రూ. 2,599 కోట్లు వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాలి.. | Anil Ambani firm gets notice to refund Rs 2599 crore | Sakshi
Sakshi News home page

రూ. 2,599 కోట్లు వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాలి..

Published Thu, May 23 2024 1:56 PM | Last Updated on Thu, May 23 2024 3:15 PM

Anil Ambani firm gets notice to refund Rs 2599 crore

నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న అనిల్‌ అంబానీ నేతృత్వంలోని కంపెనీకి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (DMRC) నుంచి తుది నోటీసు అందింది. 

ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌ నివేదిక ప్రకారం.. రూ. 2,599 కోట్లను ఎస్‌బీఐ ప్రైమ్ లెండింగ్ రేటుపై అదనంగా 2 శాతం చొప్పున వడ్డీతో పాటు 15 రోజులలోపు తిరిగి చెల్లించాలని కోరుతూ రిలయన్స్ ఇన్‌ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL)కి డీఎంఆర్‌సీ నోటీసు జారీ చేసింది. చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఇదీ నేపథ్యం..
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సెక్టార్ 21 ద్వారక వరకు నడిచే ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ రూపకల్పన, నిర్వహణ కోసం ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌, అనిల్ అంబానీకి చెందిన డీఏఎంఈపీఎల్‌ మధ్య ఒప్పందం జరిగింది. అయితే తాము గుర్తించిన కొన్ని నిర్మాణ లోపాలను డీఎంఆర్‌సీ పరిష్కరించలేదని ఆరోపిస్తూ 2012లో డీఏఎంఈపీఎల్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

దీనికి సంబంధించి కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ రూ. 2,950 కోట్లు వడ్డీతో సహా డీఏఎంఈపీఎల్‌కి చెల్లించాలని  ని ఆదేశించింది. దీంతో  డీఎంఆర్‌సీ రూ. 2,599 కోట్లను యాక్సిస్ బ్యాంక్ వద్ద ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో తాము డిపాజిట్‌ చేసిన రూ. 2,599 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అనిల్ అంబానీ సంస్థకు 15 రోజుల సమయం ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement