increases
-
రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' రూ.1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దేశీయ విఫణిలో తయారైన ఈ కారు ధర రూ.5 లక్షలు పెరిగింది. బ్రాండ్ ఇప్పుడు డైనమిక్ ఎస్ఈ వేరియంట్‌ను నిలిపివేసి.. స్థానికంగా తయారైన 'డైనమిక్ హెచ్ఎస్ఈ' వేరియంట్‌తో భర్తీ చేశారు.2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ.. 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 400 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 351 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతాయి.సాంటోరిని బ్లాక్, వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, ఛారెంటే గ్రే, జియోలా గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆటో పార్కింగ్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ అండ్ హీటెడ్ రియర్ సీట్లు వంటి వాటిని పొందుతుంది.కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, లో స్పీడ్ మ్యాన్యువరింగ్ లైట్లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. -
Delhi: మెట్రో సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో 77 లక్షల మంది ప్రయాణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తుంటారు. ఆగస్టు నెలలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అన్ని రికార్డులను అధిగమించింది. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన ఒక్కరోజులో ఢిల్లీ మెట్రోలో 77,49,682 మంది ప్రయాణించారు. ఇది ఇప్పటి వరకు ఒక్కరోజులో అత్యధికంగా ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య.ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య సాధారణంగా 72 లక్షల నుంచి 78 లక్షల మధ్య ఉంటుంది. పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) శుక్ర, శనివారాల్లో అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.డీఎంఆర్సీ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) అనూజ్ దయాల్ మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, డీఎంఆర్సీ అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించిందన్నారు. మొత్తం 84 అదనపు ట్రిప్పులను శుక్రవారం, శనివారాల్లో నడపనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Hindi Day: హిందీ అధికారిక భాష ఎలా అయ్యింది? -
వదలని వరద.. తొలగని బురద
(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షిప్రతినిధి): ఊహకందని విలయం..మాటలకందని విషాదం నుంచి ఎనిమిది రోజులైనా విజయవాడ నగరం తేరుకోలేకపోతోంది. బుడమేరు చేసిన వరద గాయం నుంచి మానకపోగా, బురద చేస్తున్న కొత్త గాయాలతో అల్లాడుతోంది. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకూ కంటిమీద కునుకు లేకుండా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్న సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీలతో పాటు వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీ, పాలఫ్యాక్టరీ ఫ్లై ఓవర్ కింద రామరాజ్యనగర్, పంజాసెంటర్, చిట్టినగర్ సొరంగం, కబేళారోడ్డు, సితార సెంటర్, నిజాంగేట్ సెంటర్, వించిపేట, కంసాలిపేటలో వరద తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. బుడమేరు ఉగ్రరూపంగత నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షానికి పరీవాహకప్రాంతం నుంచి బుడమేరుకు భారీగా నీరు వచ్చి చేరింది. మూడు చోట్ల గండి పడింది. వెలగలేరు నుంచి ఆ వరదంతా వచ్చి విజయవాడ నగరాన్ని ఈనెల 1వ తేదీ ఉదయం ముంచెత్తింది. ఆ వరద నీరు ముందుగా ప్రవేశించిన వైఎస్సార్‌కాలనీ, జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతానికి చేరుకున్న తొలిమీడియా ‘సాక్షి’కి అడుగడుగునా బాధితుల కష్టాలు కనిపించాయి. అక్కడ బుడమేరు నేటికీ ఉగ్రరూపంలోనే ఉంది. పూర్తిగా మునిగిపోయిన ఆ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. రాకపోకలు లేక అక్కడి ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. ఎనిమిది రోజులుగా నీటిలోనే ఇళ్లు నానిపోతుండటంతో గోడలు ఏ క్షణాన కూలిపోతాయోనని తప్పనిసరై పై అంతస్తుల్లోనే ఆశ్రయం పొందుతున్న బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.కన్నీరేగాని... మంచి నీరేదిబుడమేరు వరదలకు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన లక్షలాది మందికి తమ భవిష్యత్తు ఏమిటో అర్ధం కావడం లేదు. ముంపు ప్రాంతాల్లో చిధ్రమైన వారి జీవితాలు ఇప్పట్లో కోలుకునేలా లేవు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజల కన్నీరు ఇంకిపోతుందేమోగానీ ఆ అభాగ్యుల కష్టాలు తీరేలా కనిపించడం లేదు. కనీసం బురదైనా తొలగడం లేదు. వన్‌టౌన్ ప్రాంతంలో వరద నీటిలో రోజుల తరబడి మునిగిపోయిన కాలనీలు, వీధులు, రోడ్లు, ఇళ్లు బురద, చెత్తతో నిండిపోయాయి. ఆదివారం ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో వాటిని తొలగించుకునేందుకు బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, కంసాలిపేటలో బురదతో పాటు డ్రెయినేజీ నీటితో పాటు, కాలకృత్యాలు కూడా అదే నీటిలో కలిసిపోవడంతో అదంతా భారీగా దుర్ఘందాన్ని వెదజల్లుతోంది.వరద నీటిలోనే రోజుల తరబడి నరకయాతన అనుభవించిన వారిలో కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోతుంటే, మరికొందరు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ వీరికి కనీసం తాగేందుకు మంచి నీరు దొరకడం లేదు. వంట సరుకులు, కూరగాయలు తెచ్చుకున్నాగానీ వాడుకునేందుకు నీళ్లు లేక పొయ్యి వెలిగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీరూ మురుగుతో నిండి ఉంటోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధుల భయంతో చాలా మంది ఇళ్లకు తిరిగిరావడం లేదు. దీంతో వారంగా వేలాది ఇళ్లకు తాళాలు వేసే ఉన్నాయి. పూర్తిగా ఇళ్లు కూలిపోయి గూడు కోల్పోయిన వారిలో కొందరు చిట్టినగర్ వద్ద సొరంగంలో తలదాచుకుంటున్నారు. స్ఫూర్తినింపుతున్న ప్రజలువరద వల్ల లక్షలాది మంది ఉపాధి, వ్యాపారాలు లేక రోడ్డున పడ్డారు. వారిలో కొందరు చిరు వ్యాపారులు విషాదం నుంచి తేరుకుంటున్నారు. దుకాణాల్లో పేరుకుపోయిన బురదను తొలగించుకుని, పాడైపోయిన వస్తువులు, సరుకులు బయటపడేసి మళ్లీ కొత్తగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోలుకోలేని కష్టం నుంచి తేరుకుని దుకాణాలను తెరిచి స్ఫూర్తినింపుతున్నారు. వృద్ధులు, చిన్నారులను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సితార సెంటర్, కబేళ రోడ్డు, రామరాజ్య నగర్, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీలు నేటికీ వరద నీరు పూర్తిగా తొలగలేదు.ఇక్కడ పలు వీధులకు ఇప్పటికీ ప్రజల రాకపోకలకు అవకాశం లేదు. అలాంటి చోటికి ప్రభుత్వం నుంచి ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు చేరడం లేదు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ వేలాది వాహనాలు నీళ్లలోనే ఉండిపోయాయి. అవన్నీ పాడైపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వదిలేస్తున్నారు. తరలించేందుకు అవకాశం ఉన్నవాటిని అతి కష్టం మీద మరమ్మతులకు తీసుకువెళుతున్నారు. ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నప్పటికీ అవి నీటిలో మొరాయిస్తున్నాయి.సర్వం కోల్పోయాం ఆదుకోవాలిమేము కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆదివారం ఉదయం బుడమేరు వరద ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కట్టుబట్టలతో బిల్డింగ్‌పైకి పరుగులు పెట్టాం. రెండు రోజుల పాటు ఆహారం, మంచినీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాం. కరెంట్ లేదు. ప్రభుత్వ సహాయక చర్యలు మాదాకా రాలేదు. తెలిసిన వాళ్ల ద్వారా పడవను తెప్పించుకుని ఒడ్డుకు చేరాం. బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నాం. వారం రోజుల తర్వాత ఇంటిలోకి వెళ్లి చూస్తే గృహోపకరణాలన్నీ వరదలో తడిసి పాడైపోయాయి. ఇళ్లంతా బురద పేరుకుపోయింది. సర్వం కోల్పోయి తీవ్రంగా నష్ట పోయాం. ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి. – రేగాని సామ్రాజ్యం, వాంబేకాలనీ, సింగ్‌నగర్ లంటీర్లు ఉంటే ఈ కష్టాలు ఉండేవి కాదుఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. వరదలో ఇల్లు మునిగిపోయింది. ఆటో వరదలో మునిగి పాడైపోయింది. మా దగ్గర చిల్లిగవ్వలేదు. వారం రోజులుగా ఆహారం లేక, మంచినీరు అందక నరకం చూస్తున్నాం. వలంటీర్లు ఉంటే కుటుంబంలో అందరికీ ప్రభుత్వంఅందిస్తున్న సహాయ చర్యలు సక్రమంగా అందేవి. ఇప్పుడు ప్రధాన రోడ్డు వరకే ట్రాక్టర్ వస్తోంది. అక్కడకు వెళితే భోజనం ప్యాకెట్లు, వాటర్ ఇస్తున్నారే తప్ప చిన్న వీధుల్లోకి రావడం లేదు. భోజనం ప్యాకెట్లు తెరిచి చూస్తే వాసన వస్తోంది. తినలేకపోతున్నాం. – పలిశెట్టి సురేష్, సింగ్‌నగర్ -
1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు
తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో 2014–15లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగువిస్తీర్ణం 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పంట ఉత్పత్తి కూడా అదే స్థాయిలో 1.50 కోట్ల టన్నుల నుంచి 3.62 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే పంట ఉత్పత్తి 2014తో పోలి్చతే ఏకంగా 137 శాతం పెరగడం గమనార్హం.వరిసాగులో దేశంలో అగ్రగామిగా నిలిచింది. 2014–15లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు కాగా, 2022–23లో ఇది ఏకంగా 121 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 86 లక్షల ఎకరాల్లో వరి సాగు పెంపు కారణంగా, ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014–15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2022–23 నాటికి ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది. – సాక్షి, హైదరాబాద్రూ.75 వేల కోట్లు రైతుబంధు కింద జమ ⇒ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతులకు అందించారు. ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే జమ చేశారు. ప్రతి సీజన్లో సుమారు 65 లక్షల మందికి రూ.7,500 కోట్ల వరకు అందించేవారు. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రూ. 75 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. ⇒ కేసీఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 1.15 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల పరిహారాన్ని అందించింది. లక్ష రుణమాఫీఅప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. ఇందులో భాగంగానే తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిన కేసీఆర్ సర్కారు.. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రూ.లక్ష మాఫీకి హామీ ఇచ్చింది. ఇందులో 2014లో తొలిసారి 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది.ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 23 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, మరో రూ. 6 వేల కోట్ల రుణాల మాఫీ పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో అడ్డంకి ఏర్పడింది. ఇప్పుడు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దాదాపు రూ. 35 వేల కోట్లు అవసరమవుతాయని అంటున్నారు. -
పాక్‌ను శక్తివంతం చేస్తున్న చైనా? లక్ష్యం ఏమిటి?
చైనా గత మూడేళ్లుగా పాకిస్తాన్‌కు రక్షణ సహకారాన్ని అందిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్‌కు రక్షణ సహాయాన్ని కల్పిస్తోంది. బంకర్ల నిర్మాణానికి, మానవరహిత యుద్ధ వైమానిక వాహనాల విస్తరణకు సాయం చేస్తోంది. ఇంతేకాకుండా ఎల్ఓసీలో రహస్య కమ్యూనికేషన్ టవర్‌ర్లను ఏర్పాటు చేయడం, భూగర్భ ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేయడంలోనూ పాక్‌కు చైనా సహాయం చేస్తోంది.చైనాకు చెందిన అధునాతన రాడార్ సిస్టమ్‌లైన ‘జేవై’, జీహెచ్‌ఆర్‌ల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎల్ఓసీలో ప్రయోగాలు చేస్తోంది. అలాగే పాక్ సైన్య, వైమానిక రక్షణ విభాగాలకు కీలకమైన ఇంటెలిజెన్స్ మద్దతును చైనా అందిస్తోంది. తాజాగా చైనాకు చెందిన 155 మి.మీ. హోవిట్జర్ గన్ ఎస్‌హెచ్-15 ఉనికి నియంత్రణ రేఖ వెంబడిగల వివిధ ప్రదేశాలలో కనిపించింది.చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) సీనియర్ అధికారుల ఉనికి ప్రత్యక్షంగా కనిపించనప్పటికీ, చైనా సైనికులు, ఇంజనీర్లు భూగర్భ బంకర్ల నిర్మాణంతో సహా నియంత్రణ రేఖ వెంబడి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారనడానికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లిపా వ్యాలీలో చైనా నిపుణులు సొరంగం నిర్మిస్తున్నారని, ఇది కారకోరం హైవేకి అనుసంధానించే ఆల్-వెదర్ రోడ్డు నిర్మాణాన్ని సూచిస్తున్నదని కొందరు అధికారులు తెలిపారు.కారకోరం హైవే ద్వారా పాకిస్తాన్‌లోని గ్వాదర్ ఓడరేవుతో చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ మధ్య ప్రత్యక్ష మార్గాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసమే ప్రతిష్టాత్మక 46 బిలియన్ల డాలర్ల సీపీఈసీ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తోంది. 2007లో చైనాకు చెందిన ఒక టెలికం కంపెనీ పాక్‌కు చెందిన ఒక టెలికం కంపెనీని కొనుగోలు చేసింది. దీంతో చైనా మొబైల్ కంపెనీ పాకిస్తాన్లో తన సేవలను అందిస్తోంది.చైనా ఇటీవలి కాలంలో పాక్‌కు అందిస్తున్న సహకారంపై భారత సైన్యం ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నప్పటికీ, ఈ పరిణామాలపై నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నాయి. గతంలో గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతాలలో చైనా కార్యకలాపాలపై భారతదేశం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపధ్యంలో భారతదేశం అప్రమత్తంగా ఉందని, సరిహద్దు ఆవల నుండి ఏదైనా ముప్పు ఏర్పడితే, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత సైన్య అధికారులు తెలిపారు. -
సుర్రుమన్న సూరీడు..
సాక్షి,హైదరాబాద్: ఎండలు భగ్గున మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే సూరీడు నిప్పులు కక్కతున్నాడు. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తాజాగా సోమవారం మియాపూర్‌లో అత్యధికంగా 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దు కాగా, కందుకూరు, చందానగర్, నాగోల్‌లో 41.6 డిగ్రీలు, చిలుకూరు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 41.5 డిగ్రీలు, ఇబ్రహీంపట్నంలో 41.5, డిగ్రీలు, షాబాద్, రాచలూరు, అత్తాపూర్ తదితర మండలాల్లో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతల చొప్పున రికార్డు అయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో 40 నుం చి 40.9 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మీటరు గిరగిర.. భగ్గున మండుతున్న ఎండలకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు రోజంతా ఆన్‌లో ఉండటం, సామర్థ్యానికి మించి విద్యుత్ వినియోగిస్తుండటంతో సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో పాటు కండకర్లు, ఇన్సులేటర్లు వేడికి పేలిపోతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అత్యధిక డిమాండ్ నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత ఏడాది ఏప్రిల్ 1న 2954 మెగావాట్లు నమోదు కాగా, తాజాగా సోమవారం ఏకంగా 3738 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు సమయం, ప్రత్యేక దర్శనానికి 4 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని 70,902 మంది భక్తులు దర్శించుకోగా, తలనీలాలు 22,858 మంది సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్లు. నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్లో పాలకమండలి సభ్యులు సమావేశం కానున్నారు. వైకుంఠ ఏకాదశిపై పాటు పలు కీలక అంశాలపై పాలకమండలిలో చర్చ జరగనుంది. చదవండి: వావ్..విశాఖ! -
ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్! షాకిచ్చిన టాప్ ప్రైవేట్ బ్యాంక్
HDFC Bank hikes loans interest rates: విలీనం తర్వాత అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా అవతరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ రుణ రేట్ల పెంపు ఆగస్ట్ 7 నుంచి అమలులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంపిక చేసిన టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. టెన్యూర్ ఆధారంగా ఎంసీఎల్ఆర్ రేటు పెంపు ఇలా ఉంది.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు ఎగిసి 8.3 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది. మూడు నెలలకుగానూ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.6 శాతం నుంచి 8.7 శాతాన్ని తాకింది. ఇక ఆరు నెలలకయితే 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.9 శాతం నుంచి 8.95 శాతానికి ఎగసింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతం నుంచి 9.1 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల టెన్యూర్ రేట్‌ను 9.15 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.2 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ అంటే.. ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
లోక్ సభ సీట్లు పెంపు..దక్షిణాది రాష్ట్రాలకు టోపీ!
-
ట్విట్టర్ ను ఎక్కువ ధర పెట్టి కొన్న మస్క్
-
ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది కాల ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) రేట్లను పెంచింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు ఏడాది కాల డిపాజిట్‌పై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇది ఇంతకుముందు 6 శాతం ఉండేది. అంటే 100 బేసిస్ పాయింట్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. అదే 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏడాది కాల ఎఫ్డీపై 7.50 శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 7.65 శాతం ఇస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. తాజా రేట్ల సవరణ తర్వాత ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలం వరకు డిపాజిట్లపై రేట్లు 3–7 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ డిపాజిట్లకు వర్తిస్తాయి. -
ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?
ముంబై: ఉద్యోగ మార్కెట్‌పై జూన్ త్రైమాసికం(క్యూ1)లో ద్రవ్యోల్బణ ప్రభావం ఏమీ లేదని ఇండీడ్ ఇండియా క్వార్టర్లీ హైరింగ్ ట్రాకర్ నివేదిక తెలిపింది. తమ నియామకాలు, ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం ప్రభావం లేదని 89 శాతం కంపెనీలు చెప్పాయి. ఉద్యోగార్థుల్లో ప్రతి 10 మందికి గాను ఆరుగురు తమపై ద్రవ్యోల్బణ ప్రభావం లేదని చెప్పినట్టు ఇండీడ్ తన నివేదికలో తెలిపింది. 1,229 ఉద్యోగ సంస్థలు, 1,508 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఇండీడ్ పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీల ఉద్యోగ నియామకాల్లో 29 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం మార్చి త్రైమాసికంలో వృద్ధి 20 శాతాన్ని మించింది. 37 శాతం మంది ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం చూడడం లేదంటే సంస్థను మార్చాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది మార్చి త్రైమాసికంలో 46 శాతంగా ఉంది. ఐటీ, హెల్త్‌కేర్, ఈకామర్స్ ఇక ముందూ వృద్ధిని చూపిస్తాయని.. 5జీ రాకతో రానున్న త్రైమాసికాల్లో టెలికంలోనూ ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని ఇండీడ్ నివేదిక అంచనా వేసింది. ఫుల్‌టైమ్ కోరుకునే వారు 63 శాతం మంది ఉద్యోగాలు కోరుకునే వారిలో 63 శాతం మంది ఫుల్‌టైమ్ పనికోసం చూస్తున్నారు. పార్ట్‌టైమ్ పనిని కోరుకునే వారు 26 శాతంగానే ఉన్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగాల కోసం చూస్తున్నవారు 11 శాతంగా ఉన్నారు. జూన్ త్రైమాసికంలో 19 శాతం కంపెనీలు కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నాయి. ఐటీ/ఐటీఈఎస్ రంగం ఎక్కువ మందికి ఉపాధినిచ్చింది. ఈ రంగంలో 91 శాతం కంపెనీలు జూన్ క్వార్టర్లో నియమకాలు చేపట్టాయి. మార్చి త్రైమాసికంలో 83 శాతం కంపెనీలే నియామకాలు చేపట్టడం గమనార్హం. -
ఏటీఎంల ఛార్జీల మోత
-
కరోనా: కిలో టమాటా రూ.100
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ -19 ( కరోనా వైరస్ ) వ్యాప్తి నివారణ కోసం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఇదే అదనుగా సామాన్యులను కూరగాయల వ్యాపారులు నిలుపు దోపిడి చేస్తున్నారు. జనతా కర్ఫ్యూతో నిన్నంతా ఇళ్లలో ఉన్న జనాలు... సోమవారం నిత్యావసరాలు, కూరగాయలు కొనేందుకు పెద్ద ఎత్తున సూపర్ మార్కెట్లు, రైతు బజార్లుకు చేరుకున్నారు. దీంతో నగరంలోని పలు రైతు బజార్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. సందట్లో సడేమియా అన్నట్లు వ్యాపారస్తులు ....కూరగాయల్ని అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో వ్యాపారులపై కొనుగోలుదారులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు నిత్యావసర సరుకులన్నీ, కూరగాయలు అందుబాటులోనే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇచ్చినా.. అధిక ధరల వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ప్రజలు మండిపడుతున్నారు. సాధారణ రోజుల కంటే రెండింతల ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. మార్కెట్ అధికారులు చేతులెత్తేయడంతో వ్యాపారులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దాదాపు అన్ని కూరగాయల రేట్లు ఇలానే ఉన్నాయి. నగరంలోని గుడిమల్కాపూర్ , మోహదీపట్నం వ్యవసాయ మార్కెట్లో కూడా కూరగాయల ధరలు ఆకాశనంటుతున్నాయి. కూరగాయలు పాత ధర ప్రస్తుతం ధర టమాట(కిలో) రూ. 8 రూ. 100 వంకాయ( కిలో) రూ. 15 రూ. 80 మిర్చి రూ. 25 రూ. 90 క్యారెట్( కిలో) రూ.25 రూ. 80 క్యాప్సికం (కిలో) రూ. 30 రూ. 80 కాకరకాయ (కిలో) రూ. 25 రూ. 80 అదేవిధంగా నల్లగొండలోని కూరగాయల మార్కెట్ కూడా జనంతో కిక్కిరిసిపోయింది. లాక్డౌన్ రూల్స్‌ను పాటించకుండా ప్రజలు పెద్దఎత్తున మార్కెట్‌కి తరలివచ్చారు. ఇలా అయితే కోరోనా నివారణ ఎలా సాధ్యమవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కూరగాయల ధరలు కూడా అధికంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. నిజామాబాద్: జనాలతో నిజామాబాద్ కూరగాయల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. కూరగాయ ధరలు ఆకాశాన్నంటాయి. వినియోగదారుల అవసరాలను వ్యాపారలు సొమ్ము చేసుకుంటున్నారు. రెండింతలు, మూడింతలు అధిక ధరలతో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులుపై వినియోగదారుల మండిపడుతున్నారు. ప్రభుత్వం ధరలను అదుపు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు
-
అచ్చొచ్చిన..అక్టోబర్
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దంచి కొడుతున్న వర్షాల కారణంగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో వరద మహోగ్రరూపం దాల్చుతోంది. ఎగువ కర్ణా టక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో పాటు మహారాష్ట్ర లోని ఉజ్జయినీ నుంచి వస్తున్న ప్రవాహాలు తోడవటం, దీనికి స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలు జత కావ డంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తు తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రానికి ఏకంగా 6.40లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ప్రాజెక్టులో ఇప్పటికే పూర్తి స్థాయిలో నిల్వలు ఉండటంతో ఇరు రాష్ట్రాలకు తమ అవసరాలకు నీటిని వినియోగి స్తూనే, 6.39 లక్షల క్యూసె క్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరద కారణంగా ఈ ఒక్క అక్టో బర్ నెలలోనే శ్రీశైలంలోకి 194 టీఎంసీల మేర నీరు వచ్చింది. ప్రస్తుతం 50 టీఎంసీలకు పైగా నీరు వస్తుండ టం, ఇది మరో మూడు, నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరుకు 350 టీఎంసీల మార్కును చేరుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులోకి 1.68లక్షల క్యూసెక్కు లు వస్తుండగా, దిగువ నారా యణపూర్ లోకి 2.10లక్షల క్యూసెక్కులు వస్తోంది. -
85 ఏళ్ల వరకు కవరేజీ
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారుల అవసరాలను గుర్తిస్తూ ప్రజాదరణ పొందిన ‘క్లిక్2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్’ ప్లాన్‌లో బీమా కవరేజీ గరిష్ట వయసును పెంచింది. ఇప్పటి వరకు గరిష్టంగా 75 ఏళ్లు వచ్చే వరకే బీమా కవరేజీ పొందే ఆప్షన్ ఇందులో ఉండగా, దీన్ని 85 సంవత్సరాలు చేసింది. తమ నిరంతర ఉత్పత్తుల పరిశోధనలో భాగంగా... మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవనంతో పెరుగుతున్న ఆయుర్దాయం నేపథ్యంలో గరిష్ట వయసు వరకు (రిటైర్మెంట్ తర్వాత కూడా) పాలసీదారులకు బీమా అవసరాన్ని గుర్తించినట్టు సంస్థ ప్రకటించింది. దీనికితోడు యువతలో టర్మ్ ప్లాన్లపై అవగాహన పెరుగుతున్న దృష్ట్యా క్లిక్2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్ పాలసీలో గరిష్ట కాలాన్ని 85 ఏళ్ల వరకు పెంచామని, 85లో తమ వయసును తీసివేయగా మిగిలిన కాలానికి కవరేజీ పొందొచ్చని కంపెనీ తెలిపింది. లైఫ్ ఆప్షన్, ఎక్స్ట్రా లైఫ్ ఆప్షన్, 3డీ లైఫ్ ఆప్షన్ అలాగే, మెచ్యూరిటీ తర్వాత ప్రీమియం తిరిగి చెల్లించే ఆప్షన్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
హెచ్డీఎఫ్సీ బాదుడు షురూ!
ముంబై: నగదు లావాదేవీలను నిరుత్సాహపరిచే క్రమంలో దేశంలో రెండవ పెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల సేవిగ్ ఖాతాల నగదు లావాదేవీలపై చార్జీల బాదుడుకు సిద్ధమైంది. ఈ చార్జీలను భారీగా పెంచేందుకు నిర్ణయించింది. మార్చి 1 నుంచి ఈ పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని బ్యాంకు అధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ వివరాల ప్రకారం...థర్డ్‌పార్టీ ట్రాన్సాక్షన్స్‌ను రూ.25 వేలకు కుదించింది. ఇప్పటివరకూ ఈ పరిమితి రోజుకు రూ.50 వేలు. అలాగే ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌ను అయిదు నుంచి నాలుగుకి తగ్గించింది. నాన్-ఫ్రీ ట్రాన్సాక్షన్స్ పై కూడా చార్జీల మోత మోగనుంది. లిమిట్ దాటిన లావాదేవీలపై చార్జీలను 50 శాతం 150 శాతం దాకా బాదేయనుంది. హోం బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ పై కూడా పరిమితులను విధించింది. విత్ డ్రాయల్స్ అయినా డిపాజిట్స్ అయినా ఇకపైన రూ.2 లక్షల వరకే పరిమితిం. ఆ తరువాత కనీసం చార్జీ రూ.150 ఫీజుగాను, లేదా వెయ్యికి రూ.5 లు గానీ చెల్లించాల్సింది ఉంటుంది. థర్డ్ పార్టీ ( హెచ్డీఎఫ్సీ బ్యాంకు కాక ఇతర) లావాదేవీలపై కూడా ఇదే చార్జీలను వసూలు చేయనుంది. -
ఢిల్లీలో సెగలు పుట్టిస్తున్న చలి
-
అల్పపీడనంతో విశాఖలో పెరిగిన అలల ఉధృతి
-
చాపకింద నీరులా విస్తరిస్తున్న చికున్ గున్యా
-
వ్యాపారులకు అందలం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి సీఆర్డీఏ పరిధిలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై మండిపాటు పట్నంబజారు : కార్పొరేట్ వర్గాలకు రెడ్ కార్పెట్ వేస్తూ.. కంత్రీగాళ్లకు కొమ్ముకాస్తూ.. బడా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తూ, సామాన్య ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపేలా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా సీఆర్డీఏ పరిధిలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావుకు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో అడుగడుగునా చట్టాలు తుంగలో తొక్కుతూ ఆదాయం కోసం హడావుడిగా జీవోలు విడుదల చేయడంపై మండిపడ్డారు. సీఆర్డీఏ పరిధిలో టీడీపీకి చెందిన బడా వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూర్చేలా జీవో విడుదల చేయడం సమంజసమేనా అని నిలదీశారు. బడా వ్యాపారులకు అన్నం.. సామాన్యులకు సున్నం అన్నచందంగా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని ఎద్దేవా చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జిల జీవోను తక్షణమే ఉపసంహరించుకుని చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయం సేకరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలకు వెలుసుబాటు ఇవ్వకుండా గంటల్లోనే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలకు ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. -
ఆర్టీసీలో భారీగా భత్యాల పెంపు
కొత్త అలవెన్సులు ఖరారు చేసిన జేఎండీ సంస్థపై అదనపు భారం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధికారులకు యాజమాన్యం వివిధ రకాల భత్యాల(అలవెన్సులు)ను ఖరారు చేసింది. తాజా వేతన సవరణ నేపథ్యంలో భారీగా పెరిగిన జీతాలకు తోడుగా ఇప్పుడు భత్యాలు కూడా భారీగానే పెరిగాయి. 100 శాతం పెంచాలనే డిమాండ్ వచ్చినప్పటికీ సంస్థ ఆర్థిక స్థితి దృష్ట్యా జేఎండీ రమణరావు రెట్టింపు కాకుండా స్వల్పంగా తగ్గించి ఖరారు చేశారు. సూపర్ స్కేల్, స్పెషల్ స్కేల్, సీనియర్ స్కేల్, జూనియర్ స్కేల్ అధికారులకు సంబంధించిన భత్యాలను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి సూపరింటెండెంట్ స్థాయి అధికారుల భత్యాలు ఖరారు చేయాల్సి ఉంది. గతంతో పోలిస్తే వాటిని 60 శాతం వరకు పెంచే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. టీఏడీఏ, స్పెషల్ అలవెన్సు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్సు, న్యూస్‌పేపర్ అలవెన్సు, రీఫ్రెష్మెంట్ రీయింబర్స్మెంట్, కన్వేయన్స్ రీయింబర్స్మెంట్ తదితరాల్లో భారీ పెరుగుదల నమోదైంది. వేతన సవరణతో వీటినీ పెంచాల్సిన అగత్యం ఏర్పడింది. ఇటీవలి వేతన సవరణతో సంస్థపై ప్రతినెలా రూ.75 కోట్ల వరకు అదనపు భారం పడుతుండటంతో ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం చేస్తే తప్ప వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భత్యాల భారాన్ని మోసేందుకు సంస్థ ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి. ప్రతి నెలా చెల్లించే భత్యాల పెంపు ఇలా... టీఏడీఏ: సూపర్ స్కేల్ అధికారులకు రూ.1,200 నుంచి 1,920కి, స్పెషల్ స్కేల్లో రూ.వేయి నుంచి 1,600కు, సీనియర్ స్కేల్లో 800 నుంచి రూ.1,280కి, జూనియర్ స్కేల్ అధికారులకు 600 నుంచి రూ.960కి పెంచారు. స్పెషల్ అలవెన్సు: 80 కంటే ఎక్కువ బస్సులున్న డిపో మేనేజర్లకు రూ.6,400, అంతకంటే తక్కువున్న డీఎంలకు రూ.4,800గా నిర్ధారించారు. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్సు: సూపర్ స్కేల్ అధికారులకు రూ.2,500 నుంచి 4 వేలకు, సీనియర్, జూనియర్ స్కేల్ అధికారులకు రూ.2 వేల నుంచి 3,200కు పెంచారు. న్యూస్‌పేపర్ అలవెన్సు: సూపర్ స్కేల్ అధికారులకు రూ.1,500 నుంచి 2,400కు, స్పెషల్ స్కేల్ అధికారులకు రూ.1,200 నుంచి 1,920కి, సీనియర్ స్కేల్లో రూ.వేయి నుంచి 1,600కు, జూనియర్ స్కేల్లో 700 నుంచి రూ.1,120కి పెంచారు. రిఫ్రెష్మెంట్ రీయింబర్స్మెంట్: సూపర్ స్కేల్లో రూ.2,500 నుంచి 4 వేలకు, స్పెషల్ స్కేల్లో రూ.2,300 నుంచి రూ.3,680కి. కన్వేయన్స్ రీయింబర్స్మెంట్: డీఎంలకు రూ.10,400కు, సీనియర్ స్కేల్లో రూ.8 వేలకు పెంచారు. తార్నాకలోని ఆసుపత్రిలో హజార్డెడ్ విధులు నిర్వహించే వైద్యులకు అందించే ప్రత్యేక భత్యాన్ని రూ.7 వేల నుంచి 11,200కు పెంచారు. రెండేళ్లకోమారు అందించే బ్రీఫ్‌కేస్ అలవెన్సును పెండింగులో ఉంచారు. -
దంచుతున్న ఎండలు
-
ఆర్టీసీ చార్జీల పెంపు తప్పదు