
కోతకు గురైన రోడ్డును పరిశీలిస్తున్న ఎస్‌ఐ అంతిరెడ్డి
కల్హేర్: మండలంలోని మాసాన్‌పల్లి చౌరస్తా వద్ద సంగారెడ్డి - నాందేడ్ జాతీయ రహదారిపై శనివారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌రావుపల్లి శివారులో గల వంతెన వద్ద జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి.హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లె ఆర్టీసీ బస్సులు మాసాన్‌పల్లి చౌరస్తా నుంచి వెనుతిరిగాయి. నిజాంసాగర్ ఎస్‌ఐ అంతిరెడ్డి కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు.