దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
ఝరాసంగం రూరల్: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం అమవాస్య కావడంతో మన రాష్ర్టంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులను పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివార్లకు అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు కంట్లం, గుండం పూజలు చేశారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఆర్యవైశ్య, లింగాయత్, దేవస్థాన సత్రాల ద్వారా అన్నదానం ఏర్పాటు చేసినట్టు ఈవో మోహన్‌రెడ్డి తెలిపారు.