న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తుంటారు. ఆగస్టు నెలలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అన్ని రికార్డులను అధిగమించింది. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన ఒక్కరోజులో ఢిల్లీ మెట్రోలో 77,49,682 మంది ప్రయాణించారు. ఇది ఇప్పటి వరకు ఒక్కరోజులో అత్యధికంగా ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య.
ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య సాధారణంగా 72 లక్షల నుంచి 78 లక్షల మధ్య ఉంటుంది. పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) శుక్ర, శనివారాల్లో అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.
డీఎంఆర్‌సీ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) అనూజ్ దయాల్ మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, డీఎంఆర్‌సీ అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించిందన్నారు. మొత్తం 84 అదనపు ట్రిప్పులను శుక్రవారం, శనివారాల్లో నడపనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Hindi Day: హిందీ అధికారిక భాష ఎలా అయ్యింది?
Comments
Please login to add a commentAdd a comment