కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం
- ఆశలపల్లికిలో నాయకులు
ఝరాసంగం రూరల్: కేతకీ ఆలయ పాలక మండలి నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల కావడంత పోటీ తీవ్రమైంది. జిల్లాలో అతిపెద్ద శివాలయమైన ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల పాలక మండలి ఏర్పాటు కోసం గత నేల 18న నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్‌ఏస్ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకు ఝరాసంగంలోని కార్యానిర్వహణాధికారి కార్యాలయం, సంగారెడ్డిలోని అసిస్టెంట్ కమిష్‌నర్ కార్యాలయం, హైదరాబాద్‌లోని దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ధర్మకర్తల కోసం దాదాపు 50 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 6వ తేదీ వరకు మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
ఆశల పల్లకిలో నాయకులు
కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్, దర్మకర్తల కోసం గతం కంటే ఈ సారి ఎక్కువ సంఖ్యలో దరాఖాస్తు చేసుకుంటున్నారు. ఎడాది పాటు నుంచి పాలక మండలి ఖాళి ఉండడం వల్ల మండలంతో పాటు నియోజర్గంకు చెందిన టీఆర్‌ఏస్ నాయకులు చైర్మన్, దర్మకర్తల పదవులను దక్కించుకునేందుకు ఎవరికి వారే ప్రయాత్నాలు ముమ్మరంగా సాగిస్తు్న్నారు.
కేతకీ ఆలయ మాజీ చైర్మన్ ఎం.పి.బస్వరాజ్‌పాటిల్, టీఆర్‌ఏస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నర్సింహగౌడ్, టీఆర్‌ఏస్ మండల కార్యాదర్శి రాచయ్యస్వామి, టీఆర్‌ఏస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కేతన్ చౌతాయి, జహీరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నీలం వెంకటేశంలతో పాటు ఝరాసంగంకు చెందిన రాజేందర్‌సింగ్, కమాల్‌పల్లికి చెందిన సుభాష్‌రావు, మాచునూర్‌కు చెందిన ఎం.వెంకటేశం, కుప్పానగర్‌కు చెందిన జి.నర్సింహులు చైర్మన్ పదవి కోసం ప్రయాత్నాలు సాగిస్తున్నారు.
జహీరాబాద్, కోహీర్, న్యాల్‌కల్, సంగారెడ్డిలతో పాటు పటన్‌చేరువుకు చెందిన మొట్టమొదటి ఆలయ ఈవో మల్లయ్య, సదాశివపేటకు చెందిన కొంత మంది నాయకులు పాలక మండలిలో చోటు కోసం రాష్ర్ట మంత్రి హరీష్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్, మాజీ మంత్రి ఫరిదొద్ధిన్, టీఆర్‌ఏస్ నియోజవర్గ ఇంచార్జీ మానిక్‌రావు, రాష్ర్ట నాయకులు ఎం.శివకుమార్, ఉమకాంత్‌పాటిల్‌ల వద్దకు వెళ్లి పదవులు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.