full crowd
-
కేతకిలో శివనామస్మరణ
ఝరాసంగం: శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండే గాక కర్ణాటక, మహారాష్ట్ర లోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలోని అమృత గుండంలో స్నానాలు ఆచరించి గుండంలోని జలలింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పాదయాత్రగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆదివారం రాత్రి కేతకి క్షేత్రానికి చేరుకుని జాగరణ చేశారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో అభిషేకం, అన్నపూజ, ఆకులపూజ, గుండంపూజ, కంట్లము, వాహనపూజ, బిల్వార్చన, కూంకుమార్చన తదితర పూజలు నిర్వహించి మొక్కలను తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని బలభీముని, బసవణ్ణ మందిరం, కాశీబాబామఠం, నవగ్రహాలు, నాగుల వద్ద, పోగడచెట్టులకు పూజలు చేశారు. భక్తులకు తప్పని ఇబ్బందులు కేతకి ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మరుగుదొడ్లు, దుస్తుల మార్చుకునే సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు. పాదయాత్రతో చేరుకున్న భక్తులకు సరిపడా గదులు లేక ఆలయ ప్రాంగణంలోనే బస చేశారు. అలాగే వాహనాల పార్కింగ్‌కు స్థలంలేక కక్కర్వాడ, చీలపల్లి, సిద్దాపూర్ రోడ్డు మార్గాలలో వాహనాలను పార్కింగ్ చేశారు. -
వైభవంగా చతుర్వేద పారాయణం
కల్హేర్: మండలంలోని బాచేపల్లి బల్కంచెల్క తండాలో విశ్వమాలిని జగదాంబ మందిరంలో ఆదివారం కన్నుల పండుగల లోకకల్యాణం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మోటర్ వెహికిల్ ఇన్సపెక్టర్ మూడ్ కిషన్‌సింగ్–లలితాబాయి దంపతుల ఆధ్వర్యంలో ప్రజలు, రైతుల దోశలు తోలగి, సుఖసంతోషం కోసం లోకకల్యాణం జరిపారు. తండాలో నిర్మించిన జగదాంబ మందిరాం తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచడంతో వేడుకలకు ప్రదాన్యత సంతరించుకుంది. బాసర సరస్వతి దేవి క్షేత్రం అర్చకులు, నారాయణఖేడ్‌కు చెందిన వేద పండితులు మనోహర్‌శర్మ, సంతోష్ పంతులు, మురళిధర్, అంకుశ్రావు, గోవింద్, కిషన్, వినోద్ సంప్రోక్షణవిధి వైభవంగా నిర్వహించారు. చతుర్వేద పారాయణం, హరతి, హోమం, భోగ్భంఢార్, తీర్థప్రసాదవితరణ, ఇతర కార్యక్రమలు చేపట్టారు. భక్తులు మందిరంలో భవానీమాత, సేవాలాల్ మహరాజును దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు జరిపారు. దీంతో బల్కంచెల్క తండాలో భక్తిపారవశ్యం నెలకోంది. కార్యక్రమంలో తండా ప్రముఖులు రాములు, రూప్సింగ్, శంకర్, అమ్రనాయక్, కిషన్, మన్మోన్నాయక్ పాల్గొన్నారు.