చేతి పంపు నుండి ఉబికి వస్తున్న నీరు
కంగ్టి: ఇటీవల కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. దీంతో బోర్గిలో చేతిపంపు నుంచి నీరు ఉబికి వస్తోంది. కంగ్టి మండలంలో అత్యంత నీటి కొరత ఉన్న గ్రామంగా బోర్గికి పేరుంది. దీంతో ఏటా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో డిసెంబర్ నెలలోనే తాగునీటి ట్యాంకర్‌తో నీటిని అందించే ఏర్పాట్లు చేయించారు. కాగా దగ్గరలో నీటి జాడలు లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుండి నీటిని సరఫరా చేసేవారు. అలాంటి గ్రామంలోని చేతిపంపు నుండి నీరు వస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.