సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల మన్ననలను అందుకున్న ఢిల్లీ మెట్రో వారి కోసం మరో వెసులుబాటును బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీతో కలసి తొలిసారిగా ట్రావెల్ కార్డును ప్రవేశపెట్టింది. దీనికి యూనిఫేర్ కార్డు’ అని నామకరణం చేసింది. దీనిని కొనుగోలు చేసినట్టయితే టికెట్ల కోసం క్యూలో బారులుతీరాల్సిన అవసరమే ఉండదు. దీనిని డెబిట్/క్రెడిట్ కార్డుగా కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా రీచార్జి కూడా చేసుకోవచ్చు. ప్రయాణికులు క్యూలలో నిలబడే బదులు ఆయా స్టేషన్లలో స్వైప్ చేస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చినాటికి మొత్తం లక్ష కార్డులను జారీచేయాలని డీఎంఆర్‌సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయమై డీఎంఆర్‌సీ చైర్మన్ మంగూసింగ్ మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని వె సులుబాట్లు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. వారికి ఎటువంటీ ఇబ్బందులూ తలెత్తకుండా చేసేందుకు యత్నిస్తామన్నారు.
వచ్చే వారం నుంచి మెట్రో హెల్ప్‌లైన్ 1511
మెట్రోరైలులో ప్రయాణించేవారికి ఏదైనా సమస్య ఎదురైనట్లయితే ఫిర్యాదు చేయడానికి 1511 నంబరుతో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నట్టు డీఎంఆర్సీ వర్గాలు తెలిపాయి. మెట్రోలో నేరాలను తగ్గించడానికి, బాధితులకు తక్షణసాయం అందించడానికి ఉద్దేశించిన ఈ హెల్ప్‌లైన్ వచ్చే వారం నుంచి పనిచేస్తుంది. ఈ హెల్ప్‌లైన్ కోసం ఢిల్లీ పోలీసులు శాస్త్రిపార్క్ మెట్రో స్టేషన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
తప్పిన క్యూ తిప్పలు
Published Wed, Jun 25 2014 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM
Advertisement
Advertisement