ఐఫోన్ క్రేజ్ మామూలుగా ఉండదు.. యాపిల్ కంపెనీకి చెందిన ఆ ఫోన్ అంటే ప్రతిఒక్కరికీ మోజు. దానిని కొనాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అది చాలా ఖరీదు కావడంతో అందరూ కొనలేరు.
ఇదీ చదవండి: iPhone 15 Manufacturing: టాటా ఐఫోన్! ఇక ఐఫోన్ 15 తయారీ ఇక్కడే..
అయితే కష్టపడి కొనడం ఎందుకు? కొట్టేస్తే పోలా అనుకున్నాడో వ్యక్తి. యాపిల్ స్టోర్‌కి వెళ్లి నచ్చిన మోడల్ ఐఫోన్ తీసుకుని పరుగు లంకించుకున్నాడు. ఈ క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డాడు. క్రేజీ క్లిప్స్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.
(ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్)
Dude jumps off 2nd floor trying to get away after robbing Apple store 😬 pic.twitter.com/pdEjodh1Ka
— Crazy Clips (@crazyclipsonly) May 17, 2023
Comments
Please login to add a commentAdd a comment