ఈ దొంగకు ఛారిటీ వర్క్‌ ‘కిక్‌’ ఇస్తుంది! | Irfan Who Commits Theft And Distributes Stolen Money To Everyone | Sakshi
Sakshi News home page

ఈ దొంగకు ఛారిటీ వర్క్‌ ‘కిక్‌’ ఇస్తుంది!

Published Wed, Jan 13 2021 8:51 AM | Last Updated on Wed, Jan 13 2021 1:25 PM

Irfan Who Commits Theft And Distributes Stolen Money To Everyone - Sakshi

‘కిక్‌’ సినిమాలో మీకు హీరో గుర్తున్నాడా? అదేనండీ..మన కల్యాణ్‌! కల్యాణ్‌ ‘జస్ట్‌ ఫర్‌ ఫన్‌’ ‘కిక్‌’ కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఇక ఇర్ఫాన్‌ విషయానికి వస్తే ‘కిక్‌’ కోసం కాదుగానీ ఛారిటీ కోసం దొంగతనాలు చేస్తుంటాడు.పోష్‌ కాలనీలు, ఖరీదైనా కార్లు అంటే అతడికి వల్లమాలిన ప్రేమ. సోలోగా దొంగతనాలు చేయడానికి ఇష్టపడే ఇమ్రాన్, దోచిన సొమ్మును అందరికీ పంచడానికే మొగ్గు చూపుతాడు. ముప్పై సంవత్సరాల ఇర్ఫాన్‌ది బిహార్‌ రాష్ట్రం. సితమది జిల్లాలోని తన స్వగ్రామం ఉజాలలో బీదప్రజలకు సహాయపడడం, ఉచితభోజనాలు ఏర్పాటు చేయడం, హెల్త్‌ క్యాంప్‌లు నిర్వహించడం...మొదలైన మంచి పనులు చేస్తుంటాడు.

అందుకే ఇర్ఫాన్‌ను ‘రాబిన్‌హుడ్‌ ఉజాల’ అని పిలుచుకుంటారు.‘రాబిన్‌హుడ్‌ ఉజాలా’ బిహార్‌లో మార్చిలో జరగనున్న జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. అయితే  ఈలోపే ఢిల్లీలోని ఒక ఫ్లైవోవర్‌ దగ్గర...చిన్నపాటి సినిమా చేజ్‌ తరువాత పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. చదవండి: భర్తకు షాక్‌! భార్యతో సహా కారు దొంగతనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement