకి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన రూ.110 కోట్ల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు రుణం విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖట్టర్‌పై కేసు నమోదు చేసింది. తన కొత్త కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ లోన్ మోసం కేసులో 110 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. మారుతి ఎండీగా రిటైరైన తరువాత, జగదీష్ ఖట్టర్ కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2009లో 170 కోట్ల రూపాయల రుణాన్ని పొందారు. ఆ తర్వాత 2012 వరకు కొంత మొత్తాన్ని చెల్లించారు. కానీ సుమారు 110 కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టారు. దీంతో 2015లో ఇది నిరర్ధక ఆస్తి (ఎన్‌పిఎ)గా మారింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. -
మరో భారీ ప్రభుత్వ బ్యాంకు!!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత పెద్దవిగా, బలమైనవిగా తీర్చిదిద్దాలన్న ఆశయం కొనసాగుతోంది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకుల విలీనం అనంతరం... మరో భారీ విలీనానికి కసరత్తు మొదలైనట్టు తెలియవచ్చింది. తదుపరి విలీనం పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి దశ విలీనంలో భాగంగా ఈ మూడు బ్యాంకులకు ప్రభుత్వం నుంచి త్వరలో ఆహ్వానాలు అందనున్నట్టు ఆర్థిక శాఖ అధికారి వెల్లడించారు. ‘‘ఎక్కువ సమయం వేచి చూడాలనుకోవడం లేదు. బ్యాంకులు ఆప్షన్లను పేర్కొనలేకపోతే, ప్రత్యామ్నాయ యంత్రాంగమే తగిన సూచనలు చేస్తుంది’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఓ విలీనం ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు. అయితే, ఈ విలీనం మూడు పార్టీలతో కలసి ఉండకపోవచ్చన్నారు. ఎన్నో కలయికలను పరిశీలిస్తున్నామని, మొదటి రెండు త్రైమాసికాల్లో ఈ పెద్ద బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు మరింత స్థిరపడతాయని భావిస్తున్నట్టు చెప్పారు. విజయా, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీన ప్రక్రియ గతేడాది అక్టోబర్‌లో ఆరంభమైన విషయం గమనార్హం. విలీన ప్రక్రియ ముగిసి గత నెల 1 నుంచి ఒకే బ్యాంకుగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఇది మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. సరైన సమయం కాదు... అయితే, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌లో మరో విలీనానికి ఇది సమయం కాదని కొందరు ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఆర్బీఐ దిద్దుబాటు కార్యాచరణ పరిధి (పీసీఏ) నుంచి బయటకు వచ్చిందని, పీఎన్బీ, యూబీఐ రికవరీ దశలో ఉన్నాయని పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ పీసీఏ నుంచి బయపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రతీ సమస్యకు విలీనం పరిష్కారం కాదని, మరింత పెద్దవి, విఫల నిర్మాణాలను సృష్టించడానికంటే ముందు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్న అభిప్రాయాన్ని ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యక్తంచేశారు. -
పీఎన్బీకి రూ.2 కోట్లు జరిమానా
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బ్యాంకుపై ఆర్బీఐ రూ.2 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు వినియోగించే సాఫ్ట్వేర్ అయిన ‘స్విఫ్ట్’ నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఆర్బీఐ ఈ పెనాల్టీని విధించినట్లు పీఎన్బీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఈ సాఫ్ట్వేర్ కార్యాచరణ లోపం కారణంగానే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు రూ.14,000 కోట్ల కుంభకోణం చేయగలిగారని వివరణ ఇచ్చింది. ఇటీవలే ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్ఎస్బీసీ, బీఓబీ, సిటీ బ్యాంక్, కెనరా బ్యాంక్, యస్ బ్యాంక్‌లపైనా ఆర్బీఐ ఇదే తరహా జరిమానాలను విధించింది. -
రికార్డ్ల ర్యాలీకి బ్రేక్
వరుస రెండు రోజుల రికార్డ్ల ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకినప్పటికీ, చివరి గంటలో భారీగా అమ్మకాలు జరగడంతో చివరకు నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోవడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యలోటు ఒత్తిడులు తప్పవంటూ మూడీస్ సంస్థ హెచ్చరించడం... ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 174 పాయింట్లు నష్టపోయి 38,723 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 47 పాయింట్లు నష్టంతో 11,692 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,990 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. లోహ, రియల్టీ, పీఎస్‌యూ, ఆయిల్, గ్యాస్, మౌలిక, వాహన రంగ షేర్లు పెరిగాయి. లాభాల స్వీకరణ... ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారంతో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని, రూపాయి పతనం కూడా తోడవడంతో మార్కెట్ నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంతో 38,990 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా 217 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 310 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 15 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 60 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఏడు రోజుల తర్వాత రిలయన్స్‌కు నష్టాలు... వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్లలో లాభపడుతూ వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ నష్టపోయింది. 1.8 శాతం క్షీణించి రూ.1,294 వద్ద ముగిసింది. కోల్ ఇండియా 2.5 శాతం పతనమై రూ.287 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈలో వాటా విక్రయ వార్తల కారణంగా ఎస్బీఐ షేర్ 1.5 శాతం లాభంతో రూ.310 వద్ద ముగిసింది. ఇక లాభాల స్వీకరణ కారణంగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 9 శాతం అప్... నిఫ్టీ 50 సూచీలో వచ్చే నెల 28 నుంచి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను చేరుస్తున్నారు. దీంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 12 శాతం లాభంతో తాజా ఏడాది గరిష్ట స్థాయి, రూ.409ను తాకింది. చివరకు 9 శాతం లాభంతో రూ.398 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ సూచీ నుంచి తొలగిస్తున్న లుపిన్ 2% నష్టపోయి రూ. 884 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. -
పీఎన్బీ ‘గాంధీగిరి’, ఇక వారికి చుక్కలే..!
న్యూఢిల్లీ : ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చూసిన వారికి ‘గాంధీగిరి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్యాయం చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పడానికి హింసామార్గంలో కాదు...గాంధీమార్గంలో కూడా బుద్ధి చెప్పవచ్చని చూపించారు ఈ సినిమాలో. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే మొండి బకాయిలను వసూలు చేయాడానికి ప్రస్తుతం పీఎన్బీ ఇదే మార్గాన్ని ఎంచుకుంది. పీఎన్బీ ప్రస్తుత పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీ ఇద్దరు కలిసి పంజాబ్ బ్యాంక్‌లో 13 వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. పేరుకుపోయిన ఎన్పీఏల వసూళ్ల గురించి రోజురోజుకు ఆందోళనలు పెరగడంతో వాటి వసూలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో పీఎన్బీ ఈ ‘గాంధీగిరి’కి శ్రీకారం చుట్టింది. గతేడాది మేలో ప్రారంభించిన ఈ ‘గాంధీగిరి’ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేసి నెలకు రూ.100-150 కోట్ల రూపాయల వరకు రుణాలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ‘గాంధీగిరి’ విధానంలో ఉద్యోగులు రుణం తీసుకుని చెల్లించని వారి నివాసాలు, కార్యలయాల ముందు మౌనంగా కూర్చుంటారు. ఉద్యోగులు ఇలా చేయడాన్ని అవమానంగా భావించి అయిన అప్పు తీసుకున్నవాళ్లు రుణం చెల్లిస్తారనే ఉద్దేశ్యంతో బ్యాంకు ‘గాంధీగిరి’ని ప్రారంభించింది. దీన్ని అమలు చేయడానికి 1,144 మంది ఉద్యోగులను కూడా నియమించింది. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల విషయంలో జారీ చేసిన ఆదేశాల మేరకు పీఎన్బీ గత కొన్ని వారాల నుంచి దీన్ని చాలా కఠినంగా అమలుచేస్తోంది. తాము ఇప్పటికే 1,084 వేల మందిని ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులుగా గుర్తించామని, వారిలో 260 ఫోటోలను పేపర్లలో కూడా ప్రచురించామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఎగవేతదారుల విషయంలో తాము కఠిన చర్యలు తీసుకున్నామని, 150 మంది పాస్‌పోర్టులను సైతం స్వాధీనం చేసుకున్నామని, 37మందిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశామని చెప్పారు. ఇకనుంచి రుణాల మంజూరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని అందుకు గాను ఒక ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీతో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ఈ భాగస్వామ్యం వల్ల రుణాల వసూలు సులభతరం అవ్వడమే కాక క్రెడిట్, ఫ్రాడ్ రిస్క్‌ను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందిని బ్యాంకు అధికారులు చెప్పారు. ఎన్పీఏల వసూలు కోసం వన్ టైం సెటిల్మెంట్ విధానాలను తీసుకువచ్చామని, ఫలితంగా ఒక సంవత్సర కాలంలో 70-80 వేల ఎన్పీఏల దగ్గర రుణాలు వసూలు చేశామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. 2017, డిసెంబర్ నాటికి పీఎన్బీలో 57,519కోట్ల రూపాయల ఎన్పీఏలు ఉన్నాయని సమాచారం. -
రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ
-
విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ
-
డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన దిగ్గజ బ్యాంకు
సాక్షి, ముంబై: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఖాతాదారులకు శుభవార్త అందించింది. భారీ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బీపీఎస్ పాయింట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఇటీవల వడ్డీరేట్లపెంపును ప్రకటించిన నేపథ్యంలో పీఎన్బీ కూడా వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది. దేశీయ బల్క్ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 4.5 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. కోటి రూపాయలు, ఆపైన ఒక సంవత్సరం,అంతకుపైన టర్మ్ డిపాజిట్లకు ఈ వడ్డీరేటును వర్తింప చేయనుంది. ఈ ఏడాది డిసెంబరు 1 నుండి అమలులోకి వచ్చినట్టు బ్యాంకు ఒకప్రకటనలో తెలిపింది. కోటి రూపాయల డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు 100 బేసిస్ పాయింట్లను పెంచిన సంగతి తెలిసిందే. -
నిరాశపర్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3 లో నికర లాభాలు పుంజుకుని రూ.207 కోట్లను నమోదు చేసింది. అయితే ఈ త్రైమాసికంలో పీఎన్బీ రూ. 555 కోట్లను ఆర్జించనుందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. గత ఏడాదితో పోలిస్తే 306శాతం పెరుగుదలను నమోదు చేసినపప్పటికీ ఈ త్రైమాసికంలో పీఎన్బీ రూ. 555 కోట్లను ఆర్జించనుందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. మొత్తం ఆదాయం రూ. 14, 498కోట్లను సాధించింది. గత ఏడాది ఇది రూ. 13891కోట్లుగా ఉంది. డీమానిటైజేషన్ కాలంలో తమకు టఫ్టైం అని బ్యాంక్ తెలపింది.అయితే సిబ్బంది ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా అధిగమించారని చెప్పింది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికర లాభం రూ.51 కోట్ల నుంచి రూ.207 కోట్లకు పుంజుకున్నాయి. ఇందుకు బకాయిలు(స్లిప్పేజెస్) తగ్గడం కారణమైనట్లు బ్యాంక్ తెలిపింది. ఈ క్వార్టర్లో ఫ్రెష్ స్లిప్పేజెస్ రూ. 5089 కోట్ల నుంచి రూ. 4800 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది. కాగా, నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 4119 కోట్ల నుంచి రూ. 3731 కోట్లకు క్షీణించింది. ప్రొవిజన్లు రూ. 3,775 కోట్ల నుంచి తగ్గి రూ. 2,936 కోట్లకు పరమితమయ్యాయి. ఇక త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.63 శాతం నుంచి 13.7 శాతానికి నామమాత్రంగా పెరిగితే.. నికర ఎన్పీఏలు 9.1 శాతం నుంచి 9.09 శాతానికి స్వల్పంగా మెరుగయ్యాయి.