కేతకిలో శివనామస్మరణ | full crowd in kethaki temple | Sakshi
Sakshi News home page

కేతకిలో శివనామస్మరణ

Published Mon, Aug 15 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

full crowd in kethaki temple

ఝరాసంగం: శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండే గాక కర్ణాటక, మహారాష్ట్ర లోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలోని అమృత గుండంలో స్నానాలు ఆచరించి గుండంలోని జలలింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

పాదయాత్రగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆదివారం రాత్రి కేతకి క్షేత్రానికి చేరుకుని జాగరణ చేశారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో అభిషేకం, అన్నపూజ, ఆకులపూజ, గుండంపూజ, కంట్లము, వాహనపూజ, బిల్వార్చన, కూంకుమార్చన తదితర పూజలు నిర్వహించి మొక్కలను తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని బలభీముని, బసవణ్ణ మందిరం, కాశీబాబామఠం, నవగ్రహాలు, నాగుల వద్ద, పోగడచెట్టులకు పూజలు చేశారు.

భక్తులకు తప్పని ఇబ్బందులు
కేతకి ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మరుగుదొడ్లు, దుస్తుల మార్చుకునే సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు. పాదయాత్రతో చేరుకున్న భక్తులకు సరిపడా గదులు లేక ఆలయ ప్రాంగణంలోనే బస చేశారు. అలాగే వాహనాల పార్కింగ్‌కు స్థలంలేక కక్కర్‌వాడ, చీలపల్లి, సిద్దాపూర్‌ రోడ్డు మార్గాలలో వాహనాలను పార్కింగ్‌ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement