kethaki temple
-
నిత్య పూజలు అందుకుంటున్న కేతకీ పార్వతీ పరమేశ్వరులు
సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజా కార్యక్రమాలతో జాతర ప్రారంభమైంది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజలతో పాటు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శశిధర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు సంతోష్ కుమార్ పాటిల్, రుద్రయ్య స్వామి, గాలప్ప పాటిల్, నరేందర్ రెడ్డి, దత్తు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ.. -
అమృతగుండం నుంచి జలధారలు
ఝరాసంగం: కేతకి సంగమేశ్వర ఆలయ ఆవరణలోని అమృతగుండంలో జలధారలు ఉబికి వస్తున్నాయి. బుధవారం ఆలయ గుండంలో నీటిని పూర్తిగా తొలగించినా గుండం నలు మూలల నుంచి జలధారలు పైకి ఉబికి వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అమృత గుండం పూర్తిగా వరదనీటితో నిండిపోయింది. దీంతో ఆలయ అధికారులు గుండం నుంచి నీటిని బోరు మోటార్ల ద్వారా నీటిని ఖాళీ చేయించి, బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేశారు. గుండం నలుమూలలా ఎటు చూసినా జలధారలు కనిపించడంతో వాటిని చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత జలధారలు కనిపిస్తున్నయని స్థానికులు చర్చించుకుంటున్నారు. అమృతగుండంలో దక్షిణ వైపులో ఉన్న రంధ్రం ద్వారా కాశీ నుంచి నీరు రావటంతో దక్షిణ కాశీగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. -
కేతకీ కీరిటం ఎవరికో?
ఆశలపల్లికిలో నాయకులు ఝరాసంగం రూరల్: కేతకీ ఆలయ పాలక మండలి నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల కావడంత పోటీ తీవ్రమైంది. జిల్లాలో అతిపెద్ద శివాలయమైన ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల పాలక మండలి ఏర్పాటు కోసం గత నేల 18న నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్ఏస్ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఝరాసంగంలోని కార్యానిర్వహణాధికారి కార్యాలయం, సంగారెడ్డిలోని అసిస్టెంట్ కమిష్నర్ కార్యాలయం, హైదరాబాద్‌లోని దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ధర్మకర్తల కోసం దాదాపు 50 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 6వ తేదీ వరకు మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఆశల పల్లకిలో నాయకులు కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్, దర్మకర్తల కోసం గతం కంటే ఈ సారి ఎక్కువ సంఖ్యలో దరాఖాస్తు చేసుకుంటున్నారు. ఎడాది పాటు నుంచి పాలక మండలి ఖాళి ఉండడం వల్ల మండలంతో పాటు నియోజర్గంకు చెందిన టీఆర్ఏస్ నాయకులు చైర్మన్, దర్మకర్తల పదవులను దక్కించుకునేందుకు ఎవరికి వారే ప్రయాత్నాలు ముమ్మరంగా సాగిస్తు్న్నారు. కేతకీ ఆలయ మాజీ చైర్మన్ ఎం.పి.బస్వరాజ్‌పాటిల్, టీఆర్ఏస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నర్సింహగౌడ్, టీఆర్ఏస్ మండల కార్యాదర్శి రాచయ్యస్వామి, టీఆర్ఏస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కేతన్ చౌతాయి, జహీరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నీలం వెంకటేశంలతో పాటు ఝరాసంగంకు చెందిన రాజేందర్‌సింగ్, కమాల్పల్లికి చెందిన సుభాష్‌రావు, మాచునూర్‌కు చెందిన ఎం.వెంకటేశం, కుప్పానగర్కు చెందిన జి.నర్సింహులు చైర్మన్ పదవి కోసం ప్రయాత్నాలు సాగిస్తున్నారు. జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, సంగారెడ్డిలతో పాటు పటన్చేరువుకు చెందిన మొట్టమొదటి ఆలయ ఈవో మల్లయ్య, సదాశివపేటకు చెందిన కొంత మంది నాయకులు పాలక మండలిలో చోటు కోసం రాష్ర్ట మంత్రి హరీష్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్, మాజీ మంత్రి ఫరిదొద్ధిన్, టీఆర్ఏస్ నియోజవర్గ ఇంచార్జీ మానిక్‌రావు, రాష్ర్ట నాయకులు ఎం.శివకుమార్, ఉమకాంత్పాటిల్ల వద్దకు వెళ్లి పదవులు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
కేతకిలో శివనామస్మరణ
ఝరాసంగం: శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండే గాక కర్ణాటక, మహారాష్ట్ర లోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలోని అమృత గుండంలో స్నానాలు ఆచరించి గుండంలోని జలలింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పాదయాత్రగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆదివారం రాత్రి కేతకి క్షేత్రానికి చేరుకుని జాగరణ చేశారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో అభిషేకం, అన్నపూజ, ఆకులపూజ, గుండంపూజ, కంట్లము, వాహనపూజ, బిల్వార్చన, కూంకుమార్చన తదితర పూజలు నిర్వహించి మొక్కలను తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని బలభీముని, బసవణ్ణ మందిరం, కాశీబాబామఠం, నవగ్రహాలు, నాగుల వద్ద, పోగడచెట్టులకు పూజలు చేశారు. భక్తులకు తప్పని ఇబ్బందులు కేతకి ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మరుగుదొడ్లు, దుస్తుల మార్చుకునే సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు. పాదయాత్రతో చేరుకున్న భక్తులకు సరిపడా గదులు లేక ఆలయ ప్రాంగణంలోనే బస చేశారు. అలాగే వాహనాల పార్కింగ్‌కు స్థలంలేక కక్కర్వాడ, చీలపల్లి, సిద్దాపూర్ రోడ్డు మార్గాలలో వాహనాలను పార్కింగ్ చేశారు. -
కేతకి యజ్ఞమంటపంలో ఇకపై అభిషేకాలు
ఝరాసంగం: దక్షిణ కాశీగా పేరుగాంచిన, ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వరాలయంలో భక్తుల ఇబ్బందులు తీర్చేందుకు ఆలయ అధికారులు, గ్రామ పెద్దలు నూతన విధానాన్ని ప్రవేశ పెట్టారు. భక్తుల దర్శనం కొరకు గర్భగుడిలో నిర్వహించే అభిషేకాలను ఆలయ ఆవరణలోని యజ్ఞమంటపంలో నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి పి. మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంతకు ముందు కేతకి ఆలయానికి నిత్యం వచ్చే భక్తుల తాకిడి పెరుగుతుండటంతో దర్శనం కొరకు భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడేవారు. ఓ వైపు భక్తులు అభిషేకాలు చేస్తుండగానే మరోవైపు భక్తులు స్వామి వారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్వామి వారి దర్శనం చేసుకునేందుకు శ్రావణ మాసంలో ప్రతి ఆది, సోమవారాల్లో అదే విధంగా ప్రతి అమావాస్య పర్వదినాల్లో అభిషేకాలను ఆలయ ప్రాంగణంలోని యజ్ఞమంటపంలో నిర్వహించనున్నారు. -
కిటకిటలాడిన కేతకి
ఝరాసంగం రూరల్: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం అమవాస్య కావడంతో మన రాష్ర్టంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులను పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివార్లకు అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు కంట్లం, గుండం పూజలు చేశారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఆర్యవైశ్య, లింగాయత్, దేవస్థాన సత్రాల ద్వారా అన్నదానం ఏర్పాటు చేసినట్టు ఈవో మోహన్‌రెడ్డి తెలిపారు.