FD
-
స్వల్పకాల పెట్టుబడికి దారేదీ?
ప్రతి వ్యక్తికి స్వల్పకాల, మధ్య కాల, దీర్ఘకాల లక్ష్యాలనేవి ఉంటాయి. వీటి ఆధారంగానే పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. అన్నింటికీ ఒకే అస్త్రం ఫలితాలనివ్వదు. ప్రతి పెట్టుబడిలోనూ రిస్క్ ఉంటుంది. ఇది తమకు ఎంత వరకు ఆమోదమో పరిశీలించిన తర్వాతే వాటిపై నిర్ణయానికి రావాలి. దీర్ఘకాలానికి ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మధ్య కాలిక లక్ష్యాలకు, ఈక్విటీ, డెట్‌తో కలయికతో ఉండే హైబ్రిడ్ ఫండ్స్ మెరుగైనవి. మరి స్వల్పకాల లక్ష్యాల మాటేమిటి? వీటి కోసం రిస్క్ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. స్వల్పకాలంలో రాబడి కంటే పెట్టుబడి రక్షణ కీలకం అవుతుంది. అదే సమయంలో ఎంతో కొంత రాబడి కూడా రావాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాలపై అవగాహన కల్పించే కథనం ఇది. స్వల్పకాలం అంటే..? నిజానికి స్వల్పకాలానికి ఇతమిత్థమైన నిర్వచనం లేదు. కొన్ని రోజుల నుంచి నెలల వరకు స్వల్పకాలం కిందకే వస్తుంది. ఏడాది, రెండేళ్లు కూడా స్వల్పకాలం కిందకే వస్తుంది. 3–5 ఏళ్ల కాలాన్ని మధ్యస్థంగా, 10 ఏళ్లు మించితే దీర్ఘకాలంగా పరిగణిస్తుంటారు. ముఖ్యంగా మూడేళ్ల కాలానికి ఈక్విటీలను పరిగణనలోకి తీసుకోకపోవడమే రిస్క్ పరంగా సానుకూలం. ఈక్విటీ పెట్టుబడులకు కనీసం ఐదేళ్లు అయినా ఉండాలన్నది నిపుణుల సూచన. గతంలో మాదిరిగా కాకుండా నేడు ఆర్థిక అస్థిరతలు పెరిగిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం అధికమయ్యాయి. వీటి ప్రభావం ఈక్విటీలపై ఎక్కువగా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలోనే ఈక్విటీల్లో మెరుగైన రాబడులు సాధ్యపడతాయి. మూడేళ్ల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఒకవేళ ఈక్విటీలు బేరిష్ లోకి వెళ్లిపోతే కోలుకునేందుకు ఎంత సమయం అయినా తీసుకోవచ్చు. అందుకుని ఇన్వెస్టర్లు ఈక్విటీలకు బదులు సంప్రదాయ డెట్ సాధనాలను స్వల్ప కాలం కోసం పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీలు).. తాతల కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న సాధనం. కానీ, నేడు అధిక రాబడుల కాంక్షతో చాలా మంది స్వల్పకాలానికీ ఈక్విటీల వైపు అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలానికి అధిక రాబడిని ఆశించడం సమంజసమే. అదే సమయంలో స్వల్ప కాల లక్ష్యాలకు తక్కువ రాబడిని ఇచ్చే రిస్క్ లేని ఎఫ్డీలను విస్మరించడం సరికాదు. ఫిక్స్డ్ డిపాజిట్‌తోపాటు, రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అందరికీ అర్థమయ్యే సాధనాలు. ముఖ్యంగా ఎఫ్డీలపై రాబడి స్థిరంగా ఉంటుంది. అందుకని స్వల్పకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి కోసం వీటిని నమ్ముకోవచ్చు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే.. అప్పుడు ఒకటికి మించిన బ్యాంకుల్లో ఎఫ్డీలు వేసుకోవాలి. ఒక బ్యాంక్‌లో గరిష్టంగా రూ.5 లక్షలు డిపాజిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బ్యాంక్ సంక్షోభం పాలైతే ఒక డిపాజిట్‌దారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకే బీమా కింద లభిస్తుంది. స్వీప్ ఇన్ ఎఫ్డీని సైతం పరిశీలించొచ్చు. ఇది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు అనుబంధంగా ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలన్స్‌ను మించి నగదు చేరిన తర్వాత నిర్ణీత మొత్తం (రూ.1,000 అంతకుమించి) స్వీప్ ఇన్ డిపాజిట్‌గా మారుతుంది. సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్‌పై వడ్డీ రేటు 3–4 శాతం మించదు. అదే స్వీప్ ఇన్‌లో అయితే 5–6 శాతం వరకు (డిపాజిట్ ఉంచిన కాలాన్ని బట్టి) లభిస్తుంది. డిపాజిట్ రూపంలోకి మారినా కానీ, అవసరమైనప్పుడు వెంటనే ఆ మొత్తాన్ని ఏటీఎం నుంచి అయినా ఉపసంహరించుకోవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లను సైతం పరిశీలించొచ్చు. కార్పొరేట్ ఎఫ్డీలు (కంపెనీలు నిధుల కోసం జారీ చేసేవి), ఎన్బీఎఫ్సీ సంస్థల ఎఫ్డీలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీటిలో డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. అందుకే ఈ డిపాజిట్లలో రాబడి ఎక్కువగా ఉంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలను సైతం పరిశీలించొచ్చు. వీటిలో రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ ఆర్బీఐ డిపాజిట్ గ్యారంటీ పథకం పరిధిలోకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు కూడా వస్తాయి. కనుక రూ.5 లక్షల డిపాజిట్ వరకు ఢోకా ఉండదు. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ.5 లక్షలు మించకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. పెట్టుబడి ఉద్దేశం? పెట్టుబడిని కాపాడుకోవం, అదే సమయంలో కొంత రాబడిని సమకూర్చుకోవడం స్వల్పకాల పెట్టుబడుల ఉద్దేశంగా ఉండాలి. స్వల్పకాల పెట్టుబడుల కోసం అధిక రాబడులను ఇచ్చే విభాగాలను అస్సలు పరిగణనలోకి తీసుకోకూడదు. అధిక రాబడుల చరిత్ర కలిగిన ఈక్విటీల్లో స్వల్పకాలంలో పెట్టుబడికి సైతం రిస్క్ ఏర్పడుతుంది. దీర్ఘకాలంలోనే అలాంటి సాధనాల్లో రిస్క్ ను అధిగమించి రాబడులు సమకూర్చుకోగలరు. ఎఫ్డీలపై టీడీఎస్.. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి ఒక ఆర్థి క సంవత్సరంలో రూ.40,000 మించితే (60 ఏళ్లలోపు వారికి), ఆ మొత్తంపై బ్యాంక్‌లు 10 శాతం టీడీఎస్ మినహాయిస్తాయి. 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించితే అప్పుడు టీడీఎస్ అమలవుతుంది. కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు టీడీఎస్ వర్తించదు. టీడీఎస్ వద్దనుకునే వారు ఎఫ్డీలకు బదులు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఇతర డెట్ ఫండ్స్‌లోనే పన్ను అనంతరం రాబడి కాస్తంత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను గత రాబడుల ఆధారంగా ఎంపిక చేసుకోవడం సరైన విధానం కాదు. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలంగా ఉండే ఫండ్స్‌ను, అది కూడా వాటి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో చూసిన తర్వాత ఎంపిక చేసుకోవాలి. తిరిగి ఫలానా సమయంలో పెట్టుబడిని వెనక్కి తీసుకుంటానన్న స్పష్టత ఉన్న వారికి ఎఫ్డీలు మెరుగైనవి. ఎంత రాబడి వస్తుందో పెట్టుబడి సమయంలోనే తెలుసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడిని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత లోపించినట్టయితే, అప్పుడు ఓవర్‌నైట్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్ లేదా బ్యాంక్ స్వీప్ ఇన్ ఎఫ్డీ ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలానికి సైతం.. డెట్ సాధనాలు కేవలం స్వల్పకాల పెట్టుబడులకే అనుకోవడం పొరపాటు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలోనూ ఎవరైనా 100 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సరికాదు. కాల వ్యవధి, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా అసెట్ అలోకేషన్ విధానాన్ని (వివిధ సాధనాల మధ్య కేటాయింపులు) రూపొందించుకోవాలన్నది నిపుణుల సూచన. 10–20 ఏళ్లకు మించిన కాలానికి ఒకరు తమ పెట్టుబడుల్లో 70 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. మిగిలిన 30 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారానికి సైతం 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ వయసు పెరుగుతూ, లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటూ, డెట్‌లో పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్లాలి. దీని ద్వారా రిస్క్ ను అధిగమించొచ్చు. లాభాలపై పన్ను డెట్ సాధనం ఏదైనా సరే పెట్టుబడిపై వచ్చే లాభం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేశారన్న అంశంతో సంబంధం లేదు. పెట్టుబడిని విక్రయించగా వచ్చిన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ ఆదాయానికి కలుస్తుంది. నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మాదిరి మూడేళ్లు నిండిన పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై ఇండెక్సేషన్ ప్రయోజనం ఇప్పుడు లేదు. ఓవర్‌నైట్ ఫండ్స్... డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇవి అతి తక్కువ రిస్క్ కలిగినవి. కొన్ని రోజుల పాటు పెట్టుబడికి ఓవర్‌నైట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిలో వార్షిక రాబడి సుమారుగా 5 శాతం ఉంటుంది. కేవలం ఒక రోజులో గడువు తీరే సెక్యూరిటీల్లో ఓవర్‌నైట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఈ పెట్టుబడిని నగదుగా మార్చుకోవచ్చు. ఎక్కువ లిక్విడిటీతో ఉంటాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణల ప్రభావం వీటిపై ఉంటుంది. ఏరోజుకారోజు ఇవి గడువు తీరిపోతుంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు రోజువారీగా సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఈ పెట్టుబడులపై వెంటనే అమల్లోకి వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. ఆర్బీఐ రివర్స్ రెపో రేట్లను తగ్గించినప్పుడు వీటి రాబడులు కొంత వరకు ప్రభావితమవుతాయి. మనీ మార్కెట్ ఫండ్స్ ఏడాది వరకు కాల వ్యవధి తీరే సెక్యూరిటీల్లో (సర్టీఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, కమర్షియల్ బిల్లులు, ట్రెజరీ బిల్లులు) ఇవి పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక లిక్విడిటీకి తోడు మెరుగైన రాబడిని ఇచ్చే విధంగా వీటి పనితీరు ఉంటుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కంటే వీటిలో కాస్త అధిక రాబడి ఉంటుంది. గడిచిన ఏడాది కాలంలో ఇవి సగటున 7.59 శాతం రాబడిని ఇచ్చాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏడాదికి మించి పెట్టుబడి కొనసాగించేట్టు అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇవి ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో (ధరల వ్యత్యాసం) పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన ఏడాది కాలంలో (అక్టోబర్ నాటికి) ఆర్బిట్రేజ్ ఫండ్స్ సగటున 6.5–8 శాతం మధ్య రాబడులు ఇచ్చాయి. కానీ, మార్కెట్ అస్థిరతల్లో ఇవి తక్కువ రాబడులు, కొన్ని సందర్భాల్లో ప్రతికూల రాబడులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఏడాదికి మించిన కాలానికే వీటిని పరిశీలించాలి. అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఈ పథకాలు 3–6 నెలల్లో గడువు తీరే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇతర డెట్ పథకాలతో పోల్చినప్పుడు కాస్త సురక్షితమైనవి. అదే సమయంలో ఓవర్‌నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ కంటే వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది. అంతేకాదు, ఫండ్ మేనేజర్ తక్కువ రేటింగ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, డిఫాల్ట్ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. కనుక, పెట్టుబడికి ముందు వాటి పోర్ట్‌ఫోలియోలోని సెక్యూరిటీలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. అధిక రేటింగ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసిన పథకాలనే ఎంపిక చేసుకోవడం సూచనీయం. ఇవి ఏడాది కాలంలో సగటున 7.5 శాతం మేర రాబడులు ఇచ్చాయి. లిక్విడ్ ఫండ్స్... కొన్ని నెలల పాటు పెట్టుబడులకు లిక్విడ్ ఫండ్స్ కూడా అనుకూలమే. అధిక నాణ్యతతో కూడిన డెట్ సెక్యూరిటీల్లో లిక్విడ్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడులు పెడతారు. ఒక్కో డెట్ ఇన్స్ట్రుమెంట్ మెచ్యూరిటీ 91 రోజులకు మించకుండా ఉంటుంది. కావాల్సినప్పుడు వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. కొన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టంట్ రిఫండ్ సదుపాయాన్ని (రూ.50 వేల వరకు) అందిస్తున్నాయి. అంటే ఆ మేరకు వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. లేదంటే విక్రయించిన మరుసటి రోజున బ్యాంక్ ఖాతాకు ఈ మొత్తం అందుతుంది. వడ్డీ రేట్ల మార్పుల రిస్క్ వీటిపైనా ఉంటుంది. ఓవర్‌నైట్ ఫండ్స్‌తో పోలి్చతే రిస్క్ కాస్తంత ఎక్కువ. వీటిల్లో రాబడులు పెట్టుబడి కాలాన్ని బట్టి 5–6.5 శాతం మధ్య ఉంటాయి. స్వల్పకాలానికి 5 శాతం వరకు ఆశించొచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొత్త రకం క్రెడిట్ కార్డు.. ఎఫ్డీ, యూపీఐ లింక్‌తో..
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) రూపే (RuPay) భాగస్వామ్యంతో ఫస్ట్ ఎర్న్ (FIRST EARN) పేరుతో కొత్త రకం క్రెడిట్ కార్డును ప్రారంభించింది. యూపీఐ (UPI), ఎఫ్డీ (FD) లింక్‌తో ఈ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించినట్లు బ్యాంక్ ప్రకటించింది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్‌కు అనుసంధానంగా దీన్ని జారీ చేస్తారు. దీంతో యూపీఐ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.ఈ క్రెడిట్ కార్డు దరఖాస్తులోనే ఫిక్స్డ్ డిపాజిట్ తెరిచే అంశాన్ని కూడా ఏకీకృతం చేసి ఉంటారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఈ కార్డుకు జమవుతుంది. అలాగే కస్టమర్లు ఈ కార్డు ద్వారా యూపీఐలో క్రెడిట్‌ని, రివార్డ్‌లను పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డును యూపీఐతో సజావుగా అనుసంధానించడం వల్ల దేశం అంతటా 6 కోట్లకుపైగా యూపీఐ అనుసంధానిత మర్చెంట్ల వద్ద దీన్ని వినియోగించవచ్చు. ప్రతి యూపీఐ ఖర్చుపైనా కస్టమర్లు 1 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. దీంతో ప్రతి లావాదేవీ రివార్డ్‌గా మారుతుంది."ఇది ఆర్థిక సేవల ప్రపంచానికి గేట్‌వే ఉత్పత్తిగా మొదటిసారి క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందింది" అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో క్రెడిట్ కార్డ్స్, ఫాస్ట్‌ట్యాగ్, లాయల్టీ ని హెడ్ శిరీష్ భండారి పేర్కొన్నారు. "ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. కార్డ్ ఖాతాకు ఆటోమేటిక్‌గా క్రెడిట్ చేసే 1 శాతం క్యాష్‌బ్యాక్‌తో ప్రతి రోజు యూపీఐ చెల్లింపులను తక్షణమే సూపర్ రివార్డింగ్ చేస్తుందని తెలిపారు.ఫస్ట్ ఎర్న్ క్రెడిట్ కార్డు ముఖ్య ఫీచర్లు» ఈ క్రెడిట్ కార్డ్ 6 కోట్ల కంటే ఎక్కువ క్యూఆర్ కోడ్లలో యూపీఐ లావాదేవీలను అనుమతిస్తుంది .» ఇది వర్చువల్ క్రెడిట్ కార్డ్. తక్షణ ఉపయోగం కోసం యూపీఐ ఇంటిగ్రేషన్‌తో తక్షణమే జారీ చేస్తారు.» ఇది ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా అందించే సురక్షిత క్రెడిట్ కార్డ్. అందరికీ అందుబాటులో ఉంటుంది.» కొత్త కార్డ్ హోల్డర్లు కార్డు జారీ చేసిన 15 15 రోజులలోపు చేసే మొదటి యూపీఐ లావాదేవీపై 100 శాతం రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు.ప్రభావవంతంగా మొదటి సంవత్సరం ఫీజు క్యాష్ బ్యాక్‌గా వెనక్కివస్తుంది.» బ్యాంక్ యాప్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలపై అలాగే బీమా, యుటిలిటీ బిల్లులు, ఈ-కామర్స్ కొనుగోళ్లపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.» జొమాటోకు చెందిన ‘డిస్ట్రిక్ట్’ ద్వారా సినిమా టికెట్లు కొనుగోలు చేస్తే 25% రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది.» బ్యాంక్ 1 సంవత్సరం 1 రోజు ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది.» రూ.1,399 విలువైన కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ సహాయం.» కార్డు పోగొట్టుకున్నప్పుడు రూ.25,000 కార్డ్ లయబిలిటీ కవర్ లభిస్తుంది.» రూ.2,00,000 వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుంది. -
ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!
చేతిలో డబ్బు ఉంటే.. కొందరు గోల్డ్ కొనుగోలు చేస్తారు. మరి కొందరు రియల్ ఎస్టేట్ మీద పెడతారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఇలా ఎన్నెన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా.. చాలా మంది చూపు మాత్రం 'ఫిక్స్డ్ డిపాజిట్' (FD) వైపు వెళ్తుంది.రిస్క్ లేకుండా వడ్డీ పొందాలంటే.. ఫిక్స్డ్ డిపాజిట్ ఉత్తమమైన మార్గం. వడ్డీ అనేది బ్యాంకులు రెండు విధాలుగా అందిస్తాయి. ఇందులో ఒకటి రెగ్యులర్, మరొకటి సీనియర్ సిటిజన్. రెగ్యులర్ కింద అందరికీ ఒకేరకమైన వడ్డీ లభిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్లకు కొంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది.ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. చాలా బ్యాంకులు కొంతవరకు దాదాపు ఒకే విధమైన వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ.. 40 - 50 బేసిస్ పాయింట్ల స్వల్ప వ్యత్యాసం కూడా మీ డబ్బును పెంచడంలో సహాయపడుతుంది. మీ డబ్బును పెంచుకోవడానికి లేదా ఎక్కువ వడ్డీ పొందటానికి ఎన్ని సంవత్సలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామన్నది సహాయపడుతుంది.ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లు అందించే వడ్డీ రేట్లు➤హెచ్డీఎఫ్సీ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤ఐసీఐసీఐ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤యాక్సిస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం➤యెస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం (ఈ వడ్డీ రేట్లు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి).➤బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం (ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 14, 2024 నుంచి అమల్లో ఉన్నాయి).ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్బ్యాంకులలో ఫిక్స్డ్ చేయాలనుకునే ఎవరైనా.. ముందుగా మీరు ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో, అక్కడ (బ్యాంకులో) వడ్డీ ఎంత ఇస్తున్నారనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ బ్యాంక్ ఇచ్చే వడ్డీని.. ఇతర బ్యాంకులతో కంపార్ చేసుకోవాలి. ఆ తరువాత మీకు నచ్చిన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసివచ్చు. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త డిపాజిట్ స్కీములు..
భారతీయులు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లలో (fixed deposits) పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. రిస్క్ లేకుండా మంచి వడ్డీ వస్తుండటంతో ఎఫ్డీలు చాలా కాలంగా సామాన్యులకు ఇష్టమైన పెట్టుబడి ఎంపికగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన ఎఫ్డీ పథకాలను ప్రారంభిస్తున్నాయి.ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) కూడా తాజాగా వివిధ టెన్యూర్లలో రెండు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను (FD schemes) ప్రారంభించింది. 303 రోజులు, 506 రోజుల టెన్యూర్ ఉండే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలలో రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త 303 రోజుల వ్యవధి ఎఫ్డీలో డబ్బు డిపాజిట్ చేసే పెట్టుబడిదారులు 7 శాతం వడ్డీని పొందుతారు. అదేవిధంగా 506 రోజుల వ్యవధికి వడ్డీ రేటు 6.7 శాతం. ఈ కొత్త వడ్డీ రేట్లు 2025 జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే ఈ రెండు ఎఫ్డీలలో ఎక్కువ వడ్డీని పొందుతారు.ఇదీ చదవండి: క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు.. చేశారో అంతే..!సీనియర్ సిటిజన్లకు 303 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై 7.5 శాతం వడ్డీ, 506 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 7.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు 300 రోజుల వ్యవధి ఎఫ్డీలపై 7.85 శాతం, 506 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 7.5 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తోంది.ఇతర ఎఫ్డీలుపంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్డీ స్కీములను అందిస్తోంది. వీటిపై సాధారణ పౌరులకు వడ్డీ రేటు 3.50% నుండి 7.25% ఉంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 4% నుండి 7.75% వడ్డీని అందిస్తోంది. 400 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై అత్యధికంగా సాధారణ పౌరులకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ రేటు లభిస్తోంది.సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉన్నఎఫ్డీలపై 4.30% నుండి 8.05% వడ్డీని అందిస్తోంది. వీరికి ప్రస్తుతం 400 రోజుల కాలవ్యవధి ఎఫ్డీలపై 8.05% వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది. -
ఫైనాన్స్‌లో దిట్ట.. అయినా వాటి జోలికి వెళ్లలేదు!
"సర్దార్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ" అని పిలిచే భారత మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ( Manmohan Singh ) కన్నుమూశారు. ఫైనాన్స్ పట్ల అసమానమైన అవగాహన ఉన్న ఆయన దేశ ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ( Prime Minister ) పనిచేశారు. ఆర్థిక సంస్కర్తగా ( Economic Reforms ) ఘనత వహించిన మన్మోహన్ సింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ (invest ) చేసేవారు.. ఆయన పొదుపు ప్రణాళికల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సంప్రదాయ పెట్టుబడులకు ప్రాధాన్యత1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయినప్పుడు సెన్సెక్స్ 999 పాయింట్ల వద్ద ఉండేది. ఆయన సంచలనాత్మక బడ్జెట్ సంస్కరణల తరువాత ఆ సంవత్సరం చివరి నాటికి సెన్సెక్స్ ( Sensex ) దాదాపు రెండింతలు పెరిగింది. భారతదేశ ఆర్థిక రూపును దిద్దడంలో ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు ( FD ), పోస్టాఫీసు పొదుపు పథకాలు వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత ఇచ్చారు.ఎఫ్డీలు, పోస్టాఫీసు పొదుపులుప్రధానమంత్రిగా ఆయన 2013 అఫిడవిట్ ప్రకారం.. మన్మోహన్ సింగ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 11 కోట్లు. మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గురు శరణ్ కౌర్ ఇద్దరూ కలిసి రూ. 1 లక్ష నుండి రూ. 95 లక్షల విలువైన ఎనిమిది ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టారు. 2013 నాటికి వారి ఎప్డీలు, బ్యాంకు సేవింగ్స్ మొత్తం రూ. 4 కోట్లు కాగా వారి పోస్టాఫీసు ( Post office ) పొదుపు రూ. 4 లక్షలు.ఆస్తులు ఇవే.. 2019 నాటికి మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ రూ. 15 కోట్లు. ఢిల్లీ, చండీగడ్‌లోని ఆయన ఆస్తుల విలువ రూ. 7 కోట్లు. ఇక గురుశరణ్ కౌర్ వద్ద రూ. 3 లక్షల విలువైన 150 గ్రాముల బంగారం ఉండగా వారి బ్యాంకు ఎఫ్డీలు, సేవింగ్స్ రూ. 7 కోట్లు ఉన్నాయి. అదనంగా, వారు జాతీయ పొదుపు పథకం ( NSS )లో రూ.12 లక్షలు పొదుపు చేశారు.ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంమన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. ఉదాహరణకు 2013 ఫిబ్రవరి 2 నుండి క్రమశిక్షణతో కూడిన ఆయన ఆర్థిక ప్రణాళికను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఆ రోజున ఆయన మూడు ఎఫ్డీలలో రూ.2 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మూడేళ్లలో ఇవి రూ. 2.62 కోట్లు అయ్యాయి. ఈ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టారు. ఆరేళ్లలో ఆయన సంపద రూ.4 కోట్లకు చేరింది. ఈ క్రమశిక్షణతో కూడిన విధానం ఆయన పెట్టుబడులును సురక్షితంగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసింది.స్టాక్ మార్కెట్‌కు దూరంఫైనాన్స్ మీద అపారమైన అవగాహన ఉన్నప్పటికీ అధిక రాబడి కోసం మన్మోహన్ సింగ్ ఎన్నడూ స్టాక్ మార్కెట్ ( Stock market ) జోలికి వెళ్లలేదు. 1992లో స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ‘స్టాక్‌మార్కెట్‌ను తలుచుకొని నా నిద్రను చెడగొట్టుకోను’ అంటూ స్టాక్ మార్కెట్‌పై తన అంతరంగాన్ని పార్లమెంటులో వెల్లడించారు. -
మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?
ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలు త్వరలో మారనున్నట్లు తెలుస్తోంది. ఫిక్స్డ్ డిపాజిటర్లు నిర్దేశిత భాగాలతో ఎక్కువ మంది బహుళ నామినీలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బ్యాంకింగ్ నిబంధనలను సవరించే చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిశీలిస్తారని భావిస్తున్నారు.ఎక్కువ మంది నామినీలను పెట్టుకునే వెసులుబాటు కల్పించడం వల్ల ఎక్కువగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను నిర్వహించే అనేక మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది డిపాజిటర్లు ఫిక్స్డ్ డిపాజిట్లను తెరిచేటప్పుడు నామినీలను పేర్కొనలేదు. దీంతో వారి మరణం తరువాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను తీసుకోవడంలో వారి కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్ద ఎత్తున ఎదురయ్యాయి.ప్రతిపాదిత కొత్త నిబంధనలుఎకనమిక్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుత సింగిల్ నామినీ సిస్టమ్ అమలులో ఉండగా ప్రతిపాదిత సవరణలతో గరిష్టంగా నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అవకాశం కలుగుతుంది.నామినీల ఏర్పాటు రెండు విధాలుగా ఉండవచ్చు. నామినీలకు భాగాలను పేర్కొంటూ ఒకేసారి అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా వివిధ సందర్భాల్లో నామినీలను జోడించుకునే అవకాశమైనా కల్పించవచ్చు.ఒకేసారి నామినీలను ఏర్పాటుచేసిన సందర్భంలో డిపాజిటర్ మరణించిన తర్వాత ముందుగానే పేర్కొన్న భాగాల ప్రకారం నామినీలందరూ డిపాజిట్ సొమ్మును పొందే వీలుంటుంది. దీని వల్ల క్లయిమ్ సెటిల్మెంట్ సులభతరం కావడం మాత్రమే కాకుండా డిపాజిటర్ సొమ్ము సరైన వారసులకు దక్కే ఆస్కారం ఉంటుంది. -
అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!
డబ్బు పొదుపు చేయాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటారు. అయితే వాటిలో డిపాజిట్ చేసే డబ్బుకు ఆర్బీఐ కొంత వరకు బీమా కల్పిస్తోంది. దాంతో చాలా మంది ఎఫ్డీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో వివిధ మనీ యాప్‌లు, బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ సంస్థలు వంటివి ఎఫ్డీలకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అందులో ఎక్కువ వడ్డీ అందించే సంస్థలు, ఏడాదిలో వాటి వడ్డీరేట్లను కింద తెలియజేశాం.యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50% నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50%సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.05% శ్రీరామ్ ఫైనాన్స్ - 9.07% వరకు (మహిళలకు)బజాజ్ ఫైనాన్స్ - 8.65% వరకుఇండస్ ఇండ్ బ్యాంక్ - 8.25%సౌత్ ఇండియన్ బ్యాంక్ - 7.75%ఈ రేట్లు ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇన్వెస్టర్లు ఎంచుకునే కాలపరిమితి, వారి పెట్టుబడిని బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చు.ఇదీ చదవండి: అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?9.5 శాతం వడ్డీ ఇస్తున్న మనీ యాప్‘సూపర్.మనీ’ యాప్ ఎఫ్డీపై 9.5 శాతం వడ్డీ అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఆర్బీఐ గుర్తింపు కలిగిన ఏ ఆర్థిక సంస్థలో ఎఫ్డీ ద్వారా పెట్టుబడి పెట్టినా రూ.5 లక్షల వరకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) బీమా అందిస్తుంది. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అందుకు సంబంధిత బ్యాంకు/ ఆర్థిక సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి రూ.5 లక్షలలోపు ఎప్డీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నవారు అధిక వడ్డీలిచ్చే బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి విభిన్న మార్గాలను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంపిక చేసిన డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను ఇటీవల అప్డేట్ చేసింది. దీంతోపాటు బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ అనే కొత్త డిపాజిట్ ఎంపికను ప్రవేశపెట్టింది. ఇది డిపాజిట్‌దారులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ కొత్త రేట్లు అక్టోబర్ 14 నుండి అమలులోకి వచ్చాయి.కొత్త స్కీమ్ వడ్డీ రేట్లుబీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ సాధారణ పౌరులకు 7.30 శాతం వడ్డీని అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లు 7.80 శాతం వడ్డీ అందుకోవచ్చు. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే గరిష్టంగా 7.90 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ముబ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్డీ వడ్డీ రేట్ల మార్పు తర్వాత రూ. 3 కోట్ల లోపు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వ్యవధి గల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.25% నుండి 7.30% (ప్రత్యేక డిపాజిట్‌తో సహా) వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.75% నుండి 7.80% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. -
గడువు ముగియనున్న ఎస్బీఐ స్పెషల్ స్కీమ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకొచ్చిన 400 రోజుల ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్ ‘ఎస్బీఐ అమృత్ కలశ్’కు గడువు త్వరలో ముగియనుంది. ఈ పథకం కింద ఎఫ్డీ ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ 30 ముగుస్తుంది.ఏప్రిల్ 12న ప్రారంభించిన ఈ నిర్దిష్ట టెన్యూర్ ఎఫ్డీ ప్లాన్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ పథకానికి గడువును పలు సార్లు ఎస్బీఐ పొడిగిస్తూ వచ్చింది.కస్టమర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ.. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌తో అందిస్తున్న సాధారణ ఎఫ్డీ పథకాలతో పోలిస్తే అమృత్ కలాష్ ఎఫ్డీ ప్లాన్‌పై సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు సుమారు 30 బేసిస్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తోంది.అమృత్ కలశ్ ఎఫ్డీ రేట్లుఎస్బీఐ అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను సబ్స్క్రయిబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు 7.1% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.6% రేటు లభిస్తోంది. ఇది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ ప్లాన్. మరోవైపు 1-2 సంవత్సరాల టెన్యూర్ ఉండే ఎఫ్డీ ప్లాన్‌కు సాధారణ కస్టమర్లకు 6.8%, సీనియర్ సిటిజన్లకు 7.3% వడ్డీని ఎస్బీఐ చెల్లిస్తోంది. -
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!
బంధన్ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు (FD) 8.55 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.బంధన్ బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.55 శాతం, ఇతర కస్టమర్లకు 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఐదు సంవత్సరాలలోపు కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇతర కస్టమర్లకు ఈ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.ఇదీ చదవండి: కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..మరోవైపు రూ. 10 లక్షలకు మించిన పొదుపు ఖాతా నిల్వలపై 7 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ అందిస్తుంది. రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కస్టమర్లు సౌకర్యవంతంగా తమ ఇళ్లు లేదా తాము ఉండే చోటు నుంచే ఫిక్స్డ్ డిపాజిట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ సదుపాయం ద్వారా కస్టమర్లు ఎఫ్డీ బుకింగ్ ప్రక్రియను నిమిషాల వ్యవధిలో వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు.కాలవ్యవధి వడ్డీ సీనియర్ సిటిజెన్లకు సాధారణ ప్రజలకు7 నుంచి 14 రోజులు 3.00% 3.75%15 నుంచి 30 రోజులు 3.00% 3.75%31 రోజుల నుంచి 2 నెలలలోపు 3.50% 4.25%2 నెలల నుంచి 3 నెలలలోపు 4.50% 5.25%3 నెలల నుంచి 6 నెలలలోపు 4.50% 5.25%6 నెలల నుంచి ఏడాదిలోపు 4.50% 5.25%ఏడాది 8.05% 8.55%ఏడాది నుంచి ఏడాది 9 నెలలు 8.00% 8.50%21 నెలల 1రోజు నుంచి 2 ఏళ్లలోపు 7.25% 7.75%2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు 7.25% 7.75%3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు 7.25% 7.75%5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.85% 6.60%ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ 7.00% 7.50% -
‘స్టార్ ధన్ వృద్ధి’.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇటీవల రూ. 3 కోట్లలోపు డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించిన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అందులో భాగంగా అధిక రాబడిని అందించే ‘స్టార్ ధన్ వృద్ధి’అనే పేరుతో కొత్త ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది.బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి. మార్పుల తర్వాత, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ రేట్లు సాధారణ ప్రజలకు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.‘స్టార్ ధన్ వృద్ధి’ గురించి..స్టార్ ధన్ వృద్ధి పథకం అనేది పరిమిత-సమయ ఎఫ్డీ స్కీమ్. ఇది 333 రోజుల స్థిర కాలవ్యవధికి 7.25 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే ఈ పథకం కింద మరింత మెరుగైన రాబడి లభిస్తుంది.ఈ స్కీమ్ కింద సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు (వయస్సు 60-80 ఏళ్లు ) 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్లు ( వయస్సు 80 ఏళ్లకు పైబడి) 7.90 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. -
అధికంగా వడ్డీ ఇస్తున్న చిన్న బ్యాంకులు
Best FD Rates: దేశంలో చాలా మంది అధిక రాబడుల కోసం ఇప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. సాంప్రదాయ పెట్టుబడి మార్గాలను వదిలి కొత్త ఎంపికల కోసం చూస్తున్నారు. అయితే, మొత్తం పెట్టుబడిని మార్కెట్లో పెట్టే బదులు కొంత భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వంటి వాటిలో మదుపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.మరి ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ తక్కువ వస్తుంది కదా అని అపోహ పడవద్దు. ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడి ఎంపిక మాత్రమే కాకుండా వడ్డీ కూడా బాగానే వస్తుంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎఫ్డీపై ఎక్కువ వడ్డీ ఇస్తాయి.ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న బ్యాంకులు కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. ఎఫ్డీపై ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో ఇక్కడ తెలియజేస్తున్నాం.నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్డీపై దేశంలోనే అత్యధిక వడ్డీని ఇస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ బ్యాంకులో 3 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ ఖాతాను తెరిస్తే సంవత్సరానికి 9.5 శాతం వడ్డీని ఇస్తుంది.సూర్య స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీపై అత్యధిక వడ్డీ ఇచ్చే విషయంలో రెండవ స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9.1 శాతం వడ్డీని ఇస్తోంది.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 3 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 9.1 శాతం వడ్డీని అందిస్తోంది.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 3 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.75 శాతం వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీని అందించే బ్యాంకుల జాబితాలో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు మూడేళ్ల ఎఫ్డీలపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఆఫర్ 3 సంవత్సరాల వ్యవధిలో చేసిన బ్యాంక్ ఎఫ్డీలకు కూడా వర్తిస్తుంది. -
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మరింత రాబడి!
ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రూ. 3 కోట్ల లోపు వివిధ కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూలై 24 నుంచి అమలులోకి వచ్చాయి. పెంపు తర్వాత, బ్యాంక్ ఎఫ్డీ గరిష్ట రేట్లు సాధారణ పౌరులకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతంగా ఉన్నాయి.పెరిగిన ఎఫ్డీ రేట్లు ఇవే..2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల కాలవ్యవధి డిపాజిట్‌పై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు అంటే 7.15% నుంచి 7.35% వరకు పెంచింది. అలాగే 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల కాలవ్యవధిపై నా 20 బేసిస్ పాయింట్లు 7.20% నుంచి 7.40% కి పెంచింది. రూ.3 కోట్ల లోపు డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీ రేట్లుటెన్యూర్ సాధారణ పౌరులకు సీనియర్ సిటిజన్లకు 7-14 రోజులు 3.00% 3.50%15-29 రోజులు 3.00% 3.50%30-45 రోజులు 3.50% 4.00%46-60 రోజులు 4.50% 5.00%61 - 89 రోజులు 4.50% 5.00%90 రోజులు < = 6 నెలలు 4.50% 5.00%6 నెలలు 1 రోజు < = 9 నెలలు 5.75% 6.25%9 నెలల 1 రోజు నుంచి < 1 సంవత్సరం వరకు 6.00% 6.50%1 సంవత్సరం నుండి <15 నెలల వరకు 6.60% 7.10%15 నెలల నుండి <18 నెలల వరకు 7.10% 7.60%18 నెలల నుండి <21 నెలల వరకు 7.25% 7.75%21 నెలలు - 2 సంవత్సరాలు 7.00% 7.50%2 సంవత్సరాల 1 రోజు నుండి < 2 ఏళ్ల 11 నెలల వరకు 7.00% 7.50%2 ఏళ్ల 11 నెలలు - 35 నెలలు 7.35% 7.85%2 ఏళ్ల 11 నెలల 1 రోజు < = 3 సంవత్సరాలు 7.00% 7.50%3 ఏళ్ల 1 రోజు నుండి < 4 ఏళ్ల 7 నెలల వరకు 7.00% 7.50%4 ఏళ్ల 7 నెలలు - 55 నెలలు 7.40% 7.90%4 ఏళ్ల 7 నెలలు 1 రోజు < = 5 సంవత్సరాలు 7.00% 7.50%5 ఏళ్ల 1 రోజు - 10 ఏళ్లు 7.00% 7.50% -
ఇకపై మరింత రాబడి.. ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
SBI FD Interest Rates Hike: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన కోట్లాది మంది ఖాతాదారులకు శుభవార్త అందించింది. 180 రోజుల నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. ఎస్బీఐ ఈ ఎఫ్డీలపై వడ్డీని 0.25 శాతం పెంచింది.ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు బ్యాంకులు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పరిమితిని పెంచుకోవచ్చు. ఎస్బీఐ ప్రకటించిన ఈ కొత్త రేట్లు రూ .3 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఉన్నాయి. ఈ కొత్త రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇవే.. » 7 రోజుల నుంచి 45 రోజులు: సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం.» 46 రోజుల నుంచి 179 రోజులు: సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం» 180 రోజుల నుంచి 210 రోజులు: సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం» 211 రోజుల నుంచి ఏడాది లోపు: సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం» ఏడాది నుంచి 2 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం» 2 సంవత్సరాల నుంచి మూడేళ్ల లోపు: సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం» మూడేళ్ల నుంచి 5 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం» ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాలు: సాధారణ ప్రజలకు 6.50, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ.. వడ్డీ ఎంతంటే?
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్‌ను ప్రకటించింది. 666 రోజుల ఎఫ్డీని ప్రారంభించింది. ఇది రూ .2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తాలపై సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం వరకు వడ్డీని అందిస్తుంది.666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులను సూపర్ సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తారు.ఈ 666 రోజుల ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సాధారణ కస్టమర్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌పై రుణం పొందే సౌలభ్యం, ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సదుపాయం అందుబాటులో ఉంది.కస్టమర్లు, సాధారణ ప్రజలందరూ ఈ పెట్టుబడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏ బ్రాంచిలోనైనా ఈ ఎఫ్డీని తెరవచ్చు. అలాగే బీఓఐ ఓమ్ని నియో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఎఫ్డీని తెరిచే అవకాశం ఉంది. -
గతేడాది ఎఫ్‌డీఐలు డీలా
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 3.5 శాతం క్షీణించాయి. 44.42 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా సరీ్వసెస్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలకు పెట్టుబడులు తగ్గడం ప్రభావం చూపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022–23లో 46.03 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు లభించాయి. అయితే గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో మాత్రం 33 శాతంపైగా జంప్ చేశాయి. 12.38 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. అంతక్రితం క్యూ4లో ఇవి 9.28 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈక్విటీ పెట్టుబడులు, లాభార్జన, ఇతర మూలధనంతో కూడిన మొత్తం ఎఫ్‌డీఐలను పరిగణిస్తే గతేడాది నామమాత్రంగా 1 శాతం నీరసించి 70.95 బిలియన్ డాలర్లను తాకాయి. 2022–23లో ఇవి 71.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) వివరాల ప్రకారం 2021–22లో దేశ చరిత్రలోనే అత్యధికంగా 84.83 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు లభించాయి.రంగాల వారీగా..గతేడాది మారిషస్, సింగపూర్, యూఎస్, యూఏఈ, కేమన్ ఐలండ్స్, జర్మనీ, సైప్రస్ తదితర ప్రధాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు నీరసించాయి. అయితే నెదర్లాండ్స్, జపాన్ నుంచి ఎఫ్‌డీఐలు పుంజుకోవడం గమనార్హం! ఇక రంగాలవారీగా చూస్తే సర్వీసెస్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ట్రేడింగ్, టెలికం, ఆటోమొబైల్, ఫార్మా, కెమికల్స్‌కు పెట్టుబడులు తగ్గాయి. మరోపక్క నిర్మాణ రంగ(మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలు, అభివృద్ధి, విద్యుత్ రంగాలు అధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. గతేడాది మహారాష్ట్ర అత్యధికంగా 15.1 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను అందుకోగా.. గుజరాత్‌కు 7.3 బి.డా. లభించాయి. 2022–23లో ఇవి వరుసగా 14.8 బి.డా, 4.7 బి.డాలర్లుగా నమోదయ్యాయి. -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. టైల్ స్థిర డిపాజిట్లకు (రూ.2 కోట్ల వరకూ ఎఫ్డీలు) సంబంధించి కొన్ని కాల పరిమితులపై వడ్డీరేట్లను పెంచింది. 2023 డిసెంబర్ తర్వాత బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీరేటు పెంచడం ఇదే తొలిసారి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, ఈ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వస్తాయి. 46 రోజుల నుంచి 179 రోజులు, 180 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితుల డిపాజిట్ రేట్లు 25 నుంచి 75 బేసిస్ పాయింట్ల శ్రేణిలో (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. కాగా, సీనియర్ సిటిజన్లకు ఆయా కాలపరిమితులపై (టేబుల్లో పేర్కొన్న రేట్ల కన్నా అదనంగా) పేర్కొన్న డిపాజిట్ రేట్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు లభిస్తుంది. దీర్ఘకాలిక (ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య) డిపాజిట్‌పై ఏకంగా 1% వరకూ అదనపు వడ్డీరేటు లభిస్తుంది. తాజా రేట్లు ఇలా... కాల పరిమితి వడ్డీ(%) 7–45 రోజులు 3.546–179 రోజులు 5.5 180–210 రోజులు 6.0 211 రోజులు– ఏడాది 6.25 ఏడాది–రెండేళ్లు 6.80 రెండేళ్లు–మూడేళ్లు 7.00 మూడేళ్లు– ఐదేళ్లు 6.75ఐదేళ్లు– పదేళ్లు 6.50 -
తక్కువ టెన్యూర్.. ఎక్కువ వడ్డీ!
తక్కువ టెన్యూర్ ఉండి ఎక్కువ వడ్డీ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కోసం చూస్తున్నారా.. మీలాంటివారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎస్బీఐ సర్వోత్తం ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 1 లేదా 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఇతర పథకాలతో పోలిస్తే, ఇది అధిక వడ్డీని అందిస్తుంది. రెండేళ్ల టెన్యూర్ ఈ సర్వోత్తం ఎఫ్డీ పథకంపై ఎస్బీఐ 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ పీపీఎఫ్, ఎన్ఎస్సీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వంటి ఇతర పెట్టుబడి ఎంపికల కంటే ఎక్కువ. ఇది కాకుండా ఈ పథకం అతిపెద్ద ఫీచర్ ఏంటంటే.. దాని కాలవ్యవధి. ఈ పథకం టెన్యూర్ 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 7.4 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తోంది. ఏడాది టెన్యూర్ ఎస్బీఐ సర్వోత్తం ఎఫ్డీ పథకంపై 1 సంవత్సరం కాలపరిమితితో సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లు 7.60 శాతం వడ్డీని పొందవచ్చు. పెట్టుబడి పరిమితి ఎస్బీఐ సర్వోత్తం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో ఇన్వెస్టర్ కనీసం రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిట్‌దారు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. పదవీ విరమణ చేసిన వారికి ఎస్బీఐ సర్వోత్తం ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ఉత్తమమైనదని చెప్పవచ్చు. పీపీఎఫ్ నుండి డబ్బు పొందినప్పుడు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ పథకంలో రూ.2 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే వచ్చే వడ్డీ 0.05 శాతం తగ్గుతుంది. (Disclaimer: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమేనని గమనించగలరు. ఏదైనా ఎఫ్డీ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు దాని క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం) -
ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు మారాయ్..
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను (FD) సురక్షితమైన ఎంపికగా చాలా మంది పరిగణిస్తారు. నేటికీ పెట్టుబడి కోసం ఎఫ్డీలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిపాజిటర్లను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ప్రకటిస్తున్నాయి. తాజగా ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవారు లేదా చేయాలనుకుంటున్న వారు సవరించిన వడ్డీ రేట్లను పరిశీలించవచ్చు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీ సౌకర్యాన్ని అందిస్తోంది. మీరు 3 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీ ప్రయోజనం పొందవచ్చు. 500 రోజుల ఎఫ్డీపై బ్యాంక్ అత్యధికంగా 8 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఎఫ్డీ చేసే సీనియర్ సిటిజన్లకు ఐడీఎఫ్సీ బ్యాంక్ మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. వీరికి 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు 2024 మార్చి 21 నుండి అమలులోకి వస్తాయి. సాధారణ పౌరులకు వడ్డీశాతం 7 నుండి 45 రోజులు - 3 శాతం 46 నుండి 180 రోజులు - 4.50 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 5.75 శాతం 1 సంవత్సరం - 6.50 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 7.50 శాతం 500 రోజులు - 8 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 7.50 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 7.75 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.25 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7 శాతం సీనియర్ సిటిజన్లకు.. 7 నుండి 45 రోజులు - 3.50 శాతం 46 నుండి 180 రోజులు - 5 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 6.25 శాతం 1 సంవత్సరం - 7 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 8 శాతం 500 రోజులు - 8.50 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 8 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 8.25 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.75 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7.50 శాతం -
ఎఫ్డీ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంక్
ప్రైవేటు రంగంలో సేవలందిస్తున్న బంధన్ బ్యాంక్ తన వినియోగదారులకు మరింత సేవలందించేలా చర్యలు తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. 500 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై వయో వృద్ధులకు(సీనియర్ సిటిజన్లు) 8.35 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు తెలిపింది. సాధారణ వ్యక్తులకు 7.85 శాతం వడ్డీ ఇస్తోంది. ఏడాది నుంచి వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేటును 7.25 శాతంగా నిర్ణయించింది. 5-10 ఏళ్ల వ్యవధికి 5.85 శాతం వడ్డీని అందిస్తోంది. ఇదీ చదవండి.. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పసిడి రుణాలపై ఆర్బీఐ నిషేధం సీనియర్ సిటిజన్లకు 6.60 శాతంగా నిర్ణయించింది. పొదుపు ఖాతాలో రోజువారీ నిల్వ రూ.10 లక్షలకు మించి ఉన్న వారికి 7 శాతం వడ్డీనిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కొత్తగా రెండు శాఖలను ప్రారంభించినట్లు బంధన్ బ్యాంక్ వెల్లడించింది. దీంతో తెలంగాణలో మొత్తం శాఖల సంఖ్య 142కు చేరినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుకు 1664 శాఖలున్నాయి. -
డబ్బులు ఈ బ్యాంకుల్లో వేసుకుంటే మంచి వడ్డీ!
FD Interest Rate: దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఇటీవల సవరించాయి. కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ప్రత్యేక ఎఫ్డీ పథకాలకు గడువు తేదీని కూడా పొడిగించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించాయి. ప్రస్తుతం ఆయా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనవరిలో ఎఫ్డీపై వడ్డీ రేటును రెండుసార్లు సవరించింది. ఒకే టెన్యూర్ ఎఫ్డీపై వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటును సాధారణ కస్టమర్లకు 6.25 శాతం నుంచి 7.05 శాతానికి పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ అందిస్తోంది. రేట్లు సవరించిన తర్వాత ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్ (IDBI): ఐడీబీఐ బ్యాంక్ కూడా ఇటీవల ఎఫ్డీ వడ్డీ రేటును సవరించింది. మార్పు తర్వాత 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.50 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త మెచ్యూరిటీ వ్యవధితో ప్రత్యేక స్వల్పకాలిక ఎఫ్డీని ప్రారంభించింది. ఇందులో కస్టమర్లకు అధిక వడ్డీ లభిస్తుంది. కొత్త రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి. బ్యాంక్ 360D (bob360) పేరుతో కొత్త మెచ్యూరిటీ ఎఫ్డీని తీసుకొచ్చింది. ఇది సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్తరేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 4.25 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం నుంచి 7.65 శాతం వడ్డీ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ : ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 500 రోజుల వ్యవధిలో గరిష్టంగా 8 శాతం రాబడిని అందిస్తోంది. సవరించిన రేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.50 శాతం నుంచి 8.00 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. గమనిక: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. డబ్బులు డిపాజిట్ చేసే ముందు వివరాలు క్షణ్ణుంగా తెలుసుకోవడం అవసరం. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెరిగాయ్!
భద్రతతో కూడిన స్థిరమైన రాబడికి ఉత్తమమైన పెట్టుబడి మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అందుకే వీటిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్దిష్ట కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల టెన్యూర్‌పై ఎఫ్డీ రేటు సాధారణ ప్రజలకు గతంలో 6.25 శాతం ఉండగా 7.05 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం నుంచి 7.55 శాతానికి, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం నుంచి 7.85 శాతానికి సవరించింది. రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల లోపు 300 రోజుల టెన్యూర్ పీఎన్బీ ఉత్తమ్ (ముందస్తు ఉపసంహరణకు వీలులేని) ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లోనూ వడ్డీ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సవరించింది. సాధారణ ప్రజలకు 6.30 శాతం నుంచి 7.10 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం నంచి 7.60 శాతానికి పెంచింది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా 7.10 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు జనవరి 8 నుంచి వర్తిస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో తెలిపింది. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటించిన తర్వాత ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు తమ ఎఫ్డీ రేట్లను సవరించాయి. -
Fixed Deposits: శుభవార్త.. వడ్డీ రేట్లు పెరిగాయ్..
స్థిరమైన ఆదాయంతోపాటు భవిష్యత్తుకు భద్రతనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి ఉన్న వారికి శుభవార్త. ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ వద్ద చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచాయి. మెరుగైన వడ్డీ రేటు కోసం చూస్తున్నవారికి ఇదే మంచి సమయం. పలు బ్యాంకులు వివిధ కాల వ్యవధులు, డిపాజిట్ మొత్తాన్ని బట్టి 8 శాతం వరకూ వార్షిక వడ్డీని అందిస్తున్నాయి. కీలకమైన రెపో రేటును 6.5 వద్దే యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ రానున్న నెలల్లోనూ అలాగే ఉంచుతుందన్న అంచనాల నేపథ్యంలో కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఆయా బ్యాంకులు తమ వెబ్సైట్లలో ప్రకటించిన ఎఫ్డీ రేట్లు ఇక్కడ అందిస్తున్నాం.. వివిధ బ్యాంకుల ఎఫ్డీ రేట్లు ఇవే.. డిసెంబర్లో ఎఫ్డీలపై వడ్డీ రేటును పెంచిన మొదటి బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ 1 నుంచి తమ ఎఫ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్లు, ఆపైన, రూ. 10 కోట్ల లోపు డిపాజిట్ చేసే దేశీయ కస్టమర్లకు ఒక సంవత్సరం కాలవ్యవధికి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు డిపాజిట్లపై ఎఫ్డీ రేట్లను సవరించింది. ఏడు నుంచి 14 రోజుల వ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు వ్యవధిపై గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఇవి డిసెంబరు 13 నుంచి అమలులోకి వస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా రూ. 5 కోట్లకు మించిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఏడు నుంచి 14 రోజుల కాలవ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, ఏడాది నుంచి 15 నెలల వరకు గరిష్టంగా 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. డిసెంబర్ 13 నుంచి మారిన రేట్ల ప్రకారం.. రూ. 100 కోట్ల నుండి రూ. 500 కోట్లకు మించిన ఎఫ్డీలపై వడ్డీ ఇప్పుడు 7.35 శాతం నుండి 7.30 శాతానికి చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసెంబర్ 11 నుంచి రూ. 2 కోట్ల లోపు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 85 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సాధారణ కస్టమర్ల కోసం కూడా ఎఫ్డీ రేట్లు వివిధ కాల వ్యవధులకు 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి. సీనియర్ సిటిజన్లు ఇప్పుడు 23 నెలల నుండి రెండు సంవత్సరాల వరకు 7.80 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చు. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసే సాధారణ కస్టమర్లకు 23 నెలల ఒక రోజు నుంచి రెండేళ్ల లోపు కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ కూడా తన డిపాజిట్ రేట్లను సవరించింది. రెసిడెంట్ , నాన్-రెసిడెంట్ డిపాజిట్లకు వర్తించే 500 రోజుల కాలవ్యవధికి 7.50 శాతం రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 8.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డీసీబీ బ్యాంక్ డీసీబీ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచింది. డిసెంబరు 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం.. 25 నెలల నుండి 26 నెలల కాలవ్యవధితో సాధారణ డిపాజిట్లపై 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం అత్యధిక వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. -
ఫిక్స్డ్ డిపాజిట్ల ముందస్తు విత్‌డ్రా.. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు
ఫిక్స్డ్ డిపాజిట్‌దారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI). ఇక నుంచి అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మెచ్యూరిటీ కంటే ముందే డబ్బును తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కోటి రూపాయల వరకు ఉన్న అన్ని బ్యాంకు డిపాజిట్లపై ముందస్తు మెచ్యూర్ విత్‌డ్రాలను తప్పనిసరిగా అనుమతించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. నాన్ కాలబుల్ (ముందస్తు ఉపసంహరణకు వీలు లేని) ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ గతంలోనే రూ.15 లక్షల వరకూ డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.కోటి వరకూ పెంచింది. కాగా గతంలో ఈ ముందస్తు ఉపసంహరణకు వీలు లేని డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించేందుకు బ్యాంకులను అనుమతించింది. అధిక వడ్డీ రేటు వర్తించే సమయంలో మెచ్యూర్‌కు ముందు ఉపసంహరణ సౌకర్యం లేకుండా అధిక వడ్డీ రేట్లను అందించేలా బ్యాంకులను ఆర్బీఐ ప్రోత్సహించింది. వడ్డీ రేట్లు పెరిగితే కస్టమర్లు తమ డిపాజిట్లను ముందస్తుగా విత్‌డ్రా చేయరనేది ఆర్బీఐ ఉద్దేశం. చిన్న పెట్టుబడిదారులను రక్షించడమే నాన్ కాలబుల్ డిపాజిట్లపై కనీస డిపాజిట్ల పరిమాణాన్ని పెంచడం వెనుక లక్ష్యం అని బ్యాంకర్లు భావిస్తున్నారు. ఈ డిపాజిట్లపై బ్యాంకులు 25 నుంచి 30 బేసిస్ పాయింట్లు అధికంగా రాబడిని అందిస్తాయి. అధిక విలువ కలిగిన డిపాజిట్లకు రాబడి ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రామీణ బ్యాంకులకు బల్క్ డిపాజిట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచుతూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్బీఐ. అంటే రూ. 1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్లపై మాత్రమే బ్యాంకులు డిఫరెన్షియల్ రేట్లను అందించగలవు. -
ఎఫ్డీ విషయంలో ఈ పొరబాటు చేయకండి, ఇలా చేస్తే లాభాలు!
డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతానికి చేరుకోవడంతో ఈ సమయంలో ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక మరికొన్ని రోజులు వేచి చూడాలా? అన్నది ఎంతో మంది ఎదుర్కొంటున్న సందేహం. నిజానికి ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరగొచ్చు. లేదంటే కొంత విరామం తర్వాత రేట్లు తగ్గొచ్చు. మరి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే అదనపు రాబడి అవకాశాన్ని కోల్పోతామేమో..? అనుకునే వారు ఒక రకం అయితే.. ఈ రేట్లపై ఇన్వెస్ట్ చేయకపోతే, రానున్న రోజుల్లో ఆర్బీఐ రేట్లను తగ్గిస్తే అప్పుడు మెరుగైన రాబడి చాన్స్ మిస్ అవుతామేమో అనుకునే వారు ఇంకో రకం. ఇలాంటి అయోమయ వాతావరణాన్ని చూసి పెట్టుబడుల అవకాశాలను కోల్పోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, వాటికి తగినట్టు పెట్టుబడుల వ్యూహాలను అనుసరించడమే ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గం. ఇలాంటి తరుణంలో ఇన్వెస్టర్లు ‘ఎఫ్డీ లాడరింగ్’ (అంచెలంచెలుగా) విధానాన్ని అనుసరించొచ్చు. అంటే డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి గడువు తీరే విధంగా ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉండడం. మున్ముందు ఏం జరుగుతుందోనన్నది అన్ని సందర్భాల్లోనూ అంచనా వేయలేం. అటువంటప్పుడు వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు ఎఫ్డీ లాడార్ ఉపయోగపడుతుంది. మెరుగైన రాబడులకు మార్గం చూపుతుంది. ఆర్బీఐ గడిచిన రెండు ద్రవ్య విధాన సమీక్షల్లో కీలకమైన రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యానికి ఎగువనే చలిస్తోంది. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు ముగింపు పడిందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. త్వరలో వెలువడనున్న ఆగస్టు ద్రవ్యోల్బణం తదుపరి ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ద్రవ్యోల్బణం ఎగసి పడుతుండడంతో అదనపు సీఆర్ఆర్ రూపంలో బ్యాంకుల నుంచి ఆర్బీఐ మరింత లిక్విడిటీని తీసుకునే నిర్ణయాన్ని గత సమీక్షలో ప్రకటించింది. మరోవైపు యూఎస్ ఫెడ్ రానున్న సమీల్లో రేట్లను పెంచే అవకాశాలే ఉన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టాలా? వేచి చూడాలా? అన్న సందిగ్ధత ఎదుర్కొనే వారు ఎఫ్డీ లాడార్ను అనుసరించొచ్చు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) వడ్డీ రేట్ల అస్థిరతలకు చెక్ కాలానుగుణంగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఎఫ్డీ లాడార్ సాయపడుతుంది. ఈ విధానంలో పెట్టుబడి మొత్తాన్ని ఒకే కాల వ్యవధికి ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ కాల వ్యవధుల మధ్య భాగాలుగా చేసుకోవాలి. సాధారణంగా వడ్డీ రేట్లు పడిపోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలానికి కాకుండా స్వల్ప కాలానికి ఎఫ్డీలు చేస్తుంటారు. ఒకవేళ వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం మొదలు పెడితే.. స్వల్పకాలానికి చేసిన ఎఫ్డీ గడువు తీరి చేతికి వస్తుందని, ఆ మొత్తాన్ని మెరుగైన రేటుపై మళ్లీ ఎఫ్డీ చేసుకోవచ్చని అనుకుంటారు. అదే మాదిరిగా, వడ్డీ రేట్లు పెరుగుతూ వెళుతుంటే అప్పుడు దీర్ఘకాలానికి ఎఫ్డీలు చేస్తుంటారు. ఒకవేళ అక్కడి నుంచి వడ్డీ రేట్లు పడిపోవడం మొదలు పెడితే.. అధిక రేటుపై ఎఫ్డీ చేసుకున్నట్టు అవుతుందని భావిస్తుంటారు. కానీ, ఇది సరైన విధానం కాబోదు. వడ్డీ రేట్లు అస్థిరంగా ఉన్న సమయంలో పెట్టుబడినంతా ఒకే ఎఫ్డీగా మార్చుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ‘‘ఇన్వెస్టర్లు సాధారణంగా గరిష్ట రేటుపై ఎఫ్డీ చేసుకోవాలని చూస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. భవిష్యత్ వడ్డీ రేట్ల గమనాన్ని అంచనా వేయడం రిస్‌్కతో కూడుకున్నదే అవుతుంది. దీనికి బదులు వడ్డీ రేట్ల చలనంతో వచ్చే రిస్‌్కను తగ్గించుకునేందుకు ఎఫ్డీ లాడరింగ్ ఒక టెక్నిక్’’అని ముంబైకి చెందిన సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అభిజిత్ తాలూక్దార్ సూచించారు. ‘‘లాడరింగ్ను క్రమం తప్పకుండా అనుసరించినట్టయితే వడ్డీ రేట్ల మారి్పడికి భిన్నంగా లేకుండా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో, కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉండొచ్చు. ఎఫ్డీలను తిరిగి రెన్యువల్ చేసుకునే సమయంలో అప్పటి వరకు ఉన్న రేటు కంటే మెరుగైన రేటు రావొచ్చు. లేదంటే తక్కువ రేటు ఉండొచ్చు. కాకపోతే మొత్తం మీద నా పెట్టుబడులపై రేటు సగటుగా ఉంటుంది. ఎఫ్డీ లాడరింగ్తో మెరుగైన రేటుపైనే ఇన్వెస్ట్ చేయాలన్న సందిగ్ధత, అయోమయం తొలగిపోతుంది’’అని ‘ఇంటర్నేషనల్ మనీ మ్యాటర్స్’ సంస్థ ఎండీ, సీఈవో లోవై నవలకి వివరించారు. రాబడి సగటుగా మారి.. ఉదాహరణకు మీ వద్ద రూ.9 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఈ మొత్తాన్ని ఒకే ఎఫ్డీగా కాకుండా.. రూ.3 లక్షల చొప్పున మూడు భాగాలు చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని వేర్వేరు కాల వ్యవధికి ఎఫ్డీగా మార్చుకోవాలి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లకు ఒకటి చొప్పున ఎఫ్డీగా మార్చుకోవాలి. మొదటి రూ.3 లక్షలు ఏడాదికి మెచ్యూరిటీ తీరి చేతికి వస్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి మళ్లీ ఎఫ్డీ చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ వెళ్లే తరుణంలో అధిక రేటుపై ఎఫ్డీ చేసుకున్నట్టు అవుతుంది. అదే వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో అప్పటి వరకు చేసిన రేటు కంటే కొంచెం తక్కువకు ఎఫ్డీ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మిగిలి ఉన్న రెండు, మూడేళ్ల ఎఫ్డీలపై అధిక రేటు పొందినట్టు అవుతుంది. ఎఫ్డీ లాడార్ విధానం వల్ల ఇన్వెస్టర్ తన పెట్టుబడిపై పొందే రేటు సగటుగా మారుతుందని, మెరుగైన రాబడికి వీలు కలుగుతుందని అభిజిత్ తాలూక్దార్ వివరించారు. ∙ ఉదాహరణకు రూ.9 లక్షలను రూ.3 లక్షల చొప్పున ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలానికి ఎఫ్డీ చేశారని అనుకుందాం. 2018 జనవరి నుంచి 2020 డిసెంబర్ మధ్య ఈ ఎఫ్డీలు మెచ్యూరిటీ తీరేట్టుగా డిపాజిట్ చేశారు. అప్పుడు వడ్డీ రేట్లు క్షీణ బాటలో ఉన్నాయి. కనుక 6.5 శాతం, 6 శాతం, 4.7 శాతంపై ఎఫ్డీ చేసినట్టు అయింది. 2020 డిసెంబర్ చివరికి మూడు ఎఫ్డీలపై కలిపి రూ.1,63,500 రాబడిగా వచ్చి ఉండేది. అలా కాకుండా మొత్తం రూ.9 లక్షలను 2018 జనవరిలో మూడేళ్ల కాలానికి (2020 డిసెంబర్లో గడువు తీరే విధంగా) ఎఫ్డీ చేసి ఉంటే, అప్పుడు రూ.1,75,500 రాబడిగా వచ్చి ఉండేది. మూడు భాగాలుగా చేయడం వల్ల (ఎఫ్డీ లాడరింగ్) ఈ ఉదాహరణలో (వడ్డీ రేట్లు పడిపోయే క్రమంలో) రూ.12,000 తక్కువ రాబడి పొందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో ఉదాహరణలో.. 2021 జనవరి నుంచి 2023 జూలై వరకు ఇంతే మొత్తాన్ని మూడు భాగాలుగా ఎఫ్డీ చేసుకుని ఉంటే (4.25 శాతం, 5.50 శాతం, 6.75 శాతం) మొత్తం మీద వడ్డీ రాబడి రెండున్నరేళ్లలో రూ.1,35,000 వచ్చి ఉండేది. అలా కాకుండా రూ.9 లక్షలను 2021 జనవరిలో ఒకే ఎఫ్డీగా చేసి ఉంటే, దీనిపై రాబడి రూ.1,14,750గా ఉండేది. ఎఫ్డీ లాడర్ కారణంగా రూ.20,300 అధిక రాబడి వచ్చినట్టు తెలుస్తోంది. ‘‘క్షీణించే, పెరుగుతూ పోయే వడ్డీ రేట్ల సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని 2018–2023 కాలంలో ఎఫ్డీ లాడరింగ్ చేసి ఉంటే, ఈ మొత్తంపై రూ.8,250 అధిక రాబడికి అవకాశం లభించేది’’అని ముంబైకి చెందిన ఫిన్‌టెక్ సంస్థ ‘స్ట్రాటజీ’ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ ప్రశాంత బర్వాలియా వెల్లడించారు. ఏమిటి మార్గం..? నిజానికి వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో కంటే.. పెరుగుతున్న తరుణంలో, మిశ్రమంగా చలించే తరుణంలో ఎఫ్డీ లాడర్ ప్రయోజకరంగా ఉంటుంది. ఒక్క వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలోనే ఎఫ్డీ లాడర్ వల్ల కొంత నష్టపోవాల్సి వస్తుంది. కానీ, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు పెరుగుతాయా? లేదంటే తగ్గుతాయా? వడ్డీ రేటు గరిష్ట స్థాయికి చేరినట్టు ధ్రువీకరించుకోగలరా..? సాధారణ ఇన్వెస్టర్లకు ఇది క్లిష్టమైన టాస్క్ అవుతుంది. వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి కచి్చతంగా పెరుగుతాయని అనిపించినప్పుడే ఎఫ్డీ లాడర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఊహలు, అంచనాలపై ఆధారపడకుండా అన్ని కాలాల్లోనూ ఎఫ్డీ లాడార్ చేసుకోవడం అనుకూలమైన విధానం. ఎఫ్డీ లాడర్‌తో వడ్డీరేట్ల అస్థిరతలను అధిగమించడంతోపాటు, మరో ప్రయోజనం కూడా ఉంది. లిక్విడిటీ సమస్య ఉండబోదు. ఏడాదికోసారి లిక్విడిటీ చేతికి అందుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి క్రమం తప్పకుండా ఆదాయం అవసరం పడుతుంది. అటువంటి వారు మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, పన్నెండు నెలల కాలానికి ఒక్కో భాగం చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ‘‘ఎఫ్డీ లాడరింగ్ అనేది వడ్డీ రేటు, పెట్టుబడుల రిస్‌్కను తగ్గిస్తుంది. దీనికితోడు వివిధ కాలాల్లో స్థిరమైన నగదు ప్రవాహాలకు అవకాశం కలి్పస్తుంది. కాకపోతే ఏడాదిలోపు కాల వ్యవధులకు చేసే మినీ లాడర్‌పై తక్కువ రాబడి వస్తుంది’’అని రాకెట్ఫోర్ట్ ఫిన్‌క్యాప్ వ్యవస్థాపకుడు వెంకట కృష్ణన్ శ్రీనివాసన్ సూచించారు. ఇక డిపాజిట్ చేసే ముందు అందుబాటులోని వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను పరిశీలించాలి. మెరుగైన రేటును ఆఫర్ చేసే బ్యాంక్‌లో ఎఫ్డీ చేసుకోవడం ద్వారా రాబడిని పెంచుకోవచ్చు. సాధారణంగా బ్యాంకుల్లో ఎఫ్‌డీల కాలవ్యవధి ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం అయితే 7.5 శాతం వరకు వడ్డీ రేటు ఎఫ్డీలపై లభిస్తోంది. 60 ఏళ్లు నిండిన వారికి అర శాతం అదనపు రేటు లభిస్తుంది. ఎఫ్డీ లాడార్లో వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో రాబడి తగ్గుతుంది. అయినా కానీ, ఈ విధానంపై నమ్మకం ఉన్న వారే దీన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్య విషయం ఏమిటంటే.. ఏదైనా ఒక బ్యాంకులో అన్ని డిపాజిట్లు కలిపి రూ.5 లక్షలు మించకుండా, వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఏదైనా బ్యాంకు సంక్షోభంలో పడినా, రూ.5 లక్షల వరకు బీమా రూపంలో వెనక్కి వస్తుంది. -
ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...
ఫిక్స్డ్ డిపాజిట్లు (Fixed Deposits) చేసే వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఎప్పటికప్పుడు స్పెషల్ స్కీమ్స్ తీసుకొస్తుంటుంది. ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో వీటిలో డిపాజిట్ చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆకర్షణీయ వడ్డీ అందించే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఎస్బీఐలో రెండు ఉన్నాయి. అవి ఒకటి ‘అమృత్ కలశ్’ (SBI Amrit Kalash) కాగా మరొకటి ‘వుయ్‌కేర్’. అయితే వీటిలో ఎస్బీఐ వుయ్‌కేర్ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో నెలతో ముగుస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం అధిక వడ్డీని అందించే ‘ఎస్బీఐ వుయ్‌కేర్’ (SBI Wecare) అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని 2022లో ప్రవేశపెట్టింది ఎస్బీఐ. రెన్యూవల్ అయ్యే మెచ్యూరింగ్ డిపాజిట్లతోపాటు కొత్త డిపాజిట్లకూ ఈ పథకం ప్రస్తుతం అందుబాటులో ఉంది. పథకం ముఖ్యాంశాలు డిపాజిట్ వ్యవధి: కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాలు. అర్హత: 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు మాత్రమే అర్హులు. వడ్డీ రేటు: 7.50 శాతం. ఇదీ చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: వడ్డీ రేట్లు మారాయ్.. -
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: వడ్డీ రేట్లు మారాయ్..
ప్రముఖ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్లకుపైగా రూ.5 కోట్ల లోపు చేసే బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 2023 సెప్టెంబర్ 2 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి తెచ్చింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల (Fixed Deposits) పై సీనియర్ సిటిజన్లతోపాటు సాధారణ వ్యక్తులకూ ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు కాల వ్యవధిలో ఉండే బల్క్ ఎఫ్డీలపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. ఈ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లు, సాధారణ వ్యక్తులకూ ఒకే రకంగా ఉంటుంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల మెచ్యూరిటీలపై 7 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇక 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు కాల వ్యవధిలో ఉండే డిపాజిట్లపై 6.75 శాతం లభిస్తుంది. 2 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపైనా ఇదే వడ్డీ రేటు ఉంటుంది. 185 రోజుల నుంచి 270 రోజుల వరకు టెన్యూర్ డిపాజిట్లపై 6.65 శాతం, 91 రోజుల నుంచి 184 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు అమలవుతుంది. 61 రోజుల నుంచి 90 రోజుల టెన్యూర్‌కు 6 శాతం, 46 రోజుల నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 5.75 శాతం, 30 రోజుల నుంచి 45 రోజుల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఇక కనిష్టంగా 7 రోజుల నుంచి 29 రోజుల వ్యవధిలో చేసే డిపాజిట్లపై 4.75 శాతం లభించనుంది. సవరించిన వడ్డీ రేట్లు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లతోపాటు రెన్యూవల్ చేసే ఇప్పటికే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకూ వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది. -
గుడ్‌న్యూస్: అత్యధిక వడ్డీ స్కీమ్ గడువు పొడిగింపు
Amrit Kalash Deposit Scheme Deadline Extended: కష్టపడి పోగుచేసుకున్న సొమ్మును భద్రపరచుకునేందుకు ఉత్తమమైన మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అయితే వడ్డీ రేట్లు పొదుపుచేసే కాలానికి (టెన్యూర్) అనుగుణంగా ఉంటాయి. అలాగే సాధారణ ప్రజలు, మహిళలు, సీనియర్ సిటిజెన్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వడ్డీ రేటుతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అత్యధిక వడ్డీని ఇచ్చే ‘అమృత్ కలశ్’ (Amrit Kalash) స్కీమును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొన్ని నెలల క్రితం ప్రకటించింది. ప్రత్యేక పథకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీని మరోసారి పొడిగించింది. సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లకు అందించే అన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లోనూ అత్యధిక వడ్డీని అందించే పథకం ఇదే. ఎస్బీఐ అమృత్ కలశ్ అనేది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ స్కీమ్. ఈ పథకం 2023 ఏప్రిల్ 12 నుంచి అమలవుతోంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తుంది. గత ఫిబ్రవరి 15న అధికారింగా లాంచ్ అయిన ఈ స్పెషల్ స్కీమ్ గడువును ఎస్బీఐ పలుసార్లు పెంచుతూ వచ్చింది. ఆగస్ట్ 15వ తేదీతోనే గడువు ముగిసినప్పటికీ తాజాగా మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: శ్రావణమాస వేళ శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి -
అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం.. తక్కువ కాలపరిమితి.. ఎక్కువ వడ్డీ!
తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నవారి కోసం ఐడీబీఐ బ్యాంక్ అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. 375 రోజుల కాలపరిమితితో కొత్త ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జూలై 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ ఎఫ్డీ పథకంపై సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును ఐడీబీఐ అందిస్తోంది. ‘అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ’ ప్రోగ్రాంలో భాగంగా ఈ కొత్త పథకాన్ని ఐడీబీఐ ప్రారంభించింది. కాగా ఇదే ప్రోగ్రాం కింద 444 రోజుల కాలపరిమితితో ఓ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఇదివరకే ప్రవేశపెట్టింది. ఈ రెండు ఎఫ్డీ పథకాలు ఆగస్టు 15 వరకు చెల్లుబాటులో ఉంటాయని ఐడీబీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి ➤ ‘ఎస్బీఐ యోనో’ను ఇక ఏ బ్యాంక్ కస్టమర్ అయినా వాడొచ్చు.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ! ప్రస్తుతం ఉన్న 444 రోజుల వ్యవధి ఎఫ్డీ పథకానికి సంబంధించి కాలబుల్ (మెచ్యూరిటీ కంటే ముందే విరమించుకోవడం) ఆప్షన్‌పై గరిష్టంగా 7.65 శాతం, నాన్-కాల్ ఎంపిక కింద గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. -
ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది కాల ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) రేట్లను పెంచింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు ఏడాది కాల డిపాజిట్‌పై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇది ఇంతకుముందు 6 శాతం ఉండేది. అంటే 100 బేసిస్ పాయింట్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. అదే 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏడాది కాల ఎఫ్డీపై 7.50 శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 7.65 శాతం ఇస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. తాజా రేట్ల సవరణ తర్వాత ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలం వరకు డిపాజిట్లపై రేట్లు 3–7 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ డిపాజిట్లకు వర్తిస్తాయి. -
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్!
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం... ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తంపై సాధారణ ప్రజలకు 3.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మూడు నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ సాధారణ ప్రజలకు 7.75 శాతం, అదే సీనియర్ సిటిజన్లకైతే 8.25 శాతం ఉంటుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పెరిగిన వడ్డీరేట్లు మార్చి 18 నుంచి అమలులోకి వస్తాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా.. 7 నుంచి 30 రోజుల వ్యవధి డిపాజిట్లపై 3.5 శాతం, 31 నుంచి 45 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4 శాతం, 46 నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.5 శాతం, 61 నుంచి 90 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.60 శాతం వడ్డీ ఉంటుంది. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! 91 నుంచి 120 రోజుల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 4.75 శాతం, 121 నుంచి 180 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5 శాతం, 181 నుంచి 210 రోజులలో మెచ్యూర్ అయ్యే దేశీయ టర్మ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. అలాగే 211 నుంచి 269 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5.80 శాతం, 270 నుంచి 354 రోజుల వ్యవధి డిపాజిట్లపై 6 శాతం, 355 నుంచి 364 రోజుల వ్యవధితో చేసిన డిపాజిట్లపై 6.25 శాతం అందిస్తుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఐఫోన్! -
బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్ రేట్ల పెంపు
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ కాల వ్యవధి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లపై పావు శాతం మేర వడ్డీ రేట్లను పెంచినట్టు ప్రకటించింది. ఈ రేట్లు మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు 0.25–0.35 శాతం వరకు అధిక రేటును ఆఫర్ చేస్తోంది. మూడు నుంచి ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది. 5––10 ఏళ్ల డిపాజిట్పైనా ఇదే రేటు ఆఫర్ చేస్తోంది. బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 3–5 ఏళ్ల కాలానికి, 5–10 ఏళ్ల కాలానికి 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగాయి. -
ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి ఊరటనిచ్చింది. రూ.2 కోట్లలోపు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 5 నుంచి 25 బీపీఎస్ వరకు పెంచింది. అలాగే 400 రోజుల నిర్దిష్ట కాలవ్యవధితో కొత్త ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది 2023 మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్డీలపై 3 నుంచి 7 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. 2-3 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ చేసిన సీనియర్ సిటిజన్లుకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ అందించే అత్యధిక వడ్డీ రేటు ఇదే. పెంచిన ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధికి చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేటును అత్యధికంగా 25 బీపీఎస్ పెంచింది. వీటిపై గతంలో 6.75 శాతం వడ్డీ వస్తుండగా ఇప్పుడు 7 శాతానికి పెరిగింది. అలాగే 3 నుంచి 10 ఏళ్ల వ్యవధి ఎఫ్‌డీలపైనా 25 బేసిస్ పాయింట్లు పెంచింది. వీటికి గతంలో 6.25 శాతం వడ్డీ ఇస్తుండగా తాజాగా 6.5 శాతం అందిస్తోంది. ఇక 1 నుంచి 2 సంవత్సరాల కాలానికి చేసే ఎఫ్డీలపై అత్యల్పంగా కేవలం 5 బేసిస్ పాయింట్లు మాత్రమే వడ్డీ రేటు పెంచింది. వీటిపై 6.75 శాతం ఉన్న వడ్డీ రేటు ప్రస్తుతం 6.8 శాతానికి పెరిగింది. అయితే సంవత్సరం కన్నా తక్కువ కాల వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎటువంటి పెంపూ లేదు. 211 రోజుల నుంచి సంవత్సరం లోపు చేసే ఎఫ్డీలపై 5.75 శాతం, 180 నుంచి 210 రోజుల లోపు వాటిపై 5.25 శాతం, 46 నుంచి 179 రోజుల వరకు చేసే ఎఫ్డీలపై 4.5 శాతం, 7 నుంచి 45 రోజులలోపు వాటిపై 3 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ అలాగే కొనసాగిస్తోంది. (ఇదీ చదవండి: సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త పాలసీ.. ప్రయోజనాలు ఇవే..) -
'నా కూతురికి డబ్బు విలువ తెలియదు'
టీమిండియా మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న మహిళల టి20 వరల్డ్‌కప్‌లో బిజీగా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పూజా వస్త్రాకర్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక వికెట్ కూడా పడగొట్టింది. ఇవాళ గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇటీవలే తొలిసారి జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలంలోనూ పూజాకు మంచి ధర పలికింది. ముంబై ఇండియన్స్ జట్టు రూ.కోటి 90 లక్షలకు పూజాను కొనుగోలు చేసింది. కాగా పూజా వస్త్రాకర్ టి20 వరల్డ్‌కప్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లడానికి ముందు తండ్రి బంధన్ రామ్‌కు రూ. 15 లక్షల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. కూతురు గిఫ్ట్‌ను చూసి సంతోషపడాల్సిన తండ్రి ఆశ్చర్యంగా నిరాశకు గురయ్యాడు. ''నా కూతురు అనవసరంగా డబ్బులు వృథా చేస్తుందంటూ'' బంధన్ రామ్ పేర్కొనడం ఆసక్తిని కలిగించింది. పూజా వస్త్రాకర్ తండ్రి బంధన్ రామ్ రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బంధన్ రామ్ చాలా విషయాలను పంచుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. ''పూజా వస్త్రాకర్ తన నాలుగేళ్ల వయస్సులోనే క్రికెట్‌ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నా కూతురు టీమిండియాకు ఆడుతుందని నేను ఊహించలేదు. కానీ పట్టుదలతో తను అనుకున్నది సాధించి ఇవాళ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయం. పూజా చిన్నప్పుడు క్రికెట్ ఆడడానికి డబ్బులు అడిగిన ప్రతీసారి తనను సరదాగా ఎగతాళి చేసేవాడిని. చదువుకోకుండా అనవసరంగా క్రికెట్‌పై డబ్బులు ఖర్చు చేయిస్తున్నావు అంటూ కోప్పడేవాడిని. అయితే నా మాటలను సంతోషంగా స్వీకరించే పూజా ఎప్పుడు ఒక మాట అంటుండేది..'' చూడు నాన్న.. ఏదో ఒకరోజు కచ్చితంగా దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తాను''. అయితే పూజా దగ్గర ఒక బలహీనత ఉంది.. అదే డబ్బులు వృథా చేయడం. ఈ మధ్యనే వద్దని చెప్పినా కూడా రూ. 15 లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చింది. బిడ్డ ప్రయోజకురాలు అయ్యిందంటే నాకు సంతోషమే. కానీ ఇలా అనవసరపు ఖర్చు నాకు నచ్చదు. అందుకే డబ్ల్యూపీఎల్ వేలం ద్వారా వచ్చిన రూ.1.90 కోట్లను దాచుకోవడానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను. ఇలా అయినా నా కూతురు అనవసర ఖర్చు తగ్గించుకుంటుంది'' అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తరపున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పూజా వస్త్రాకర్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. జట్టు తరపున 2 టెస్టుల్లో ఐదు వికెట్లు తీసింది. ఇక 26 వన్డేల్లో 816 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు, 44 టి20ల్లో 257 పరుగులతో పాటు 29 వికెట్లు పడగొట్టింది. చదవండి: Shoaib Akhtar: అందం ఒక్కటే సరిపోదు.. తెలివి కూడా ఏడిస్తే బాగుండు! -
పన్ను భారం తగ్గించుకోవాలంటే..
వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది. ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు. ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్ఎస్ఎస్ అన్నది సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్పీఎస్– మూడు ప్రయోజనాలు ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్ వరకు లాకిన్లోనే ఉంటాయి. డెట్ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్‌కు అలోకేషన్‌ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్పీఎస్కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్పీఎస్కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కనుక ఎన్పీఎస్ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ (గిల్ట్ ఫండ్స్) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్‌స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ విభాగం కూడా ఉంది. జీవిత బీమా పథకాలు జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్‌లు మెరుగైనవి. లేదంటే ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు ఎన్ఎస్సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్ చేస్తుంటే, యాక్సిస్ బ్యాంక్ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్ఎస్సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్‌లు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎస్సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్ఎస్సీలో పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. యులిప్‌లు యులిప్‌లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్లోనూ ఎన్‌పీఎస్‌లో మాదిరే ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్‌కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్‌లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మాదిరి ఇందులో ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్‌ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పీపీఎఫ్ ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్‌లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్ ఎఫ్‌డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్‌పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సైతం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్ తక్కువ. తక్కువ రిస్క్ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్ ఫండ్స్ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు. -
కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్
హైదరాబాద్: కెనరా బ్యాంక్ నూతనంగా 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. దీనిపై 7.75 శాతం వరకు వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇందులో నాన్ కాలబుల్ డిపాజిట్ (గడువుకు ముందు ఉపసంహరించుకోలేనివి)పై 7.25 శాతం రేటును ఆఫర్ చేస్తుండగా, కాలబుల్ డిపాజిట్‌పై (గడువుకు ముందు రద్దు, పాక్షిక ఉపసంహరణకు వీలైనవి) 7.15 శాతం వార్షిక వడ్డీ రేటును ఇస్తున్నట్టు కెనరా బ్యాంక్ తెలిపింది. 60 ఏళ్లు నిండిన వారికి 0.50 శాతం అదనపు రేటును ఇస్తోంది. -
కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అన్ని కాలపరిమితులపై డిపాజిట్ రేటును అరశాతం పెంచింది. రూ.2 కోట్లలోపు ఏడాది, మూడేళ్ల మధ్య వడ్డీరేట్లు అరశాతం పెరిగి వరుసగా 6.75 శాతానికి పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం వడ్డీ అందుతుంది. ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయెల్ అవకాశం లేని పీఎన్బీ ఉత్తమ్ స్కీమ్ కింద డిపాజిట్ రేటు 6.8 శాతానికి ఎగసింది. 666 రోజుల స్థిర డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 8.1 శాతంగా కొనసాగుతుంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
వారెవ్వా.. ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు!
ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) మరోసారి వడ్డీ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఇది రెండో సారి. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 7 నుంచి అమలులోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలకు ఈ పెంపు వర్తిస్తుంది. 15 నెలల ఒక రోజు నుంచి 18 నెలల లోపు కాలవ్యవధి ఎఫ్డీలు 6.40% వడ్డీని పొందుతారు. 18 నెలల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై 6.50% వడ్డీని పొందనున్నారు. సీనియర్ సిటిజన్స్ హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు ఎఫ్‌డీల వడ్డీ రేటు పెంచిన సంగతి తెలిసింతే. అయితే 60 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం పెంచిన వడ్డీ రేటుపై మరో 0.50 శాతం అదనపు రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో ఈ బ్యాంక్ ఖాతాదారులకు ఒకే సారి రెండు శుభవార్తలను అందించింది. బ్యాంక్‌లో వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం కాగా గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. వీటితో పాటు రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచేసింది. 15 నెలల ఒక రోజు నుండి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి ఇప్పుడు 6.90% వడ్డీని అందిస్తోంది. చదవండి: ఆ ఐఫోన్‌ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’! -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 61 రోజుల నుంచి 89 నెలల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. గతంలో ఇంట్రస్ట్ రేట్లు 4శాతం ఉండగా ఇప్పుడు (50బేసిస్) 4.50 శాతానికి పెంచింది. ► 90 రోజుల నుంచి 6 నెలల కాలానికి.. గతంలో 4.25 శాతం ఉండగా ఇప్పుడు 4.50 శాతానికి పెంచింది. ►1 రోజుల నుంచి 9 నెలల కంటే తక్కువ 6 నెలల తగ్గకుండా చేసిన ఎఫ్డీలపై నిన్న వరకు 5 శాతం వడ్డీని చెల్లించేది. ఇప్పుడు ఆ వడ్డీని 5.25 శాతానికి పెంచింది. ►1 రోజు నుంచి ఏడాదికి కాలానికి 9 నెలలు ఎఫ్డీని కొనసాగిస్తే.. వాటిపై 5.50శాతం వడ్డీని పొందవచ్చు. గమనిక : పెరిగిన పిక్స్డ్ రేట్లు ►ఒక సంవత్సరం నుండి 15 నెలల ఎఫ్డీ టెన్యూర్ కాలానికి 6.10 శాతం, 15 నెలల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్డీలపై 6.15 శాతం ఇంట్రస్ట్ పొందవచ్చు. ►ఒక రోజు నుండి ఐదేళ్ల లోపు అంటే (రెండేళ్ళ టెన్యూర్ కాలానికి) చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం, ఐదు నుంచి పదేళ్ల టెన్యూర్ కాలానికి 6.20 శాతం వడ్డీని పొందవచ్చు. ►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీని పొందుతారు. గమనిక : పెరిగిన రికరింగ్ డిపాజిట్ రేట్లు ►హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 నెలల నుంచి 120 నెలల కాలానికి చేసే సాధారణ రికరింగ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. చదవండి👉 భారత్‌లో అదరగొట్టిన ధంతేరాస్ సేల్స్, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం! -
హమ్మయ్య!.. కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ
ఫిక్స్డ్ డిపాజిటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్డీలపై 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఎస్బీఐ (SBI) వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు అక్టోబర్ 15, 2022 నుంచి అమలులోకి వస్తాయి. వీటితో పాటు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అన్ని కాలాలకు సంబంధించిన వడ్డీ రేట్లను కూడా పెంచింది. దీంతో ఇకపై కస్టమర్లు 3శాతం నుంచి 5.85 శాతం మధ్య వడ్డీ రేట్లను పొందవచ్చు. అంతేకాకుండా, సీనియర్ సిటిజన్లు సాధారణ వడ్డీ రేటుపై అదనపు వడ్డీని పొందుతారు. బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్-రేట్ డిపాజిట్లపై (FDలు) వడ్డీ రేట్ల ఇలా ఉన్నాయి. సామాన్య ప్రజలకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5శాతం ఉంది. 46 నుంచి 179 రోజుల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న FDలు ఇకపై.. 4 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం ఇవ్వనుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 5.60% నుంచి 5.80%, సీనియర్ సిటిజన్లకు 6.10% నుంచి 6.30%కి పెంచింది. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న రుణాల వడ్డీ రేటును 5.65 శాతం నుంచి 5.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం నుంచి 6.65 శాతానికి బ్యాంక్ పెంచింది. చదవండి: ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్! -
ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన పీఎన్బీ
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని కాలాల ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే 10-20 బేసిస్ పాయింట్ల వడ్డీరేటును పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 17, 2022 నుండి అమలులోకి వస్తాయని బ్యాంక్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. పెరిగిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లు, ఇప్పటికే ఉన్న డిపాజిట్ల పునరుద్ధరణ రెండింటికీ వర్తిస్తాయని పీఎన్బీ స్పష్టం చేసింది. సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రెండేళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50శాతంగా ఉంటుంది. రెండు నెంచి మూడు సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ చెల్లిస్తుంది. పీఎన్బీ ఉత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంక్ అందించే ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ పీఎన్‌బీఉత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడిదారులు రూ. 15 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. ఈ డిపాజిట్ పథకం వ్యవధి 91 రోజుల నుండి 1111 రోజుల వరకు ఉంటుంది . ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు వరుసగా 4.05శాతం 5.55 శాతం దాకా ఉంటుంది. -
కీలక నిర్ణయం..వారికి అదిరిపోయే శుభవార్తను అందించిన ఐసీఐసీఐ బ్యాంక్..!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్తను అందించింది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువును పొడిగిస్తూ ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రత్యేకమైన వడ్డీరేట్లను సీనియర్ సిటిజన్లకు అందించనుంది. సీనియర్ సిటిజన్ల కోసం ఐసీఐసీఐ బ్యాంకు పలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వారి కోసం ప్రత్యేకమైన వడ్డీ రేట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్‌లో భాగంగా సీనియర్ సిటిజన్లకు అందించే 0. 50 శాతం వడ్డీరేటుతో పాటు మరో 0.25 శాతం అదనపు వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ స్కీమ్ జనవరి 20నే ముగియాల్సి ఉండగా దానిని ఏప్రిల్ 8 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ పొడిగించింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఎఫ్డీ స్కీమ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. దీంతో ఈ స్కీమ్ సినీయర్ సిటిజన్లకు మరో 5 నెలల పాటు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు కొత్తగా ఓపెన్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తించనుంది. దాంతో పాటుగా పాత ఫిక్స్డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకున్నవారికి కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక పథకం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 6.35 శాత వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సాధారణ ఖాతాదారులకు అందించే 5.60 శాతం కంటే ఎక్కువ. చదవండి: గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..! వారు రూ. 5 వేలకు మించి విత్ డ్రా చేయలేరు..! -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్..!
గత నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను హెచ్డీఎఫ్సీ బ్యాంకు పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు ఎంపిక చేయబడిన పీరియడ్‌పై మాత్రమే వర్తిస్తాయి. ఏప్రిల్ 6, 2022 నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లు వర్తించనున్నాయి. ఒక ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లను హెచ్డీఎఫ్సీ పెంచింది. దీంతో వడ్డీరేట్లు 5 శాతం నుంచి 5.10 శాతానికి పెరిగింది. రెండు సంవత్సరాల ఎఫ్డీలపై 5 శాతం నుంచి 5.10 శాతానికి 10 బేసిస్ పాయింట్లను పెంచుతూ హెచ్డీఎఫ్సీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా....రూ. 5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటజన్లకు ఐదేళ్ల కాల వ్యవధిలో 25 బేసిస్ పాయింట్ల ప్రీమియంను బ్యాంక్ చెల్లిస్తూనే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ సాధారణ 50 బేసిస్ పాయింట్ల ప్రీమియంతో అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..! చదవండి: ఒప్పో సంచలన నిర్ణయం..! -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం..! ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు భిన్నంగా
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల మాదిరిగా కాకుండా..ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విత్‌డ్రా చేయలేని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లకు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈలకు వర్తిస్తాయి.కాగా రూ.5 కోట్ల కంటే ఎక్కువ లేదా సమానమైన విత్‌డ్రా చేయలేని ఎఫ్డీలకు మాత్రమే ఈ వడ్డీరేట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త రేట్లు మార్చి 01, 2022 నుంచి అమలులోకి వచ్చాయని హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు రూ. 2 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించాయి. ఇక విత్‌డ్రా చేయలేని ఎఫ్డీలు సాధారణ డిపాజిట్ల కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి ఎటువంటి అకాల ఉపసంహరణ సదుపాయాన్ని కలిగి లేని ఫిక్స్డ్ డిపాజిట్స్. అంటే గడువు ముగిసేలోపు డిపాజిటర్ ఫిక్స్డ్ డిపాజిట్లను మూసివేయలేరు. అసాధారణమైన పరిస్థితులలో ఈ డిపాజిట్లను అకాల ఉపసంహరణను బ్యాంక్ అనుమతిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..! ► 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 5 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక ఎఫ్డీ వడ్డీరేటు 4.7 శాతం. ► 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.6 శాతం వడ్డీ రేటు. ► 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై 4.55శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ► 9 నెలల కంటే ఎక్కువ కాలం నుంచి ఒక ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై 4.15 శాతం వడ్డీరేటు ► 6 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై 4 శాతం వడ్డీరేటు ఇవ్వబడుతుంది. ► 91 రోజుల నుంచి 6 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై అత్పల్ప వడ్డీ రేటు 3.75 శాతం. చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎస్బీఐ బాటలోనే ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు కూడా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు మార్చి 10, 2022 వస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ వడ్డీ రేట్లు 2 కోట్ల కంటే ఎక్కువ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రమే వర్తించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ► 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక ఎఫ్డీ వడ్డీరేటు 4.6 శాతం. ► 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.50 శాతం. ► 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 4.2 శాతం వడ్డీరేటు ► 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధికి వడ్డీ రేటు 4.3 శాతం. ► 1 సంవత్సరం నుంచి 15 నెలల మధ్య కాలానికి చేసిన ఎఫ్డీలపై 4.15 శాతం వడ్డీ రేటు ► 1 సంవత్సరం లోపు, ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 2.5 శాతం నుంచి 3.7 శాతం వరకు ఉంటాయి. పైన పేర్కొన్న రేట్లు సాధారణ , సీనియర్ సిటిజన్లకు సమానంగా ఉంటాయి. అంతేకాకుండా రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఎఫ్డీలపై వడ్డీ రేట్లను కూడా ఐసీఐసీఐ సవరించింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనున్నాయి.ఇక రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లు మారవు. చదవండి: ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ.. ఎంతంటే? -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. పెరిగిన వడ్డీ రేట్లు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఎఫ్డీ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ గల బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఎస్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు మార్చి 10, 2022 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.2 కోట్లకు కంటే ఎక్కువ పెట్టుబడి, 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల ఎఫ్డీ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది. వడ్డీ రేట్లను పెంచడం వల్ల మార్చి 10 నుంచి ఎఫ్డీలపై 3.30 శాతం వడ్డీ లభించనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.60 శాతం నుంచి 3.80 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఎస్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరనుంది. అలాగే, ఈ ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని ఎస్బీఐ తెలిపింది. సమీక్షించిన ఈ వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు, రెన్యూవల్ అయ్యే డిపాజిట్లకు వర్తిస్తున్నాయి. (చదవండి: పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ) -
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త..!
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కోటక్ నిర్ణయం తీసుకుంది. ఈ వడ్డీరేట్ల పెంపు డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనుంది. కొత్త వడ్డీ రేట్ల అమలు 2022 మార్చి 9 నుంచి సవరించిన కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. రూ.2 కోట్ల వరకు బ్యాలెన్స్ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. దీంతో 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 5 శాతానికి పెరిగింది. గతంలో ఈ ఎఫ్డీలపై 4.9 శాతం వడ్డీ రేటును కోటాక్ అందించింది. సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. కాగా గత నెలలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. సవరించిన వడ్డీరేట్లు ఇలా..! ► 7 రోజుల నుంచి 30 రోజుల కాలపరిమితి ఎఫ్డీలపై 2.5 శాతం ► 31 నుంచి 90 రోజుల ఎఫ్డీలపై 2.75 శాతం ► 91 నుంచి 120 రోజుల ఎఫ్డీలపై 3 శాతం వడ్డీ ► 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి ఎఫ్డీలపై వడ్డీ రేటు 2.5 శాతం నుంచి 5.8 శాతం వరకు ఉంటుంది. ► 181 రోజుల నుంచి 363 రోజుల ఎఫ్డీలపై 4.4 శాతం ► 364 రోజుల ఎఫ్డీలపై 4.5 శాతం ► 390 రోజుల నుంచి 23 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.1 శాతం ► 3 నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.45 శాతం ► 5 ఏళ్లుపై మించిన ఎఫ్డీలపై 5.5 శాతం చదవండి: క్రెడిట్‌కార్డు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ వార్త..! -
కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
Canara Bank Hikes Fixed Deposit Rates: కెనరా బ్యాంక్ తన ఎఫ్డీ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు(౦.25) శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు మార్చి 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయని కెనరా బ్యాంక్ తెలిపింది. కెనరా బ్యాంక్ 7 నుంచి 45 రోజుల మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వినియోగదారులకు 46 రోజుల నుంచి 90 రోజులు మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.90 శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.95 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇంకా 180 రోజులు లేదా అంతకంటే తక్కువ మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఎఫ్డీలకు 4.40% వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే కస్టమర్లు 2-3 సంవత్సరాల కాల వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే కస్టమర్లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.25 శాతానికి బదులుగా.. 5.45 శాతం వడ్డీ రేటు లభించనుంది. మిగత ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల గురించి బ్యాంక్ పోర్టల్ సందర్శించండి. సీనియర్ సిటిజన్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడులపై అధిక వడ్డీ రేటును స్వీకరిస్తారని బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు చేసే పెట్టుబడులపై బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5% అధిక వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంకు "1111 డేస్" రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకం కింద డిపాజిట్ రేటుకంటే అదనంగా 0.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు 5.55 శాతం. (చదవండి: ఆ విషయంలో ఢిల్లీ, ముంబైలతో పోటీ పడుతున్న హైదరాబాద్!) -
బ్యాంకుల్లో డిపాజిట్లు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని వివరాలను వెంటనే తమకు పంపాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, స్థానిక సంస్థలు, జిల్లా కలెక్టర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల వివరాలు, ఆయా అకౌంట్లలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను వెంటనే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జీవో నంబర్ 18ని జారీ చేశారు. తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ నేపథ్యంలో బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై పలు జాగ్రత్తలను సూచిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న బ్యాంకు అకౌంట్లన్నింటినీ ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకునే తెరిచారా.. లేదా? ప్రస్తుతమున్న అకౌంట్లను సమీక్షించి అవసరం లేని అకౌంట్లను మూసివేసే అంశాలపై వచ్చే నెల 10వ తేదీ కల్లా నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆయా బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల పరిస్థితిని పరిశీలించాలని, డిపాజిట్ చేసిన మేరకు నగదు ఉందో లేదో తనిఖీ చేయడంతో పాటు ఆయా బ్యాంకుల నుంచి తాజాగా సర్టిఫికెట్లు తీసుకుని తమకు పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. ఒకే బ్యాంకులోకి డిపాజిట్లు.. అదే విధంగా ఒక శాఖ లేదా సంస్థకు పలు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంటే వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్యానెల్మెంట్ చేసిన ఏదైనా ఒకే బ్యాంకులోకి మార్చాలని, ఈ క్రమంలో వడ్డీ తగ్గకుండా చూసుకోవాలని కోరింది. ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్‌ను క్లోజ్ చేసే అవకాశం లేకపోతే ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలని పేర్కొంది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వివరాలన్నింటినీ ప్రతి నెలా 10వ తేదీ కల్లా అప్డేట్ చేయాలని వెల్లడించింది. ఇక నుంచి ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కొత్తగా బ్యాంకు అకౌంట్లు తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను డిపాజిట్ల రూపంలోకి ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని, డిపాజిట్ల ఉపసంహరణ కాలపరిమితి ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫిక్స్డ్ డిపాజిట్ లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లో నగదు రూపంలో లావాదేవీలు జరగకూడదని, కచ్చితంగా ప్రభుత్వ అధికారిక ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను లింక్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులపై వచ్చిన వడ్డీని ఆ పథకం కిందనే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది. వడ్డీ కింద వచ్చిన మొత్తాన్ని ఖర్చు చేసే విషయంలో వార్షిక ఆడిట్ నివేదికలో స్పష్టంగా నమోదు చేయాలని ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త...!
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ దారిలోనే హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీరేట్ల పెంపు వుంటుందని బ్యాంకు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఫిబ్రవరి 14 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది. కాగా ఈ వడ్డీరేట్ల పెంపు కేవలం రూ.2 కోట్లలోపున్న ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తించనునాయి. ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.45 శాతానికి చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం 6 నెలలకు గాను 1 రోజుల నుంచి 9 నెలల టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం 9 నెలల గాను 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ఒక ఏడాది పాటు: జనరల్ పబ్లిక్ కోసం - 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.50 శాతం 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.35 శాతం -
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాదిరిగానే ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. తాజా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు జనవరి 20 నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకులతో పాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా & కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు కూడా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. మరిన్ని బ్యాంకులు ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్దం అవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన అధికారిక పోర్టల్‌లో వడ్డీ రేట్లకు సంబంధించన కొత్త జాబితాను ప్రకటించింది. సాదారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ కి బ్యాంకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన టర్మ్ డిపాజిట్లపై ఎక్కువగా 0.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఎన్ఆర్ఐ సీనియర్ సిటిజన్స్ కి అదనంగా వడ్డీ రేటు లభించదు. కొత్త ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. 3 నెలల్లో ఏకంగారూ.2.4 కోట్లు లాభం!) -
ఎస్బీఐ ఖాతాదారులకు సంక్రాంతి శుభవార్త..!
కొత్త ఏడాదిలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్(ఎఫ్డి)పై అందించే వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10% వరకు పెంచినట్లు ప్రకటించింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. 1 సంవత్సరం కాలపరిమితి నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి గల ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.0% నుంచి 5.1%కి పెంచింది. అలాగే, అదే కాలానికి సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేటును 5.50% నుంచి 5.60%కి పెంచినట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి. డిసెంబర్ 2021లో ఎస్బీఐ తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బిపిఎస్ పెంచినట్లు వెబ్సైట్లో తెలిపింది. కొత్త బేస్ రేటు (సంవత్సరానికి 7.55%) డిసెంబర్ 15, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక తక్కువ వడ్డీ రేట్లకు సమయం ముగిసింది అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తోంది. రుణగ్రహీతలకు లోన్స్ ఇచ్చేందుకు బేస్ రేటును కీలకంగా తీసుకుంటారు. బేస్ రేట్ పెరగడంతో అన్నీ రకాల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు పడిపోయాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడం అనేది బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన వారికి ఒక మంచి శుభవార్త. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇటీవల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సర కాలానికి వడ్డీ రేటు 5.6 శాతంగా ఉండనుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా.. రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి బ్యాంక్ తెలిపింది. ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారికి సీఈఓ భవిష్ అగర్వాల్ శుభవార్త..!) -
ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన ఎస్బీఐ!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి శుభవార్త.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్లు(బిపిఎస్) పెంచినట్లు తన వెబ్సైట్లో తెలిపింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో జమ చేసే బల్క్ టర్మ్ డిపాజిట్లపై మాత్రమే ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఉండే రీటేల్ టర్మ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తించదని బ్యాంక్ స్పష్టంచేసింది. కొత్తగా పెంచిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వస్తాయని తాజా ప్రకటనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఫిక్స్డ్ డిపాజిట్ల కొత్త వడ్డీ రేట్లు: డిసెంబర్ 8న సెంట్రల్ బ్యాంక్ తన ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశాన్ని నిర్వహించిన వారం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు ప్రస్తుతం వరుసగా 4 శాతం, 3.35 శాతంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును ప్రస్తుతానికి మార్చకుండా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు, ఇది గత 20 సంవత్సరాలలో కనిష్టం. -
ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే
ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే అధిక భద్రతనిస్తూనే, పూర్తి హామీతో కూడిన రాబడులను ఇచ్చే సాధనాలు ఏవైనా ఉన్నాయా? – కవాన్జైన్ మీరు సీనియర్ సిటిజన్ అయితే (60 ఏళ్లు నిండినవారు) సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) పథకాలను పరిశీలించొచ్చు. ఇవన్నీ భద్రతతో కూడిన పెట్టుబడి సాధనాలు. వీటికి ప్రభుత్వ హామీ ఉంటుంది. వీటి తర్వాత షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇవి తక్కువ నాణ్యత (రేటెడ్) సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. ఒకవేళ మీరు చిన్న వయసులో ఉండి, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే.. కొంత మొత్తాన్ని ఈక్విటీకి కూడా కేటాయించుకోవాలి. రిస్క్ ఏ మాత్రం తీసుకోకపోతే చెప్పుకోతగ్గ రాబడులను పొందలేరు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుందని అనుకుంటారు కానీ.. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే వాస్తవ విలువ తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణ రేటు కంటే తక్కువగా మీ పెట్టుబడులు వద్ధి చెందుతుంటే కనుక.. చూడ్డానికి పెరిగినట్టు అనిపించినా వాటి విలువ తగ్గిపోయినట్టే. కనుక దీర్ఘకాలానికి పెట్టుబడుల్లో కొంత మేర రిస్క్ తీసుకోవచ్చు. నా వయసు 50 ఏళ్లు. స్మాల్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో స్మాల్‌క్యాప్‌నకు, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల మధ్య కేటాయింపులు ఎలా ఉండాలి? – ఎస్కే శర్మ మీ వయసు ప్రకారం చూస్తే.. స్మాల్‌క్యాప్ విభాగంలో (మార్కెట్ విలువ పరంగా చిన్న కంపెనీలు) ఇన్వెస్ట్ చేయడం మంచిదే. గణనీయంగా విలువ పడిపోయినా ఫర్వాలేదనుకుంటే మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అద్భుత రాబడులను ఇచ్చినా.. స్వల్పకాలంలో ఇవి ఎంతో నిరుత్సాహపరుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వీటిల్లో పతనం చాలా స్వల్పకాలంలోనే గణనీయంగా ఉంటుంది. అయితే ప్రతీ ఇన్వెస్టర్ కూడా కనీసం 20–25 శాతం వరకు అయినా స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకు ఎటువంటి సూత్రం అవసరం లేదు. ఇలా చేయడం వల్ల స్మాల్‌క్యాప్స్ నుంచి సంపాదించుకున్న మొత్తానికి కొంత రక్షణ కల్పించుకోవచ్చు. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు గణనీయంగా పెరగొచ్చు లేదా పడిపోవచ్చు. దానికి తగినట్టు పెట్టుబడుల కేటాయింపులను మార్చుకోవాలి. ఉదాహరణకు స్మాల్‌క్యాప్‌లో 75 శాతం, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు 25 శాతంగా అస్సెట్అలోకేషన్ను నిర్ణయించుకున్నారనుకుంటే.. స్మాల్‌క్యాప్ పెట్టుబడుల విలువ మొత్తం పెట్టుబడుల్లో 90 శాతానికి చేరితే.. అప్పుడు తిరిగి 75 శాతానికి తగ్గించుకోవాలి. అంటే ఆ మేరకు స్మాల్‌క్యాప్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 75 శాతం కంటే తగ్గిపోయి, డెట్ సాధనాల విలువ పెరిగిన సందర్భాల్లో.. డెట్ పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుని, మిగిలిన మేర స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు పెంచుకోవాలి. డెట్ సాధనాలకు కనీసం 20–25 శాతం అయినా కేటాయించుకుంటేనే అర్థవంతంగా ఉంటుంది. ఇంతకంటే తక్కువ కేటాయింపులు చేసుకుని.. పోర్ట్‌ఫోలియోలను మార్చుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం నెరవేరదు. చదవండి: డీమ్యాట్ అకౌంట్ల స్పీడ్, స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న పెట్టుబడులు -
అదిరిపోయే ఎస్బీఐ ఆఫర్ వారం రోజులు మాత్రమే
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారుల కోసం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్’ కింద కస్టమర్లు 75 రోజులు, 75 వారాలు, 75 నెలల వరకు డిపాజిట్ చేసే మొత్తంపై 15 బేసిస్ పాయింట్లు వరకు అదనంగా వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ ఆఫర్ 2021 సెప్టెంబరు 14 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య సాధారణ ఖాతాదారులు పొదుపు చేసే ఎఫ్డీలపై 3.9% నుంచి 5.4% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్లు జమ చేసే డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) అదనంగా లభిస్తాయి. ఈ వడ్డీ రేట్లు 8 జనవరి 2021 నుండి అమల్లోకి రానున్నాయి. (చదవండి: Tesla: భారత్‌లో ఆన్లైన్ ద్వారా కార్ల అమ్మకం!) అర్హత: ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్లతో సహా దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు(₹2 కోట్ల కంటే తక్కువ) కొత్త, రెన్యువల్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్, స్పెషల్ టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్‌లు మాత్రమే. ఎన్ఆర్ఈ డిపాజిట్లు(525 రోజులు, 2250 రోజులు మాత్రమే) సాధారణ ప్రజలకు ఎస్బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు Tenor Existing Interest Rate Proposed Interest Rate 75 రోజులు 3.90% 3.95% 525 రోజులు 5.00% 5.10% 2250 రోజులు 5.40% 5.55% సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు Tenor: Existing Interest Rate Proposed Interest Rate 75 రోజులు 4.40% 4.45% 525 రోజులు 5.50% 5.60% 2250 రోజులు 6.20% 6.20% -
ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే డెట్ ఫండ్స్ మెరుగైనవా?
ఇండెక్స్ ఫండ్స్‌లో రాబడులు ఎంత? బ్యాంకు ఎఫ్‌డీల కంటే మీడియం లాంగ్, మీడియం డ్యురేషన్ ఫండ్స్ మెరుగైనవా? – కీర్తి నందన Fixed Deposits and Debt funds : భద్రత పాళ్లు అధికంగా ఉండే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను (ఎఫ్డీలు) డెట్ ఫండ్‌తో పోల్చి చూడడం సరికాదు. ఎఫ్డీలపై రాబడులు దాదాపుగా గ్యారంటీడ్ (హామీతో కూడిన)గా ఉంటాయి. బ్యాంకులు సంక్షోభంలో పడితే డిపాజిటర్ల డబ్బులు (గరిష్టంగా రూ.5లక్షల వరకు) 90 రోజుల్లోపు చెల్లించేలా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డెట్ ఫండ్స్‌పై రాబడుల విషయంలో ఎటువంటి హామీ లభించదు. రాబడుల విషయంలో ఏ మ్యూచువల్ ఫండ్‌కూడా హామీ ఇవ్వదు. కాకపోతే పెట్టుబడులను నష్టపోకుండా స్థిరమైన రాబడులకు అయితే అవకాశం ఉంటుంది. కానీ మీడియం లేదా లాంగ్ డ్యురేషన్ (కాల వ్యవధి) ఫండ్స్‌కు ఇది వర్తించదు. కొన్ని ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ పడిపోదు. ఉదాహరణకు ఓవర్‌నైట్ ఫండ్స్‌లో రాబడులు సేవింగ్ ఖాతా కంటే ఎక్కువ ఉండవు. అల్ట్రా షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్ ఫండ్స్ అన్నవి ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరే, కొన్ని సందర్భాల్లో కొంచెం అధిక రాబడులను ఇచ్చే విధంగా పనిచేస్తాయి. స్వల్ప కాలానికి ఎఫ్డీలతో ఈ ఫండ్స్‌ను పోల్చి చూడొద్దు. ఎందుకంటే కొన్ని డెట్ ఫండ్స్ స్వల్పకాలంలో విలువను కోల్పోవచ్చు. 2–4 ఏళ్ల కాలానికి అయితే ఎఫ్‌డీల కంటే అధిక రాబడులు అందుకోవచ్చు. ఇక పన్ను చెల్లింపు రెండో అంశం అవుతుంది. ఎఫ్డీలు, డెట్ ఫండ్స్ రాబడులపై పన్ను వేర్వేరుగా ఉంటుంది. డిపాజిట్లపై వచ్చే ఆదాయానికి ఏటా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అది వెనక్కి తీసుకున్నా లేదా క్యుములేటివ్ అయినా ఇదే వర్తిస్తుంది. డెట్ ఫండ్స్‌లో రాబడులపై పన్ను అన్నది విక్రయించిన తర్వాతే అమల్లోకి వస్తుంది. మూడేళ్లకు పైగా డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను కొనసాగించినట్టయితే.. రాబడుల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాత పన్ను చెల్లిస్తే చాలు. ఈ ప్రయోజనాల వల్ల దీర్ఘకాలంలో ఎఫ్‌డీల కంటే డెట్ ఫండ్స్‌లో కాస్త మెరుగైన రాబడులు అందుకోగలరు. పదిహేనేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా సెన్సెక్స్ లేదా నిఫ్టీ ఫండ్ ఏదైనా ఉందా? 16 నుంచి 17 శాతం వార్షిక రాబడులు రావాలి. అది కూడా రోజువారీగా ఆ పథకాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉండకూడదు? – ఆర్ఎస్ దహియా వచ్చే 15 ఏళ్ల కాలానికి నిఫ్టీ లేదా సెన్సెక్స్ 16–17 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇస్తాయే, లేదో నాకు తెలియదు. ఒకవేళ వడ్డీ రేట్లు 5–7 శాతం స్థాయికి పరిమితమైతే అప్పుడు వార్షిక రాబడులు 12 శాతం ఉన్నా కానీ మెరుగైనవే. సుదీర్ఘకాల చరిత్ర ఉన్న ఇండెక్స్ ఫండ్ పనితీరును గమనిస్తే.. చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. కానీ, గత పనితీరు అన్నది భవిష్యత్తుకు సంకేతం కాదు. రానున్న కాలంలో భిన్నమైన పనితీరును చూపించే అవకాశం కూడా లేకపోలేదు. నిఫ్టీ, సెన్సెక్స్ గురించి మాట్లాడుతుంటే అది లార్జ్‌క్యాప్ కంపెనీల గురించే. సాధారణ మార్కెట్‌కు అనుగుణంగానే లార్జ్‌క్యాప్ కంపెనీల పనితీరు ఉంటుంది. సెన్సెక్స్‌లోని కొన్ని కంపెనీలు అసాధారణ పనితీరు చూపించొచ్చు. కొన్ని నిరుత్సాహపరచొచ్చు. ఇండెక్స్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే రాబడులు దీర్ఘకాలంలో సహేతుకంగా ఉంటాయి. అంతేకాదు స్థిరాదాయ పథకాల కంటే అధికంగా, ద్రవ్యోల్బణం కంటే ఎక్కువే ఉంటాయి. కనుక ఆ రాబడులు మంచివే. - ధీరేంద్రకుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం -
ఎఫ్డీ వడ్డీ రేట్లు సవరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులు జమ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ) వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టె ఎఫ్డీ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ రేటును అందించనున్నట్లు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.9% - 5.25% మధ్య వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజా ఎఫ్డీ వడ్డీ రేట్లు (రూ.2 కోట్ల కంటే తక్కువ): డిపాజిట్ కాల వ్యవది వడ్డీ రేటు 7 నుంచి 14 రోజులు 2.9% 15 నుంచి 29 రోజులు 2.9% 30 నుంచి 45 రోజులు 2.9% 46 నుంచి 90 రోజులు 3.25% 91 నుండి 179 రోజులు 3.80% 180 రోజుల నుంచి 270 రోజులు 4.4% 271 రోజులు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ 4.4% 1 సంవత్సరం 5% 1 సంవత్సరం కంటే పైన & 2 సంవత్సరాల వరకు 5% 2 సంవత్సరాల కంటే పైన & 3 సంవత్సరాల వరకు 5.10% 3 సంవత్సరాలు పైన & 5 సంవత్సరాల వరకు 5.25% 5 సంవత్సరాల కంటే పైన & 10 సంవత్సరాల వరకు 5.25% -
దూసుకొస్తున్న క్రిప్టో కరెన్సీ బ్యాంక్
సాక్షి, ముంబై: ఇటీవలి క్రిప్టోకరెన్సీకి ఆదరణపెరుగుతున్న నేపథ్యంలో యూకేకు చెందిన క్రిప్టో బ్యాంక్ కాషా భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. కాషా, యునైటెడ్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల జాయింట్ వెంచర్ అయిన క్రిప్టో బ్యాంక్ యునికాస్ ఆగస్టు15 నాటికి దేశంలో కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ బ్యాంకుగా అవతరించనున్నామని యూనికాస్ వెల్లడించింది. ఇతర బ్యాంకుల మాదిరిగానే క్రిప్టో బ్యాంక్ పొదుపు, రుణ, వాణిజ్య సేవలను అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన వెంటనే, బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలలో ఎఫ్డీలను,ఆర్డీలను ప్రారంభించాలని భావిస్తోంది. క్రిప్టో ఎఫ్డీకి నిర్దిష్ట మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. అదేవిధంగా, ఇతర బ్యాంకుల ఆర్డీ మాదిరిగానే చిన్న పెట్టుబడిదారులు చిన్న మొత్తంలో రోజువారీ పెట్టుబడి పెట్టడానికి యూనికాస్ అనుమతించాలని యోచిస్తోంది. రిటైల్ పెట్టుబడిదారులు, వ్యాపారులను ఆకర్షించడమే లక్ష్యమనీ, రీటైల్ పెట్టుబడిదారులు తమ భవిష్యత్ అవసరాల నిమితం పెట్టుబడిపెట్టేలా ప్రోత్సహిస్తామని యునికాస్ మేనేజింగ్ పార్టనర్, సీఈఓ దినేష్ కుక్రేజా చెప్పారు. ఎఫ్డిలతోపాటు ఆర్డీల మాదిరిగానే, చిన్నపెట్టుబడిదారులు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టొచ్చన్నారు. ప్రస్తుతం యునికాస్కు దేశంలో ఢిల్లీ, జైపూర్, గుజరాత్లో మూడు శాఖలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం రాజస్థాన్ లోని జైపూర్‌లో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను ప్రారంభించాలని భావిస్తున్నామని కుక్రేజా చెప్పారు. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ జెబ్‌పే, ఇప్పటికే ఎఫ్డీలను ఆఫర్ చేస్తోంది. ఇక్కడ క్రిప్టోకరెన్సీని 90 రోజుల వరకు డిపాజిట్ చేసి స్థిర వడ్డీని సంపాదించవచ్చు మరోవైపు యునికాస్ క్రిప్టో కరెన్సీ పొదుపు ఖాతాలపై సంవత్సరానికి 4 శాతం నుండి 9.67 శాతం దాకా వడ్డీ అందిస్తుంది. అంతేకాదు క్రిప్టో బ్యాంక్ ఫిజికల్ బ్రాంచెస్ ఉన్న నగరాల్లో తన ప్రీమియం కస్టమర్లకు డోర్-స్టెప్ సేవలను కూడా అందిస్తుంది. -
ఈ లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయ్ జాగ్రత్త!
ఆదాయపు పన్ను శాఖ బ్యాంకు సేవింగ్, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకర్ ప్లాట్ ఫారమ్స్ మొదలైన వంటి వాటిలో ప్రజల నగదు లావాదేవీలను తగ్గించడానికి పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ సంస్థల ద్వారా జరిగే నగదు లావాదేవిలపై ఒక నిర్దిష్ట పరిమితి విధించింది. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటి అనేది ఈ క్రింద తెలుసుకుందాం.. బ్యాంక్ ఎఫ్డీ(ఫిక్సిడ్ డిపాజిట్): చిన్న పెట్టుబడి పథకాలలో ఫిక్సిడ్ డిపాజిట్ అనేది ఒక మంచి ఆప్షన్. ఒక బ్యాంకు ఎఫ్డీ ఖాతాలో నగదు డిపాజిట్ చేసే బ్యాంకు డిపాజిటర్ రూ.10 లక్షల మించి ఎఫ్డీ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్: రియల్ ఎస్టేట్ ఒప్పందానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పరిమితిని విధించింది. మీరు ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు రూ.30 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపిస్తుంది. సేవింగ్స్/కరెంట్ అకౌంట్: ఒక వ్యక్తికి సంబంధించిన పొదుపు ఖాతాలో గనుక లక్ష రూపాయలకు పైగా మించి క్యాష్ డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను నోటీసును పంపవచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు ఈ పరిమితి రూ.50 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు ఆదాయపు పన్ను శాఖ పంపే నోటీసులకు బాధ్యత వహించాలి. మ్యూచువల్ ఫండ్/స్టాక్ మార్కెట్/బాండ్/డిబెంచర్: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్ లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు పైన పేర్కొన్న పెట్టుబడి ఎంపికల్లో రూ.10 లక్షల పరిమితికి మించి పెట్టుబడి పెట్టకుండా చూసుకుంటే మంచిది. రూ.10 లక్షలకు మించి గనుక పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను శాఖ మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)ని చెక్ చేసే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే సమయంలో బిల్లు చెల్లింపు అనేది రూ.1 లక్ష పరిమితికి మించి దాటకూడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు చేసేటప్పుడు ఈ నగదు పరిమితి దాటితే ఆదాయపు పన్ను శాఖ మీకు ఐటీ నోటీసులు పంపించే అవకాశం ఉంది. -
సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారతదేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఎఫ్డీ పథకం కింద ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టె నగదుపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల కన్న అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ గా పిలువబడే ఈ కొత్త స్కీమ్ వల్ల వారి ఎఫ్డీ డిపాజిట్లపై అదనంగా 30 బేసిస్ వడ్డీ పాయింట్లు లభిస్తాయి. ప్రస్తుతం, ఎస్బీఐ అన్ని కాలవ్యవధుల టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల ను అందిస్తుంది. వీకేర్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారు ఇప్పుడు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టె టర్మ్ డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ వీకేర్ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ఇప్పుడు సెప్టెంబర్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ ఎఫ్డీ స్కీమ్ వివరాలు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు అర్హులు. ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఇందులో ఎఫ్డీ చేయాలి. బ్యాంకు గరిష్ట డిపాజిట్ రూ.2 కోట్లు ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఈ డిపాజిట్లపై బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 80 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ కింద డబ్బును ఎఫ్డీ చేస్తే వర్తించే వడ్డీ రేటు 6.2 శాతం గడువు కన్న ముందు నగదు విత్ డ్రా చేస్తే అదనపు 30 బిపీఎస్ ప్రీమియం వర్తించదు. బ్యాంకు 0.5 శాతం జరిమానా విధించవచ్చు. -
ఐడీబీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ తన బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంకులో పెట్టుబడి పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఎఫ్డీ వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేసింది. రూ. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐడీబీఐ పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 20 సంవత్సరాల మెచ్యూరిటీతో వస్తాయి. ఈ వ్యవధిలోని అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.7% నుంచి 4.8%% వరకు వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు అనేవి జూలై 14 నుంచి అమల్లోకి వచ్చాయి. ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఎఫ్డీలపై ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్ల కొరకు ప్రస్తుతం బ్యాంక్ 3.2% నుంచి 5.3% వరకు ఎఫ్డీ రేట్లను అందిస్తుంది. ఈ డిపాజిట్లను పన్ను ఆదా చేసే ఎఫ్డీలు అని కూడా అంటారు. ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బీపీఎస్ వడ్డీరేట్లను అన్ని టెనర్లలో అందిస్తుంది. ఐడీబీఐ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ల అయితే ఈ వడ్డీ రేట్లకు 50 బీపీఎస్(0.50 శాతం) అదనం అని గుర్తు పెట్టుకోవాలి. ఎఫ్డీలపై తాజా వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 14 రోజులు వరకు అయితే 2.7% 15 రోజుల నుంచి 30 రోజులు వరకు అయితే 2.7% 31 రోజుల నుంచి 45 రోజులు వరకు అయితే 2.8% 46 రోజుల నుంచి 60 రోజులు వరకు అయితే 3.00% 61 రోజుల నుంచి 90 రోజులు వరకు అయితే 3.00% 3 నెలల నుంచి 6 నెలలు వరకు అయితే 3.5% 6 నెలలు 1 రోజు నుంచి 270 రోజులు వరకు అయితే 4.3% 271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు అయితే 4.3% 1 సంవత్సరం వరకు అయితే 5% 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే 5.1% 2 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.1% 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.3% 5 సంవత్సరాల వరకు అయితే 5.25% 5 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 7 సంవత్సరాల వరకు అయితే 5.25% 7 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల వరకు అయితే 5.25% 10 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 20 సంవత్సరాలు వరకు అయితే 4.8% -
బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్...!
న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్(ఎస్సీఎస్ఎస్) పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు నిర్ణీత కాల డిపాజిట్లపై అధికంగా వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పథకంతో అధిక వడ్డీ రేట్లనే కాకుండా, వీటిపై అదనపు ప్రయోజనాలు కూడా రానున్నాయి. ఇటీవలకాలంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో చాలా మంది ఖాతాదారులు ఫిక్స్డ్ డిపాజిట్లను చేయడం లేదు. తిరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు వర్తించే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి) పై ఉన్న రేట్లపై అదనపు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ పథకాన్ని 2021 సెప్టెంబర్ 30 వరకు పెంచుతూ బ్యాంకులు ఉత్తర్వులు జారీ చేశాయి. ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీం ఫర్ సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ పథకంతో సాధారణ ఖాతాదారులకు లభించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్ల అధికంగా అందిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ఖాతాదారులకు ఐదేళ్ల ఎఫ్డీపై 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రత్యేక ఎఫ్డి పథకం కింద సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం వడ్డీ రేట్లను ఇవ్వనుంది. రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్బీఐ ప్రవేశపెట్టిన ‘ఎస్బీఐ వీకేర్‘ లో భాగంగా 30 బిపిఎస్ అదనపు ప్రీమియం పాయింట్లను వారి రిటైల్ టిడి కోసం చెల్లించబడుతుంది. అందుకోసం ఆయా బ్యాంకుల్లో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఖాతాదారునిగా ఉండాలి. ఎస్బీఐ వీ కేర్ పథకాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీం ఫర్ సీనియర్ సిటిజన్స్ ఐదు సంవత్సరాల వ్యవధితో 5 కోట్ల కన్నా తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25% అదనపు ప్రీమియం అందించనుంది. ఈ ప్రత్యేక డిపాజిట్ ఆఫర్ 2021 సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ స్పెషల్ డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 75 బిపిఎస్ పాయింట్లను కూడా ఇవ్వనుంది. ప్రత్యేక ఎఫ్డి పథకం కింద సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ ఎఫ్డీ స్కీం ఫర్ సీనియర్ సిటిజన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 100 కంటే ఎక్కువ బిపిఎస్ పాయింట్లను ఇస్తోంది. ఈ పథకంలో డిపాజిట్ చేస్తే 6.25 వడ్డీ రేటు లభిస్తోంది. చదవండి: బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఎస్బీఐ డిప్యూటీ ఎండీ -
అలర్ట్: జూన్ 30లోగా ఎఫ్డీ దారులు ఈ ఫామ్‌లు నింపాల్సిందే
కరోనా మహమ్మరి నేపథ్యంలో కొద్దీ రోజుల క్రితం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పించడానికి ప్రభుత్వం గడువును పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) వ్యక్తిగత ఐటీఆర్ కోసం 2 నెలలు, కంపెనీలు లేదా భాగస్వామ్య సంస్థలకు ఒక నెల గడువును పొడిగించింది. సీబీడీటీ కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ఎఫ్డీ గడువు విషయంలో ఎటువంటి మార్పు లేదు. అందుకే ఎఫ్డీలో పెట్టుబడులు పెట్టిన వారు జూన్ 30 న లేదా అంతకన్నా ముందు 15 జీ, 15 హెచ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌లను నింపి గడువులోగా బ్యాంకుల్లో సమర్పిస్తే డబ్బు ఆదా అవుతుంది. లేకపోతే బ్యాంకులు పన్ను మొత్తాన్ని కట్ చేస్తాయి. 15జీ, 15హెచ్ ఫామ్‌ల వల్ల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఉన్న వారికి ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్(టీడీఎస్) నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం మంచి వడ్డీ రేట్లు వస్తుండడంతో ఎక్కువ మంది మదుపరులు ఎఫ్డీలలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఎఫ్‌డీల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఓ పరిధిని నిర్ణయించింది. అది దాటిన వారికి టీడీఎస్ వర్తిస్తోంది. టీడీఎస్‌పై గరిష్ట పరిమితి ఎంత..? మొదట్లో టీడీఎస్ పరిమితి రూ.10వేలు ఉండగా ప్రస్తుతం అది రూ.40వేలకు పెరిగింది. ఈ పరిమితి పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి వర్తిస్తుంది. ఆపై టీడీఎస్ నుంచి మినహాయింపు పొందాలంటే.. 15G, 15H ఫామ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. 15 జీ ఫామ్ అంటే..? మీరు పెట్టుబడి పెట్టిన నగదు ద్వారా వచ్చే వడ్డీపై టీడీఎస్ పన్ను మినహాయింపు కోసం ఫామ్ 15జీని సమర్పించాలి. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. దాని ఆధారంగా ఈ ఫారం నింపబడుతుంది. ఈ ఫారమ్‌ను ఎవరు పూరించవచ్చో తెలుసుకుందాం. ఒక భారతీయ పౌరుడు లేదా ఉమ్మడి హిందూ కుటుంబం లేదా ట్రస్ట్ ఈ ఫారమ్ నింపవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ ఫారమ్‌ను పూరించవచ్చు. ఈ ఫారం కంపెనీకి లేదా సంస్థకు వర్తించదు. మొత్తం రాబడిపై ట్యాక్స్ లియబులిటీ సున్నాగా ఉండాలి. ఓ సంవత్సరంలో వడ్డీ రాబడి పన్ను మినహాయింపు పరిధిని దాటి ఉండకూడదు. 15 హెచ్ ఫామ్ అంటే..? 60 ఏళ్లు పైబడిన వారు టీడీఎస్ పన్ను మినహాయింపు కోసం ఫామ్ 15 హెచ్ ఫామ్ సమర్పించాలి. ఏ భారతీయ పౌరుడైనా ఈ ఫారమ్ నింపవచ్చు. వ్యక్తికి కనీసం 60 సంవత్సరాలు ఉండాలి. మొత్తం రాబడిపై ట్యాక్స్ లియబులిటీ సున్నాగా ఉండాలి. ఈ రెండు ఫామ్‌ల్లో మీ ప్రాథమిక సమాచారాన్ని చాలా జాగ్రత్తగా నింపాలి. ఆ తర్వాత వీటికి పాన్ కార్డ్ కాపీని, ట్యాక్స్ డిక్లరేషన్‌ను జత చేయాలి. ఆ తర్వాత ఫిక్స్ డిపాజిట్ ఉన్న బ్యాంకులో సమర్పించాలి. ఈ రెండు ఫామ్‌ల కాల పరిమితి ఓ సంవత్సరం ఉంటుంది. చదవండి: కేవలం 1 శాతం వడ్డీకే రుణం.. వారికి మాత్రమే -
డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లు కట్..!
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అన్ని రకాల కాల పరిమితులు కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఎస్బీఐ మే నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల తగ్గడం వరుసగా రెండోసారి. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లపై 40బేసిస్ పాయింట్ల(0.4శాతం) వరకు తగ్గించింది. ఈ తగ్గింపు మే 27నుంచే అమల్లోకి వస్తుంది. కొత్త రేట్ల ప్రకారం ఒక ఏడాది నుంచి రెండేళ్ల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్‌పై 5.1శాతం మాత్రమే వడ్డీ వస్తుంది. 3-5 ఏళ్ల మద్య కాలపరిమితి గల 5.3శాతం, 5ఏళ్లకు పైబడి 10ఏళ్ల కాల పరిమితి కలిగి డిపాజిట్లపై వడ్డీ 5.4శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్బీ తాజా వడ్డీరేట్ల తగ్గింపు ఇలా ఉన్నాయి. -
సీనియర్ సిటిజన్స్‌కు ..స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌లు
దేశంలోని వయో వృద్ధులకు మంచి లాభాన్ని చేకూర్చే ఫిక్స్డ్ డిజాజిట్ స్కీములను బ్యాంకులు అందిస్తున్నాయి.దీనిలో భాగంగా దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఇటీవల సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ) స్కీములను ప్రారంభించాయి. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారీ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లను ఆదుకునేందుకు దేశంలో తొలిసారి వయోవృద్ధులకు ‘ఎస్బీఐ వి కేర్’ అనే ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమును ఎస్బీఐ ప్రవేశపెట్టింది. ‘హెచ్డీఎఫ్సీ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ’ పేరిట హెచ్డీఎఫ్ఎసీ స్కీమును ప్రారంభించగా, ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్ ‘ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్’ పేరిట అందిస్తోంది. ఎస్బీఐ ఎఫ్డీ స్కీమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ స్కీమ్ పేరు: ఎస్బీఐ వి కేర్. 2020 మే 12 నుంచి ఈ స్కీమ్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. దీని కాలపరిమితి 5 ఏళ్లు. దీనిలో ఇన్వెస్ట్ చేసిన సీనియర్ సిటిజన్స్‌కు 80 బేసీస్ పాయింట్లు అధికంగా కొత్తగా వడ్డీని చెల్లిస్తారు. ఈ స్కీమ్‌లో ఎఫ్డీ చేసే సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. గడువు ముగియక ముందే ఎఫ్డీని ఉపసంహరించుకోవాలంటే అదనంగా వచ్చే 30 బేసిస్ పాయింట్ల ప్రీమియం రాదు. పైపెచ్చు 0.5 శాతం పెనాల్టీ విధిస్తారు. డిపాజిట్ మొత్తం రూ.2 కోట్లకు మించరాదు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ స్కీమ్ పేరు: హెచ్డీఎప్సీ సీనియర్ సిటిజన్ కేర్. 2020 మే 18 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. 5 ఏళ్ల ఒక రోజు-10 ఏళ్ల వరకు ఈ స్కీముకు కాలపరిమితి ఉంటుంది. కొత్తగా ఇచ్చే వడ్డీ 75 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటుంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన సీనియర్ సిటిజన్‌కు ఏడాదికి వడ్డీ రేటు 6.50 శాతం లభిస్తుంది. దీంతోపాటు అదనంగా 25 బేసిస్ పాయింట్ల ప్రిమియం కూడా అదనం.గడువు ముగియక ముందే ఎఫ్డీని విత్‌డ్రా చేసుకోవాలంటే 1శాతం పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ 5 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకోవాలంటే పెనాల్టీ 1.25 శాతం పడుతుంది. ఇక ఈ స్కీములో చేరాలనుకునేవారు రూ.5 కోట్ల వరకు ఎఫ్డీ చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ స్కీమ్ పేరు: ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్.2020 మే 20 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ స్కీముకు 5 ఏళ్ల ఒక రోజు-10 ఏళ్ల వరకు కాలపరిమితిని అందిస్తున్నారు.కొత్తగా 80 బేసిస్ పాయింట్లు అధికంగా వడ్డీని అందిస్తున్నారు. ఇక ఈ స్కీములో చేరిన సీనియర్ సిటిజన్స్‌కు ఏడాదికి 6.55 శాతం వడ్డీని చెల్లిస్తారు. 5ఏళ్ల ఒకరోజుకంటే ముందే ఎఫ్డీ విత్‌డ్రా చేయాలనుకుంటే 1 శాతం పెనాల్టీ కట్టాలి. 5 ఏళ్ల ఒకరోజు తరువాత ఎఫ్డీ తీసుకోవాలంటే 1.30 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీములో చేరాలనుకునే సీనియర్ సిటిజన్లు రూ.2 కోట్లవరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ మూడు స్కీముల్లో కామన్‌గా ఉన్నవి... సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఎఫ్డీ స్కీము 5 ఏళ్ల కాలపరిమితి ఉండడం. ఇప్పటికే ఎఫ్డీలు కలిగిన ఖాతాదారులతోపాటు, కొత్తగా స్పెషల్ ఎఫ్డీలను తీసుకున్న వారికి సైతం కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి. స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌లు 2020 సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ,హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఇప్పటికే ఎఫ్డీలు కలిగిన సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీరేటును అందిస్తున్నాయి. దేశీయంగా నివసిస్తున్న60ఏళ్లు పైబడిన వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు. -
షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కాలంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ తాజాగా తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. వివిధ కాల పరిమితుల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 50 బేసిస్ పాయింట్ల వకు కోత విధించినట్లు బ్యాంక్ తెలిపింది. సవరించిన రేట్లు మే 11 నుంచే అమలులోకి వచ్చినట్టు పేర్కొంది. (తగ్గిపెరిగిన ఎస్బీఐ ‘రేటు’) ఐసీఐసీఐ బ్యాంక్ తాజా రేట్ల కోత నిర్ణయంతో ఏడాది కాల పరిమితి డిపాజిట్లపై ఇప్పుడు 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. అదే ఏడాది పైన కాల పరిమితిలోని ఎఫ్డీలపై 5.7- 5.75 శాతం మధ్య వడ్డీని చెల్లించనుంది. మరోవైపు రుణరేట్ల (ఎంసీఎల్ఆర్) ను కూడా తగ్గించే అవకాశం వుందని భావిస్తున్నారు. అటు నిరాశాజనక ఫలితాలతో స్టాక్మార్కెట్లో బ్యాంకు షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది. కాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు కోత విధించిన సంగతి తెలిసిందే. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ) చదవండి : రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే! కరోనా: ఎయిరిండియా ఉద్యోగికి పాజిటివ్ -
ఎస్బీఐ డిపాజిట్ రేట్ల కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ కాలపరిమితులపై డిపాజిట్ రేట్లను తగ్గించింది. 170 రోజుల వరకూ స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీరేటును 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రిటైల్ సెగ్మెంట్లో దీర్ఘకాలిక కాలపరిమితి డిపాజిట్లపై రేట్లు 20 బేసిస్ పాయింట్లు, బల్క్ సెగ్మెంట్లో డిపాజిట్ రేట్లు 35 బేసిస్ పాయింట్లు తగ్గాయి. రూ. 2 లక్షలు ఆపైన బల్క్ డిపాజిట్లపై రేటును కూడా ఎస్బీఐ తగ్గించింది. తగ్గించిన తాజా రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. -
వడ్డీపై పన్ను ఎగ్గొట్టడం కష్టమే!
సేవింగ్స్ ఖాతాల్లో కావచ్చు... ఫిక్స్డ్ డిపాజిట్లపై కావచ్చు... ఇతరత్రా కావచ్చు! వడ్డీ రూపంలో వచ్చే ఆదాయాన్ని పన్ను అధికారుల కళ్లలో పడకుండా దాచడం ఇక అసాధ్యమే. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ల పరిశీలనను ఆదాయపన్ను శాఖ ఇటీవలి కాలంలో విస్తృతం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఆదాయం పొందుతూ పన్ను చెల్లించని వారు లేదా పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిపై ఐటీ శాఖ నిఘా పెంచింది. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పొందేవారు చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడమే శ్రేయస్కరం. వడ్డీ ఆదాయానికి సంబంధించి పన్ను చెల్లింపుదారుల్లో ఎన్నో దురభిప్రాయాలున్నాయి. వీటిలో తమ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆదాయపన్ను శాఖకు తెలియవని అనుకోవటం కూడా ఒకటి. నిజం చెప్పాలంటే... టీడీఎస్ ఒక్కటి చాలు! ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి ఐటీ శాఖకు తెలియడానికి!!. ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 దాటితే బ్యాంకు స్థాయిలో టీడీఎస్ అమలు చేస్తారు. ఇది ఫామ్ 26ఏఎస్‌లో కనిపిస్తుంది. అంతేకాదు... ఆ ఏడాదిలో వడ్డీ ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు కూడా ఇందులో ఉంటాయి. బ్యాంకు టీడీఎస్ విధిస్తే పన్ను చెల్లించక్కర్లేదనే మరో అపోహ కూడా ఉంది. కానీ వడ్డీ ఆదాయంలో టీడీఎస్ 10 శాతమే మినహాయిస్తారు. ఒకవేళ డిపాజిట్ దారుడి ఆదాయం అధిక పన్ను రేటు పరిధిలో ఉంటే ఆ మేరకు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది కాబట్టి. టీడీఎస్ బాధ్యత విస్మరించొద్దు కొందరు టీడీఎస్ చెల్లించడం ఎందుకన్న ఆలోచనతో డిపాజిట్లను వేర్వేరు బ్యాంకుల్లో కొద్ది కొద్దిగా చేస్తుంటారు. కానీ, పన్ను ఎగ్గొట్టేందుకు ఇలా చేయకపోవడమే మంచిదంటున్నారు ట్యాక్స్ నిపుణులు. ఫిక్స్డ్ డిపాజిట్ల సమయంలో పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందనేది క్లియర్‌ట్యాక్స్ డాట్ ఇన్ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా మాట. కనుక ఈ తరహా ఇన్వెస్ట్మెంట్లను రహస్యంగా ఎక్కువ కాలం పాటు ఉంచే అవకాశం ఉండదు. కొందరు 15జీ, 15 హెచ్ ఫామ్‌లు ఇవ్వటం ద్వారా పన్ను అధికారుల కళ్లలో పడకుండా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. వార్షికాదాయం పన్ను పరిమితికి లోపే ఉన్నవారు, టీడీఎస్ మినహాయించుకుంటే ఇచ్చే పత్రాలు ఇవి. వీటిని దుర్వినియోగం చేస్తే ట్యాక్స్ అధికారుల దృష్టిలో పడతారని, తప్పుడు ధ్రువీకరణలు ఇవ్వడం వల్ల పెనాల్టీ, విచారణలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని ట్యాక్స్ స్పానర్ డాట్ కామ్ సీఎఫ్‌వో సుధీర్ కౌశిక్ వివరించారు. 15జీ, 15హెచ్ దుర్వినియోగం 15జీ, 15హెచ్ డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా బయటపడొచ్చన్న ఆలోచన సరికాదన్నది నిపుణుల మాట. వీటిని సమర్పించిన ఖాతాదారుల పాన్ నంబర్, డిపాజిట్ వివరాలను బ్యాంకులు తమ టీడీఎస్ రిటర్నుల్లో పేర్కొంటాయని ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సుభమ్ అగర్వాల్ తెలిపారు. దీంతో ఈ సమాచారం ఫామ్ 26ఏఎస్లోకి చేరుతుంది. మరి ఇలా ఒకటికి మించిన బ్యాంకుల్లో 15జీ లేదా 15 హెచ్ పత్రాలను సమర్పించిన వివరాలు 26ఏఎస్‌లో కనిపిస్తే, ఆ ఆదాయం బేసిక్ పన్ను మినహాయింపు పరిమితి దాటిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పన్ను చెల్లింపు దారుల్లో దాదాపు 90 శాతం మంది వడ్డీ ఆదాయాన్ని పేర్కొనడం లేదని సమాచారం. మరి పన్ను చెల్లంపుదారులు అందరికీ బ్యాంకు ఖాతాలు తప్పకుండా ఉంటాయని తెలిసిందే. సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై వారికి ఎప్పటికప్పుడు ఆదాయం జమ అవుతూనే ఉంటుంది. సెక్షన్ 80టీటీఏ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలా సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకే పన్ను మినహాయింపు ఉంటుంది. అంతకు మించితే పన్ను చెల్లించాల్సిందే. కానీ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలు చేయకపోవడం వల్ల ఈ ఆదాయాన్ని తమ రిటర్నుల్లో చూపించని పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యుల పేరుపై... ఒక్కరి పేరుతోనే పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయకుండా ట్యాక్స్ పడుతుందన్న ఆలోచనతో కొందరు తమ పేరిట కొంత, కుటుంబ సభ్యుల పేరిట తలా కొంత చొప్పున డిపాజిట్ చేస్తుంటారు. జీవిత భాగస్వామి, పిల్లలకు ఇచ్చే నగదు బహుమానంపై చట్టప్రకారం పన్ను ఉండదు. ఇలా బహుమానంగా ఇచ్చిన మొత్తంపై వచ్చే ఆదాయం ఇచ్చిన వారి ఆదాయంలోనే కలుస్తుంది. ఇలా మొదటి ఆదాయమే కలుస్తుంది. ఒకవేళ ఇలా వచ్చిన ఆదాయాన్ని తీసుకున్న వ్యక్తి మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు దానిపై వచ్చే ఆదాయం వారికే చెందుతుంది. ఇచ్చిన వారి ఆదాయంలో కలవదు. తల్లిదండ్రుల పేరుపై... కానీ, తల్లిదండ్రుల విషయానికొస్తే ఇది భిన్నంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఇచ్చే బహుమానం ఏదైనా దానిపై పన్ను పడదు. అలాగే, ఇలా బహుమానంగా ఇచ్చిన దానిపై వచ్చే ఆదాయం తీసుకున్న తల్లిదండ్రుల ఆదాయంగానే చట్టం పరిగణిస్తుంది. జీవిత భాగస్వామి, పిల్లల మాదిరిగా ఇచ్చిన వారి ఆదాయంలో కలవదు. ఈ వెసులుబాటు ఉండడంతో అధిక పన్ను పరిధిలో ఉన్న వారు కొంత తమ తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇవ్వడం ద్వారా పన్ను భారాన్ని దించుకోవచ్చు. చట్ట ప్రకారం 60 ఏళ్లు దాటిన వారికి ఏటా రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉందనే విషయం తెలిసిందే. సెక్షన్ 80సీ ప్రయోజనాలు కూడా కలుపుకుంటే ఇది రూ.4.5లక్షలు. కనుక ఆ మేర వడ్డీ ఆదాయంపై పన్ను ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంది. అయితే, ఇలా తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చిన మొత్తంపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస మినహాయింపైన రూ.3 లక్షలు దాటితే దాన్ని రిటర్నుల రూపంలో చూపించడం తప్పనిసరి. హెచ్ఆర్ఏ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక్కటే కాదు. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) కూడా పన్ను అధికారుల నిఘాలోకి వచ్చేసింది. నకిలీ రసీదులు సమర్పించి హెచ్ఆర్ఏకు ఉన్న పన్ను మినహాయింపు పొందుతుండడమే ఇందుకు కారణం. దీంతో ఆదాయపన్ను శాఖ రూ.1.5 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గించి, ఇంతకు మించి వార్షికంగా అద్దె చెల్లిస్తుంటే భవన యజమాని పాన్ నంబర్ సమర్పించడాన్ని తప్పనిసరి చేసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ అద్దె రూ.50,000కు మించి చెల్లించేవారు అందులో టీడీఎస్ కింద 5 శాతాన్ని మినహాయించి పన్ను అధికారులకు జమ చేయాల్సి ఉంటుంది. -
ద్రవ్యోల్బణంపై దాడి చేద్దాం !
♦ డబ్బును అల్మారాలో, బ్యాంకు ఖాతాలో ఉంచితే నష్టమే ♦ ఏటా ద్రవ్యోల్బణం రూపంలో డబ్బు విలువ క్షీణత ♦ పెట్టుబడులకు మళ్లించకపోతే పేదరికమే! ♦ దీర్ఘకాలంలో అవసరాలు తీరాలంటే డబ్బు సంపదగా మారాలి ♦ అందుకు సరైన దిశగా అడుగులు వేయాలి ప్రతి కుటుంబానికీ ఆర్థిక అవసరాలెన్నో ఉంటాయి. సంపన్న వర్గాలను పక్కన పెడితే సామాన్య, మధ్యతరగతి జీవులకు ప్రతీ నెలా వచ్చే ఆదాయమే ఆధారం. అందులోనే అతికష్టం మీద కొంచెం పొదుపు చేసి పక్కన పెడుతుంటారు. ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించేది కొద్దిమందే. అందులోనూ ఆ పొదుపును సంపదగా మార్చే సాధనాల వైపు మళ్లించేది ఇంకా తక్కువ మంది. మిగిలిన వారు ఆశ్రయించే మార్గాలు కేవలం వారి దగ్గరున్న డబ్బు విలువను కాపాడుతాయంతే. అందుకే సంపద సమకూరాలంటే ద్రవ్యోల్బణ శాస్త్రం తెలిసి ఉండాలి. ‘‘దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కలిగించే నష్టం గురించి ఇన్వెస్టర్లలో కొద్ది మందిలోనే అవగాహన ఉంటుంది’’ అని ప్రముఖ ఆర్థిక నిపుణుడు ధీరేంద్ర కుమార్ చెప్పారు. ప్రతి నెలా ఆర్జిస్తున్న మొత్తంలో ఓ 20 శాతాన్ని పొదుపు చేశారనుకుందాం. దాన్ని తీసుకెళ్లి ఇంట్లో లేదంటే బ్యాంకు ఖాతాలో ఉంచేసి నెలనెలా వేతనంలో పొదుపు చేస్తున్నానని మురిసిపోతే అది అమాయకత్వమే అవుతుంది. పొదుపు కాదు, మంచి రాబడులను ఇచ్చే వాటిని ఎంచుకుని మదుపు చేసినప్పుడే అనుకున్నవి నెరవేరతాయి. ఉదాహరణకు ఏడాది క్రితం పెట్రోల్ ధర ఎంతుందో గుర్తు చేసుకోండి. లీటరు 59.68. ప్రస్తుతం రూ.67.50 (ఢిల్లీలో). సుమారు 13 శాతం పెరిగినట్టు తెలియడం లేదూ... అలాగే మిగిలిన వస్తువులు కూడా. కొన్ని ధరలు తగ్గొచ్చు. కానీ, సగటు జీవనానికి కావాల్సిన నిత్యావసరాల ధరలు ఏటేటా పెరగడం సర్వ సాధారణంగా జరిగేదే. ఇలా ధరలు పెరిగితే కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. ధరలు 10 శాతం పెరిగాయంటే... ఏడాది క్రితం రూ.100 పెట్టి కొనుగోలు చేసిందానికి ప్రస్తుతం రూ.110 చెల్లిస్తే గానీ రాదు. దీన్నే డబ్బు విలువ క్షీణించడం (ద్రవ్యోల్బణం)గా పేర్కొంటారు. దీన్ని ఇప్పుడు పొదుపునకు అన్వయించి చూడండి. మీరు రూ.10,000లను పొదుపు చేసి ఏడాదిగా ఇంట్లోనే దాచి ఉంచారనుకోండి. ఆ తర్వాత కూడా రూ.10 వేలే ఉంటాయి. కానీ ఆ డబ్బు విలువ ఎంతో కొంత తగ్గి ఉంటుంది. ఇంట్లోనే ఉంచేసుకోవడం వల్ల కలిగిన నష్టం ఇది. చేప ఎప్పుడూ నీటిలోనే పెరుగుతుంది. అలానే డబ్బు ఎప్పుడూ పెట్టుబడుల్లోనే వృద్ధి చెందుతుంది. ఈ విషయం తెలియక కొందరు నష్టపోతే... తెలిసిన వారు ఆచరణలో పెట్టక నష్టపోతుంటారు. కేవలం పొదుపుతో నష్టం! మన దేశంలో సామాన్యుల్లో ఇప్పటికీ చాలా మంది డబ్బును ఇళ్లలోనే ఉంచేస్తున్నారన్న విషయం ఇటీవల పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల వద్ద రద్దీ తెలియజెప్పింది. ముఖ్యంగా గృహిణుల పొదుపు ఇంటికే పరిమితం అవుతోంది. ఇల్లు కావచ్చు, బ్యాంకు ఖాతా కావచ్చు. ఇవి మన దగ్గరున్న డబ్బు విలువను కాపాడేవి కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బు ఎప్పుడూ తన విలువను కాపాడుకోలేదు. ఇదంతా ద్రవ్యోల్బణం మహిమ. దీనివల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే కాలానుగుణంగా నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగిపోవడం. రాబడి తక్కువుంటే ఏమవుతుంది...? ఎవరెన్ని చెప్పినా ఫిక్స్డ్ డిపాజిట్లలోనే పెట్టుబడి పెడతా అనే బాపతు కొందరుంటారు. రాబడులు తక్కువగా వస్తాయని చెబితే... కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ గురించి చెబతుంటారు. నిజమే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో 7 శాతం వడ్డీ వస్తుందనుకోండి. ఆరు నెలలకో, ఏడాదికో ఆ వడ్డీ అసలు మొత్తంలో కలుస్తుంది. దీంతో ఆ వడ్డీపైనా వడ్డీ వస్తుంది. దీన్నే చక్రవడ్డీ అంటాం. కానీ, ద్రవ్యోల్బణం మింగేసే డీకాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అంటే చక్రవడ్డీ రూపంలో వచ్చినదాన్ని ద్రవ్యోల్బణం మింగేస్తుంటుంది. ఏటా ద్రవ్యోల్బణం అన్నది అంతకుముందు ఏడాదిలో ఉన్న ద్రవ్యోల్బణ గరిష్ట శాతంపైనే నమోదవుతూ ఉంటుంది. వడ్డీపై వడ్డీ మాదిరిగా. రూ.లక్ష రూపాయలను తీసుకెళ్లి బ్యాంకులో ఎఫ్డీ చేస్తే వచ్చే వడ్డీ రాబడి 7 శాతం. అదే ఏడాదిలో ధరలు 7 శాతం పెరిగిపోతే వచ్చిన లాభం ఏముంటుంది ఆలోచించండి...? అసలు మొత్తం పెరిగింది. కానీ ఆ పెరిగిన మొత్తంతో వచ్చేదేమీ ఉండదు. ఉదాహరణకు రూ.లక్ష పదేళ్ల కాలంలో రూ.2.16 లక్షలు అవుతాయి. అదే సమయంలో జీవనానికి అవసరమైన వాటి ధరలు పదేళ్ల క్రితం రూ.లక్షకు వచ్చిన వాటికి ఇప్పుడు ఇంచుమించుగా రూ.2.16 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ఎలా ఉన్నారో, వారి స్థాయి పదేళ్ల తర్వాతా అలానే ఉంటుంది. ధనవంతులు కాలేరు. వారి కొనుగోలు శక్తి అప్పుడు ఎంతుందో ఇప్పుడూ అంతే. 30 ఏళ్ల క్రితం రూ.10,000 సంపాదించిన వారు నెలంతా సౌకర్యంగా, గొప్పగా బతికేవారు. నేడు రూ.10,000లతో ఏ రకంగా జీవించవచ్చో అర్థం చేసుకోండి. ఊహించడం కష్టమే భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే ఊచించడం కష్టం. ఉదాహరణకు రాజీవ్ వయసు 40 ఏళ్లు. 60 ఏళ్లకు రిటైర్ అవుతాడని అనుకుంటే ఇప్పటి మాదిరిగానే అప్పుడూ మధ్యతరగతి జీవనం కోసం నెలకు రూ.2.5 లక్షలు అవసరం అవుతాయి. రూ.2.5 లక్షలతో ఇప్పుడు ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం ఏడాది అవసరాలు తీరతాయి. కానీ 20 ఏళ్ల తర్వాత పరిస్థితి చూస్తే అంతే మొత్తం నెల అవసరాలకు కావల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. ఇక రాజీవ్‌కు 80 ఏళ్ల వయసు వచ్చే సరికి నెల జీవనానికి కనీసం రూ.10 లక్షలు అవసరం ఉంటుంది. గుర్తిస్తేనే విజేత... ద్రవ్యోల్బణం తక్కువగా ఉండే దేశంగా మారాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కానీ, అంతకంతకూ పెరిగిపోతున్న జనాభాతో ద్రవ్యోల్బణ నియంత్రణ కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ సామాన్యుడిగా డబ్బు విలువను కాపాడుకుంటూ ద్రవ్యోల్బణం మించి మెరుగైన రాబడులను ఇచ్చే మార్గాల్లోకి పొదుపును మళ్లించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేవారు వాటిపై రాబడులు చాలా తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఓ 20 ఏళ్లలో రూ.2 కోట్లను సమకూర్చుకోవాలి అనుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు 8 శాతం రాబడినిచ్చే సాధనంలో ప్రతీ నెలా రూ.1.7 లక్షల చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. అదే రాబడి 10 శాతం వచ్చే దానిలో అయితే రూ.1.3 లక్షలు ఇన్వెస్ట్ చేసే సరిపోతుంది. అలాగే 20 ఏళ్లలో రూ.కోటి కావాలనుకోండి. 10 శాతం రాబడి వచ్చే సాధనంలో ప్రతి నెలా రూ.1,38,124 చొప్పున పెట్టుబడి పెట్టాలి. రాబడి 14 శాతంగా ఉంటే రూ.85,217 చాలు. రాబడి 18 శాతం అయితే కేవలం రూ.51,901 సరిపోతాయి. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్స్ పథకాలు ఈ స్థాయిలో రాబడులను ఇస్తాయని చరిత్ర చెబుతోంది. కనుక బ్యాంకు డిపాజిట్ల వంటి తక్కువ రాబడులను ఇచ్చే వాటిని నమ్ముకుంటే మెరుగైన రాబడులను పొందలేరు. వాస్తవిక రాబడులు చాలా స్వల్పం. పన్ను పరిధిలో ఉన్న వారు అయితే బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చిన రాబడులపై పన్ను కట్టగా, ద్రవ్యోల్బణం హరింపు తీసివేయగా నికరంగా నష్టమే వస్తుంది. కనుక ఇలాంటి వాటిని నమ్ముకుంటే విశ్రాంత జీవనం, పిల్లల వివాహాలు, ఇంటి కొనుగోలు వంటి దీర్ఘకాల అవసరాలు తీర్చుకోవడం కష్టతరం అవుతుంది. వారసత్వంగా ఇల్లు, ఇతర ఆస్తులు వచ్చిన వారికైతే ఏ ఇబ్బంది లేదు. కానీ, కష్టార్జితాన్నే నమ్ముకున్న వారు ద్రవ్యోల్బణం గురించి తెలుసుకుని మెరుగైన రాబడులను ఆశ్రయించడం ఉత్తమం. డబ్బు విలువ తరిగేది ఇలా... 1984లో రూ.లక్షను పొదుపు చేసి దాన్ని అలానే ఇంట్లో దాచి ఉంచారనుకోండి. ఇప్పుడు ఆ లక్ష వలువ రూ.7,451. పొదుపును పెట్టుబడులుగా మార్చి రాబడులను ఆర్జించకుంటే ఎంత దాచినా ద్రవ్యోల్బణం పేదవారిని చేస్తుందనడానికి ఇదే నిదర్శనం. -
వడ్డీ తగ్గుతోంది ! రిటైరయ్యాక ఎలా ?
ఎఫ్డీలపై గణనీయంగా తగ్గుతున్న రాబడి ► ఊహించని రీతిలో పెరుగుతున్న వైద్య వ్యయాలు ► అందుకోసం మూడంచెల భద్రత అవసరం ⇔ అత్యవసర నిధి ⇔ వైద్య బీమా ⇔ ఈక్విటీల్లో పెట్టుబడి ► అనవసర వ్యయాలు తగ్గించుకోవటమూ మంచిదే డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. బ్యాంకు ఎఫ్డీలపై 7 శాతానికి మించి వడ్డీ రావటం లేదు. మరి వడ్డీ ఆదాయాన్నే నమ్ముకున్న విశ్రాంత ఉద్యోగుల పరిస్థితేంటో ఒక్కసారి ఊహించుకోండి? ప్రైవేటు ఉద్యోగాలు కనక చాలామందికి పింఛన్ కూడా లేదు. మరి వాళ్లేం చేయాలి? తక్కువ వడ్డీ రేట్లున్న ఈ పరిస్థితుల్లో జీవనావసరాలను తీర్చుకునేందుకు వారికున్న ప్రత్యామ్నాయాలేంటి? ఇదే ఈ ప్రత్యేక కథనం... గడిచిన రెండు మూడేళ్ల కాలంలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగని ఖర్చులేమీ తగ్గిపోవటం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామి అవసరాలకు వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలు గతం కంటే ఎక్కువే అయ్యాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు నెలనెలా వడ్డీ ఆదాయంతోపాటు మూల నిధి నుంచి కొంత మేర వినియోగించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే మరో ఇబ్బంది ఎదురవుతుంది. తరిగిపోయిన అసలునిధి భవిష్యత్తులో తగినంత ఆదాయాన్నివ్వలేదు. జీవించి ఉన్నంత కాలం అవసరాలను తీర్చే స్థాయిలో అది ఉండకపోవచ్చు. ఇది కూడా ప్రమాదకరమే రిస్క్ సమంజసం కాదు... పెట్టుబడుల ద్వారా అధికంగా ఆదాయం పొందాలన్న ఆలోచనతో రిటైర్మెంట్ కాలంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న నిధిని ఇతర సాధనాల వైపు మళ్లించడం సరికాదు. ఎందుకంటే విశ్రాంత జీవనంలో ప్రశాంతత ముఖ్యం. ఆ సమయంలో ఆదాయం కోసం తీసుకునే రిస్క్ ఆందోళనను పెంచకూడదు. పైగా అసలు నిధికి భద్రత ఎంతో అవసరం. కార్పొరేట్ సంస్థలు చేతులెత్తేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నందున బాడ్ ఫండ్లు, కార్పొరేట్ డిపాజిట్లలో పెట్టుబడులూ సమంజసం కాదు. ఇక ఉన్న అవకాశాలు యాన్యుటీ పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లే. యాన్యుటీ పథకాల కంటే ఫిక్స్డ్ డిపాజిట్లలోనే రాబడి ఎక్కువగా ఉంది. తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పరిమితం చేసుకోవడం, రివర్స్ మార్ట్గేజ్ వంటి వాటి ద్వారా అవసరమైనంత పొందడం విశ్రాంత జీవనంలో ఉన్న వారి చేతుల్లో ఉన్న అవకాశాలు. ఆరోగ్యానికి రక్షణ ఉందా? అన్నింటికంటే ఖరీదైనది వైద్యం అని తెలిసిందే. అందుకే మలి జీవితంలో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా ఆరోగ్య రక్షణపై ప్రభావం పడకూడదు. ఇందుకోసం మూడెంచల రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. మొదటిది అత్యవసర నిధి. రెండోది వైద్య బీమా. మూడోది ఈక్విటీల్లో పెట్టుబడులు. వైద్య బీమాలో కొన్ని వ్యాధులు, సర్జరీలకు కవరేజీ ఉండదు. దానికి ఎక్కువ డబ్బే అవసరమవుతుంది. అందుకోసమే మూడో ఆప్షన్. వైద్య వ్యయాలనేవి అనుకోకుండా ఎదురవుతాయి. ఏ స్థాయిలో ఉంటాయన్నదీ ఊహించలేం. అందుకే ఈక్విటీల్లో కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొంత మేర రక్షణ కల్పించుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఎందుకంటే సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆరోగ్య రంగ ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది. ఈ లెక్కన సాధారణ వస్తువుల ధరలతో పోలిస్తే వైద్య వ్యయాల పెరుగుదల వేగంగా ఉంటుంది. మరి ఉన్నదంతా తీసుకెళ్లి సురక్షితమైనదన్న యోచనతో ఫిక్స్డ్ డిపాజిట్లలోనే పెడితే వచ్చే నామమాత్రపు వడ్డీ ఆదాయం ఏ మూలకు సరిపోతుందన్నది ఆలోచించాలి. అందుకే కొంత రిస్క్ ఉన్నప్పటికీ ఈక్విటీలో కొంచెం మెరుగైన రాబడులను ఆశించవచ్చు. ఖర్చులకు కళ్లెం వేయాలా? ఇటువంటి సందర్భాల్లో వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం సముచితం. వినోదం, కాలక్షేపం కోసం ఖర్చులకు బదులు జీవన వ్యయాలు, ఆరోగ్య వ్యయాలకే ప్రాధాన్యమివ్వాలి. ‘జీవితమంతా కష్టపడ్డాను ఇప్పుడైనా ఎంజాయ్ చేయకుంటే ఎలా’ అన్న భావన కలగడం అసహజమేమీ కాదు. అయితే మీకు వస్తున్న ఆదాయం మీ ఆకాంక్షలన్నింటినీ తీర్చే స్థాయిలో ఉంటే త్యాగం చేయాల్సిన అవసరం రాదు. కానీ, తక్కువ ఆదాయం ఉంటే మాత్రం కనీస అవసరాలే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోవాలి. ‘రివర్స్’ మందు!! సొంత ఇంటినే ఆదాయ వనరుగా మార్చుకునే ప్రత్యేక సదుపాయం... ఇది అనువైన సమయమే! వడ్డీ రేట్ల క్షీణత నేపథ్యంలో రివర్స్ మార్ట్గేజ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుత రేట్ల ప్రకారం చూస్తే రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్న వారికి రివర్స్ మార్ట్గేజ్ అనువైనదనేది నిపుణుల అభిప్రాయం. విశ్రాంత జీవనంలో ఉన్న వారికి ప్రధానంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీయే ఆధారం. మరి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 శాతానికి దిగివచ్చేశాయి కనక వడ్డీ ఆదాయానికీ చిల్లులు పడ్డాయి. రూ.50 లక్షలను ఎఫ్డీ చేస్తే గతంలో 9 శాతం వడ్డీ రేటున్నప్పుడు వార్షికంగా రూ.4.5 లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు 7 శాతం వడ్డీపై ఈ ఆదాయం రూ.3.5 లక్షలకు పడిపోయింది. ఆదాయం ఈ స్థాయిలో తగ్గిపోయినందున రివర్స్ మార్ట్గేజ్ తీసుకోవడానికి ఇది అనువైన సమయమన్నది నిపుణుల మాట. ఎక్కువ బ్యాంకులు 10–12 శాతం మధ్య వడ్డీ రేటు వసూలు చేస్తుండగా, ఐవోబీ మాత్రం 9.40 శాతానికే రుణమిస్తోంది. రివర్స్ మార్ట్గేజ్ పనిచేసేదెలా? ఇంటి కోసం రుణం తీసుకున్నామనుకోండి. ఒకేసారి రుణం తీసుకుని... నెలనెలా వాయిదాలు కట్టాల్సి ఉంటుంది. దానికి రివర్స్‌లో... మన దగ్గరున్న ఇంటిని బ్యాంకుకు తనఖా పెడతామన్న మాట. బ్యాంకే నెలనెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. అలా కాకుండా రుణం మొత్తం ఒకేసారి కావాలన్నా జారీ చేస్తుంది. కాల వ్యవధి తర్వాత ఏక మొత్తంలో రుణాన్ని, వడ్డీతో కలిపి తీర్చివేయాలి. 2007లో ఈ పథకం అమల్లోకి రాగా... ప్రారంభంలో ఈ పథకం పట్ల భారీ అంచనాలే వ్యక్తమయ్యాయి. కానీ, వాస్తవంగా చూస్తే ఆదరణ అంతగా లేదు. దీనికి కారణం వడ్డీ రేట్లు అధికంగా ఉండడమే. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు తమ సొంతింటిని రివర్స్ మార్ట్గేజ్ చేసుకునేందుకు అర్హత ఉంది. ఎలా తీసుకుంటే మేలు...? రివర్స్ మార్ట్గేజ్ రెండు విధాలుగా ఉంటుంది. అర్హత మేరకు రుణం మొత్తాన్ని బ్యాంకు ఖరారు చేసిన తర్వాత నెలసరి వాయిదాల రూపంలో లేదా మూడు నెలలు లేదా వార్షికంగా రుణాన్ని తీసుకోవచ్చు. కాదంటే ఏక మొత్తంలోనూ ఇస్తారు. ఒకేసారి రుణాన్ని తీసేసుకుంటే దాన్ని నెలనెలా ఆదాయం కోసం బ్యాంకు ఎఫ్డీ లేదంటే బీమా కంపెనీ పెన్షన్ యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. వీటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుంది. అదే బ్యాంకు నుంచి రుణాన్ని నెలసరి వాయిదాల రూపంలో అందుకున్నట్టయితే, అది రుణం కనుక దానిపై పన్ను పడదు. ఇంటి విలువలో ఎంత రుణం..? రివర్స్ మార్ట్‌గేజ్‌లో బ్యాంకులు రుణం తీసుకున్న వ్యక్తి మరణించినపుడు మాత్రమే రుణాన్ని వసూలు చేసుకోగలవు. అదే సమయంలో రుణ గ్రహీత మార్ట్గేజ్ కాల వ్యవధి వరకూ జీవించి ఉంటే... బ్యాంకులు రుణ వసూలును వాయిదా వేసుకోవాలి. దీంతో రిస్క్ పెరుగిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాంకులు అసలు ఇంటి విలువలో 40 శాతాన్ని మాత్రమే (ఎల్టీవీ) రుణంగా మంజూరు చేస్తున్నాయి. ఎవరికి అనుకూలం...? చక్కగా స్థిరపడిన వారికి తల్లిదండ్రుల పేరిట ఉన్న ఇంటితో దాదాపు అవసరం ఏర్పడదు. అలాంటి పిల్లల తాలూకు తల్లిదండ్రులు రివర్స్ మార్ట్గేజ్ రుణ పథకాన్ని పరిశీలించొచ్చు. అలాగే, వస్తున్న ఆదాయం కంటే ఖర్చులు అధికం కావడం తరచూ జరుగుతుంటే రివర్స్ మార్ట్గేజ్ ఓ మంచి అవకాశమేనంటున్నారు నిపుణులు. ఒకవేళ ఆదాయం, ఖర్చుల మధ్య అంతరం తక్కువగా ఉంటే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలూ చూడొచ్చన్నది వారి సలహా. బ్యాంకు ఎఫ్డీల్లోనుంచి పెట్టుబడులను స్వల్పకాలిక డెట్ ఫండ్స్‌కు మళ్లించడం ద్వారా కొంచెం అధిక రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. విధి, విధానాలు ► 60 ఏళ్లు ఆపైబడిన వారే రుణానికి అర్హులు. దంపతులు ఇద్దరి పేరిటా తీసుకోవచ్చు. కాకపోతే అందులో ఒకరి వయసు 60, ఆపైన ఉండాలి. ► రుణ కాల వ్యవధి గరిష్టంగా 20 ఏళ్లు. బ్యాంకుల మధ్య ఈ విషయంలో తేడాలున్నాయి. వాస్తవానికి తనఖా పెడుతున్న ఇంటి మిగిలిన జీవిత కాలం రుణ కాల వ్యవధికి కీలకం. ► రుణ గ్రహీత మరణానంతరమే బ్యాంకులు రుణాన్ని వసూలు చేసుకుంటాయి. ఉదాహరణకు బ్యాంకు 20 ఏళ్ల కాలవ్యవధితో మార్ట్గేజ్ రుణాన్ని జారీ చేసిందనుకుందాం. రుణగ్రహీత 30 ఏళ్లు జీవించి ఉంటే, అప్పటి వరకూ బ్యాంకులు రుణాన్ని వసూలు చేసుకోవు. ► రుణ గ్రహీత మరణానంతరం అతని వారసులకు రుణాన్ని చెల్లించే హక్కుంటుంది. వారసులు రుణాన్ని చెల్లించేందుకు ముందుకు రాకపోతే, బ్యాంకులు అప్పుడు తనఖాలో ఉన్న ఇంటిని వేలం వేస్తాయి. అలా వచ్చిన ఆదాయంలో రుణం, వడ్డీ పోను ఏమైన మిగిలి ఉంటే ఆ మొత్తాన్ని చట్టబద్ధమైన వారసులకు అందిస్తాయి. ► ఇంటి రుణం మాదిరిగానే ప్రాసెసింగ్ చార్జీలు వంటివి మామూలే. -
ఎఫ్డీలకు సెలవ్..!
• ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు ఎన్నో • వడ్డీ రేట్లూ తగ్గినంత కాలం డెట్ ఫండ్స్ ఆకర్షణీయమే • పోస్టాఫీసు పథకాల్లోనూ మెరుగైన రాబడులు • ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌తో రాబడులు, పన్ను ఆదా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇతర స్థిరాదాయ పథకాలపైనా వడ్డీ రేట్లు ఆశాజనకంగా లేవు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఒక శాతానికి మించి రాబడులను ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మంచి రాబ డుల కోసం ఇన్వెస్టర్లు ఈ ప్రత్యామ్నాయాల వైపు చూడొచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ⇔ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లలో రాబడులకు హామీ ఉండదు కానీ, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు మించి రాబడులను ఇస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. డెట్ ఫండ్స్‌లోనూ రిస్క్ కాల వ్యవధులను బట్టి... లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇన్కమ్, డైనమిక్ బాండ్ ఫండ్స్ ఇలా భిన్న రకాలు ఉన్నాయి. ⇔ నెలకోసం అయితే లిక్విడ్ఫండ్ అనువుగా ఉంటుంది. ⇔ నెల నుంచి మూడు నెలల వరకు పెట్టుబడి పెట్టేట్టు అయితే అల్ట్రా షార్ట్ టర్మ్ ఎంచుకోవచ్చు. ⇔ కనీసం ఓ ఏడాది పాటు పెట్టుబడి కదిలించను అని అనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్ ఫండ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ⇔ పెట్టుబడుల కాల వ్యవధి మూడేళ్లు అయినా çపర్వాలేదనుకుంటే ఇన్కమ్ ఫండ్ అనువైనది. ⇔ మొదటి మూడు ఫండ్లలో రిస్క్ ఉండదు. ఇన్కమ్ ఫండ్, మూడేళ్లకు మించి పెట్టుబడి కోసం ఎంచుకునే ఫండ్లలో రిస్క్ ఉంటుందని తెలుసుకోవాలి. డైనమిక్ బాండ్ ఫండ్స్ స్థిరమైన రాబడులకు డైనమిక్ బాండ్స్ లో అవకాశం ఉంటుంది. భిన్న రకాల కాల వ్యవధులు, వడ్డీ రేట్లతో కూడిన పథకాల్లో మదుపు ద్వారా స్థిరమైన, మోస్తరు రాబడులను అందిస్తాయి. అక్రూయెల్ డెట్ ఫండ్స్ పెట్టుబడిలో కొంత భాగం అక్రూయెల్ డెట్ ఫండ్స్ కు కేటాయించుకోవడం కూడా సమంజసమే. వీటిలో పెట్టుబడులు కాలాన్ని బట్టి కాకుండా వడ్డీ రేట్ల ప్రాధాన్యం ఆధారంగానే ఉంటాయి. దీంతో రిస్క్ దాదాపుగా ఉండదు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ (ఎఫ్ఎంపీ) ఈ పథకాలు బ్యాంకు ఎఫ్‌డీల కంటే అర శాతం నుంచి ఒక శాతం ఎక్కువ రాబడులను ఇస్తాయి. గడువు తీరే వరకు వీటిలో పెట్టుబడులను కొనసాగించడం వల్ల వడ్డీ రేట్ల పరంగా ఆటు పోట్లు లేకుండా చూసుకోవచ్చు. పోస్టాఫీసు పథకాలు పోస్టాపీసు పథకాల వడ్డీ రేట్లు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయి. పీపీఎఫ్‌పై రాబడులకు పన్ను ప్రయోజనాలు, సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజనపై కూడా వడ్డీ రేట్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) కంపెనీలు జారీ చేసే ఎన్సీడీలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లనే ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీ ఆర్థిక సామర్థ్యం, వ్యాపారం వృద్ధిలో ఉందా, బ్యాలన్స్ షీటు తదితర వివరాలు పరిశీలించే ఇన్వెస్ట్చేయాలి. లేదంటే అసలుకే ముప్పు ఏర్పడుతుంది. ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అధిక పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఇవి చక్కగా నప్పుతాయి. 10 నుంచి 20 ఏళ్ల కాలంలో అధిక రాబడులను అందుకోవచ్చు. -
ఆ రుణం ఉంచుకోవద్దు!!
క్రెడిట్ కార్డు!!. అత్యవసర సమయంలో ఆదుకునే ఓ సాధనం. అలాంటపుడు వాడితేనే ప్రయోజనం. అలాకాకుండా అయినదానికీ, కాని దానికీ వాడితే చివరకు వాడేందుకు ఏమీ మిగలదు. ఎక్కువ మంది చేస్తున్నదిదే. ఫలితం... అప్పు తీర్చలేని పరిస్థితిలోకి వెళుతున్నారు. వారి క్రెడిట్ చరిత్రపై బ్లాక్ మార్కు పడిపోతోంది. భవిష్యత్తులో రుణాలు పుట్టని పరిస్థితి ఎదురవుతోంది. అలా క్రెడిట్ కార్డు అప్పుల్లో చిక్కుకున్న వారికోసం నిపుణులుచెప్పిన సలహాల సమాహారమే ఈ కథనం... క్రెడిట్ కార్డు రుణాలు తీర్చేయటమే బెటర్ ⇒ బ్యాంకులో నగదు; ఎఫ్డీలు ఏదైనా వాడొచ్చు ⇒ ఆఖరికి వేరే అప్పు చేసైనా ఇది తీర్చేస్తే మేలు ⇒ రుణాల్లో చిక్కుకున్నవారికి నిపుణుల సలహాలివీ.. 2015లో దేశంలో క్రెడిట్ కార్డు వినియోగదారులు కార్డుల ద్వారా చేసిన వ్యయం రూ.1,90,000 కోట్లు. ఇదే ఏడాదిలో డెబిట్ కార్డులపై వినియోగం రూ.1,21,300 కోట్లు. ఇది చాలు. క్రెడిట్ కార్డుల కుటుంబంలో చేరుతున్న వారి సంఖ్య ఎలా పెరుగుతోందో చెప్పటానికి. అవసరమేదైనా క్రెడిట్ కార్డుతో గట్టేక్కేయొచ్చన్న ధోరణి పెరగటం వల్లే క్రెడిట్ కార్డుల లావాదేవీలు బుల్లెట్ రైలు వేగంతో విస్తరిస్తున్నాయి. బ్యాంకులో నగదు... క్రెడిట్ కార్డుపై అప్పు కొందరు బ్యాంకు ఖాతాలో నగదు ఉంచుకుని క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. ద్రవ్యోల్బణాన్ని కాచుకునే వడ్డీ కూడా గిట్టుబాటు కాని చోటేదైనా ఉందంటే అది బ్యాంకు ఖాతానే. మరి అక్కడ వృథాగా ధనాన్ని పోగేసుకుని... క్రెడిట్ కార్డుపై రెండు మూడు రూపాయల వడ్డీ చెల్లించటం తెలివైన పనా? వెంటనే బ్యాంకు ఖాతాలో ఉన్న నగదుతో క్రెడిట్ కార్డు అప్పు తీర్చేయటం మంచి చర్య అనిపించుకుంటుంది. అలాగే కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకున్న డబ్బును బయటకు తీయడానికి మనసు ఒప్పక.... క్రెడిట్ కార్డును వాడేస్తుంటారు. ఇది కూడా సరికాదు. ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఏడు శాతం మించి వడ్డీ రాని పరిస్థితిలో అక్కడ నగదు ఉంచడం కన్నా... ఆ డిపాజిట్‌ను రద్దు చేసి క్రెడిట్ కార్డు అప్పు తీర్చేయడం మంచిది. ప్రణాళిక మేరకు నడచుకోవాలి... నగదు అందుబాటులో ఉంటే సమస్య ఎందుకు వస్తుందంటారా...? నగదు అందుబాటులో లేదంటారా? అయితే క్రెడిట్ కార్డుపై పేరుకుపోయిన రుణాన్ని తీర్చేందుకు ఓ ప్రణాళిక రచించుకోవాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రూ.లక్ష బకాయి ఉంది. దాన్ని ఓ ఏడాదిలో తీర్చాలి. నెలకు అసలు వడ్డీ కలిపి తక్కువలో తక్కువ ఓ పదివేల రూపాయలైనా చెల్లిస్తూ వెళ్లడం ఓ మార్గం. బదులు అడగండి... నెలనెలా చెల్లించేటంత ఆర్థిక వెసులుబాటు లేకపోతే... అయిన వారినో, సన్నిహితులనో, స్నేహితులనో నమ్ముకోవాల్సిందే. కాస్త మొహమాటాన్ని పక్కన పెట్టి సమస్య గురించి తెలియజేసి సాయం అడగండి. వడ్డీ లేకుండా సాయం చేసేందుకు ఒక్కరైనా ముందుకు రావచ్చు. దాంతో క్రెడిట్ కార్డు అప్పు తీర్చేయండి. ఒకవేళ వడ్డీ డిమాండ్ చేసినా బ్యాంకు వడ్డీ రేటు... కాదు కూడదంటే మరో రెండు శాతం అదనంగా ఇచ్చినా క్రెడిట్ కార్డు రుణ ఊబి నుంచి బయట పడవచ్చు. ఎవరూ ఆదుకోలేదా...? ఎవరూ సాయం చేయకపోయినా... మనస్తాపం చెందకుండా పర్సనల్ లోన్ తీసుకునే ప్రయత్నం చేయండి. 14 శాతం వడ్డీ రేటు నుంచే వ్యక్తిగత రుణాలు లభిస్తున్నాయి. క్రెడిట్ కార్డుపై వడ్డీ కంటే ఇది చాలా చౌక. క్రెడిట్ కార్డులపై వడ్డీ చక్రవడ్డీలన్నీ కలుపుకుని 40 శాతం వరకూ ఉంటుంది. ముందు భారీ వడ్డీ భారాన్ని వదిలించుకుంటే వ్యక్తిగత రుణాన్ని నిదానంగా తీర్చుకోవచ్చు. సెటిల్మెంట్... ఇక అందుబాటులో ఉన్న మరో మార్గం... ‘ఉన్నపళంగా అంతా తీర్చలేను... రుణాన్ని ఈఎంఐలుగా మార్చండి. రెండేళ్ల గడువు ఇవ్వండి. వడ్డీ తగ్గించండి. లేకుంటే అసలు కూడా చెల్లించే పరిస్థితి లేదు’ అని తేల్చి చెప్పండి. మొండి బకాయిలను వదిలించుకునే పనిలో బ్యాంకులున్నాయి. మీ డిమాండ్‌కు తలొగ్గి ఓ అవకాశం ఇచ్చి చూడవచ్చు. డిమాండ్ చేయాలేగానీ వడ్డీ రేటు 18 శాతానికి, అంతకంటే తక్కువకు కూడా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. కొత్త రుణంతో పాత రుణానికి బైబై ఏ విధంగా చూసినా క్రెడిట్ కార్డు రుణం చెల్లించలేని పరిస్థితి ఎదురైతే... మరో క్రెడిట్‌కార్డు తీసుకోవడమే చక్కని పరిష్కారం. కొత్త కార్డుపై వచ్చిన రుణంతో పాత కార్డు రుణం నుంచి విముక్తి పొందవచ్చు. పైగా కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వారికి 3 నెలల వరకు వడ్డీ రహిత రుణాలిచ్చే ఆఫర్లు ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని నెలల పాటు చాలా తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఏదో ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిరోభారంగా మారిన పాత బకాయిని వదిలించుకోవడం మనసును తేలిక పరుస్తుంది. -
’పిల్’నిబంధనలు మరింత కఠినం!
-
‘పిల్’ నిబంధనలు మరింత కఠినం!
దుర్వినియోగం జరక్కుండా హైకోర్టు చర్యలు * వ్యక్తిగత వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఇవ్వాలి * ఆదాయమార్గాలూ వెల్లడించాలి * న్యాయవాదికిచ్చే ఫీజు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి * మీపై ఉన్న సివిల్, క్రిమినల్, రెవెన్యూ వివాదాలనూ పేర్కొనాలి * పిటిషనర్ ఉద్దేశాలపై ధర్మాసనానికి సందేహం వస్తే రూ.50 వేల ఎఫ్డీ * రిజిస్ట్రార్ సంతృప్తి చెందితేనే పిల్‌కు నంబర్ సాక్షి, హైదరాబాద్: మీరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయాలని భావిస్తున్నారా..? గతంలో అలా పిల్ దాఖలు చేసి.. ఇలా అనుకూల ఉత్తర్వులు పొందారా..? అయితే ఈసారి పిల్ దాఖలు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి. నిన్నటి వరకు ఆషామాషీగా దాఖలు చేసిన విధంగానే ఇకపై పిల్ దాఖలు చేస్తామంటే కుదరదు. పిల్ దాఖలు పేరుతో న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసే వ్యక్తులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో వారికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ప్రజా ప్రయోజన వ్యాజ్య నిబంధనలు-2015ను ఉమ్మడి హైకోర్టు రూపొందించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు విషయంలో హైకోర్టులు వాటికి తగ్గట్టు స్వీయ నిబంధనలను రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఎవరు దాఖలు చేయాలి.. ఏ రూపంలో దానిని దాఖలు చేయాలి.. ఎవరు దానిని విచారించాలి.. తదితర వివరాలను కూడా వాటిలో పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో పాటు జత చేయాల్సిన వాటి గురించి కూడా సవివరంగా పొందుపరిచారు. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఓ అంశాన్ని సుమోటో (తనంతట తాను) పిటిషన్‌గా స్వీకరించవచ్చు. ప్రధాన న్యాయమూర్తి నియమించే పిల్ కమిటీ లేదా హైకోర్టు న్యాయమూర్తి చేసే సిఫారసుల ఆధారంగా ఓ అంశాన్ని పిల్‌గా విచారించవచ్చు. పౌరుని నుంచైనా, న్యాయ విద్యార్థుల నుంచైనా, న్యాయవాదుల సంఘం నుంచైనా, న్యాయసేవాధికార సంస్థ నుంచైనా లేఖలు గానీ, వినతిపత్రాలు గానీ అందుకున్నప్పుడు వాటిని ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు పిల్‌గా పరిగణించి విచారించాలి.. పిల్ రూపంలో నేరుగా ఏ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌నైనా విచారించవచ్చు. కోర్టు సందేహిస్తే రూ.50 వేలను సిద్ధం చేసుకోవాల్సిందే పిల్ దాఖలు సమయంలో మీరు పొందుపరిచిన వివరాలు, అందించిన సమాచారం విశ్వసించదగినదిగా లేదని విచారణ సమయంలో ధర్మాసనం భావిస్తే, ఈ పిల్ దాఖలు వెనుక మీకున్న సదుద్దేశాలను నిరూపించుకోవాలని, దానికి ముందు కనీసం రూ.50 వేలను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో రిజిస్ట్రార్(జ్యుడీషియల్) పేరు మీద జమ చేయాలని కక్షిదారుడిని ఆదేశించవచ్చు. ధర్మాసనం తనంతట తానుగా లేదా ఆ పిల్లోని ఇతర పార్టీల అభ్యర్థన మేర ఫిక్స్డ్ డిపాజిట్‌కు ఆదేశాలివ్వొచ్చు. తమ ముందున్న వ్యాజ్యంలో విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయని ధర్మాసనం భావిస్తే, ఏ కక్షిదారుడికైనా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వొచ్చు. ఒకవేళ ఏదైనా సంస్థ పిల్ దాఖలు చేయాలని భావిస్తే, దాని అధీకృత అధికారి, ప్రతినిధులు పిటిషనర్ అయి ఉండాలి. విచారణ సమయంలో ఆ సంస్థ అధీకృత అధికారి, ప్రతినిధి మారితే, ఆ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకురావాలి. 30 రోజుల్లో పిల్లో అందుకు అనుగుణంగా మార్పులు చేయాలి. పిల్ దాఖలు చేయాలంటే... 1. పిల్ దాఖలు చేసే వ్యక్తి లేదా సంస్థ లేదా సంఘం తన వ్యాజ్యంలో పూర్తి పేరు, పోస్టల్ అడ్రస్, ఈ మెయిల్, మొబైల్ నంబర్, వ్యక్తిగత గుర్తింపునకు ఆధారం, వృత్తి, వార్షిక ఆదాయం, బ్యాంకు ఖాతా, పాన్ నంబర్, ఆధార్ నంబర్ తదితరాలను పొందుపరచాల్సి ఉంటుంది. 2. అన్ని పత్రాలపై పిటిషనర్ సంతకం చేసి, వాటిని సీల్డ్కవర్లో కోర్టు రిజిస్ట్రీ ముందుంచాలి. 3. థర్డ్‌పార్టీ ఎవరూ కూడా ఆ వివరాలను చూడకుండా ఆ సీల్డ్‌కవర్‌ను ఒరిజినల్ బండిల్‌తో జత చేయాలి. 4. పిటిషనర్ వృత్తి, అతని పూర్వ వివరాలు, తన విశ్వసనీయతకు సంబంధించిన వివరాలు, పిల్లో తాను లేవనెత్తిన విషయానికీ తనకూ ఉన్న సంబంధం తెలియజేయాలి 5. గతంలో కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కొన్నారా..? ఆ కేసుకు సంబంధించి ప్రస్తుత దశ, ఇతర వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. 6. గతంలో ఏదైనా కోర్టు తదుపరి ఎటువంటి పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చిందా..? ఉంటే వాటి వివరాలను తెలియచేయాలి. 7. పిల్లో లేవనెత్తిన అంశం ఏ విధంగా ప్రజా ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందో వివరించాలి. 8. సివిల్, క్రిమినల్, రెవెన్యూ వివాదాల్లో తన పాత్ర ఏమైనా ఉంటే వాటి వివరాలు, పిల్లో లేవనెత్తిన అంశంపై న్యాయపరంగా తనకేమైనా సంబంధం ఉంటే దాని గురించి తెలియజేయాల్సి ఉంటుంది. 9. పిల్లో తాను లేవనెత్తిన అంశంలో తనకున్న జోక్యం చేసుకునే హక్కు, అర్హత గురించి వివరించాలి. 10. అన్నింటికన్నా ముఖ్యమైంది ఈ కేసు దాఖలు చేసేందుకు, న్యాయవాదికి ఫీజు చెల్లించేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, అందుకు సంబంధించిన మార్గాలను తెలియజేయాల్సి ఉంటుంది. గమనిక: మీరు పొందుపరిచిన ఈ వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయని కోర్టు రిజిస్ట్రీ భావిస్తే, అప్పుడే మీ పిల్‌కు పూర్తిస్థాయి నంబర్ కేటాయిస్తారు. తరువాత ఆ పిల్ ధర్మాసనం ముందు విచారణకు వస్తుంది. -
ఐపీఓల కన్నా ఎఫ్‌డీలే మిన్న!
న్యూఢిల్లీ: గత పదేళ్లలో ఐపీఓల్లో కన్నా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) లోనే రాబడులు అధికంగా వచ్చాయని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఐఐఏఎస్ తెలిపింది. ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడమనేది జూదంగా మారిపోయిందని పేర్కొంది. పలు కంపెనీలు ఐపీఓల కోసం క్యూ కట్టిన నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడి కావడం విశేషం. 2003, ఏప్రిల్ 1 నుంచి 2014, జూలై మధ్యకాలంలో వచ్చిన 394 ఐపీఓలపై అధ్యయనం నిర్వహించిన ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.., 2003, ఏప్రిల్ నుంచి వచ్చిన ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లలో 60 శాతం మంది సొమ్ములు పూర్తిగా కరిగిపోయాయి. గత పదేళ్లలో వచ్చిన ఐపీఓల పనితీరు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచలేకపోయింది. ఐపీఓల్లో ఆఫర్ చేసిన ధర కంటే అధిక ధరకు ట్రేడవుతున్న కంపెనీలు 42 శాతంగానే (162) ఉన్నాయి. అయితే ఈ ఐపీఓల ద్వారా పెద్దగా రాబడులేమీ రాలేదు. బుల్ రన్‌లోనే ఐపీఓలకు ఈ స్థాయి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ కాలంలో వచ్చిన ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడానికి బదులుగా ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులే వచ్చేవి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా దక్కేవి. 70 శాతం (245) కంపెనీల షేర్ల ధరలు ఆఫర్ ధర కంటే తక్కువగానే ట్రేడవుతున్నాయి. ఈ కాలంలో మొత్తం ఇరవై ప్రభుత్వ రంగ కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వీటిల్లో నాలుగు కంపెనీలు(ఎంఓఐఎల్, ఎన్‌హెచ్‌పీసీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) షేర్ల ధరలు ఐపీఓ ఆఫర్ ధర కన్నా తక్కువగా ట్రేడవుతున్నాయి. తగిన నియమనిబంధనలను పాటించలేదన్న కారణంగా ఈ కాలంలో వచ్చిన మొత్తం ఐపీఓల్లో 25 కంపెనీల ట్రేడింగ్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్ లు నిలిపేశాయి. -
ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: భారత బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొన్ని స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను అరశాతం వరకూ తగ్గించింది. బ్యాంక్ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. దీనిప్రకారం 179 రోజుల వరకూ డిపాజిట్లపై వడ్డీరేటు అరశాతం తగ్గింది. 7-179 రోజుల మధ్య డిపాజిట్లపై వడ్డీరేటు అరశాతం తగ్గి 7.5% నుంచి 7%కి చేరింది. కొత్త రేటు ఈ నెల 18వ తేదీ నుం చీ అమల్లోకి వస్తుంది. ఇక రూ.కోటి రూపాయలకు పైబడిన డిపాజిట్ రేట్లకు సంబంధించి రెండు మెచ్యూరిటీల విషయంలో వడ్డీరేటు తగ్గింది. 7-60 రోజుల మధ్య రేటు పావుశాతం తగ్గింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి దిగింది. 61 రోజుల నుంచి యేడాది వరకూ రేటు ప్రస్తుత 7 శాతం నుంచి 6.75 శాతం తగ్గింది.