బిహార్‌లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్‌ఫోన్ కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భాగల్‌పూర్ స్టేషన్ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. అయితే ఆ స్టేషన్‌లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. चलती ट्रेन से पैसेंजर का फोन छीनकर भाग रहे झपटमार को यात्री ने पकड़ लिया और करीब 1 किमी तक ट्रेन की खिड़की से लटकाए रखा।
वीडियो बिहार के भागलपुर का बताया जा रहा है। pic.twitter.com/tHbKphUIQe
రైల్లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
Published Wed, Jan 17 2024 7:31 PM | Last Updated on Wed, Jan 17 2024 8:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment