
న్యూఢిల్లీ: ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మెట్రో రైలు ఇటీవల గొడవలు, యువత డ్యాన్స్‌లకు, ప్రేమికుల రొమాన్స్‌లకు అడ్డాగా మారుతోంది. ఇదంతా దేశ రాజధానిలోని ఢిల్లీ మెట్రో గురించి. ప్రజలకు సేవలందిస్తూ గుర్తింపు పొందుతూ వార్తలో నిలుస్తుందనుకున్న ఢిల్లీ మెట్రో.. వేరొక రూపంలో నిత్యం వార్తలో నిలుస్తోంది. ఒక ఘటన జరిగింది కదా పోనీలే అని మరిచిపోయే లోపు మరొక ఉదాంతం తెరపైకి వస్తోంది.
తాజాగా ఇద్దరు మహిళల మధ్య కీచులాటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వారిద్దరు సీటు కోసం గొడవ పడుతూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఆ వీడియెలో.. ఒక మహిళ తన కుమార్తెతో పాటు ప్రయాణిస్తుండగా... అంతలో మరొక మహిళతో సీటు విషయమై గొడవ మొదలవుతుంది. ఈ క్రమంలో వారిద్దరు ఒకరికొకరు వేళ్లు చూపించుకుంటూ నోర్మూసుకో అంటూ గట్టిగా అరవడం ప్రారంభించారు.
కనీసం తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని అని వారికి అనిపించలేదు. మరొక మహిళ వచ్చి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించదు. ఈఘటనను కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఢిల్లీ మెట్రో అధికారులు ఇలాంటి ఘటనలకు పునరావృతం కాకూడదని ప్యాసింజర్లను కోరుతున్నా... వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు, వీటికి ఫుల్‌స్టాప్ పడడం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Just Delhi Metro & Women !!!#W0men !!#DelhiMetro
— The DV Warrior (Parody) (@BakraofDv) August 3, 2023
😂😂😂 pic.twitter.com/BRjVJTQkJ7
Comments
Please login to add a commentAdd a comment