ఏందయ్యా సామీ! కాస్త చూసుకుని నడువు!! | Man Busy Looking At His Phone Falls On Delhi Metro Tracks | Sakshi
Sakshi News home page

Viral Video: ఏందయ్యా సామీ! కాస్త చూసుకుని నడువు!!

Published Sun, Feb 6 2022 9:11 AM | Last Updated on Sun, Feb 6 2022 9:40 AM

Man Busy Looking At His Phone Falls On Delhi Metro Tracks - Sakshi

న్యూఢిల్లీ: ఇంతవరకు మనం రైలులోంచి జారిపడటం వంటి రకరకాల ప్రమాదాలను చూశాం. ఇటీవలే ఒక వ్యక్తి ఏకంగా కదులుతున్న రైలు ముందు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని తోసేసి వెళ్లిపోయిన ఘటనలు గురించి విన్నాం. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఢిల్లీలోని షాహదారా మెట్రో స్టేషన్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీలోని ఒక వ్యక్తి ఫోన్‌ చూస్తు నడుస్తూ మెట్రో ట్రాక్‌ పై పడిపోయాడు. ఈ ఘటన శుక్రవారం షాహదారా మెట్రోస్టేషన్‌లో చోటుచేసుకుంది. అయితే అక్కడే ఉన్న సెంట్రల్‌ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ సిబ్బందికి చెందిన కానిస్టేబుల్ రోథాష్ చంద్ర వేగంగా స్పందించి మెట్రో ట్రాక్‌పైకి దిగి సదరు యువకుడిని మెట్రోరైలు రాకమునుపే ఫ్లాట్‌ఫాంపైకి ఎక్కించి కాపాడాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement