Delhi Metro station
-
ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని శివాజీ పార్కు నుండి పంజాబ్ బాగ్ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ తీవ్రవాదుల నినాదాలు కలకలం సృష్టించాయి. ఈ మేరకు SFJ సంస్థలోకి వీడియోను కూడా విడుదల చేసింది. మెట్రో అధికారుల నుండి సమాచారాన్ని అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అన్ని మెట్రో స్టేషన్ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీని ఖలిస్థాన్ గా మారుస్తామని, పంజాబ్ భారత దేశానికి చెందినది కాదని, మోదీ భారతదేశం సిక్కుల నరమేధానికి పాల్పడిందని, ఖలిస్థాన్ రెఫరెండం జిందాబాద్ అని SFJ పేరుతో ఈ నినాదాలను రాశారు దుండగులు. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన జీ20 సదస్సుకు కొద్దిరోజుల ముందు ఖలిస్తానీలు ఈ దారుణానికి ఒడిగట్టడంతో ఢిల్లీ పోలీసులు భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసి 450కి పైగా క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను పీసీఆర్ వ్యాన్లు, 50కి పైగా అంబులెన్స్‌లు, ఎయిర్‌పోర్టు, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అగ్నిమాపక యంత్రాలతో సహా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. In more than 5 metro stations somebody has written 'Delhi Banega Khalistan and Khalistan Zindabad'. Delhi Police is taking legal action against this: Delhi Police pic.twitter.com/T6U5myjZyv — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!
Metro station.. మనుషులు చేసే కొన్ని తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయి. చిన్న తప్పుల కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. మెట్రో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ హంగామా క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో మెట్రో కింద ఉన్న ప్రజలు కిందకు దిగాలని ఎంతగా అరుస్తున్నా, కేకలు వేస్తున్నా అతను మాత్రం అవేవీ పట్టించుకోకుండా కనీసం వారి వైపు కూడా చూడకుండా నడుచుకుంటూ వెళ్లాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. లంచ్ తర్వాత తిన్నది అరిగేందుకు మధ్యాహ్నం వాక్ చేస్తున్నాడని కామెంట్ చేశాడు. A man running on a Track Near nangloi metro station Green Line @OfficialDMRC @ACPAshishKumar pic.twitter.com/NnwY7vka4I — Ravi Rai (@RaviRai76784793) August 20, 2022 -
మెట్రో స్టేషన్లో వికృత చేష్టలు.. మహిళ దగ్గరకు వచ్చి..
ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. యువతులు, మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. మెట్రో రైల్వే స్టేషన్లో మహిళ పట్ల ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జూన్ 2వ తేదీన చోటుచేసుకోగా.. 100 గంటలపాటు సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఎల్లో లైన్లో జూన్ 2న ఒక మహిళ మెట్రో రైలులో ప్రయాణించింది. ఆమె స్టేషన్లో కూర్చుని ఉండగా.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక అడ్రస్ గురించి అడిగాడు. ఆ అడ్రస్ గురించి చెప్పిన ఆమె జోర్ భాగ్ మెట్రో స్టేషన్లో దిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై ఒక చోట కూర్చొని క్యాబ్ బుక్ చేస్తున్నది. నిందితుడు కూడా.. అదే స్టేషన్లో దిగాడు. అనంతరం.. అతడు మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. అడ్రస్ అడిగాడు. దీంతో, ఆమె.. అతడికి అడ్రస్ చెబుతుండగా.. నిందితుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో షాకైన బాధితురాలు.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం, ఈ ఘటన గురించి సిబ్బందికి చెప్పింది. కానీ, వారు పట్టించుకోకపోవడంతో ట్విట్టర్ వేదికగా.. వరుస ట్వీట్స్ చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాదాపు 100 గంటలు సీసీ ఫుటేజీని చెక్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కోట్లా ముబారక్‌పూర్‌లో నివాసం ఉంటున్న మానవ్ అగర్వాల్(40)గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నిందితుడు.. నేపాల్‌కు పారిపోయాడని తెలిపారు. Woman Molested Inside Delhi Metro Station, Horrific Act Caught on CCTV#DelhiMetro #JorBagh pic.twitter.com/iHKP2nMWwl — TIMES NOW (@TimesNow) July 6, 2022 ఇది కూడా చదవండి: మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..? -
మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు
దేశంలో యువతులు, మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొందరు ఆకతాయిలు మహిళలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు. తాజాగా మెట్రో స్టేషన్లో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చేటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధిత యువతి ఢిల్లీలోని జోర్‌బాగ్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కింది. అనంతరం రైలులో ఉన్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓ అడ్రస్ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్ చెప్పింది. అనంతరం ఆమె దిగిపోవాల్సిన స్టేషన్ రాగా.. రైలు దిగి మరో రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాట్‌ఫామ్ మీద ఉన్న బెంచి మీద కూర్చుంది. ఇంతలో అడ్రస్ అడిగిన వ్యక్తి మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. మరోసారి అడ్రస్‌ను కోరి.. క్లియర్ చెప్పమని అడిగాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి.. బాధితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన శారీరక అవయవాలను ఆమెకు తాకిస్తూ దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు.. అతను ఏం చేస్తున్నాడో గమనించి.. ప్లాట్‌ఫామ్ మీది ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పింది అతను పట్టించుకోకుండా పై ఫ్లోర్లో ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నాడు. దీంతో షాకైన యువతి.. మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కూడా గుర్తించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. దానిని పెద్ద సీన్ చేయవద్దని ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో, బాధితురాలు తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ట్వీట్‌కు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. ఆ ఘటనపై తగు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ మహిళా కమిషన్.. కేసు సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. Zero-tolerance for any indecent behaviour, sexual harassment: DMRC on Jor Bagh station case In a statement, it also asserted that the Delhi Metro Rail Corporation, as an organisation has "zero-tolerance for any act amount... #News by #EconomicTimes https://t.co/wOyd25dCYK — Market’s Cafe (@MarketsCafe) June 4, 2022 In the context of the recent incident reported at Jorbagh, we have already taken up the issue with the concerned security agencies. Delhi Police has already taken cognizance of the complaint and are investigating into the matter. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 3, 2022 ఇది కూడా చదవండి: ‘ఆర్య సమాజ్’ మ్యారేజ్ సర్టిఫికెట్లు చెల్లవు -
మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: గుర్తు తెలియని ఓ యువతి మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదరు యువతి గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఓ యువతి మెట్రోస్టేషన్ గోడ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెట్రో స్టేషన్లో ఉన్న సిబ్బంది, సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆమె మాటల్లో పెట్టి రక్షించే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఎంత చెప్పినా యువతి పట్టించుకోలేదు. ఎలాగైనా ఆమె కాపాడాలన్న ఉద్దేశ్యంతో జవాన్లు.. ఆమె పై నుంచి దూకబోయే ముందు మెట్రో స్టేషన్ కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. యువతిని కాపాడాలని సిబ్బంది ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా యువతి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ముందు జాగ్రత్తగా అధికారులు అంబులెన్స్‌ను పిలిపించడంతో వెంటనే ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేయగా ట్రెండింగ్‌లో నిలిచింది. Saving Lives... Prompt and prudent response by CISF personnel saved life of a girl who jumped from Akshardham Metro Station. #PROTECTIONandSECURITY #Humanity @PMOIndia@HMOIndia@MoHUA_India#15yearsofCISFinDMRC pic.twitter.com/7i9TeZ36Wk — CISF (@CISFHQrs) April 14, 2022 Something dangerous that I witnessed today when I reached Akshardham metro station...This girl in white shirt wanted to commit suicide, while DMRC employees and jawans tried their best to convince this girl. Although she jumped from the edge, but was rescued.@NewsroomPostCom pic.twitter.com/la2XCyu9Tn — Neha Singh (@NehaSingh1912) April 14, 2022 -
ఆపదలో చిక్కుకుంది.. రియల్ హీరో కంటపడింది
నిజమైన హీరోలు ఎవరో తెలుసా? దేశానికి కాపలా కాసే సైనికులు. అంతేనా.. ఆపదలో ఉన్నవాళ్లకు సాయం అందించేవాళ్లు కూడా ఆ ట్యాగ్‌కు అర్హులే. అలాంటిది ఆపదలో ఉన్న ఆ చిన్నారి రియల్ హీరో కంటపడింది. ఊరుకుంటాడా మరి?.. ఆ వీడియోనే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఎనిమిదేళ్ల చిన్నారి మెట్రో స్టేషన్ దగ్గర ఆడుకుంటూ.. పైకి ఎక్కేసింది. తీరా 25 అడుగుల ఎత్తుకి చేరి.. అక్కడ చిక్కుకుపోయింది. భయంతో ఏడ్పు అందుకోగా.. ఆ ఏడ్పు విన్న కొందరు.. అక్కడే ఉన్న కొందరు సీఐఎస్ఎఫ్ సిబ్బందిని సాయం కోరారు. వెంటనే.. ఉరుకుల మీద అక్కడికి చేరుకున్నాడు ఓ సిబ్బంది. #WATCH : राजधानी दिल्ली के निर्माण विहार मेट्रो स्टेशन पर ग्रिल में फंसी बच्ची, सीआईएसएफ जवान ने दिलेरी दिखा बच्ची को बचाया@CISFHQrs @OfficialDMRC video source _ @NeerajGaur_#delhimetro #cisf #Delhi pic.twitter.com/l4EY1JIuIq — Tarun Sharma (@tarun10sharma) February 28, 2022 జాగ్రత్తగా అక్కడికి చేరుకుని ఆ చిన్నారిని రక్షించి కిందకు తీసుకొచ్చాడు. ఆ దగ్గర్లోనే ఆ అమ్మాయి ఇళ్లు ఉందట!. అందుకే ఆడుకుంటూ అక్కడికి వెళ్లిపోయింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నిర్మాన్ విహార్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఏందయ్యా సామీ! కాస్త చూసుకుని నడువు!!
న్యూఢిల్లీ: ఇంతవరకు మనం రైలులోంచి జారిపడటం వంటి రకరకాల ప్రమాదాలను చూశాం. ఇటీవలే ఒక వ్యక్తి ఏకంగా కదులుతున్న రైలు ముందు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని తోసేసి వెళ్లిపోయిన ఘటనలు గురించి విన్నాం. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఢిల్లీలోని షాహదారా మెట్రో స్టేషన్లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీలోని ఒక వ్యక్తి ఫోన్ చూస్తు నడుస్తూ మెట్రో ట్రాక్ పై పడిపోయాడు. ఈ ఘటన శుక్రవారం షాహదారా మెట్రోస్టేషన్లో చోటుచేసుకుంది. అయితే అక్కడే ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ సిబ్బందికి చెందిన కానిస్టేబుల్ రోథాష్ చంద్ర వేగంగా స్పందించి మెట్రో ట్రాక్‌పైకి దిగి సదరు యువకుడిని మెట్రోరైలు రాకమునుపే ఫ్లాట్ఫాంపైకి ఎక్కించి కాపాడాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A passenger namely Mr. Shailender Mehata, R/O Shadhara, slipped and fell down on the metro track @ Shahdara Metro Station, Delhi. Alert CISF personnel promptly acted and helped him out. #PROTECTIONandSECURITY #SavingLives@PMOIndia @HMOIndia @MoHUA_India pic.twitter.com/Rx2fkwe3Lh — CISF (@CISFHQrs) February 5, 2022 -
సీఏఏ సెగ: మెట్రో స్టేషన్ తాత్కాలికంగా మూసివేత
-
సీఏఏ సెగ: మెట్రోకు బ్రేక్
న్యూఢిల్లీ: పౌరసత్వ నిరసన సెగలు ఢిల్లీ మెట్రోను తాకాయి. సుమారు నెలరోజులకు పైగా షాహీన్‌బాగ్‌లో నిరసనలు చేపట్టిన ఆందోళనకారులు తాజాగా శనివారం రాత్రి ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జాతీయ జెండాలు చేతబూని ఆజాదీ(స్వాతంత్ర్యం) కావాలంటూ గొంతెత్తి అరిచారు. చేతులకు నీలం రంగు బ్యాండ్ కట్టుకుని ‘జై భీమ్’ నినాదాలు చేశారు. ఇక సీఏఏను రద్దు చేసేవరకు ఇక్కడనుంచి కదిలేది లేదంటూ నిరసనకారులు తేల్చి చెప్తున్నారు. కాగా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో జనం పోగవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. (రాళ్లు రువ్వి వర్సిటీలోకి వెళ్లారు) దీంతో పోలీసులు అదనపు బలగాలతో ఆ ప్రాంతాన్ని మెహరించారు. దాదాపు 500మందికి పైగా ఆందోళనకారులు ఈ ర్యాలీలో పాల్గొనగా వీరిలో మహిళల సంఖ్యే అధికంగా ఉండటం గమనార్హం. కాగా జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ బయటే వీరు నిరసనలు చేపట్టడంతో డీఎమ్ఆర్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జాఫ్రాబాద్ మెట్రోస్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మార్గంలో వెళ్లే రైళ్లు అక్కడ ఆగవని, ప్రయాణికులు గమనించాలని కోరారు. (నిన్న అమూల్య.. నేడు ఆర్ధ్ర) -
మెట్రో రైలులో యువతికి చేదు అనుభవం
సాక్షి, న్యూ ఢిల్లీ: మహిళలు ఎంతో భద్రతగా భావించే మెట్రో రైలులో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎదురుగా నిలబడ్డ ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో బెంబేలెత్తిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ వికృత ఘటన బుధవారం ఢిల్లీ మెట్రో ఎల్లో లైన్ మార్గంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... విధులు ముగించుకుని మహిళా ఉద్యోగిని సాయంత్రం 6 గంటల సమయంలో గుర్గావ్ వెళ్లేందుకు ఢిల్లీ మెట్రో రైలు ఎక్కింది. ఆ సమయంలో అదే రైలులో ఉన్న ఓ యువకుడు తన ప్రయివేట్ పార్ట్స్ చూపిస్తూ యువతికి అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో భయకంపితురాలైన ఆమె ఏం చేయాలో అర్థం కాక బిత్తర చూపులు చూసింది. సుమారు ఓ నిమిషం పాటు బ్యాగును అడ్డుపెట్టుకుంటూ, తీస్తూ సదరు వ్యక్తి మరింత వెకిలిగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువతి... స్నేహితురాలి సహాయంతో అతని ఫొటోను సంపాదించి.. తనకు జరిగిన ఘోర అనుభవాన్ని ట్విటర్లో రాసుకొచ్చింది.(దోచుకున్న సొమ్ముతో ఇళ్లు..షికార్లు!) యువతి ట్వీట్‌పై స్పందించిన ఢిల్లీ మెట్రో యజమాన్యం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయాలని, లేదంటే దగ్గర్లో ఉన్న మెట్రో అధికారులను సంప్రదించాలని సూచించింది. తద్వారా దుండగులపై వెంటనే చర్యలు తీసుకునే ఆస్కారం ఉందని పేర్కొంది. ఇక మెట్రో స్పందనతో పాటు, స్నేహితురాలి ప్రోద్బలంతో ధైర్యం తెచ్చుకున్న యువతి ఈ ఘటనపై గురువారం ఫిర్యాదు చేసింది. అయితే అతను ఎక్కడ దిగిపోయాడో మాత్రం తనకు తెలీదని చెప్పుకొచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. (నాలుగేళ్ల ప్రేమ అర్థాంతరంగా..) -
మెట్రోలో రూ. కోటి తీసుకెళుతూ..
సాక్షి, న్యూఢిల్లీ : పోలీసుల కళ్లుగప్పి కోటి రూపాయల నగదు తీసుకువెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ మెట్రో స్టేషన్లో గురువారం సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జంగ్‌పుర మెట్రో స్టేషన్ వద్ద నిందితులు రాజస్ధాన్‌కు చెందిన వికాస్ చౌహాన్ (30), మధ్యప్రదేశ్ నివాసి ఆర్తి (20)ల బ్యాగ్‌లను స్కాన్ చేయగా అందులో పెద్దమొత్తంలో నగదును గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిని అరెస్ట్ చేశారు. వారి బ్యాగ్‌లను తనిఖీ చేయగా రూ కోటి పట్టుబడిందని, ఈ నగదుపై వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని సీఐఎస్ఎఫ్ ఏఐజీ హేమేంద్ర సింగ్ చెప్పారు. భారీమొత్తం నగదుతో పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్టు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. -
మెట్రో స్టేషన్ సమీపంలో తలలేని మృతదేహం
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని జహంగీపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో తలలేని మహిళా మృత దేహం లభ్యమైంది. దుప్పటిలో చుట్టి ఉన్న మృతదేహాన్ని పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించగా రెండు మూడు రోజుల క్రితమే మహిళను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. శరీరం నల్లగా మారి పాడైపోయే స్థితికి చేరుకుందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాబు జగ్జీవన్ రాం మెమొరియల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
మెట్రో రైలు ముందు దూకేశాడు
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ 23 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఈరోజు ఉదయం ప్లాట్‌ఫామ్ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందుకు దూకాడు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చోటు చేసుకుంది. మెట్రో రైలు ముందుకు దూకడంతో ఆ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని అధికారులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ముంబైకి చెందిన ఈ విద్యార్థి సివిల్ సర్వీసు పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. తూర్పు ఢిల్లీలోని నిర్మాన్ విహార్‌లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్లాట్‌ఫామ్ మీదకు రైలు వస్తున్న క్రమంలో బ్లూలైన్ వద్ద రైలు ముందు దూకినట్టు సీనియర్ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఈ ఘటనతో మెట్రో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. మెట్రో సర్వీసులకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. -
క్షణం ఆలస్యమై ఉంటే.. శవమయ్యేవాడు
సాక్షి, న్యూఢిల్లీ : ఏదైనా పెద్ద ప్రమాదం నుంచి బయటపడినపుడు పొద్దున లేచిన ఘడియ మంచిదయింది లేకపోతే ఏం అనర్థం జరిగేదోనని అనుకోవడం చాలా మందికి అలవాటు. మయూర్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడు కూడా అలాగే అనుకోవాలేమో. అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శాస్త్రినగర్ మెట్రో స్టేషన్లో మయూర్ పటేల్ ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు ఆగి ఉన్న రైలు ముందు నుంచి ట్రాక్ దాటడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో రైలు కదలడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. అయితే అతడు రావడాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై రైలును ఆపడంతో మయూర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో మయూర్‌కి జరిమానా విధించడంతో ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించారు అధికారులు. ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు ఎలా వెళ్లాలో తనకు తెలీదని, అందుకే ట్రాక్ దాటి వెళ్లేందుకు ప్రయత్నించానని తాపీగా సమాధానం చెప్పాడు. మయూర్ సమాధానం విన్న అధికారులు అవాక్కవ్వడంతో పాటు.. కాస్త అసహనానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. -
లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
-
మెట్రో స్టేషన్‌కి గన్‌తో యువకుడు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఓ యువకుడు తుపాకీతో కనిపించి కలకలం రేపాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనిఖీలు చేసే సందర్భంలో అతడు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని రద్దీగా ఉండే నెహ్రూ ప్లేస్‌లో మెట్రో రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ మెటల్ డిటెక్టర్ వద్ద మెట్రోలో ప్రయాణించే వాళ్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందం ఉంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు చెక్ చేస్తుండగా వారిలో 21 ఏళ్ల సుమిత్ మిశ్రా యువకుడు కంగారుగా కనిపించాడు. దాంతో అతడిని ప్రత్యేకంగా తనిఖీ చేయగా తుపాకీ లభ్యం అయింది. దీంతో వెంటనే అధికారులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ యువకుడు ఎవరు, అతడి చేతుల్లోకి తుపాకీ ఎలా వచ్చింది? ఎందుకు అతడు తుపాకీతో మెట్రో స్టేషన్‌కు వచ్చాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఎస్ఐ ఆత్మహత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న భగత్ సింగ్ గురువారం మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ లోని సీసీ టీవీ కంట్రోల్ రూములో సర్వీసు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాల్ కాజీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సీఐఎస్ఎఫ్, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగ్రాకు చెందిన భగత్ సింగ్ 2012లో సీఐఎస్ఎఫ్ చేరారు. ఆయన వివాహితుడు. -
ఢిల్లీ మెట్రోస్టేషన్ వద్ద కాల్పుల కలకలం
దేశ రాజధాని నగరంలోని మెట్రో రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల కలకలం రేగింది. ఇంద్రలోక్ మెట్రోస్టేషన్ సమీపంలో ఓ పురుషుడు, మహిళపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. వారిలో పురుషుడు అక్కడికక్కడే మరణించగా మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి పేరు సుందర్ అని, అతడు చెత్త వ్యాపారి అని పోలీసులు తెలిపారు. సుందర్ తలపైన, గుండెలోను బుల్లెట్లు తగిలాయి. ఇది వ్యక్తిగత పగతో చేసిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన మహిళను హిందూరావు ఆస్పత్రిలో చేర్చారు. సరాయ్ రోహిలా పోలీసు స్టేషన్లో హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల వివరాలు పోలీసులకు తెలిశాయని సమాచారం.