న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది కాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీలు) రేట్లను పెంచింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు ఏడాది కాల డిపాజిట్‌పై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇది ఇంతకుముందు 6 శాతం ఉండేది. అంటే 100 బేసిస్ పాయింట్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది.
అదే 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏడాది కాల ఎఫ్‌డీపై 7.50 శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 7.65 శాతం ఇస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. తాజా రేట్ల సవరణ తర్వాత ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలం వరకు డిపాజిట్లపై రేట్లు 3–7 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు దేశీయ, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లకు వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment