పెరిగిన మెట్రో కనీస రీచార్జి | Delhi Metro revises min recharge to Rs 100 using TVMs | Sakshi

పెరిగిన మెట్రో కనీస రీచార్జి

Jul 22 2014 10:21 PM | Updated on Sep 2 2017 10:42 AM

టోకెన్ వెండింగ్ మిషన్ (టీవీఎం)ల ద్వారా రీచార్జి చేసే కనీస మొత్తం పెరిగింది. నిన్నటిదాకా రూ. 100 ఉండగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ మొత్తాన్ని రూ. 200 చేసింది.

న్యూఢిల్లీ: టోకెన్ వెండింగ్ మిషన్ (టీవీఎం)ల ద్వారా రీచార్జి చేసే కనీస మొత్తం పెరిగింది. నిన్నటిదాకా రూ. 100 ఉండగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ మొత్తాన్ని రూ. 200 చేసింది. ఇలా పెంచడం రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. వాస్తవానికి ఇది తొలుత రూ. 50 కాగా తర్వాత రూ.100కు పెంచింది. ఇప్పుడు ఏకంగా రూ. 200 చేసింది. కస్టమర్ కేర్ సెంటర్‌లద్వారా కనీస మొత్తాన్ని రీచార్జి చేసుకోవాలని, ఆ తర్వాత రూ. 100 ఆపైన చేసుకోవచ్చని డీఎంఆర్‌సీ కార్యనిర్వాహక సంచాలకుడు అనుజ్ దయాళ్ చెప్పారు. కాగా నగర పరిధిలోని మొత్తం 83 మెట్రో స్టేషన్లలో 170 టీవీఎంలు ఉన్నాయి. మెట్రో ైరె ళ్లలో ప్రయాణించేవారిలో 70 శాతం మంది వీటిని వినియోగిస్తున్నారు. ఈ కార్డులను వినియోగించేవారికి డీఎంఆర్‌సీ ప్రయాణంలో పది శాతం రాయితీ ఇస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement