DMRC
-
Delhi: మెట్రో సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో 77 లక్షల మంది ప్రయాణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తుంటారు. ఆగస్టు నెలలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అన్ని రికార్డులను అధిగమించింది. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన ఒక్కరోజులో ఢిల్లీ మెట్రోలో 77,49,682 మంది ప్రయాణించారు. ఇది ఇప్పటి వరకు ఒక్కరోజులో అత్యధికంగా ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య.ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య సాధారణంగా 72 లక్షల నుంచి 78 లక్షల మధ్య ఉంటుంది. పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) శుక్ర, శనివారాల్లో అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.డీఎంఆర్సీ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) అనూజ్ దయాల్ మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, డీఎంఆర్సీ అన్ని లైన్లలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించిందన్నారు. మొత్తం 84 అదనపు ట్రిప్పులను శుక్రవారం, శనివారాల్లో నడపనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Hindi Day: హిందీ అధికారిక భాష ఎలా అయ్యింది? -
రూ. 2,599 కోట్లు వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాలి..
నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీకి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుంచి తుది నోటీసు అందింది. ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం.. రూ. 2,599 కోట్లను ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటుపై అదనంగా 2 శాతం చొప్పున వడ్డీతో పాటు 15 రోజులలోపు తిరిగి చెల్లించాలని కోరుతూ రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL)కి డీఎంఆర్సీ నోటీసు జారీ చేసింది. చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.ఇదీ నేపథ్యం..న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సెక్టార్ 21 ద్వారక వరకు నడిచే ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ రూపకల్పన, నిర్వహణ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, అనిల్ అంబానీకి చెందిన డీఏఎంఈపీఎల్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే తాము గుర్తించిన కొన్ని నిర్మాణ లోపాలను డీఎంఆర్సీ పరిష్కరించలేదని ఆరోపిస్తూ 2012లో డీఏఎంఈపీఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీనికి సంబంధించి కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ రూ. 2,950 కోట్లు వడ్డీతో సహా డీఏఎంఈపీఎల్కి చెల్లించాలని ని ఆదేశించింది. దీంతో డీఎంఆర్సీ రూ. 2,599 కోట్లను యాక్సిస్ బ్యాంక్ వద్ద ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో తాము డిపాజిట్ చేసిన రూ. 2,599 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అనిల్ అంబానీ సంస్థకు 15 రోజుల సమయం ఇచ్చింది. -
అనిల్ అంబానీ అదృష్టం తారుమారు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో ఆరవస్థానంలో నిలిచిన అనిల్ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన– ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు(డీఏఎంఈపీఎల్) అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ– డీఏఎంఈపీఎల్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మధ్య కుదిరిన ‘‘రాయితీ ఒప్పందం’’ విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి రూ.8,000 కోట్ల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయన్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్ అనుగుణంగా గతంలో డీఎంఆర్సీ చెల్లించిన రూ.3,300 కోట్లను వాపసు చేయాలని సుప్రీం డీఏఎంఈపీఎల్ని ఆదేశించింది. అయితే తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. అటు డీఎంఆర్సీ నుంచి కానీ ఇటు గ్రూప్ సంస్థ డీఏఎంఈపీఎల్ నుంచి తనకు ఎటువంటి డబ్బూ అందలేదని వివరించింది. -
ఢిల్లీ మెట్రోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వార్తా సంస్థ ఏఎన్ఐ విడుదల చేసిన వీడియోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చుట్టూ భద్రతా అధికారులు నిలుచుని ఉన్నారు. మెట్రో నిర్వహణ గురించి డీఎంఆర్సీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ముర్ముకు తెలియజేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. #WATCH | President Droupadi Murmu takes a metro ride in Delhi. pic.twitter.com/Elc2pdUmHJ — ANI (@ANI) February 7, 2024 -
డ్రైవర్‌లెస్ ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోల తొలి డ్రైవర్ రహిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ‘దేశంలోని తొలి డ్రైవర్ రహిత, ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు సర్వీసు 37 కిమీలు మెజెంటా లైన్ మార్గంలో (జానక్‌పురి వెస్ట్ బొటానికల్ గార్డెన్ వరకు) డిసెంబర్ 28న ప్రారంభం కానుంది. ఈ సర్వీసును మోదీ ప్రారంభిస్తారు’ అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. -
మెట్రో ప్రయాణం: మరో 30 సెకన్లు పెంపు
న్యూఢిల్లీ: దేశంలో నాలుగో దశ లాక్డౌన్ ముగిసిన తర్వాత కేంద్రం మెట్రో ప్రయాణాలకు అనుమతిస్తే... ప్రతి స్టేషన్లో రైలు ఆగే వ్యవధిని పెంచాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎమ్ఆర్సీ) ఆలోచిస్తుంది. రైలులో సామాజిక దూరం అమలయ్యేలా చూడాలని భావిస్తుంది. లాక్‌డౌన్‌కు ముందు మెట్రో రైలు ప్రతి స్టేషన్లో 30 సెకన్ల పాటు ఆగేది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ వ్యవధిని మరో 30 సెకన్ల పాటు పెంచాలని డీఎమ్ఆర్సీ చూస్తుంది. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్ఓపీ)ని రూపొందించింది. మే 31 నాటికి దేశంలో నాల్గవ దశ లాక్డౌన్ ముగుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఈ ఎస్ఓపీ ఆమోదం పొందనుంది. ఇప్పటికే ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ డీఎమ్ఆర్సీ సీనియర్ అధికారులతో దీనిపై చర్చించారు. కేంద్రం మెట్రో రైళ్లకు అనుమతిస్తే.. సామాజిక దూరం పాటించడం, రైళ్లను శుభ్రపర్చడం వంటి అంశాల గురించి చర్చించారు. ఈ క్రమంలో డీఎమ్ఆర్సీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మెట్రోలో సామాజిక దూరం పాటించడం కోసం రెండు సీట్లకు మధ్య ఓ సీటు వదిలేయాలి. ప్రతి ట్రిప్ పూర్తి కాగానే రైళ్లను డిసిన్ఫెక్టెంట్ చేయాలి. స్టేషన్లో సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ ఏర్పాటు చేయాలి. టోకెన్లతో పాటు కాంటాక్ట్‌లెస్ టికెటింగ్‌ను అమలు పర్చాలని భావిస్తున్నాం. ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే... జరిమానాతో పాటు.. జైలు శిక్ష కూడా విధిస్తాం. స్టేషన్లోకి వచ్చేటప్పుడు ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఈ మేరకు అదనపు సిబ్బందని నియమించాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. -
సీఏఏ సెగ: మెట్రో స్టేషన్ తాత్కాలికంగా మూసివేత
-
సీఏఏ సెగ: మెట్రోకు బ్రేక్
న్యూఢిల్లీ: పౌరసత్వ నిరసన సెగలు ఢిల్లీ మెట్రోను తాకాయి. సుమారు నెలరోజులకు పైగా షాహీన్‌బాగ్‌లో నిరసనలు చేపట్టిన ఆందోళనకారులు తాజాగా శనివారం రాత్రి ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జాతీయ జెండాలు చేతబూని ఆజాదీ(స్వాతంత్ర్యం) కావాలంటూ గొంతెత్తి అరిచారు. చేతులకు నీలం రంగు బ్యాండ్ కట్టుకుని ‘జై భీమ్’ నినాదాలు చేశారు. ఇక సీఏఏను రద్దు చేసేవరకు ఇక్కడనుంచి కదిలేది లేదంటూ నిరసనకారులు తేల్చి చెప్తున్నారు. కాగా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో జనం పోగవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. (రాళ్లు రువ్వి వర్సిటీలోకి వెళ్లారు) దీంతో పోలీసులు అదనపు బలగాలతో ఆ ప్రాంతాన్ని మెహరించారు. దాదాపు 500మందికి పైగా ఆందోళనకారులు ఈ ర్యాలీలో పాల్గొనగా వీరిలో మహిళల సంఖ్యే అధికంగా ఉండటం గమనార్హం. కాగా జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ బయటే వీరు నిరసనలు చేపట్టడంతో డీఎమ్ఆర్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జాఫ్రాబాద్ మెట్రోస్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మార్గంలో వెళ్లే రైళ్లు అక్కడ ఆగవని, ప్రయాణికులు గమనించాలని కోరారు. (నిన్న అమూల్య.. నేడు ఆర్ధ్ర) -
డ్రైవర్ లేకుండానే మెట్రో రయ్ రయ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో డ్రైవర్ రహిత రైళ్లు పట్టాలెక్కనున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లను బుధవారం ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పరీక్షించింది. ఫేస్ 3 కింద రెండు కారిడార్లను ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. వైఫై సౌకర్యం, సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక యూఎస్బీ డివైస్ అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది చివరికల్లా డ్రైవర్ లేకుండా నడిచే ఈ మెట్రో రైళ్లు రాజధానిలో పరుగులు పెట్టనున్నాయని మెట్రో ఎండీ మంగు సింగ్ వెల్లడించారు. మొదటగా డ్రైవర్ పర్యవేక్షణలో ఓ ఏడాది రైళ్లను నడిపి 100 శాతం సక్సెస్ సాధించాక డ్రైవర్ రహిత రైళ్లను ప్రారంభిస్తామన్నారు. దక్షిణ కొరియాలో తయారైన ఐదు డ్రైవర్ రహిత రైళ్లను ఇటీవలే దిగుమతి చేసుకున్నారు. ఇవి ఇప్పటికే ఢిల్లీలోని ముకుంద్‌పూర్ డిపోకు చేరుకున్నాయి. మరో మూడు రైళ్లు 'సిగ్నలింగ్ సిస్టమ్, ఎలెక్ట్రికల్ ఫిటింగ్స్‌తో అనుసంధానించి డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షించనున్నారు. స్పెషల్ రైళ్లు ఒక్కసారి 1866 మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చుతాయి. డ్రైవర్ క్యాబిన్ తీసివేయడంతో 40 మంది ప్రయాణించేందుకు అవకావం ఉంది. ఈ రైళ్లకు 6 కోచ్‌లు ఉంటాయి. మజ్లిస్ పార్క్-శివ్ విధార్ ల మధ్య 58.5 కిలోమీటర్లు, నొయిడాలోని బొటానికల్ గార్డెన్-జానక్పూరి పశ్చిమ ఢిల్లీ ల మధ్య 38 కి.మీ మేర ఇప్పటికే ట్రయల్ రన్ సాఫీగా సాగిపోతున్న విషయం తెలిసిందే. ఫేస్ 3లో డ్రైవర్ రహిత రైళ్లను ప్రవేశపెట్టే సమయంలో ప్రాథమిక పరీక్షల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. అయితే పరీక్షలన్నీ పూర్తయ్యాక సిబ్బంది లేకుండా రైళ్లను నడుపుతాం' అని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఓ ప్రతినిధి చెప్పారు. 56 కిలో మీటర్ల దూరాన్ని 12 నిమిషాల్లో చేరుకునే వేగంతో ఈ రైళ్లు పరుగులు పెట్టడం విశేషం. -
విజయవాడ మెట్రోకు టెండర్ల ఆహ్వానం
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆన్ లైన్ టెండర్లను ఢీల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్(డీఎమ్ఆర్సీ) ఆహ్వానించింది. రెండు ప్యాకేజీల పనులకు టెండర్లను శుక్రవారం సాయంత్రం ఆహ్వానించింది. నెహ్రూ బస్టాండ్ నుంచి నడమనూరు కారిడార్ పనులకు 1.33 కి.మీ నుంచి 6.57 కి.మీ వరకు 5 ఎలివేటేట్ ష్టేషన్ల నిర్మాణానికి టెండర్లు వేస్తున్నారు. మొదటి ప్యాకేజీలో సీటీ కేన్సర్ ఆస్పత్రి, ఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజీ, సత్యసాయి మందిరం, బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషన్లకు టెండర్ల దరఖాస్తులకు ఆహ్వానించారు. మొత్తంగా రూ.314 కోట్ల నుంచి 390 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండో ప్యాకేజీలో 6.57 కి.మీ నుంచి 12.62 కి.మీ వరకు మెట్రో రైలు నిర్మాణం చేపడతారు. ఈ ప్యాకేజీలో ఆరు ఎలివేటెడ్ స్టేషన్లకు టెండర్లు వేస్తున్నారు. రెండో ప్యాకేజీలో నిడమనూరు, ఎనికెపాడు, రామకృష్ణా వే బ్రిడ్జి, ప్రసాదం పాడు, రామవరపుపాడు, గుణదల స్టేషన్లకు టెండర్ల కోసం డీఎమ్ఆర్సీ సంస్థ ఆహ్వానించింది. -
జహంగీర్ పురి-బడ్లీ మధ్య ట్రయల్ రన్
♦ పరుగులు తీసిన మెట్రో రైలు ♦ {పాజెక్టు పనులు దాదాపు ఓ కొలిక్కి ♦ అనుమతి రాగానే అందుబాటులోకి న్యూడిల్లీ : జహంగీర్ పురి-బడ్లీ మార్గంలో శుక్రవారం మెట్రో రైలు ప్రయోగాత్మకంగా పరుగులు తీసింది. యెల్లో లైన్ పొడగింపులో భాగంగా నిర్మించిన ఈ మార ్గంలో జహంగీర్‌పురి-హుడా సిటీ సెంటర్ మధ్య ఇప్పటికే మెట్రో రైలు సేవలందిస్తోంది. జహ ంగీర్పురి-బడ్లీ మధ్య దూరం 4.392 కిలోమీటర్లు. మూడోదశ కింద చేపట్టిన ఈ ఎలివేటెడ్ ప్రాజెక్టు పనులు దాదాపు ఓ కొలిక్కివచ్చాయి. ట్రయల్ రన్లు, ప్రాథమిక లాంఛనాలు పూర్తవడంతోపాటు అనుమతులు అందినవెంటనే ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు శుక్రవారం డీఎంఆర్సీ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఉత్తర ఢిల్లీ పరిధిలోని జహంగీర్‌పురి, సమయ్‌పూర్, బడ్లీ, ట్రాన్స్‌పోర్ట్‌నగర్, జీటీ కర్నాల్ రోడ్డు ప్రాంతాలతోపాటు రోహిణి పరిధిలోని కొన్ని ప్రాంతాలవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఈ పనులు సజావుగా సాగాలంటే ఆయా సంస్థల మధ్య సమన్వయం అత్యంత అవసరం. డీఎంఆర్సీకి భూసేకరణ సవాల్ న్యూఢిల్లీ: శరవేగంగా మెట్రో పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ)కు భూసేకరణ పెద్ద అవరోధంగా మారింది. ఈ విషయాన్ని డీఎంఆర్సీ చీఫ్ మంగూసింగ్ మీడియాకు వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మూడో దశలో భాగంగా మూడు ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన మెట్రో పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. ఈ అడ్డంకులు తొలిగిపోతే ప్రస్తుతం 190 కిలోమీటర్ల మేర జరుగుతున్న పనులను అదనంగా మరో 140 కిలోమీటర్ల మేర చేపట్టడానికి వీలవుతుందన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియాకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తూర్పుఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలోగల కొన్ని కుటుంబాలు తాము ప్రకటించిన పునరావాస ప్యాకేజీని తిరస్కరించాయని చెప్పారు. అలాగే పశ్చిమ ఢిల్లీలోని మాయపురి, పంజాబీభాగ్లో మరికొన్ని కుటుంబాలు కూడా అంగీకరించలేదని తెలిపారు. పంజాబీభాగ్లో మురికివాడలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. -
మెట్రో పరుగులు మూడేళ్లలో
- డీఎంఆర్సీ డీపీఆర్‌ను ఆమోదించిన కేబినెట్ - రెండో దశలో అమరావతికి అనుసంధానం - ప్రకాశం బ్యారేజీ దిగువన మరో బ్రిడ్జి నిర్మాణం సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నివేదించిన సవివర నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకుంది. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించడంతో పాటు రాజధాని అమరావతికి విస్తరించాలని కేబినెట్ తీర్మానించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని డీఎంఆర్సీ చేపట్టనుంది. ఈ నిర్ణయాలన్నీ గతంలోనే జరిగినా వాటికి కేబినెట్ అధికారికంగా బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 25.76 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో నిర్మించే తొలి దశ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,705 కోట్లు ఖర్చవుతుందని డీఎంఆర్సీ సవివర నివేదికలో పేర్కొంది. నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి ప్రాజెక్టు పూర్తవడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని చెప్పిన డీఎంఆర్సీ అప్పటికి అంచనా వ్యయం రూ.6,823 కోట్లు అవుతుందని స్పష్టం చేసింది. మొదటి కారిడార్ పండిట్ నెహ్రూ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.76 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్‌లో 12 స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి నిడమానూరు వరకు 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్‌లో 13 స్టేషన్లు నెలకొల్పుతారు. కంట్రోల్ పాయింట్‌గా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మెట్రో ప్రాజెక్టు కంట్రోల్ పాయింట్‌గా, సంయుక్త బస్‌స్టేషన్‌గా ఉంటుంది. మొదటి కారిడార్‌ను రెండో దశలో రాజధాని అమరావతికి విస్తరిస్తారు. ఇందుకోసం కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రస్తుతం ఉన్న రైలు బ్రిడ్జికి 200 మీటర్ల అవతల మరో బ్రిడ్జిని నిర్మిస్తారు. అటు నుంచి ప్రాజెక్టును తుళ్లూరుకు కలుపుతారు. రెండో కారిడార్‌ను రెండో దశలో గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తారు. అనుమతులు వచ్చేందుకు ఎస్పీవీ ఏర్పాటు మెట్రో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను శ్రీధరన్ నేతత్వంలోని డీఎంఆర్‌సీకే అప్పగించిన ప్రభుత్వం దీనిపై బుధవారం లాంఛనంగా నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 40 శాతం నిధులను భరిస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను జపాన్‌కు చెందిన జైకా తదితర సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించారు. దీనిపై జైకా సంస్థతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు వెంటనే వచ్చేందుకు ప్రభుత్వం ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్)ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మంత్రిమండలి కూడా ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయడంతో దానికి సంబంధించిన ధృవీకరణ అందగానే డీఎంఆర్సీ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉంది. -
మెట్రోకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నివేదించిన సవివర నివేదికకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన మీదట నిర్ణయించింది. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించడంతోపాటు రాజధాని అమరావతికి విస్తరించాలని కేబినెట్ తీర్మానించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని డీఎంఆర్సీ చేపట్టనుంది. ఈ నిర్ణయాలన్నీ గతంలోనే జరిగినా వాటికి కేబినెట్ అధికారికంగా బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 25.76 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో నిర్మించే తొలి దశ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,705 కోట్లు ఖర్చవుతుందన డీఎంఆర్సీ సవివర నివేదికలో పేర్కొంది. నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి ప్రాజెక్టు పూర్తవడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని చెప్పిన శ్రీధరన్ అప్పటికి అంచనా వ్యయం రూ.6,823 కోట్లు అవుతుందని స్పష్టం చేసింది. మొదటి కారిడార్ పండిట్ నెహ్రూ స్టేషన్ నుంచి పెనమలూరు వరకూ 12.76 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్‌లో 12 స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి నిడమానూరు వరకూ 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్‌లో 13 స్టేషన్లు నెలకొల్పుతారు. పండిట్ నెహ్రూ బస్టేషన్ మెట్రో ప్రాజెక్టు కంట్రోల్ పాయింట్‌గా, సంయుక్త బస్టేషన్‌గా ఉంటుంది. మొదటి కారిడార్‌ను రెండో దశలో రాజధాని అమరావతికి విస్తరిస్తారు. ఇందుకోసం ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రస్తుతం ఉన్న రైలు బ్రిడ్జికి 200 మీటర్ల అవతల మరో బ్రిడ్జిని నిర్మిస్తారు. ప్రాజెక్టును తుళ్లూరుకు కలుపుతారు. రెండో కారిడార్‌ను రెండో దశలో గన్నవరం ఎయిర్‌పోర్టు వర కూ విస్తరిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను శ్రీధరన్ నేతృ త్వం లోని డీఎంఆర్‌సీకే అప్పగించిన ప్రభుత్వం దీనిపై బుధవారం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 40 శాతం నిధులను భరిస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను జపాన్‌కు చెందిన జైకా తదితర సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయి ంచారు. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు వెంటనే వచ్చేం దుకు ప్రభుత్వం ఎస్పీవీని (స్పెషల్ పర్పస్ వెహికల్) కూడా ఏర్పాటు చేసింది. ధ్రువీకరణ అందగానే డీఎంఆర్సీ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉంది. -
మహిళా సంరక్షణకు మెరుగైన భద్రత
న్యూఢిల్లీ: రాత్రి వేళల్లో ఢిల్లీ మెట్రోల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు క్షేమంగా ఇంటికి చేరుకునేలా మెరుగైన భద్రత కల్పించాలని కేంద్ర పరిశ్రమల భద్రత దళం(సీఐఎస్ఎఫ్) నిర్ణయించింది. కేవలం మెట్రోల్లో భద్రత కల్పించడమే కాకుండా, వారు క్షేమంగా ఇంటికి చేరుకునేలా ఆటో, రిక్షా, బస్సు వంటి ప్రయాణ సాధనాలు కూడా సమకూర్చాలని తమ మహిళా సిబ్బందికి సీఐఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డీఎంఆర్సీ పరిధిలో 136 మెట్రో సేష్టన్లు ఉండగా, పురుషులు, మహిళలు కలిపి 4,800 మంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళా ప్రయాణికులకి సాయమందించాలని మేము మా సిబ్బందికి చెప్పాం. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఆటోలు, రిక్షా వంటి ప్రయాణ సాధనాలు కూడా సమకూర్చి, వాటి నంబర్లను నోట్ చేసుకోవాలని చెప్పాం. తద్వారా తమను గమనిస్తున్నారనే భయంతో మహిళా ప్రయాణికులతో డ్రైవర్లు సక్రమంగా నడుచుకుంటారు. దీంతో మహిళలు క్షేమంగా ఇంటికి వెళ్లగలుగుతారు’ అని సీఐఎస్ఎఫ్ డీజీ అర్వింద్ రంజన్ చెప్పారు. సోమవారం సీఐఎస్ఎఫ్ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మెట్రో స్టేషన్లలో ఉన్న సీసీటీవీలు కూడా తమకు తోడ్పాటునందిస్తున్నాయని చెప్పారు. మరిన్ని సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 180 సంఘటనల్లో ఇవి ఉపయోగిపడ్డాయని తెలిపారు. వీటిని ఉపయోగించి ట్రాక్‌లపై నడుస్తున్న 500 మంది పై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. మంచి ప్రవర్తన, నైపుణ్యాలను నేర్పించి తమ సిబ్బందిని మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం నియమించామని తెలిపారు. అలాగే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, చాందినీ చౌక్, కష్మీరీ గేట్, చౌరీ బజార్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి ఆరు ప్రాంతాల్లో గ్లాస్ డోర్ కారిడార్ల ఎత్తు పెంచాలని డీఎంఆర్సీకి ప్రతిపాదించింది. స్టేషన్లలో 90 శాతం దొంగతనాలు మహిళా దొంగలు చేస్తున్నారని తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హెల్ప్‌లైన్ నంబరు స్థానంలో సులభంగా గుర్తుండేలా నాలుగు సంఖ్యల నంబరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఐఎస్ఎఫ్ అధికారులు డీఎంఆర్సీకి సూచించారు. తద్వారా ప్రజలు సీఐఎస్‌ఎఫ్‌ని సంప్రదించడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. -
మెట్రో ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం రేపటి నుంచి అదనంగా 17 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 వరకు వీటిని నడపబోతున్నట్లు పేర్కొంది. గ్రీన్ లైన్, ఎయిర్‌పార్టు ఎక్స్‌ప్రెస్ లైన్ మినహా మిగిలిన అన్ని మార్గాల్లో ఈ 17 రైళ్లను అదనంగా తిప్పుతామని చెప్పింది. అదనంగా ఏర్పాటు చేస్తున్న ఈ రైళ్లు రద్దీ సమయాల్లో మొత్తం 104 ట్రిప్పులు వేస్తాయని వెల్లడించింది. ఈ చర్యల వల్ల పీక్ అవర్స్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మరింతగా ప్రోత్సహించినట్లు అవుతుందని డీఎంఆర్సీ ప్రతినిధి చెప్పారు. ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే ద్వారాకా-నొయిడా(బ్లూ లైన్), జహంగీర్‌పురి-గుర్గావ్ (యెల్లో లైన్) మార్గాల్లో కొత్తగా 12 రైళ్లను ఏర్పాటు చేశారు. అదనపు కేటాయింపులతో బ్లూ లైన్ మార్గంలో రైళ్ల సంఖ్య 53కి పెరగగా, యెల్లో లైన్ మార్గంలో 63కి చేరింది. అలాగే ట్రిప్పుల సంఖ్య కూడా వరుసగా బ్లూ లైన్(619), యెల్లో లైన్(734)కి పెరిగింది. రెడ్ లైన్ మార్గంలో మాత్రం ఆఫ్ పీక్ అవర్స్‌లో తిప్పేందుకు ఒకే ఒక రైలును వేయగా, వయొలెట్ లైన్లో పీక్ అవర్స్ కోసం ఒక రైలును కేటాయించారు. ఢిల్లీ మెట్రో ద్వారా రోజుకి 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారని అంచనా. ప్రయాణికుల రద్దీ కారణంగా 2010-14 మధ్య కాలంలో కోచ్‌ల సంఖ్యను 640 నుంచి 1,076కి పెంచింది. ఈ విధంగా డీఎంఆర్సీ చేపడుతున్న చర్యలతో మెట్రోలో ప్రయాణం ఇక సులభతరం అయ్యే అవకాశం ఉంది. -
డీఎంఆర్సీ డాక్యుమెంట్లను డిజిటలీకరణ
న్యూఢిల్లీ: డాక్యుమెంట్ల రూపంలో భద్రపరిచే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) సమాచారాన్ని అవసరమైనప్పుడు క్షణాల్లో తిరిగి చూసుకునేలా డిజిటలైజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఏజెన్సీ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్, ఎన్ఐసీ డిప్యూటీ డైరక్టర్ జనరల్ రాజీవ్ ప్రకాశ్ మెట్రో భవన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ వెబ్సైట్ రూపకర్తలను అభినందించారు. దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, భవిష్యత్‌లో కూడా సంస్థ ఉద్యోగుల కోసం మరిన్ని ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని డీఎంఆర్సీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. దీర్ఘకాలంపాటు డాక్యుమెంట్లను సంరక్షించడమే కాకుండా ఎప్పుడు కావలంటే అప్పుడు క్షణాల్లో సమాచారాన్ని చూసుకోవడానికి శాస్త్రిపార్కులోని నేషనల్ డేటా సెంటర్లోని ఎన్ఐసీ సర్వర్ తోడ్పతుందని చెప్పింది. -
ఎయిర్పోర్ట్ మెట్రోకు పెరిగిన ఆదరణ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌కు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. కాగా, గత జూలైలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఈ మెట్రో నిర్వహణను హస్తగతం చేసుకుంది. అప్పటినుంచి ఈ రైలుకు ప్రయాణికుల్లో ఆసక్తి పెంచేందుకు పలుచర్యలు తీసుకుంది. అందులో భాగంగా టికెట్ ధరను తగ్గించింది. దాంతోపాటు రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు కల్పించడంతో ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఇందులో ప్రయాణించేవారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి సాధించినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, 2013 జూలై నుంచి 2014 జూలై వరకు సరాసరి రోజువారి ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పులేదు. 2013 జూలైలో రోజూ 10,069 మంది ప్రయాణిస్తే, 2014 జూలైలో ఆ సంఖ్య 13,838కి మాత్రమే పెరిగింది. అయితే గత జూలైలో ప్రయాణచార్జీలను తగ్గించిన తర్వాత ఒక్కసారి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఒక్క నవంబర్లోనే 5,38,293 మంది ఈ రైలును ఆశ్రయించారు. అంటే సరాసరిన రోజున18 వేల మంది ప్రయాణించినట్లు అధికారికంగా తేలింది. ఈ సందర్భంగా డీఎంఆర్సీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. గత జూలై వరకు ఈ రైల్లో ప్రయాణించడానికి కనిష్టంగా రూ.30, గరిష్టంగా రూ.180 టికెట్ ధర ఉండేదన్నారు. కాగా, జూలై నుంచి ఈ ధరలను రూ.20, రూ.100గా మార్చామన్నారు. అలాగే శివాజీస్టేడియం నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్ రైల్‌కు ఫీడర్ బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రైళ్లకు అనుసంధానం చేస్తూ ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలను మార్చామన్నారు. దీంతో ఇటీవల కాలంలో ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని వివరించారు. -
చార్జీలు తగ్గించినా స్పందన అంతంతే
న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్ మార్గంలో మెట్రో రైళ్లను నడుపుతున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఈ ఏడాది జులైలో చార్జీలను దాదాపు 40 శాతం తగ్గించింది. అయినప్పటికీ సంస్థ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. చార్జీలను తగ్గించినప్పటికీ ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఆశించినమేర పెరగలేదు. తొలుత ఈ మార్గంలో మెట్రో రైళ్ల నిర్వహణ బాధ్యతలను రిలయన్స్ సంస్థ చేపట్టింది. అయితే 2013, జులైలో ఆ బాధ్యతలనుంచి తప్పుకోవడంతో డీఎంఆర్సీ తన భుజస్కంధాలపైకి ఎత్తుకుంది. అప్పట్లో ప్రతిరోజూ దాదాపు 10,069 మంది రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాతి సంవత్సరం అది 17,943కు చేరుకుంది. ఆ తర్వాత రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడంతోపాటు చార్జీలను కూడా తగ్గించింది. అంతేకాకుండా మెట్రో రైలు సేవలను ప్రారంభ సమయాన్ని గం. 4.45గా చేసింది. అంతకుముందు గం. 5.15 నిమిషాలకు తొలి రైలు బయల్దేరేది. అంతకుముందు ఈ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఒక మెట్రో రైలు వచ్చేది. రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడంద్వారా ఇప్పుడు ఆ సమయాన్ని పది నిమిషాల 30 సెకండ్లకు కుదించారు. ఇందువల్ల ఈ మార్గంలో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అంతకుముందు 148 ట్రిప్పులు ఉండగా ఆ తర్వాత వీటి సంఖ్య 166కు చేరుకుంది. అంతేకాకుండా ప్రయాణికులకు వసతులు కూడా బాగా పెంచారు. శివాజీ మెట్రో స్టేషన్ వద్ద ఫీడర్ సేవలను పెంచారు. ఆయా స్టేషన్లవద్ద దిగిన ప్రయాణికులకు తక్షణమే బస్సులు అందేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇంతచేసినప్పటికీ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రయాణికుల సంఖ్య అంతంతగానే పెరిగింది. ఈ విషయం డీఎంఆర్సీని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ మార్గంలో మొత్తం 21 స్టేషన్లు ఉన్నాయి. కాగా ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాన్ని పొడగించే అంశంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) దృష్టి సారించింది. గుర్గావ్ వరకూ పొడిగించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా హర్యానా ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ గుర్గావ్ వరకూ ఈ మార్గాన్ని పొడిగించినట్టయితే మెట్రో రైలు సేవలను వినియోగించుకునేవారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఇందువల్ల వారు తమ తమ గమ్యస్థానాలకు సత్వరమే చేరుకునే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. -
ఢిల్లీ మెట్రో సేవలు భేష్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) తన కార్యకలాపాలు ప్రారంభించి 12 ఏళ్లు పూర్తిచేసుకుంది. ప్రయాణికుల ఆదరణ పొందుతూ అంచలంచెలుగా విస్తరణ చెందుతున్న ఢిల్లీ మెట్రో కారణంగా 2014 సంవత్సరంలో దాదాపు రూ. 10,346 కోట్ల పొదుపు జరిగిందని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీఆర్ఆర్ఐ) అంచనా వేసింది. 190 కి.మీ. పొడవున్న ఈ మెట్రో నెట్ వర్క్ కారణంగా ప్రాణ నష్టం ఏటా గణనీయంగా తగ్గుతోందని అంచనా వేసింది. సంబంధిత వివరాలను డీఎంఆర్సీ ఛైర్మన్ మంగూసింగ్ మీడియాకు వె ల్లడించారు. ఇంధన పొదుపు విషయానికి వస్తే ఢిల్లీ మెట్రో దాదాపు రూ. 1,972 కోట్ల విలువైన ధనాన్ని పొదుపు చేసింది. 2011లో దాదాపు 1.06 లక్షల టన్నుల ఇంధనం పొదుపు అవగా.. 2014లో ఇది 2.7 లక్షల టన్నులకు చే రుకుంది. ఇక వాహన పెట్టుబడి- నిర్వహణ వ్యయం రూ. 2,617 కోట్లు మేర ఆదా అయ్యింది. ప్రయాణికుల అమూల్యమైన సమయానికి లెక్కకడితే దాని విలువ రూ. 4,107 కోట్లు అవుతుందని సింగ్ వివరించారు. అంతేకాకుండా 2007లో 16,895 వాహనాల వినియోగం తగ్గితే... 2011లో 1,17,249 వాహనాల వినియోగం తగ్గిందని, 2014లో ఆ సంఖ్య 3,90,971కి చేరిందని వివరించారు. 2007లో 24,691 టన్నుల ఇంధనం పొదుపవగా.. 2014లో 2,76,000 టన్నుల ఇంధనం పొందుపైందని వివరించారు. 2011లో ప్రతి ప్రయాణికుడికి తాను ప్రయాణం చేసినప్పుడు 28 నిమిషాలు ఆదా కాగా.. ఈ ఏడాది 32 నిమిషాలు ఆదా అయ్యిందని తెలిపారు. అలాగే ట్రాఫిక్ జాముల కారణంగా వృథా అయ్యే ఇంధనం మెట్రోల ద్వారా మిగిలిందని, దీని విలువ రూ. 491 కోట్లు ఉంటుందని వివరించారు. అలాగే కాలుష్యం తగ్గింపు కారణంగా దాదాపు రూ. 489 కోట్లు ఆదా అయ్యింది. ఈ అన్ని అంశాలు కలిపితే 2014లో రూ. 10,346 కోట్లు ఆదా అయినట్లని వివరించారు. ఏటా ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని తెలిపారు. క్రమంగా విస్తరణ ఢిల్లీ మెట్రో రైలు తన సేవలను క్రమంగా విస్తరిస్తోంది. 2014లో జన్‌పథ్, మండీ హౌజ్ స్టేషన్లను ప్రారంభించింది. అలాగే 11 రైళ్లను 8 కోచ్‌లు గల రైళ్లుగా మార్చింది. ఫేజ్-1లో 65 కి.మీ. ఫేజ్-2లో 125 కి.మీ. మేర మెట్రో నెట్వ ర్క్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫేజ్-3, ఫేజ్-4 విస్తరణ పనులు నడుస్తున్నాయి. ఫేజ్-3లో మరో 167.27 కి.మీ. మేర నెట్వర్క్ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫేజ్-4లో మరో 100 కి.మీ. మేర నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. -
మే నాటికల్లా అందుబాటులోకి మరో మెట్రో మార్గం
న్యూఢిల్లీ: జహంగీర్‌పురి -ఫరీదాబాద్ మధ్య నిత్యం రాకపోకలు సాగించేవారికి శుభవార్త. ఈ రెండు ప్రాంతాల మధ్య ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మేనాటికల్లా ఈ మార్గంలో మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయమై డీఎంఆర్సీ అధికార ప్రతినిధి అంజు దయాళ్ మాట్లాడుతూ ‘2015 మే నాటికల్లా ఈ పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నాం. ఆ తర్వాత భద్రతా పత్రం కోసం మెట్రో రైల్ సేఫ్టీ కమిషనరేట్‌ను సంప్రదిస్తాం’అని అన్నారు. తొలి విడత కింద బడ్లి-ఢిల్లీ మధ్య చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు పనులు మార్చినాటికల్లా పూర్తవుతాయని భావిస్తున్నామన్నారు. జహంగీర్‌పురి -ఫరీదాబాద్ కారిడార్‌లో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయి. ఇదే సమయంలో సిగ్నలింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి.ఈ కారిడార్‌లో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. అవి ఢిల్లీ, బడ్లీమోర్, రోహిణీ సెక్టార్ 18. ఈ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 29 వేలమంది రాకపోకలు సాగిస్తారని అంచనా. ఇక నాలుగో విడతలో భాగంగా బడ్లీమోర్ స్టేషన్‌ను ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌గా మారుతుంది. -
మంగూ సింగ్‌కు గౌరవ డాక్టరేట్
న్యూఢిల్లీ: దేశంలో మెట్రో టెక్నాలజీలో చేస్తున్న అసాధారణమైన కృషికి, నాయకత్వ ప్రతిభకు గుర్తింపు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్‌కు ఓ ప్రైవేట్ యూనివర్సిట్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. నోయిడాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఎమిటీ యూనివర్సిటీ ఈ గౌరవ పురస్కారాన్ని అందచేసింది. డీఎంఆర్సీ సాధిస్తున్న అపూర్వమైన విజయాలు, అత్యంత వేగంగా అది సాధిస్తున్న పురోగతి వెనుక స్ఫూర్తిదాయకమైన సింగ్ నాయకత్వం ఉందని యూనివర్సిటీ అభినందించింది. సొరంగ మార్గాలను నిర్మించే టన్నెలింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఐ)కి అధ్యక్షునిగా మంగూసింగ్ ఢిల్లీ, కోల్‌కతా నగరాలలో మెట్రో ప్రాజెక్టు అమలులో ఎనలేని కృషి చేశారని కొనియాడింది. భారీ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో సింగ్ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని పేర్కొంది. నిర్దేశిత సమయంలో, కేటాయించిన బడ్జెట్ నిధులతోనే ప్రాజెక్టులను పూర్తి చేశారని తెలిపింది. -
‘మెట్రో’ మూడో దశకు భూసేకరణ గ్రహణం
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తలపెట్టిన మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు భూసేకరణ గ్రహణం పట్టుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని డీఎం ఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఓ లేఖ రాశారు. గుర్తించిన స్థలాలను తమకు తక్షణమే అప్పగించకపోయినట్టయితే మూడో దశ పనులను చేపట్టడం కష్టమవుతుందని ఆ లేఖలో సింగ్ హెచ్చరించారు. భూసేకరణ ఆవశ్యకతను, అది సక్రమంగా జరగకపోతే ఎదురయ్యే ఇబ్బందులను ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖను ఆయన ఈ నెల 11వ తేదీన రాశారు. ఇందుకు సంబంధించిన ప్రతిని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు కూడా పంపారు. ముకుంద్‌పూర్, శివ్‌విహార్ ప్రాంతాల్లో భూసేకరణ పెద్ద తలనొప్పిగా పరిణమించిందని పేర్కొన్నారు. దీంతోపాటు ముకుంద్‌పూర్-మాయాపురి. మాయాపురి-లజ్‌పత్‌నగర్ మధ్య కూడా ఇదే పరిస్థితి నెలకొం దన్నారు. దీని పొడవు 84 కిలోమీటర్లని తెలిపారు. ఈ మార్గంలో ఓ చోట మురికివాడ కూడా ఉందని, దీంతో వయాడక్ట్ పనులు ఆగిపోయాయన్నారు. స్థలం దొరకని కారణంగా పంజాబిబాగ్ స్టేషన్ పనలు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. ఇక కాళిందీకుంజ్ వద్ద నిర్మించతలపెట్టిన స్టేషన్ విషయంలోనూ అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడ ఢిల్లీ అభివృద్ధి సంస్థకు 2.15 లక్షల చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇక్కడే డిపోను నిర్మించాలని నిర్ణయించారు. అయితే అనేక కారణాల వల్ల ఈ పనులు కూడా ముందుకు సాగడం లేదు. దీంతోపాటు ఇక్కడే డీడీఏకి మరో లక్ష చదరపు మీటర్ల స్థలం ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ఈ స్థలాన్ని డీడీఏ ఏనాడో డీఎంఆర్సీకి అప్పగించింది. అయితే అక్కడే నివాసం ఏర్పరుచుకున్నవారు దానిని ఖాళీ చేసేందుకు ముందుకు రావడం లేదు. లేఖ అందింది: కాగా డీఎంఆర్సీ చైర్మన్ మంగూసింగ్ రాసిన లేఖ తమకు అందిందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. దీనిని పరిశీలిస్తున్నామన్నారు. -
నోబెల్ మెమోరియల్ వాల్ ప్రారంభం
న్యూఢిల్లీ: నగరంలోని రాజీవ్ మెట్రో రైల్ స్టేషన్లో ఆదివారం ఉదయం నోబెల్ మెమోరియల్ వాల్‌ను స్వీడన్ రాయబార కార్యాలయ ప్రతినిధులు ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) , కెనడా రాయబార కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భారతదుశం నుంచి నోబెల్ పురస్కారాలను అందుకున్న వారి గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించామని డీఎంఆర్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. నోబెల్ మెమోరియల్ వాల్ ప్రదర్శన ఆదివారం నుంచి వచ్చే నెల ఒకటో తేదీదాకా జరగనుంది. ఈ ప్రదర్శనలో భాగంగా ఈ గోడపై రవీంద్రనాథ్ ఠాగూర్, సీవీరామన్, సుబ్రమణ్య చంద్రశేఖర్, డాక్టర్ హరగోవింద్ ఖురానా, మదర్‌థెరిస్సా, అమర్త్యసేన్, వెంకట్రామన్ రామకృష్ణన్లతోపాటు ఈ ఏడాది నోబెల్ బహుమతి విజేత కైలాష్ సత్యార్థి ఫొటోలను కూడా ఉంచనున్నారు. ఈ వాల్ ప్రారంభ కార్యక్రమంలో డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్, స్వీడన్ రాయబారి హెరాల్డ్ శాండ్‌బర్గ్, నార్వే రాయబారి ఇవిండ్ ఎస్ హొమ్మే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్ మాట్లాడుతూ నోబెల్ మెమోరియల్ వాల్ ప్రార ంభించడం గర్వించదగ్గ విషయమన్నారు. నోబెల్ పురస్కార గ్రహీతలవల్ల భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు. -
‘మెట్రో’ సేవలు విస్తృతం
ప్రయాణికులకు శుభవార్త... నగరంలో మెట్రో రైలు సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇందుకు కారణం నాలుగో దశ కింద 103.93 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించనుండడమే. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించింది. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నాలుగో దశ మెట్రో మార్గ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులోభాగంగా 103.93 కిమీ పొడవైన మెట్రో మార్గాన్ని నిర్మించనుంది. ఈ పనులను 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను డీఎంఆర్సీ... కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖతోపాటు ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రెండింటి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. నాలుగవ దశ కింద రిఠాలా నుంచి నరేలా (921.73కిమీ),పశ్చిమ జనక్‌పురి నుంచి ఆర్.కె.ఆశ్రం (28.92కిమీ), ముకుంద్ పురి నుంచి మౌజ్‌పూర్ (12.54 కిమీ), ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ ( 12.58 కిమీ), ఏరోసిటీ నుంచి తుగ్లకాబాద్ ( 20. 20 కిమీ), లజ్‌పత్‌నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ 9 (7.96 కిమీ) వరకు ఆరు కారిడార్లను నిర్మించాలని డీఎంఆర్సీ ప్రతిపాదించింది. రిఠాలా- నరేలా వరకు ఉండే కారిడార్ బర్వాలా, బవానాల మీదుగా, పశ్చిమ జనక్‌పురి నుంచి ఆర్కెఆశ్రం వరకు ఉండే కారిడార్ పీరాఘడీ మీదుగా ముకుంద్‌పుర్- మౌజ్‌పుర్ కారిడార్ వజీరాబాద్, ఖజూరీఖాస్ల మీదుగా, తుగ్లకాబాద్ - ఏరోసిటీ కారిడార్ మెహ్రోలీ, మహీపాల్పుర్ గుండా, ఇందర్‌లోక్ - ఇందర్బస్తీ కారిడార్ దయాబస్తీ,న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, దిల్లీ గేట్, సచివాలయం మీదుగా నిర్మించాలని డీఎంఆర్సీ ప్రతిపాదించింది. పనులు మొదలుపెట్టిన ప్పటి నుంచి 72 నెలల్లోగా నాలుగోదశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డీఎంఆర్సీ అంటోంది. 2016, ఏప్రిల్‌లో పనులు ప్రారంభమైతే 2022 మార్చి నాటికి పూర్తవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. నాలుగో దశలో ఆరు కారిడార్లలో 67 మెట్రో స్టేషన్లను నిర్మిస్తారు. ప్రస్తుతం నగరంలో మెట్రో మార్గం 190 కి.మీ పొడవుతో విస్తరించి ఉంది. ప్రతిరోజూ 25 లక్షల మంది ప్రయాణికులు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. మూడో దశ మెట్రో నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. 140 కి.మీల ఈ మెట్రో నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ 40 లక్షలకు చేరుకుంటుందని ఆశిస్తున్నారు. నాలుగో దశ నిర్మాణం తరువాత ఢిల్లీ మెట్రో ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ 60 లక్షలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. -
సేవలు బహు బాగు
ఢిల్లీ మెట్రో నిక్కచ్చితత్వానికి పెట్టింది పేరు. నిర్దేశిత సమయానికే స్టేషన్‌కు గమ్యస్థానానికి చేరుతుంది. న్యూఢిల్లీ: ప్రయాణికుల మనసులను దోచుకోవడంలో 18 అంతర్జాతీయ మెట్రోల్లో ఢిల్లీ మెట్రో ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. గ్లోబల్ మెట్రో బెంచ్‌మార్కింగ్ గ్రూప్స్ అయిన నోవా, కోమట్ సంస్థలు సంయుక్తంగా అంతర్జాతీయ మెట్రో సేవలపై అధ్యయనం చేశాయి. ప్రజారవాణా వ్యవస్థల్లో అత్యుత్తమ సేవలకు సంబంధించి యూరోపియన్ ప్రమాణాల ప్రకారం ఈ సంస్థలు అధ్యయనం చేశాయి. ఇందులోభాగంగా అందుబాటు, వినియోగం అత్యంత సులువుగా ఉండడం, ప్రయాణానికి ముందే సమాచారం అందుబాటులో ఉండడం, ప్రయాణ సమయంలో నిరంతరం సమాచారం అందించడం, విశ్వసనీయత, ప్రయాణికుడికి ప్రాధాన్యత, వారికి తగు భద్రత తదితర అంశాల ప్రాతిపదికగా ఈ అధ్యయనం సాగింది. ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీనుంచి మే 25వ తేదీవరకూ అధ్యయనం చేశారు. ఇందుకోసం పలు ప్రముఖ వెబ్సైట్లు, సామాజిక మీడియాలను వేదికగా చేసుకున్నారు. ప్రపంచంలోని 18 ప్రముఖ మెట్రో రైళ్ల సేవలను వినియోగిస్తున్న దాదాపు 41 వేలమంది అభిప్రాయాలను సేకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. హాంగ్‌కాంగ్ ఎంటీఆర్, లండన్ అండర్‌గ్రౌండ్, మెట్రో డీ మాడ్రిడ్, ప్యారిస్ ఆర్‌ఏటీపీ, న్యూక్యాజిల్ నెక్సస్, మెట్రో రియో తదితర ప్రముఖ సంస్థలను ఇందులోభాగస్వాములను చేశారు. ఈ అధ్యయనంలో ఢిల్లీ మెట్రో ద్వితీయ స్థానంలో నిలవగా, లండన్ డాక్లాండ్స్ లైట్ రైల్వే, బ్యాంకాక్ మెట్రోలకు ఆ తర్వాతి స్థానం లభించింది. ఐదు మార్గాల్లో సేవలు 2002, డిసెంబర్ 24వ తేదీన ఢిల్లీ మెట్రో సేవలు మొదలయ్యాయి. మొత్తం ఐదు మార్గాల్లో ఢి ల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 2.4 మిలియన్ మంది ప్రయాణికులు వీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. మొత్తం రైళ్ల సంఖ్య 204 కాగా వీటికి నాలుగు, ఆరు, ఎనిమిది చొప్పున బోగీలు ఉంటాయి. నగరంతోపాటు నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ వంటి దూరప్రాంతాలకు కూడా వీటి సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో కోల్‌కతా తరువాత ఇదే అతి పెద్ద మెట్రో రైలు వ్యవస్థ. ఈ మెట్రో మార్గం మొత్తం పొడవు 193.2 కిలోమీటర్లు కాగా స్టేషన్ల సంఖ్య 139. మూడో దశకు నిధులు న్యూఢిల్లీ: మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులకోసం రాష్ట్ర ప్రభుత్వం తన ఈక్విటీ వాటా కింద ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) కి రూ. 200 కోట్ల మేర నిధులను విడుదల చేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. నిధుల విషయంలో కొన్ని కఠినతరమైన నిబంధనలను విధించామన్నారు. డీఎంఆర్సీ తన ప్రాజెక్టులను నిర్దేశిత కాలవ్యవధిలోగానే పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఆర్థిక, రవాణా, ప్రణాళికా విభాగాల పురోగతికి సంబంధించి కు ఈ సంస్థ ప్రతి నెలా తన నివేదికలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నిధులకు సంబంధించి ఆడిట్ చేసిన వినియోగపత్రాన్ని తమకు అందజేయాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నిధులకు సంబంధించి కూడా ఆడిట్ చేసిన వినియోగపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఈక్విటీ వాటా నిధులను నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉంటుందన్నారు. డీఎంఆర్సీ పనితీరును రవాణా శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తుం దన్నారు. నిర్దేశిత లక్ష్యాలను డీఎంఆర్సీ సాధించిందా లేదా అనే అంశంపైనా ఈ శాఖ తమకు నివేదిస్తుందన్నారు. -
మెట్రో బోగీలపై త్వరలో ప్రకటనలు
న్యూఢిల్లీ: రాబడి పెంపు దిశగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా బోగీలపై త్వరలో ప్రకటనలకు అనుమతించ నుంది. కార్యాచరణేతర రాబడిని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. బొమ్మలు, ముద్రిత సామగ్రి, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ డిస్ప్లే, స్మార్ట్ పోస్టర్లు, హోలోగ్రాఫిక్ చిత్రాలు, విజ్యువల్ డిస్ప్లేకి సంబంధించిన కాంట్రాక్టుకు సంబంధించిన హక్కులను ఇప్పటికే ఓ సంస్థకు అప్పగించామన్నారు. ఈ కాంట్రాక్టు పది సంవత్సరాలపాటు ఉంటుందన్నారు. మెట్రో బోగీలు లోపలిభాగంతోపాటు, స్టేషన్ పరిసరాల్లో ప్రకటనలను ఇప్పటికే అనుమతిస్తున్నామన్నారు. ఈ సంస్థల కార్యకలాపాలను తాము నిరంతరం నిశితంగా పరిశీలిస్తుంటామన్నారు. ఈ ప్రకటనల నాణ్యత ప్రపంచశ్రేణి విమానాశ్రయాలు, మెట్రో రైళ్ల ప్రమాణాలకు ధీటుగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కాగా ప్రస్తుతం డీఎంఆర్సీ 200 మెట్రో రైళ్లను నడుపుతోంది. 60 రైళ్లకు ఎనిమిది బోగీలు ఉండగా, మరో 80 రైళ్లకు ఆరు బోగీలు ఉన్నాయి. వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ ప్రారంభం పర్యావరణ అనుకూల నిర్మాణాలకు ప్రోత్సాహమిచ్చే దిశగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అడుగులు వేసింది. ఇందులోభాగంగా సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీవరకూ వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వారాన్ని నిర్వహిస్తోంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా భారత్‌తోపాటు ప్రపంచంలోని వంద దేశాల్లో కూడా సోమవారం నుంచి వారం రోజులపాటు రల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల ఆరంభంలో డీఎంఆర్సీ... ఐజీబీసీతో కలసి గ్రీన్ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎంఆర్టీఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి విదితమే. ఈ కార్యక్ర మాన్ని డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ ప్రారంభించారు. నేటినుంచి ఫీడర్ బస్సుల సేవలు శివాజీ స్టేడియం మెట్రో రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. మంగళవారం నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఫీడర్ బస్సు సేవలను ప్రారంభించనుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ బస్సులు ఉదయం ఎనిమిది గంటలనుంచి రాత్రి ఎనిమిది గంటలవరకూ అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు పటేల్ చౌక్, ఆకాశ్శాణి భవన్, కృషి భవన్, పాటియాలా హౌస్, హైకోర్టు, ప్రగతిమైదాన్, సుప్రీంకోర్టు ఐటీఓ, ఢిల్లీ గేట్, న్యూఢిల్లీ మెట్రో స్టేషన్, మింట్ రోడ్, స్టేట్స్‌మన్ హౌస్ తదితర ప్రాంతాలమీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో ప్రస్తుతానికి శీతలేతర బస్సులను ప్రయోగాత్మకంగా నడుపుతారు. ప్రతి 20 నిమిషాలకొకటి చొప్పున ఈ బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల స్పందననుబట్టి వీటి సేవలను పెంచుతామని సదరు ప్రకటనలో డీఎంఆర్సీ పేర్కొంది. కాగా ప్రస్తుతం ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లైన్ ఈ తరహా సేవలను అందిస్తోంది. -
మెట్రో స్పెల్లింగులు తప్పుల తడకలు
సవరిస్తామంటున్న డీఎంఆర్సీ న్యూఢిల్లీ: మెట్రోరైళ్లు ప్రయాణికులు చక్కటి సేవలు అందిస్తుండవచ్చు గాక. అయితే స్టేషన్లు, రూట్మ్యాపులపై ఉన్న పేర్లలో చాలా తప్పులు కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని పేర్ల స్పెల్లింగులు తప్పుగా ఉంటే, మరికొన్నింటినీ తప్పుగా రాస్తున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ మె ట్రో స్టేషన్ ఒకటో నంబరు గేటు దగ్గరున్న బోర్డుపై Chams Ford Club అని రాసి ఉంటుంది. నిజానికి దీనిని Chelms Ford Club అని రాయాలి. బ్రిటిష్‌పాలనలో భారత వైస్రాయ్ లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ పేరు మీద నగరంలోని రెడ్‌క్రాస్ రోడ్డు లో క్లబ్ ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి చెమ్స్‌ఫోర్డ్ వీధి అనే పేరొచ్చింది. మండీ హౌస్ స్టేషన్‌లోని సూచికల బోర్డులపై Lady Irvin College అని తప్పుగా రాశారు. దీనిని Lady Irwin College అని రాయాలి. ఇర్విన్ కూడా భారత వైస్రాయ్ సతీమణి కావడంతో ఈమె పేరుపై లేడీ ఇర్విన్ కాలేజీని 1930లో స్థాపించారు. ఇదే స్టేషన్లో మరో చోట Bhagwan Dass Road కు బదులు Bhagvan Dass Road అంటూ తప్పుగా రాశారు. అంతేగాక స్టేషన్లలో ఎల్ఈడీ తెర ల్లో కనిపించే రూటుమ్యాపుల్లోనూ చాలా తప్పులు ఉంటాయి. జంగ్‌పురా స్టేషన్‌లోని బోర్డులపై Jang pura అని సరిగ్గానే రాసి ఉంటుంది. కోచ్‌లలోని ఎల్ఈడీ తెరపై దీనిని Jang pura అంటూ రెం డు పదాలుగా విడగొట్టారు. మూల్‌చంద్ స్టేషన్ పేరులోనూ ఇదే పొరపాటు జరిగింది. స్టేషన్ బయట ఉక్కు అక్షరాల్లో Moolchand అని బాగా నే రాశారు. రూట్మ్యాపుల్లో మాత్రం Mool chand అని విడగొట్టారు. ఈ తప్పుల గురించి ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారు ల వద్ద ప్రస్తావించగా, త్వరలోనే స్పెల్లింగు తప్పులను సవరిస్తామని ప్రకటించారు. ఇలాంటి తప్పు లు సూచికల బోర్డులు, రూట్మ్యాపులకు మాత్రమే పరిమితం కాలేదు. రాజధాని విహారం పేరుతో రూపొందించిన నావిగేషన్ మ్యాపుల్లోనూ తప్పులకు కొదవలేదు. సెంట్రల్ సెక్రటేరియట్ నావిగేషన్ మ్యాపులో రాష్ట్రపతి భవన్ అని పేర్కొంటూ పార్లమెంటు భవ నం ఫొటో ముద్రించారు. జహంగీర్‌పురి స్టేషన్ పేరును ఎల్ఈడీ తెరపై సక్రమంగానే రాశారు. స్టేషన్ బయట కనిపించే సూచికల బోర్డులో మాత్రం ‘జహంగీర్ పురి’ అని విడిగా రాశారు. యెల్లోలైన్లో కింగ్స్‌వే క్యాంప్ స్టేషన్ పేరును ‘కింగ్స్ వే క్యాంప్’ అంటూ అనవసరంగా ఖాళీలతో రాశారు. రేస్‌కోర్సు మెట్రో స్టేషన్‌లోని సూచికల బోర్డులపై Tuglak Road అని తప్పుగా రాశా రు. దీనిని Tughlaq Road అని రాయాలి. -
పెరిగిన మెట్రో కనీస రీచార్జి
న్యూఢిల్లీ: టోకెన్ వెండింగ్ మిషన్ (టీవీఎం)ల ద్వారా రీచార్జి చేసే కనీస మొత్తం పెరిగింది. నిన్నటిదాకా రూ. 100 ఉండగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఈ మొత్తాన్ని రూ. 200 చేసింది. ఇలా పెంచడం రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. వాస్తవానికి ఇది తొలుత రూ. 50 కాగా తర్వాత రూ.100కు పెంచింది. ఇప్పుడు ఏకంగా రూ. 200 చేసింది. కస్టమర్ కేర్ సెంటర్లద్వారా కనీస మొత్తాన్ని రీచార్జి చేసుకోవాలని, ఆ తర్వాత రూ. 100 ఆపైన చేసుకోవచ్చని డీఎంఆర్సీ కార్యనిర్వాహక సంచాలకుడు అనుజ్ దయాళ్ చెప్పారు. కాగా నగర పరిధిలోని మొత్తం 83 మెట్రో స్టేషన్లలో 170 టీవీఎంలు ఉన్నాయి. మెట్రో ైరె ళ్లలో ప్రయాణించేవారిలో 70 శాతం మంది వీటిని వినియోగిస్తున్నారు. ఈ కార్డులను వినియోగించేవారికి డీఎంఆర్సీ ప్రయాణంలో పది శాతం రాయితీ ఇస్తోంది. -
ఢిల్లీ మెట్రోలో ఒకే రోజు 26 లక్షల మంది ప్రయాణం..
న్యూఢిల్లీ: ఒకే రోజు అత్యధిక మంది ప్రయాణీకులను తరలించిన ఓ రికార్డును ఢిల్లీ మెట్రో రైలు సొంతం చేసుకుంది. జూలై 21 తేదిన 26 లక్షల మంది ప్యాసింజర్లను ఢిల్లీ మెట్రో తరలించింది. జూలై 21 తేదిన 26,84,132 మంది ప్యాసింజర్లు ప్రయాణించారని డిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ (డీఎమ్ఆర్సీ) తెలిపింది. గత సంవత్సరం ఆగస్టు 19న 26,50,635 ప్రయాణించారని డీఎమ్ఆర్సీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ కారిడార్‌లో చార్జీల తగ్గింపు
న్యూఢిల్లీ:ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌లో చార్జీలను తగ్గిం చినట్టు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) గురువారం ప్రకటించింది. టారిఫ్‌ను ఈ నెల 24 నుంచి 40 శాతం తగ్గిస్తున్నామని వెల్లడించింది. దీని ప్రకారం కనీస చార్జీని రూ.30 నుంచి రూ.20కి తగ్గిస్తారు. గరిష్ట చార్జీని రూ.180 నుంచి రూ.100కు తగ్గిస్తామని డీఎం ఆర్సీ ఉన్నతాధికారి అనుజ్ దయాళ్ తెలిపారు. ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ చార్జీలను తగ్గించి, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్‌కు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. మంత్రి సూచన మేరకు ఇక నుంచి 15 నిమిషాలకు బదులు ప్రతి 10 నిమిషాలకు ఒక రైలును నడుపుతుంది. అంటే రోజుకు 168 ట్రిప్పులు అందుబాటులోకి వస్తాయి. ఇది వరకే వీటి సంఖ్య 148 మాత్రమే. రైళ్ల వేగాన్ని కూడా గంటలకు 70 కిలోమీటర్లకు బదులు 80 కిలోమీటర్లకు పెంచుతారు. ఫలితంగా న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి కేవలం 19 నిమిషాలు పడుతుంది. అంతేగాక ఢిల్లీ ఎయిరోసిటీ నుంచి టెర్మినల్ టి1 వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక ఫీడర్ బస్సును అందుబాటులోకి తెస్తారు. ఉదయం ఆరింటి నుంచి రాత్రి 10 గంటల వరకు వీటి సేవలను వినియోగించుకోవచ్చు. ఫెయిర్ స్టోర్ వాల్యూకార్డు కొనుగోలు చేసిన వారికి చార్జీలో 10 రాయితీ ఇస్తారు. చార్జీల తగ్గింపు ద్వారక, దౌలాకువా, న్యూఢిల్లీ మార్గాల్లో ప్రయాణించేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని దయాళ్ అన్నారు. అయితే ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇస్తున్న అన్ని రకాల కార్డులు, రాయితీ పథకాలను రద్దు చేస్తారు. ఆదివారాల్లో కనిష్ట, గరిష్ట చార్జీలుగా రూ.20 నుంచి రూ.60 వరకు మాత్రమే వసూలు చేస్తామని డీఎంఆర్సీ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ చార్జీలపై లోక్‌సభలో గురువారం చర్చ నడిచింది. చార్జీలు తగ్గించాల్సిందిగా డీఎం ఆర్సీకి సూచించామని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. టారిఫ్ ఏసీ బస్సు చార్జీలను మించకూడదని చెప్పామన్నారు. -
మూడేళ్ల తర్వాత మలిఅడుగు
న్యూఢిల్లీ: బొటానికల్ గార్డెన్ -కాళిందికుంజ్ మధ్య మెట్రో రైలు మార్గం పొడిగింపు ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ), నోయిడా అథారిటీ సంస్థలు బుధవారం సంతకం చేశాయి. స్థానిక మెట్రో భవన్లోఎ డీఎంఆర్సీ చైర్మన్ మంగూసింగ్ సమక్షంలో ఆ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ విభాగం డెరైక్టర్ ఎస్డీ శర్మ, నోయిడా అథారిటీ సీఈఓ రమారమణ్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని డీఎంఆర్సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం కార్యనిర్వహణ అధికారి అనుజ్ దయాళ్ వెల్లడించారు. కాగా బొటానికల్ గార్డెన్ (నోయిడా)-కాళిందికుంజ్ (ఢిల్లీ) మధ్య మెట్రో రైలు మార్గం నిర్మాణానికి సంబంధించినప్రతిపాదన మూడు సంవత్సరాల క్రితమే రూపుదాల్చింది. ఈ మార్గం మొత్తం పొడవు 3.9 కిలోమీటర్లు. ఈ ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గత జూన్ నెలలో ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదముద్ర వేసిన సంగతి విదితమే. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు హుడా సిటీ సెంటర్-జహంగీర్‌పురి మార్గంలో ప్రయాణించడం కోసం రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. హౌజ్‌ఖాస్, ఎమిటీ విశ్వవిద్యాలయం, కల్కాజీ స్టేషన్ల మీదుగా కాళిందీకుంజ్‌కు చేరుకోవచ్చు. ఈ మార్గ ంలో సగటున 48,500 మంది ప్రతిరోజూ ప్రయాణిస్తారని సంబంధిత అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఢిల్లీ నగరం శివారులోని జాతీయ ప్రాదేశిక ప్రాంత పరిధిలోని బొటానికల్ గార్డెన్ తొలి ఇంటర్చేంజ్ స్టేషన్ అవుతుంది. -
చకచకా బడ్లీ మెట్రో కారిడార్ పనులు
న్యూఢిలీ/నోయిడా: జహంగీర్‌పురి-సమయ్‌పూర్ బడ్లి మెట్రో కారిడార్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చినాటికల్లా ఈ మార్గం అందుబాటులోకి రావొచ్చని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఎలివేటెడ్ మార్గం. అప్, డౌన్లలో రెండు వంతెన మార్గాలను నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో బడ్లి మెట్రో స్టేసన్‌కు ముందు ఉత్తర రైల్వే పట్టాలు ఉంది. దీంతో దీనిని ఈ రైల్వే పట్టాలకు 12 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జహంగీర్‌పురి, కర్నాల్ రోడ్, రోహిణి, ట్రాన్స్‌పోర్టు నగర్, బడ్లి స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది మలుపులు ఉంటాయి. ‘ఈ విషయమై పనుల విభాగం డెరైక ్టర్ జితేంద్ర త్యాగి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ మార్గం వెంబడిగల ప్రాంతాలను కూడా అభివద్ధి చేస్తామన్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే 25 వేలమంది ప్రయాణికులు లబ్ధి పొందుతారన్నారు. నిర్మాణ పనులు దాదాపు 70 శాతం మేర పూర్తయ్యాయన్నారు. పనులు పూర్తయితే హుడా సిటీ సెంటర్-సమయ్‌పూర్ బడ్లీ లైన్ మెట్రో నెట్‌వర్క్‌లో ఈ మార్గం అత్యంత పెద్దదవువుతుందన్నారు. డీఎంఆర్‌సీతో త్వరలో ఒప్పందం మెట్రో మార్గం పొడిగింపు దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని నోయిడా చైర్మన్ రమారమణ్ వెల్లడించారు. ఈ విషయమై జాతీయ రాజధానిలో శనివారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి అలోక్ రంజన్ చర్చించినట్టు చెప్పారు. డీఎంఆర్‌సీతో ఒప్పందానికి యూపీ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. డీఎంఆర్సీ అధిపతి మంగూసింగ్ సమక్షంలో ఒప్పందాలపై ఇరు పార్టీలు సంతకాలు చేస్తాయన్నారు. కాగా బొటానికల్ గార్డెన్ (నోయిడా)-కాళిందికుంజ్ (ఢిల్లీ) మధ్య మెట్రో రైలు మార్గం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన మూడు సంవత్సరాల క్రితమే రూపుదాల్చింది. ఈ మార్గం పొడవు 3.9 కిలోమీటర్లు. ఈ ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గత జూన్ నెలలో లక్నోలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు హుడా సిటీ సెంటర్-జహంగీర్‌పురి మార్గంలో ప్రయాణించడం కోసం రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.హౌజ్‌ఖాస్, ఎమిటీ విశ్వవిద్యాలయం, కాళిందీకుంజ్. కల్కాజీ స్టేషన్ల మీదుగా కాళిందీకుంజ్‌కు చేరుకోవచ్చు. -
మెట్రోకు సౌర వెలుగులు
- మూడు స్టేషన్లలో ప్లాంట్లు - ప్రైవేటు సంస్థతో డీఎంఆర్సీ ఒప్పందం న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన ఇంధన వనరులు, పద్ధతులను ప్రోత్సహించడంతో భాగంగా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మూడు స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించనుంది. స్టేషన్ల ఆవరణలోని భవనాలపై పైకప్పులపై వీటిని బిగిస్తారు. మొత్తం 250 కిలోవాట్ల పీక్ (కేడబ్ల్యూపీ) కరెంటును అందించగల ఈ ప్లాంట్లను ఆనంద్ విహార్ అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ (ఐఎస్బీటీ) మెట్రో స్టేషన్, ప్రగతి మైదాన్ స్టేషన్‌తోపాటు, డీఎంఆర్సీ పుష్పవిహార్ కార్యాలయంలో నిర్మిస్తారు. ఆనంద్‌విహార్ ప్లాంటు 115 కేడబ్ల్యూపీ, ప్రగతిమైదాన్ 85 కేడబ్ల్యూపీ, పుష్ప్‌విహార్ ప్లాంటు కేడబ్ల్యూపీల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని డీఎంఆర్సీ అధికారవర్గాలు తెలిపాయి. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం డీఎంఆర్సీ.. తన ఎండీ మంగూసింగ్ సమక్షంలో నోయిడాకు చెందిన ప్రైవేటు సంస్థ జాక్సన్ ఇంజనీర్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్ఈసీఐ) ఇందుకు సహకరించింది. ఇది వరకు ద్వారక సెక్టార్ 21 స్టేషన్లో నిర్మించినట్టుగానే, ఈ మూడు స్టేషన్లలో ‘ఆర్ఈఎస్సీఓ’ విధానంలోనే సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తారు. ఈ విధానం లో ఉత్పత్తి అయిన కరెంటును డీఎంఆర్సీ యూనిట్ల చొప్పున కొంటుంది. ప్రైవేటు సంస్థే మూలధన పెట్టుబడిని సమకూర్చుకుంటుందని డీఎంఆర్సీ ఉన్నతాధికారి అనుజ్ దయాళ్ అన్నారు. ఇలా సమకూరిన కరెంటును స్టేషన్ల విద్యుత్ దీపాలు, ఇతర నిర్వహణ అవసరాలకు వాడుతారు. ‘స్టేషన్లతోపాటు మెట్రోరైళ్ల డిపోలు, పార్కింగ్ కేంద్రాలు, నివాస సముదాయాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి మేం ప్రయత్నిస్తాం. మూడోదశలో నిర్మిస్తున్న స్టేషన్లను సోలార్ప్లాంట్లతో అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని దయాళ్ వివరించారు. అంతేగాక మూడోదశ కోసం వినియోగించే అన్ని భవనాలనూ పర్యావరణానికి అనుకూల పద్ధతిలోనే నిర్మిస్తారు. నగరంలో వాయుకాలుష్యం నివారణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నందుకుగానూ డీఎంఆర్సీకి ఐక్యరాజ్యసంస్థ 2011 లో కార్బన్ క్రెడిట్లు ప్రదానం చేసింది. ఇదిలా ఉంటే గుర్గావ్ రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ఫారంపైన కూడా సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేశారు. దీనివల్ల చాలా వరకు కరెంటు అవసరాలు తీరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ‘మేం ఇటీవలే 25 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్లాంటును నిర్మించాం. త్వరలో మొదటి ప్లాట్‌ఫారంపైనా కూడా ఇదే సామర్థ్యం గల మరో ప్లాంటు ను ఏర్పాటు చేస్తాం’ అని ఉత్తర రైల్వే అధికారి ఒకరు అన్నారు. -
పాత ఢిల్లీలో మళ్లీ ట్రామ్‌లు?
సాక్షి, న్యూఢిల్లీ: పాత ఢిల్లీ వీధుల్లో మళ్లీ ట్రామ్‌లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాజ హానాబాద్ వీధులలో మళ్లీ ట్రామ్‌లు నడపాలని పీడబ్ల్యూడీ యోచిస్తోంది. ఈ పథకానికి యూటీప్యాక్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో ఫతేపురీ మసీదు నుంచి జైన్‌మందిర్ వరకు ట్రామ్ నడపాలనుకుంటున్నారు. ఈ రూటు పొడవు 1.3 కిలోమీటర్లు. ట్రామ్ రూటు మెట్రో స్షేషన్ వరకు ఉంటుం ది. ట్రామ్ కోసం రూటు ప్రణాళిక తయారుచేసే బాధ్యత డీఎంఆర్సీకి అప్పగించారు. చాందినీచౌక్ సుందరీకరణ పథకం పాత ఢిల్లీ రోడ్లపైకి ట్రామ్‌లను తెచ్చేందుకు దోహదపడుతోంది. ఢిల్లీలో అరవయ్యో దశకం వరకు ట్రామ్‌లు నడిచాయి. 1908 లో లార్డ్ హార్డింగ్ చేతుల మీదుగా ప్రారంభమైన ట్రామ్ సేవలను 1921లో విస్తరించారు. అప్పట్లో 15 కి.మీల ట్రామ్ ట్రాక్ ఉండేది.. ట్రాక్‌పై 24 కార్ల తో కూడిన ట్రామ్ నడిచేదని అంటారు. అప్పట్లో చాందినీచౌక్, జామా మసీదు, సదర్‌బజార్ తదితర ప్రాంతాలలో ట్రామ్ సేవ అందుబాటులో ఉండేది. 1963లో ట్రామ్ సేవ రద్దయింది. ఢిల్లీచరిత్రలో భాగమైన ట్రామ్‌లను మళ్లీ పాత ఢిల్లీలో ప్రవేశపెట్టాలని లెఫ్టినె ంట్ గవర్నర్ న జీబ్జంగ్ భావించారు. పాత ఢిల్లీ చారిత్రక నేపథ్యం దృష్ట్యా ట్రామ్ సేవను ప్రవేశపెట్టాలన్న జంగ్ సూచనమేరకు పీడబ్ల్యూడీ విభాగం ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. దీనిని యూటీప్యాక్ ఆమోదం కోసం పంపగా ఆ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. ట్రామ్ సేవ కోసం 7.5 మీటర్ల వెడల్పు క్యారేజ్‌వే రూపొందించవలసి ఉం టుంది. చాందినీచౌక్‌ను అందంగా తీర్చిదిద్దే పథకానికి సంబంధిం చిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యి, పీడబ్ల్యూడీ విభాగం ఈ పథకం పనులు ప్రారంభించింది. షాజహనాబాద్ పునరాభివృద్ధి బోర్డు కూడా జామామసీదు పథకానికి సంబంధించి పను లు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసింది. అయితే కేవలం ట్రామ్ మార్గాన్ని మెట్రోస్టేషన్‌తో అనుసంధానించడంతో సరిపోదని మొత్తం షాజ హానాబాద్ అంతటా ఈ సేవను అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నారు. చాందినీచౌక్, రైల్వే స్టేషన్, జామా మసీదు వాటి పరిసర ప్రాంతాలను కలుపు తూ ప్రజారవాణా వ్యవస్థను రూపొందించడం వల్ల షాజహానాబాద్ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు మార్కెట్‌కు వచ్చే జనాల సంఖ్య పెరుగుతుంది. దాంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కా రం లభిస్తుందని భావిస్తున్నా రు. ఇరుకు రోడ్లు, వీధులతో కూడిన పాత ఢిల్లీలో వాహనాల రాకపోకలు అటుంచి కాలినడకన సంచరించడం కూడా కష్టతరమే. -
నగరవాసులకు మరో కానుక
సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌజ్ మధ్య 3.2 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మెట్రోరైలు చార్జీల పెంపు ప్రతిపాదనపై అధ్యయనం చే సి చార్జీల సవరణకుఅవకాశం ఉందేమో చూడాల్సిందిగా డీఎమ్మార్సీని కోరినట్లు మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మండీహౌజ్-సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో లైన్ గురువారం ప్రారంభమయింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు దీనిని ప్రారంభించారు. మహిళా డ్రైవరుతో కూడిన మొదటి రైలును ఉదయం 9.30 గంటలకు మండీహౌజ్ స్టేషన్లో జెండా ఊపి ఈ లైన్‌ను ప్రారంభించారు. ఆ తరువాత డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్, ఇతర సీనియర్ అధికారులు, విలేకరులతోపాటు వెంకయ్యనాయుడు మెట్రోరైలులో ప్రయాణించి సెంట్రల్ సెక్రటేరియట్ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ మార్గంలో మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో రెండోదశలో నిర్మించిన బదర్‌పుర్ కారిడార్‌ను కశ్మీరీగేట్ వరకు పొడిగించడానికి సెంట్రల్సెక్రటేరియట్ నుంచి కశ్మీరీ గేట్ వరకు కిలోమీటర్ల మెట్రోలైన్ నిర్మించారు. ఇందులో భాగంగా సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌజ్ మధ్య 3.2 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాన్ని భూగర్భంలో నిర్మించారు. ఈ మార్గంలో సెంట్రల్ సెక్రటేరియట్, జన్‌పథ్, మండీహౌజ్ స్టేషన్లు ఉన్నాయి. మే 2011లో ప్రారంభించిన ఈ మెట్రో లైన్ నిర్మాణాన్ని నిర్దేశిత గడువుకు మూడు నెలల ముందే ముగించినట్లు ఢిల్లీ మెట్రో చెప్పింది. బదర్‌పుర్ కారిడార్‌ను (వయొలెట్ లైన్) పొడిగిస్తూ నిర్మించిన ఈ సెక్షన్ వల్ల రాజీవ్‌చౌక్ స్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడి తగ్గుతుంది. బదర్‌పుర్-సెంట్రల్ సెక్రటేరియట్ మార్గంలో ప్రయాణికులు దక్షిణ ఢిల్లీ నుంచి నోయిడా, ద్వారకా, వైశాలి వెళ్లేందుకు ఇక నుంచి రెండురైళ్లు మారనవసరం లేదు. అంతకు ముందు ఈ రూట్లో ప్రయాణించేవారు సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లో, రాజీవ్‌చౌక్ స్టేషన్లో రైళ్లు మారవలసి వచ్చేది. ఈ సెక్షన్ ప్రతిరోజూ 70 వేల మంది ప్రయాణికులుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక నుంచి తరచూ మెట్రో ప్రయాణం: మంత్రి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మండీహౌజ్ కారిడార్ నిర్మాణ పనులను విజయవంతంగా ముగించిన ఢిల్లీ మెట్రో అధికారులు, ఢిల్లీ ప్రభుత్వాన్ని, కార్మికులను అభినందించారు. 140 కిలోమీటర్ల మెట్రోమార్గంతో మెట్రోఫేజ్ 3 నిర్మాణం మొత్తం పూర్తయితే దేశరాజధానిలో ప్రయాణం తీరుతెన్నులు మారుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణ జీవితంలో వేగవంతమైన, సౌకర్యంగా ఉండే ప్రయాణ సాధనం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌజ్ సెక్షన్‌లోని స్టేషన్ల గోడలు ఈ ప్రాంతపు చారిత్రక నేపథ్యాన్ని కనుల ముందుంచుతున్నాయని వ్యాఖ్యానించారు. మెట్రోఫేజ్ 3లో 13 ఇంటర్చేంజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి నిర్మాణం 2016 మార్చి నాటికి పూర్తికానుంది. అప్పటి వరకు ఢిల్లీలో చాలా భాగం మెట్రోతో అనుసంధానిస్తామని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చే శారు. దూరప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడు దేశరాజధానిలో ప్రయాణించడానికి మెట్రో సదుపాయాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతూ తన మంత్రివర్గ సహచరులందరికీ లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. ఇది కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదపడడంతోపాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందన్నారు. ఢిల్లీకి వచ్చినప్పుడల్లా తాను మెట్రో రైలులో ప్రయాణిస్తానని వెంకయ్య ఈ సందర్భంగా అన్నారు. దాని వల్ల మెట్రో పనితీరు గురించి స్వయంగా తెలుసుకోవడంతోపాటు రోడ్లపై రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడానికి తోడ్పడగలుగుతానని చెప్పారు. చార్జీల పెంపుపై త్వరలోనే నిర్ణయం పెండింగులో ఉన్న మెట్రో చార్జీల పెంపును గురించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, చార్జీల పెంపు ప్రతిపాదనను అధ్యయనం చే సి చార్జీల సవరణకుఅవకాశం ఉందేమో చూడాల్సిందిగా డీఎమ్మార్సీని కోరినట్లు ఆయన చెప్పారు. చమురు, ఇతర ధరలు పెరిగినప్పుడు వ్యయభారం సమస్యను పరిష్కరించడానికి రెండు మార్గాలున్నాయని తెలిపారు. ఒకటి ప్రయాణికులపై పెరిగిన వ్యయభారాన్ని మోపడం, రెండోది.. వాణిజ్య ప్రకటనలు, ఫుడ్‌కోర్టుల వంటి వాటి ఏర్పాటుకు మెట్రో స్టేషన్ల ప్రాంగణాలను సమర్థంగా వాడుకోవడమని చెప్పారు. మెట్రోఫేజ్ 3 ప్రాజెక్టుల కోసం భూసేకరణ గురించి లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడానని వెంకయ్య నాయుడు తెలిపారు. -
తప్పిన క్యూ తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల మన్ననలను అందుకున్న ఢిల్లీ మెట్రో వారి కోసం మరో వెసులుబాటును బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీతో కలసి తొలిసారిగా ట్రావెల్ కార్డును ప్రవేశపెట్టింది. దీనికి యూనిఫేర్ కార్డు’ అని నామకరణం చేసింది. దీనిని కొనుగోలు చేసినట్టయితే టికెట్ల కోసం క్యూలో బారులుతీరాల్సిన అవసరమే ఉండదు. దీనిని డెబిట్/క్రెడిట్ కార్డుగా కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా రీచార్జి కూడా చేసుకోవచ్చు. ప్రయాణికులు క్యూలలో నిలబడే బదులు ఆయా స్టేషన్లలో స్వైప్ చేస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చినాటికి మొత్తం లక్ష కార్డులను జారీచేయాలని డీఎంఆర్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయమై డీఎంఆర్సీ చైర్మన్ మంగూసింగ్ మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని వె సులుబాట్లు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. వారికి ఎటువంటీ ఇబ్బందులూ తలెత్తకుండా చేసేందుకు యత్నిస్తామన్నారు. వచ్చే వారం నుంచి మెట్రో హెల్ప్‌లైన్ 1511 మెట్రోరైలులో ప్రయాణించేవారికి ఏదైనా సమస్య ఎదురైనట్లయితే ఫిర్యాదు చేయడానికి 1511 నంబరుతో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నట్టు డీఎంఆర్సీ వర్గాలు తెలిపాయి. మెట్రోలో నేరాలను తగ్గించడానికి, బాధితులకు తక్షణసాయం అందించడానికి ఉద్దేశించిన ఈ హెల్ప్‌లైన్ వచ్చే వారం నుంచి పనిచేస్తుంది. ఈ హెల్ప్‌లైన్ కోసం ఢిల్లీ పోలీసులు శాస్త్రిపార్క్ మెట్రో స్టేషన్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. -
మెట్రో స్మార్ట్ కార్డ్ ధర రెట్టింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో స్మార్ట్ కార్డ్ కనీస రుసుంను రూ.200కు పెంచారు. ఇది వచ్చే బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ఢిల్లీ మెట్రో అధికారులు ఆదివారం తెలిపారు. వివరాలిలా.. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము రూ.50 తో కలిపి కొత్త స్మార్ట్‌కార్డు విలువ రూ.150. ‘చాలామంది స్మార్ట్ కార్డ్ వినియోగదారులు రోజూ ప్రయాణం చేస్తుంటారు. కార్డు కనీస రుసుంను పెంచడం వల్ల రోజూ ప్రయాణించేవారికి కార్డును రీచార్జి చేయించుకోవడానికి ఎక్కువసార్లు లైన్లో నిల బడాల్సిన అవసరం తప్పుతుంది..’ అని అధికారి ఒకరు వ్యాఖ్యానిం చారు. రోజూ సుమారు 12 వేల మంది స్మార్ట్ కార్డులను వెనక్కి తీసుకుంటున్నారు. అలాగే 30 శాతం కార్డులను ఒకే నెల్లో కొని, వెనక్కి ఇచ్చేస్తున్నారు. దీంతో డీఎం ఆర్సీ సుమారు 9 లక్షల కార్డులను పునరుద్ధరించాల్సి వస్తోంది. మెట్రో కార్డు వినియోగించే ప్రయాణికులు తమ ప్రయాణంలో టికెట్‌పై 10 శాతం రాయితీ పొందుతున్న సంగతి తెలిసిందే. -
మెట్రో స్టేషన్లను ఎందుకు మూశారు?
న్యూఢిల్లీ: నగరంలోని నాలుగు మెట్రో స్టేషన్లను ఎందుకు మూసివేశారని రవాణాశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. దీనిపై వివరణ కోరుతూ ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ)కి లేఖ రాశారు. మెట్రో స్టేషన్లను మూసివేసి ప్రజలను ఎందుకు ఇబ్బందులపాలు చేశారో తెలపాలని లేఖలో నిలదీశారు. విధులను నిర్లక్ష్యం చేసిన నలుగురు ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా సీఎం కేజ్రీవాల్ సోమవారం రైల్‌భవన్ ఎదుట ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. మద్దతుదారులు పెద్దఎత్తున తరలిరావాలంటూ ఆయన పిలుపునివ్వడంతో జనం తాకిడి కూడా పెరిగింది. దీంతో సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్‌భవన్, పటేల్‌చౌక్, రేస్‌కోర్సు స్టేషన్లను మూసివేశారు. దీంతో దాదాపు రెండు లక్షలమందికి పైగా ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. దీనికి కొందరు ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ సర్కాన్‌ను బాధ్యులను చేయడంతో మంత్రి స్పందించారు. ‘అవును మెట్రో స్టేషన్ల బంద్ విషయమై డీఎంఆర్సీకి లేఖ రాశం. మూసివేతకు కారణాలేమిటో మేము తెలుసుకోవాలనుకున్నామ’ని సౌరభ్ భరద్వాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. -
మొదలైన మెట్రో ఫేజ్-3 ట్రయల్న్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోరైలు ఫేజ్-3లో భాగంగా నిర్మించిన సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌస్ మధ్య మెట్రోరైలు ట్రయల్ రన్ సోమవారం ప్రారంభమైంది. ఢిల్లీ మెట్రోరైలు చైర్మన్ డా.సుధీర్‌కృష్ణ, డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్ సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. 24 నెలల్లోనే ఈ పనులు పూర్తి చేసి డీఎంఆర్సీ అధికారులు సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు మంగూసింగ్ తెలిపారు. రెండు నెలలపాటు ఈ ట్రయల్ రన్‌ను కొనసాగించనున్నట్టు చెప్పారు. సెంట్రల్ సెక్రటేరియట్-క శ్మీరీగేట్ కారిడర్లో భాగంగా మూడు కిలోమీటర్ల సొరంగమార్గం పనులు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. 2014 మార్చి వరకు ఈ కారిడర్ మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌస్ మార్గం అందుబాటులోకి వస్తే రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌పై ప్రయాణికుల రద్దీ చాలా వరకు తగ్గనుంది. మొదటి రోజు ట్రయల్ రన్ విజయవంతం అయినట్టు డీఎంఆర్సీ అధికారులు ప్రకటించారు. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆజాద్పురలో మరో టీబీఎం పనులు షురూ డీఎంఆర్సీ ఫేజ్-3లో భాగంగా ఆజాద్పుర్లో మరో టన్నెల్ బోరింగ్ మిషన్(టీడీఎం) పనులు సోమవారం ప్రారంభించినట్టు అధికారులు తెలిపా రు. ముకుంద్పుర-శివ్‌విహార్ కారిడర్లో భాగంగా చేపట్టిన ఈ పనులను డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్ ప్రారంభించారు. 2014 జూన్ వరకు ఈ టీబీ ఎం 1.4 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వేలా లక్ష్యం పెట్టుకున్నట్టు చెప్పారు. ఇదికాకుండా ఫేజ్-3లో మొత్తం 12 టీబీఎంలు పనిచేస్తున్నట్టు చెప్పారు. -
పొరుగు రాష్ట్రాల్లో చురుగ్గా మెట్రో
ఢిల్లీ మినహా మరే ఇతర రాష్ట్రాల్లోనూ పనులు చేపట్టకూడదని కొన్ని నెలల క్రితమే అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం లేఖ రాసింది. ఇతర ప్రాంతాల్లో మెట్రోరైలు ప్రాజెక్టుల నిర్మాణం, కన్సల్టెన్సీ సేవలు అందిస్తే భవిష్యత్‌లో డీఎంఆర్సీ పనితీరు దెబ్బతింటుందని హెచ్చరించింది. నోయిడా, ఘజియాబాద్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలన్న డీఎంఆర్సీ నిర్ణయాన్ని కొత్త ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రోత్సహిస్తారని డీఎంఆర్సీ భావిస్తోంది. న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా వైదొలగడం వల్ల మెట్రో విస్తరణ మరింత చురుగ్గా కొనసాగుతాయని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) భావిస్తోంది. షీలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెలుపల మెట్రో పనులకు అడ్డంకులు సృష్టిం చారనే విమర్శలు ఉన్నాయి. అదనపు రాబడికి వీలుగా తాము కన్సల్టెన్సీ సేవలు ప్రారంభించేం దుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నోయిడా, ఘజియాబాద్, లక్నోలో మెట్రో ప్రాజెక్టుల పనులు చురుగ్గా కొనసాగుతాయని భావిస్తున్నారు. నిజానికి ఢిల్లీ బయటి ప్రాంతాల్లో పనులు చేపట్టడం వల్ల రాజధానిలో మెట్రో సేవలకు ఎటువంటి ఇబ్బందులూ కలగబోవని డీఎంఆర్సీ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. దీక్షిత్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో పనులు చేపట్టాల్సిందిగా డీఎంఆర్సీపై తాము ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చామని పట్టణాభివృద్ధిశాఖ వర్గాలు తెలిపాయి. ‘లక్నో మెట్రో ప్రాజెక్టు సవివర నివేదిక తయారీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని మార్పులు సూచిస్తూ వ్యాఖ్యలు రాశాం. త్వరలోనే లక్నోలో మెట్రోరైలు నిర్మాణ పనులు మొదలుపెడతాం. బయటి రాష్ట్రాల్లో పనులు చేపట్టడానికి డీఎంఆర్సీ అధికారులు దీక్షిత్‌కు నచ్చజెప్పాల్సి వచ్చేది. అయినప్పటికీ ఢిల్లీలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో నాణ్యతపై రాజీ పడే ప్రసక్తే లేదు’ అని ఆయన వివరించారు. ఢిల్లీ మినహా మరే ఇతర రాష్ట్రాల్లోనూ పనులు చేపట్టకూడదని కొన్ని నెలల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ మోహన్ స్పోలియా డీఎంఆర్సీకి లేఖ రాశారు. దీక్షిత్ సూచన మేరకే ఆయన ఈ పనిచేశారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తే భవిష్యత్‌లో డీఎంఆర్సీ పనితీరు దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. నోయిడా, ఘజియాబాద్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలన్న డీఎంఆర్సీ నిర్ణయాన్ని అప్పట్లోనే దీక్షిత్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఢిల్లీలోనే చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. లక్నో మెట్రో ప్రాజెక్టు నుంచి డీఎంఆర్సీ తప్పుకొని ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అయితే కే జ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంతోషంగానే ఉంది. ‘యూపీ రాష్ట్ర పరిధిలోనే మెట్రో ప్రాజెక్టులకు కేజ్రీవాల్ అడ్డుచెప్పే అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడ కూడా ఆయన పార్టీని విస్తరించాలనుకుంటున్నారు కాబట్టి మెట్రో విస్తరణకు సహకరిస్తారు’ అని ఒక అధికారి వివరించారు. చురుగ్గా మూడోదశ ఢిల్లీలోనూ మెట్రో మూడోదశ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. విస్తరణలో భాగంగా డీఎంఆర్సీ చేపట్టిన మూడోదశ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల మెట్రోమార్గాలు, స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. 2016 కల్లా మూడోదశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డీఎంఆర్సీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడోదశలో మొత్తం 103.05 కిలోమీటర్ల మేర మెట్రోమార్గాలను నిర్మిస్తారు. ముకుంద్‌పూర్-యమునావిహార్ కారిడార్‌ను 55.69 కిలోమీటర్ల పొడవున, జనక్‌పురి వెస్ట్-కాళిందికుంజ్ కారిడార్‌ను 33.49 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్-కాశ్మీరీగేట్ మార్గాన్ని 9.37 కిలోమీటర్ల పొడవున, జహంగీర్‌పురి-బద్లి మార్గాన్ని 4.489 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఈ దశలో 67 స్టేషన్లు, 15 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉంటాయి. 2016 నాటికి ఢిల్లీ మెట్రోరైళ్లలో ప్రతినిత్యం 40 లక్షల మంది ప్రయాణిస్తారని భావిస్తున్నారు. మూడోదశ నిర్మాణానికి రూ.35,242 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. మూడోదశలో అనేక మార్గాలను భూగర్భంలో నిర్మిస్తారు. వీటి కోసం సొరంగాలను తవ్వడానికి విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలను (టీబీఎం) తెప్పించారు.