water flows
-
ఉప్పొంగి ప్రవహిస్తున్న కిన్నెరసాని
-
పెన్నా కాఫర్ డ్యామ్‌కు గండి
నెల్లూరు (క్రైమ్): పెన్నా నదికి నీటి ప్రవాహం అధికం కావడంతో కాఫర్ డ్యామ్ (మట్టి కట్ట)కు గండి పడింది. ఆకస్మికంగా పెరిగిన నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో పెన్నానదిపై నూతన బ్యారేజీ నిర్మాణంలో ఉంది. బ్యారేజ్‌కు అవతల వైపు నీటిని నిల్వ చేసేందుకు కాఫర్ డ్యామ్ నిర్మించారు. ఆదివారం సాయంత్రం నీరు అధికం కావడంతో దీనికి గండి పడి, దిగువ ప్రాంతానికి నీటి ప్రవాహం పెరిగింది. పశువులు మేపుకునేందుకు, ఈత కొట్టేందుకు వెళ్లిన మహిళలు, పురుషులు.. మొత్తం ఆరుగురు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. అందులో భాస్కర్ అనే వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి తమను రక్షించాలని అభ్యర్థించాడు. స్పందించిన ఎస్పీ సీహెచ్ విజయారావు సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో సంతపేట ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా, ఎస్ఐ నాగరాజు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పెన్నానది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బ్యారేజీ గేట్లను మూయించారు. తాళ్లు, గజ ఈతగాళ్ల సాయంతో అతి కష్టం మీద భాస్కర్, అతని స్నేహితుడిని, పొర్లుకట్టకు చెందిన కాకు చిన్నమ్మ, ఆర్ సుబ్బాయమ్మ, గుణలను రక్షించారు. మరో వ్యక్తి అప్పటికే రైల్వే బ్రిడ్జి పిల్లర్‌ను ఎక్కడంతో తాళ్ల సహాయంతో అతన్ని బ్రిడ్జి మీదకు చేర్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని ఎస్పీ అభినందించగా, బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
నాగార్జున సాగర్ కు పెరిగిన వరద ఉధృతి
-
నాగర్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద నీరు
-
నాగార్జునసాగర్ 22 గేట్లు ఎత్తివేత
-
శ్రీశైలం జలశయానికి కొనసాగుతున్న వరద
-
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
-
రాజమండ్రి: గోదావరికి పోటెత్తిన వరద
-
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
-
పోలవరం ప్రాజెక్ట్ వద్ద పెరిగిన గోదావరి ఉధృతి
-
అచ్చొచ్చిన..అక్టోబర్
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దంచి కొడుతున్న వర్షాల కారణంగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో వరద మహోగ్రరూపం దాల్చుతోంది. ఎగువ కర్ణా టక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో పాటు మహారాష్ట్ర లోని ఉజ్జయినీ నుంచి వస్తున్న ప్రవాహాలు తోడవటం, దీనికి స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలు జత కావ డంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తు తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రానికి ఏకంగా 6.40లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ప్రాజెక్టులో ఇప్పటికే పూర్తి స్థాయిలో నిల్వలు ఉండటంతో ఇరు రాష్ట్రాలకు తమ అవసరాలకు నీటిని వినియోగి స్తూనే, 6.39 లక్షల క్యూసె క్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరద కారణంగా ఈ ఒక్క అక్టో బర్ నెలలోనే శ్రీశైలంలోకి 194 టీఎంసీల మేర నీరు వచ్చింది. ప్రస్తుతం 50 టీఎంసీలకు పైగా నీరు వస్తుండ టం, ఇది మరో మూడు, నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరుకు 350 టీఎంసీల మార్కును చేరుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులోకి 1.68లక్షల క్యూసెక్కు లు వస్తుండగా, దిగువ నారా యణపూర్ లోకి 2.10లక్షల క్యూసెక్కులు వస్తోంది. -
ఎస్సారెస్పీలో జలకళ
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సీజన్లో ఆలస్యంగా అయినా చెప్పుకోదగ్గ నీటి ప్రవాహాలు రావడంతో పరీవాహక ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టులోని నీటి నిల్వలతో ఖరీఫ్ పంటలకు చివరిదశలో అయినా 2, 3 తడులకు నీరందే అవకాశాలు మెరుగయ్యాయి. 90 టీఎంసీల నిల్వలకుగాను 54 టీఎంసీల మేర నిల్వ చేరడం, స్థిరంగా ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో .. వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో సిద్ధం చేసిన పంపులతో కాళేశ్వరం నీటిని తరలించే అవసరం లేకుండా పోయింది. ప్రతి ఏడాది గోదావరి నదీ బేసిన్లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. వీటితోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ప్రవాహాలుంటాయి. సెప్టెంబర్ వరకు సరైన వర్షాలు లేకపోవడం, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి దిగువకు ప్రవాహాలు కొనసాగకపోవడంతో ఎస్సారెస్పీకి నీటి రాక ఆలస్యమైంది. ఈ నెలాఖరు వరకు మంచి వర్షాలున్నాయనే అంచనాల నేపథ్యంలో మరో 10 టీఎంసీలైనా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
నీళ్లు ఫుల్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తి తీరుస్తోన్న జలాశయాల్లోకి వరద పోటెత్తుతోంది. కృష్ణా, గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో నగరానికి అత్యవసర పంపింగ్ కష్టాలు తీరాయి. నాగార్జునసాగర్ నుంచి అక్కంపల్లి మీదుగా కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నిత్యం 1,253 మిలియన్ లీటర్ల తాగునీటిని గ్రేటర్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో నాగార్జునసాగర్ వైపునకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. మరో వారం రోజుల్లో సాగర్ 590 అడుగుల గరిష్ట మట్టానికి చేరుకునే అవకాశాలున్నట్లు జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో సాగర్ బ్యాక్‌వాటర్ వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర మోటార్లను యుద్ధప్రాతిపదికన తొలగించామన్నారు. ఇక సిటీకి గోదావరి జలాలను తరలిస్తోన్న ఎల్లంపల్లి జలాశయానికి సైతం కాళేశ్వర గంగ పరుగులు తీస్తోంది. ఇప్పటికే ఈ జలాశయంలో 485.560 అడుగుల గరిష్ట మట్టానికి నీటి నిల్వలు చేరడంతో జలకళ సంతరించుకుంది. ఈ జలాశయం నుంచి నగరానికి నిత్యం 771 మిలియన్ లీటర్ల జలాలను తరలిస్తున్నారు. ఆయా జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్న నేపథ్యంలో నగరవాసులకు ఇక నుంచి పుష్కలంగా తాగునీరు అందించవచ్చని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. అదనంగా 200 మిలియన్ లీటర్లు నగరానికి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఎల్లంపల్లి, నాగార్జునసాగర్, అక్కంపల్లి జలాలే ఆదరువయ్యాయి. మరోవైపు నగరానికి ఆనుకొని ఉన్న ఉస్మాన్‌సాగర్(గండిపేట్), హిమాయత్‌సాగర్‌ల నుంచి సైతం నిత్యం 123 మిలియన్ లీటర్ల తాగునీటిని సేకరించి, శుద్ధి చేసి నగరంలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. మొత్తంగా ఆయా జలాశయాల నుంచి రోజూ వారీగా 2,147 మిలియన్ లీటర్ల జలాలను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్, ఎల్లంపల్లి జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న నేపథ్యంలో నగరానికి అదనంగా మరో 200 మిలియన్ లీటర్ల జలాలను తరలించే అవకాశాలున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ నీటిని ఇటీవల హడ్కో తాగునీటి పథకం, ఓఆర్ఆర్ తాగునీటి పథకం కింద నూతనంగా నిర్మించిన 225 భారీ స్టోరేజీ రిజర్వాయర్లలో నిల్వ చేసి నగరం నలుమూలలకు సరఫరా చేసే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు. కష్టాలుండవ్.. వర్షాకాలం ప్రారంభంలో వరుణుడు ముఖం చాటేయడంతో నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ (పుట్టంగండి) వద్ద నుంచి అత్యవసర పంపింగ్ చేపట్టి కృష్ణా జలాలు సరఫరా చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవడంతో నగరానికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి. శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం మూడు, నాలుగురోజులకోసారి తాగునీరు సరఫరా అవుతున్న ప్రాంతాలకు ఇక నుంచి రోజు విడిచి రోజు సరఫరా చేయవచ్చని జలమండలి అధికారులు తెలిపారు. ఇక కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా, వేళలను కుదించడం లాంటి కష్టాలు ఉండవని అధికారులు భరోసా ఇస్తున్నారు. నీటివృథాను అరికట్టాలి సాక్షి, సిటీబ్యూరో: తాగునీరు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత జలమండలి లైన్మెన్లదేనని బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన లైన్మైన్లకు తాగునీటి వృథాపై అవగాహన కల్పించారు. నగరానికి సరఫరా చేస్తున్న నీటిలో నిత్యం 50 మిలియన్లు రహదారుల పాలవుతోందన్నారు. గుర్తించిన 150 ప్రాంతాల్లో జలమండలి లైన్మెన్లు నీటివృథాను ఎలా అరికడుతున్నారన్న అంశంపై ఎండీ ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఇంకుడుగుంతలు నిర్మించారు? నల్లా నీటితో వాహనాలు, వరండాలు శుభ్రం చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. పరిశీలించిన అంశాలపై లైన్మెన్లు ఓ నమూనా పూర్తిచేసి జనరల్ మేనేజర్లకు సమర్పించాలని సూచించారు. మంచినీటి పైపులైన్లకున్న వాల్వూ తిప్పితే ఎన్ని ఇళ్లకు నీరు సరఫరా అవుతుంది? ఆయా ఇళ్లకు నీటి సరఫరా, బిల్లింగ్ విషయాల్లో వస్తున్న వ్యత్యాసాలను గుర్తించాలన్నారు. ఈ పరిశీలన ద్వారా ఏ ప్రాంతాల్లో తాగునీటి వృథా జరుగుతుందన్న విషయం తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్క లైన్మెన్ తమ పరిధిలో ఒక ఇంజెక్షన్ బోర్వెల్, ఒక ఇంకుడుగుంత నిర్మించే విధంగా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు–2 డైరెక్టర్ డి.శ్రీధర్‌బాబు, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
వరదొస్తే పంపులన్నీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ప్రస్తుతానికి ఒక్క మోటార్‌తో మొదలవగా మిగతా పంపుల ప్రారంభం ప్రాణహిత, గోదావరిలో పూర్తిస్థాయి వరదలు పుంజుకున్నాకే జరగనుంది. జూలై నుంచి ప్రవాహాలు పుంజుకొనే తీరుకు అనుగుణంగా ఒక్కో మోటార్‌ను ఆన్‌చేస్తూ నీటిని తీసుకునేలా ఇప్పటికే అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఏటా జూన్ నుంచి ప్రాణహితలో ప్రవాహాలు మొదలవుతాయి. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతంలో పెద్దగా వర్షాలు కురవలేదు. దీంతో ఈ ఏడాది 1,471 క్యూసెక్కులకు మించి ప్రాణహితలో ప్రవాహాలు లేవు. ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రాణహితలో 1,385 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగా 21న 1,420 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగినట్లు టెక్రా గేజ్ స్టేషన్ రికార్డులు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి గరిష్టంగా 50 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఈ ఏడాది 2 వేల క్యూసెక్కులు కూడా దాటలేదు. ఈ నేపథ్యంలోనే గోదావరి నీటి ఎత్తిపోతల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం గోదావరి నదిపై క్రాస్ బండ్ నిర్మించి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఈ నిల్వతో వచ్చిన నీటితోనే ఒక్క మోటార్‌ను ఆన్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం గోదావరిలో 94 మీటర్ల నీటి ప్రవాహం కొనసాగుతుండగా 100 మీటర్ల లెవల్ నీటి ప్రవాహం ఉంటేనే రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం సాధ్యం కానుంది. అయితే ప్రస్తుతం రుతుపవనాలు పుంజుకోవడంతో వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో జూలై నుంచి ప్రవాహం పుంజుకునే అవకాశం ఉంది. జూలై రెండో వారానికి 50 వేల మేర ప్రవాహాలు వచ్చినా ఒక్కో మోటార్‌ను ప్రారంభిస్తూ నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. -
భారీ వర్షాలు: నీటమునిగిన ఏపీ రాజధాని ప్రాంతం
-
అమృతగుండం నుంచి జలధారలు
ఝరాసంగం: కేతకి సంగమేశ్వర ఆలయ ఆవరణలోని అమృతగుండంలో జలధారలు ఉబికి వస్తున్నాయి. బుధవారం ఆలయ గుండంలో నీటిని పూర్తిగా తొలగించినా గుండం నలు మూలల నుంచి జలధారలు పైకి ఉబికి వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అమృత గుండం పూర్తిగా వరదనీటితో నిండిపోయింది. దీంతో ఆలయ అధికారులు గుండం నుంచి నీటిని బోరు మోటార్ల ద్వారా నీటిని ఖాళీ చేయించి, బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేశారు. గుండం నలుమూలలా ఎటు చూసినా జలధారలు కనిపించడంతో వాటిని చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత జలధారలు కనిపిస్తున్నయని స్థానికులు చర్చించుకుంటున్నారు. అమృతగుండంలో దక్షిణ వైపులో ఉన్న రంధ్రం ద్వారా కాశీ నుంచి నీరు రావటంతో దక్షిణ కాశీగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. -
పొంగుతున్న పాతాళగంగ
కోహీర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. కోహీర్ మండలం మనియార్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు పట్లూరి ప్రభాకర్, పట్లూరి చిట్టి, పట్లూరి సంవృద్ధి, చెనువాల లాల్‌రెడ్డి బోర్లలో నీరు పైకి ఉబుకుతోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చూసి వస్తున్నారు. -
చేతిపంపు.. నీటిపొంగు
కంగ్టి: ఇటీవల కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. దీంతో బోర్గిలో చేతిపంపు నుంచి నీరు ఉబికి వస్తోంది. కంగ్టి మండలంలో అత్యంత నీటి కొరత ఉన్న గ్రామంగా బోర్గికి పేరుంది. దీంతో ఏటా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో డిసెంబర్ నెలలోనే తాగునీటి ట్యాంకర్‌తో నీటిని అందించే ఏర్పాట్లు చేయించారు. కాగా దగ్గరలో నీటి జాడలు లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుండి నీటిని సరఫరా చేసేవారు. అలాంటి గ్రామంలోని చేతిపంపు నుండి నీరు వస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
తెలంగాణలో నిండుకుండల్లా జలాశయాలు
-
నిండుకుండల్లా జలాశయాలు
హైదరాబాద్ : కుండపోతగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటితో జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టుల నీటి నిల్వల వివరాలు ఇలా ఉన్నాయి. 1.జూరాల ప్రాజెక్టు : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 1045.01 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 1044.57 అడుగులు ప్రస్తుత నీటి నిల్వ: 9.36 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 120000 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 126484 క్యూసెక్కులు 2. శ్రీశైలం : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 885.01 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 876.50 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 215.78 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 170.66 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 124720 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 9243 క్యూసెక్కులు 3. నాగార్జునసాగర్ : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 590 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 514.50 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 312.05 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 139.44 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 7063 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 1350 క్యూసెక్కులు 4. మూసీ ప్రాజెక్టు : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 645 అడుగులు ప్రస్తుత నీటిమట్టం: 642.80 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 4.46 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 3.89 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 21550 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 28500 క్యూసెక్కులు 5. పులిచింతల : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 175 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 30 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 79107 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 79107 క్యూసెక్కులు 6. నిజాంసాగర్ : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 1405 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 1380.60 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 17.80 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 1.42 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 45872 క్యూసెక్కులు 7.ఎస్ఆర్ఎస్పీ : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 1091 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 1087.80 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 90.31 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 75.14 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 444000 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 10582 క్యూసెక్కులు 8. ఎల్లంపల్లి : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 485.56 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 484.60 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 20.18 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 19.34 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 72832 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 57388 క్యూసెక్కులు 9. కడెం : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 700 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 698.03 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 7.60 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 7.09 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 31164 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 46301 క్యూసెక్కులు 10. ఎల్. ఎం.డి : పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 920 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 897.90 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 24.07 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 9.26 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 25835 క్యూసెక్కులు 11. సింగూర్: పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్): 1717.93 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 1715.39 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 29.91 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 25.82 టీఎంసీలు ఇన్‌ఫ్లో : 60000 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 157000 క్యూసెక్కులు