
సాక్షి, న్యూఢిల్లీ : పోలీసుల కళ్లుగప్పి కోటి రూపాయల నగదు తీసుకువెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో గురువారం సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జంగ్‌పుర మెట్రో స్టేషన్ వద్ద నిందితులు రాజస్ధాన్‌కు చెందిన వికాస్ చౌహాన్ (30), మధ్యప్రదేశ్ నివాసి ఆర్తి (20)ల బ్యాగ్‌లను స్కాన్ చేయగా అందులో పెద్దమొత్తంలో నగదును గుర్తించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వారిని అరెస్ట్ చేశారు. వారి బ్యాగ్‌లను తనిఖీ చేయగా రూ కోటి పట్టుబడిందని, ఈ నగదుపై వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని సీఐఎస్‌ఎఫ్ ఏఐజీ హేమేంద్ర సింగ్ చెప్పారు. భారీమొత్తం నగదుతో పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్టు సీఐఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment