ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) రూపే (RuPay) భాగస్వామ్యంతో ఫస్ట్ ఎర్న్ (FIRST EARN) పేరుతో కొత్త రకం క్రెడిట్ కార్డును ప్రారంభించింది. యూపీఐ (UPI), ఎఫ్‌డీ (FD) లింక్‌తో ఈ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించినట్లు బ్యాంక్ ప్రకటించింది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు అనుసంధానంగా దీన్ని జారీ చేస్తారు. దీంతో యూపీఐ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
ఈ క్రెడిట్ కార్డు దరఖాస్తులోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరిచే అంశాన్ని కూడా ఏకీకృతం చేసి ఉంటారు. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఈ కార్డుకు జమవుతుంది. అలాగే కస్టమర్‌లు ఈ కార్డు ద్వారా యూపీఐలో క్రెడిట్‌ని, రివార్డ్‌లను పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డును యూపీఐతో సజావుగా అనుసంధానించడం వల్ల దేశం అంతటా 6 కోట్లకుపైగా యూపీఐ అనుసంధానిత మర్చెంట్ల వద్ద దీన్ని వినియోగించవచ్చు. ప్రతి యూపీఐ ఖర్చుపైనా కస్టమర్‌లు 1 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. దీంతో ప్రతి లావాదేవీ రివార్డ్‌గా మారుతుంది.
"ఇది ఆర్థిక సేవల ప్రపంచానికి గేట్‌వే ఉత్పత్తిగా మొదటిసారి క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందింది" అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో క్రెడిట్ కార్డ్స్, ఫాస్ట్‌ట్యాగ్, లాయల్టీ ని హెడ్ శిరీష్ భండారి పేర్కొన్నారు. "ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. కార్డ్ ఖాతాకు ఆటోమేటిక్‌గా క్రెడిట్ చేసే 1 శాతం క్యాష్‌బ్యాక్‌తో ప్రతి రోజు యూపీఐ చెల్లింపులను తక్షణమే సూపర్ రివార్డింగ్ చేస్తుందని తెలిపారు.
ఫస్ట్ ఎర్న్ క్రెడిట్ కార్డు ముఖ్య ఫీచర్లు
» ఈ క్రెడిట్ కార్డ్ 6 కోట్ల కంటే ఎక్కువ క్యూఆర్ కోడ్‌లలో యూపీఐ లావాదేవీలను అనుమతిస్తుంది .
» ఇది వర్చువల్ క్రెడిట్ కార్డ్. తక్షణ ఉపయోగం కోసం యూపీఐ ఇంటిగ్రేషన్‌తో తక్షణమే జారీ చేస్తారు.
» ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా అందించే సురక్షిత క్రెడిట్ కార్డ్. అందరికీ అందుబాటులో ఉంటుంది.
» కొత్త కార్డ్ హోల్డర్‌లు కార్డు జారీ చేసిన 15 15 రోజులలోపు చేసే మొదటి యూపీఐ లావాదేవీపై 100 శాతం రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు.ప్రభావవంతంగా మొదటి సంవత్సరం ఫీజు క్యాష్ బ్యాక్‌గా వెనక్కివస్తుంది.
» బ్యాంక్ యాప్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలపై అలాగే బీమా, యుటిలిటీ బిల్లులు, ఈ-కామర్స్ కొనుగోళ్లపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
» జొమాటోకు చెందిన ‘డిస్ట్రిక్ట్’ ద్వారా సినిమా టికెట్లు కొనుగోలు చేస్తే 25% రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది.
» బ్యాంక్ 1 సంవత్సరం 1 రోజు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది.
» రూ.1,399 విలువైన కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ సహాయం.
» కార్డు పోగొట్టుకున్నప్పుడు రూ.25,000 కార్డ్ లయబిలిటీ కవర్ లభిస్తుంది.
» రూ.2,00,000 వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment