సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దంచి కొడుతున్న వర్షాల కారణంగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో వరద మహోగ్రరూపం దాల్చుతోంది. ఎగువ కర్ణా టక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో పాటు మహారాష్ట్ర లోని ఉజ్జయినీ నుంచి వస్తున్న ప్రవాహాలు తోడవటం, దీనికి స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలు జత కావ డంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తు తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రానికి ఏకంగా 6.40లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది.
ప్రాజెక్టులో ఇప్పటికే పూర్తి స్థాయిలో నిల్వలు ఉండటంతో ఇరు రాష్ట్రాలకు తమ అవసరాలకు నీటిని వినియోగి స్తూనే, 6.39 లక్షల క్యూసె క్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరద కారణంగా ఈ ఒక్క అక్టో బర్ నెలలోనే శ్రీశైలంలోకి 194 టీఎంసీల మేర నీరు వచ్చింది. ప్రస్తుతం 50 టీఎంసీలకు పైగా నీరు వస్తుండ టం, ఇది మరో మూడు, నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరుకు 350 టీఎంసీల మార్కును చేరుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులోకి 1.68లక్షల క్యూసెక్కు లు వస్తుండగా, దిగువ నారా యణపూర్ లోకి 2.10లక్షల క్యూసెక్కులు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment