
అమృతగుండం నుంచి వస్తున్న నీళ్లు
ఝరాసంగం: కేతకి సంగమేశ్వర ఆలయ ఆవరణలోని అమృతగుండంలో జలధారలు ఉబికి వస్తున్నాయి. బుధవారం ఆలయ గుండంలో నీటిని పూర్తిగా తొలగించినా గుండం నలు మూలల నుంచి జలధారలు పైకి ఉబికి వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అమృత గుండం పూర్తిగా వరదనీటితో నిండిపోయింది. దీంతో ఆలయ అధికారులు గుండం నుంచి నీటిని బోరు మోటార్ల ద్వారా నీటిని ఖాళీ చేయించి, బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేశారు.
గుండం నలుమూలలా ఎటు చూసినా జలధారలు కనిపించడంతో వాటిని చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత జలధారలు కనిపిస్తున్నయని స్థానికులు చర్చించుకుంటున్నారు. అమృతగుండంలో దక్షిణ వైపులో ఉన్న రంధ్రం ద్వారా కాశీ నుంచి నీరు రావటంతో దక్షిణ కాశీగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.