Travel card
-
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్!
తరచూ రైలు ప్రయాణాలు చేసే వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐఆర్సీటీసీ) ప్రత్యేకంగా మరో ట్రావెల్ క్రెడిట్ కార్డును తీసుకొస్తోంది. ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కలిసి కో-బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించాయి. ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ప్రత్యేకంగా ఎన్పీసీఐ రూపే నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్‌లలో ఈ కార్డును ఉపయోగించి బుక్ చేసే రైలు టిక్కెట్లపై ప్రత్యేకమైన ప్రయోజనాలతోపాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ కో-బ్రాండెడ్ కార్డ్ మెరుగైన ఆన్లైన్ లావాదేవీలు, అత్యుత్తమ ప్రయోజనాలతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక లాంజ్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుందని ఐఆర్సీటీసీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ సహిజ పేర్కొన్నారు. ఐఆర్సీటీసీతో భాగస్వామ్యం పొందిన మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకు తమదేనని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ పరాగ్ రావ్ తెలిపారు. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులతో కూడా ఐఆర్సీటీసీ ఇలాంటి భాగస్వామ్యాలు చేసుకుంది. ట్రావెల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు: ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ప్రత్యేకంగా ఎన్పీసీఐ రూపే నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ టికెటింగ్ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్ ద్వారా బుక్ చేసిన టిక్కెట్లపై గరిష్ట తగ్గింపు. ఆకర్షణీయమైన జాయినింగ్ బోనస్, బుకింగ్‌లపై తగ్గింపులు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోని ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లకు యాక్సెస్. (ఇదీ చదవండి: MG Motor: ఆ స్మార్ట్ ఈవీ పేరు ‘కామెట్’... రేసింగ్ విమానం స్ఫూర్తితో...) -
విదేశీ ప్రయాణం.. ట్రావెల్ కార్డుతో సులభం..
చైనా తత్వవేత్త లావోఝు చెప్పినట్లు... వేలమైళ్ల ప్రయాణమైనా ప్రారంభ మయ్యేది ఒక అడుగుతోనే. ఇప్పుడు జనం కూడా కొత్త విషయాలు తెలుసుకోవటానికి చాలా దూరం ప్రయాణాలు చేస్తున్నారు. కొందరేమో కొత్త ప్రదేశాలను చూడాలని, మరికొందరేమో బిజినెస్ వ్యవహారాల కోసం... ఇలా ఎన్నో కారణాల మీద ఇపుడు విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. టెక్నాలజీ పుణ ్యమా అని ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. బిజినెస్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విదేశీ ప్రయాణం సులువైంది. టెక్నాలజీ, ట్రావెల్ అప్లికేషన్స్, సమాచార లభ్యత వంటివి విదేశీ ప్రయాణాన్ని సరళతరం చేశాయి. ఇలా ప్రయాణాన్ని ఈజీ చేసిన వాటిలో ‘ట్రావెల్ కార్డు’లు ముందున్నాయి. ట్రావెల్ కార్డులు అంటే? ట్రావెల్ కార్డు కూడా డెబిట్ కార్డులాంటిదే. మన మొబైల్ నంబర్‌ను ప్రీ-పెయిడ్ కార్డ్స్‌తో ఎలాగైతే రీచార్జ్ చేసుకుంటామో అలాగే ట్రావెల్ కార్డును కూడా మన బ్యాంకు అకౌంట్లోని డబ్బుల ద్వారా వివిధ కరెన్సీలతో నింపుకోవచ్చు. బ్యాంకులు, ఇతర సంస్థలు వీటిని జారీ చేస్తూ ఉంటాయి. ప్రయోజనాలు డబ్బుల్ని (క్యాష్) వెంట తీసుకెళ్లడమంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం.‘ట్రావెల్ కార్డు’ను తీసుకుంటే మనం డబ్బుల్ని వెంట తీసుకెళ్లాల్సిన పని ఉండదు. వీటి వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం వేగంగా, సులభంగా డబ్బుల్ని వినియోగించుకోవచ్చు. ఎక్కడైనా ఖర్చు పెట్టొచ్చు. ఖర్చు చేయకుండా మిగిలిపోయిన డబ్బుల్ని తిరిగి పొందొచ్చు. చేసే ప్రతి ఖర్చు వివరాలను ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ సర్వీసుల ద్వారా తెలుసుకో వచ్చు. దీంతో ఖర్చులను నియంత్రించుకోవచ్చు. హాలిడే ట్రిప్‌లో మీ కార్డులోని డబ్బులు అయిపోతే మీరు మళ్లీ మీ బ్యాంకు నుంచి డబ్బుల్ని కార్డులోకి బదిలీ చేసుకోవచ్చు. ట్రావెల్ కార్డులను ఏటీఎంలలో పెట్టి నగదు తీసుకోవచ్చు. ఈ కార్డులను స్టాండర్డ్ డెబిట్ ట్రాన్సాక్షన్లకు, ఆన్లైన్, స్టోర్ లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇవి పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ కవర్‌ను (మరణిస్తేనే) అందిస్తున్నాయి. ప్రయాణంలో వీసా, పాస్‌పోర్ట్ కనిపించకుండా పోతే ఇది మనకు బాసటగా నిలుస్తుంది. మీరు ట్రావెల్ కార్డుపైనే ఎక్కువగా ఆధారపడితే అప్పుడు ఎక్స్ఛేంజ్ రేట్లపై కన్నేసి ఉంచడం మరిచిపోవద్దు. భద్రతపై భయం వద్దు.. ట్రావెల్ కార్డుల భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కార్డు ఎక్కడైనా పోతే, దాన్ని వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే పోయిన కార్డులో ఉన్న డబ్బుల్ని కొత్త కార్డులోనీ బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం ట్రావెల్ కార్డులు చిప్, పిన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లతో వస్తున్నాయి. దీంతో మీరు భద్రత గురించి భయపడాల్సిన పనిలేదు. -
అతని చెయ్యే.. ఓ కార్డు
లండన్: టైమ్ సేవ్ చేయడానికి, ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేయడానికి రష్యాకు చెందిన టెకీ వ్లాద్ జైస్తేవ్ వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా ట్రావెలింగ్ కార్డు, ఆఫీస్ ఐడీ కార్డులను తన చేతిలో (చర్మం కింద)అమర్చుకున్నాడు. ఆఫీసుకు వెళ్లినప్పుడు ఐరిష్ ఇవ్వడం లేదా కార్డు స్వైప్ చేయడం వంటి వాటితో ఎంతో కొంత సమయం వృధాఅవుతుంది. దాంతో పాటు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే మనతో పాటు అందుకు కావాల్సిన కార్డును తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ రెండింటిని చేతిలో అమర్చుకుంటే టైం సేవ్ అవుతుందని ఇంజినీర్ వ్లాద్ జైస్తేవ్ భావించాడు. ఎసిటోన్ ద్రావణంలో తన రెండు కార్డులను కరిగించి, ఆ తర్వాత మిగిలిన సిలికాన్ లోహాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. కత్తితో చేయిని కోసుకుని ఆ చిన్న ముక్కలను తన చేతిలో అమర్చుకుని కుట్లేసుకున్నాడు. తన మరో చేతికి ఇప్పుడు క్రెడిట్ కార్డును ఇంజెక్ట్ చేసుకోవాలని ప్రస్తుతం అదేపనిలో ఉన్నాడు. ఇలా చేయడం వల్ల టీ తాగడానికి వెళ్లినా, టిక్కెట్లు కొనుక్కోవాల్సి వచ్చినా డబ్బులు, కార్డుల కోసం చూసుకోవాల్సిన పని ఉండదని టెకీ జైస్తేవ్ అంటున్నాడు. జర్మనీకి చెందిన ఓ హ్యాకర్ వినూత్న ఆలోచనను చూసి జైస్తేవ్ స్ఫూర్తిపొందినట్లున్నాడు. జర్మనీకి చెందిన ఓ హ్యాకర్ టిమ్ కానన్ చేతిలో ఇంజెక్ట్ చేసుకున్న చిన్న చిప్ శరీరానికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. ఆ డేటాని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు కూడా బదిలీచేసుకోవచ్చును. -
తప్పిన క్యూ తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల మన్ననలను అందుకున్న ఢిల్లీ మెట్రో వారి కోసం మరో వెసులుబాటును బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీతో కలసి తొలిసారిగా ట్రావెల్ కార్డును ప్రవేశపెట్టింది. దీనికి యూనిఫేర్ కార్డు’ అని నామకరణం చేసింది. దీనిని కొనుగోలు చేసినట్టయితే టికెట్ల కోసం క్యూలో బారులుతీరాల్సిన అవసరమే ఉండదు. దీనిని డెబిట్/క్రెడిట్ కార్డుగా కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా రీచార్జి కూడా చేసుకోవచ్చు. ప్రయాణికులు క్యూలలో నిలబడే బదులు ఆయా స్టేషన్లలో స్వైప్ చేస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చినాటికి మొత్తం లక్ష కార్డులను జారీచేయాలని డీఎంఆర్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయమై డీఎంఆర్సీ చైర్మన్ మంగూసింగ్ మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని వె సులుబాట్లు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. వారికి ఎటువంటీ ఇబ్బందులూ తలెత్తకుండా చేసేందుకు యత్నిస్తామన్నారు. వచ్చే వారం నుంచి మెట్రో హెల్ప్‌లైన్ 1511 మెట్రోరైలులో ప్రయాణించేవారికి ఏదైనా సమస్య ఎదురైనట్లయితే ఫిర్యాదు చేయడానికి 1511 నంబరుతో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నట్టు డీఎంఆర్సీ వర్గాలు తెలిపాయి. మెట్రోలో నేరాలను తగ్గించడానికి, బాధితులకు తక్షణసాయం అందించడానికి ఉద్దేశించిన ఈ హెల్ప్‌లైన్ వచ్చే వారం నుంచి పనిచేస్తుంది. ఈ హెల్ప్‌లైన్ కోసం ఢిల్లీ పోలీసులు శాస్త్రిపార్క్ మెట్రో స్టేషన్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.