క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు నవంబర్ 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు రానున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డ్ కొత్త నిబంధనలలో మార్పులను ప్రకటించాయి.మీరు కూడా ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే, ఈ మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లో మార్పులు
ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్‌లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేస్తే, దానిపై కొన్ని అదనపు ఛార్జీలు విధించవచ్చు. ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులు, ఆటో డెబిట్ లావాదేవీలు మొదలైన వాటిపై ఛార్జీలు వర్తించవచ్చు.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లో మార్పులు
ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులో మార్పులు చేసింది. కొన్ని కార్డ్‌లలో ఈ సదుపాయం పూర్తిగా తొలగించగా కొన్ని కార్డ్‌లలో ఇది పరిమితి ఆధారంగా అందుబాటులో ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది. నిర్దిష్ట కేటగిరీలలో రివార్డ్ పాయింట్‌ల రీడెంప్షన్ మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. దానిలో పరిమితులు ఉండవచ్చు. ఇక ఈఎంఐలో చేసిన కొనుగోళ్లకు వడ్డీ రేట్లు మారాయి. కార్డ్ రకం, లావాదేవీని బట్టి కొత్త వడ్డీ రేట్లు మారవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment