న్యూఢిల్లీ: పౌరసత్వ నిరసన సెగలు ఢిల్లీ మెట్రోను తాకాయి. సుమారు నెలరోజులకు పైగా షాహీన్‌బాగ్‌లో నిరసనలు చేపట్టిన ఆందోళనకారులు తాజాగా శనివారం రాత్రి ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జాతీయ జెండాలు చేతబూని ఆజాదీ(స్వాతంత్ర్యం) కావాలంటూ గొంతెత్తి అరిచారు. చేతులకు నీలం రంగు బ్యాండ్ కట్టుకుని ‘జై భీమ్’ నినాదాలు చేశారు. ఇక సీఏఏను రద్దు చేసేవరకు ఇక్కడనుంచి కదిలేది లేదంటూ నిరసనకారులు తేల్చి చెప్తున్నారు. కాగా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో జనం పోగవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. (రాళ్లు రువ్వి వర్సిటీలోకి వెళ్లారు)
దీంతో పోలీసులు అదనపు బలగాలతో ఆ ప్రాంతాన్ని మెహరించారు. దాదాపు 500మందికి పైగా ఆందోళనకారులు ఈ ర్యాలీలో పాల్గొనగా వీరిలో మహిళల సంఖ్యే అధికంగా ఉండటం గమనార్హం. కాగా జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ బయటే వీరు నిరసనలు చేపట్టడంతో డీఎమ్‌ఆర్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జాఫ్రాబాద్ మెట్రోస్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మార్గంలో వెళ్లే రైళ్లు అక్కడ ఆగవని, ప్రయాణికులు గమనించాలని కోరారు. (నిన్న అమూల్య.. నేడు ఆర్ధ్ర)
Comments
Please login to add a commentAdd a comment