సంప్రోక్షణ విధి నిర్వహిస్తున్న వేదపండితులు. భక్తులు
కల్హేర్: మండలంలోని బాచేపల్లి బల్కంచెల్క తండాలో విశ్వమాలిని జగదాంబ మందిరంలో ఆదివారం కన్నుల పండుగల లోకకల్యాణం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మోటర్ వెహికిల్ ఇన్‌సపెక్టర్ మూడ్ కిషన్‌సింగ్–లలితాబాయి దంపతుల ఆధ్వర్యంలో ప్రజలు, రైతుల దోశలు తోలగి, సుఖసంతోషం కోసం లోకకల్యాణం జరిపారు.
తండాలో నిర్మించిన జగదాంబ మందిరాం తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచడంతో వేడుకలకు ప్రదాన్యత సంతరించుకుంది. బాసర సరస్వతి దేవి క్షేత్రం అర్చకులు, నారాయణఖేడ్‌కు చెందిన వేద పండితులు మనోహర్‌శర్మ, సంతోష్ పంతులు, మురళిధర్, అంకుశ్‌రావు, గోవింద్, కిషన్, వినోద్ సంప్రోక్షణవిధి వైభవంగా నిర్వహించారు.
చతుర్వేద పారాయణం, హరతి, హోమం, భోగ్‌భంఢార్, తీర్థప్రసాదవితరణ, ఇతర కార్యక్రమలు చేపట్టారు. భక్తులు మందిరంలో భవానీమాత, సేవాలాల్ మహరాజును దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు జరిపారు. దీంతో బల్కంచెల్క తండాలో భక్తిపారవశ్యం నెలకోంది. కార్యక్రమంలో తండా ప్రముఖులు రాములు, రూప్‌సింగ్, శంకర్, అమ్రనాయక్, కిషన్, మన్మోన్‌నాయక్ పాల్గొన్నారు.