
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ, ప్రయివేట్ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మైల్‌స్టోన్ టికెట్ వోచర్లతో సహా అనేక ప్రయోజనాలను నిలిపివేయనుండగా, ఎస్‌బీఐ తన క్లబ్ విస్తారా ఎస్‌బీఐ, క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మార్పులు
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 2025 మార్చి 31 నుండి మైల్‌స్టోన్ టికెట్ వోచర్లు, పునరుద్ధరణ ప్రయోజనాలు, ఇతర ఫీచర్లను అందించడాన్ని నిలిపివేయనుంది. అయితే 2026 మార్చి 31 వరకు మహారాజా పాయింట్లు కొనసాగుతాయి. ఆ తర్వాత కార్డు పూర్తిగా నిలిచిపోతుంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం కీలక మార్పులు ఇవే..
క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ ఇకపై అందుబాటులో ఉండదు.
వన్ ప్రీమియం ఎకానమీ టికెట్, వన్ క్లాస్ అప్ గ్రేడ్ వోచర్ తో సహా కాంప్లిమెంటరీ వోచర్లు నిలిచిపోతాయి.
ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్ స్టోన్ వోచర్లు ఇకపై జారీ కావు.
2025 మార్చి 31 తర్వాత కార్డులను రెన్యువల్ చేసుకునే కస్టమర్ల వార్షిక రుసుమును ఏడాది పాటు రద్దు చేస్తారు.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు పాలసీల్లో మార్పులు
క్లబ్ విస్తారా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు ఎకానమీ టికెట్ వోచర్లు ఇకపై ఉండవు.
రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.5 లక్షల వార్షిక ఖర్చులకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ నిలిపివేయనున్నారు.
క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు ఇకపై ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్లను అందించదు.
బేస్ కార్డు రెన్యువల్ ఫీజు రూ.1,499, పీఎం కార్డు రెన్యువల్ ఫీజు రూ.2,999.
వినియోగదారులకు ఫీజు మాఫీకి ఇంకా అవకాశం ఉంటుంది.
మార్పుల వెనుక కారణం
గత ఏడాది నవంబర్‌లో విస్తారా-ఎయిరిండియా విలీనం తర్వాత ఈ మార్పులు జరిగాయి. ఇది ఎయిరిండియా మహారాజా క్లబ్ లాయల్టీ కార్యక్రమంలో సర్దుబాట్లకు దారితీసింది. ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను సవరించగా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా ఎటువంటి మార్పులను ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment