శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనం కాకుండానే వెనక్కి!
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. దర్శనం లేట్ అవుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. శబరిమలలో క్యూలైన్ల నిర్వహణలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం వహించారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అయ్యప్ప దర్శనానికి ఎక్కువగా సమయం పడుతుండటంతో కర్ణాటకకు చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు.
VIDEO | Sabarimala pilgrims blocked the Erumeli-Pamba road overnight demanding that their vehicles be allowed to go till Pamba. #Sabarimala pic.twitter.com/IpsOonzRRU
— Press Trust of India (@PTI_News) December 13, 2023
మరోవైపు.. శబరిమలకు వెళ్లే రహదారుల్లో మంగళవారం కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐదు రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు. తమ వాహనాలను అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కాగా, రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు.
Extremely dangerous situation at #Sabarimala with unmanageable crowd. Less police force deployed to control the crowd as major force is diverted to CM's and Minister's program.@narendramodi @PMOIndia @AmitShah @rajnathsingh Kindly intervene and avert a potential disaster🙏🙏 pic.twitter.com/ksoGsa5B0z
— നചികേതസ് (@nach1keta) December 12, 2023
ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకు భారీ సంఖ్యలోనే భక్తులు వెళ్లినట్టు సమాచారం. వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్టు తెలుస్తోంది.
#SwamiSharanam Salutes to @TheKeralaPolice Team in #Sabarimala. Heavy crowd and they are simply rocking. Helping young Malikappurams inconvenienced in the crowd to get some fresh air pic.twitter.com/mejM0qSWQj
— Suresh 🇮🇳 (@surnell) December 12, 2023
Usually we hear Swamy Saranam Ayyappa Nama japam in the queue lines but due to heavy rush and poor management pilgrims were chanting down down police and CM.
Yesterday was worst day in life.
Never travel with kids. Too much suffocation in Q lanes#Sabarimala pic.twitter.com/1CMFk0NwVD
— నేనుఎవరు (@NenuYevaru) December 10, 2023
ప్రత్యేక రైళ్లు..
ఇదిలా ఉండగా.. అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రత్యేక రైళ్లు.. డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి.
Sabarimala Season Special Trains #Sabarimala #SCR @drmhyb @drmsecunderabad @drmvijayawada @drmgnt @drmgtl @drmned pic.twitter.com/OX7NYNjOcR
— South Central Railway (@SCRailwayIndia) December 12, 2023
The Travancore Devaswom Board has completely failed in managing the crowd in Sabarimala. If this continues, it could result in serious issues. #Sabarimala #Kerala pic.twitter.com/blfkwrtyfg
— Harish M (@chnmharish) December 10, 2023