సాటి మనిషి ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో ఉన్నపుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు పక్కనుంచి వెళ్లిపోతారు చాలామంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే.. మెట్రో స్టేషన్‌లో ఎక్స్‌లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇది చూసి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లినాక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్సలేటర్ మీద నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చి మరీ ఆయనకు సాయం చేశారు. ‘‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనను మరిపించేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్ చేయడం విశేషం. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు. ఆర్‌వీసీజీ మీడియా ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. &
Respect for these girls ❤️📈pic.twitter.com/bc6yeRLXl9
— RVCJ Media (@RVCJ_FB) August 1, 2024
Comments
Please login to add a commentAdd a comment