jumps off
-
ఐఫోన్ కోసం ఎన్ని తిప్పలో.. రెండో అంతస్తు నుంచి దూకేశాడు.. వీడియో వైరల్!
ఐఫోన్ క్రేజ్ మామూలుగా ఉండదు.. యాపిల్ కంపెనీకి చెందిన ఆ ఫోన్ అంటే ప్రతిఒక్కరికీ మోజు. దానిని కొనాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అది చాలా ఖరీదు కావడంతో అందరూ కొనలేరు. ఇదీ చదవండి: iPhone 15 Manufacturing: టాటా ఐఫోన్! ఇక ఐఫోన్ 15 తయారీ ఇక్కడే.. అయితే కష్టపడి కొనడం ఎందుకు? కొట్టేస్తే పోలా అనుకున్నాడో వ్యక్తి. యాపిల్ స్టోర్‌కి వెళ్లి నచ్చిన మోడల్ ఐఫోన్ తీసుకుని పరుగు లంకించుకున్నాడు. ఈ క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డాడు. క్రేజీ క్లిప్స్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేవు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) Dude jumps off 2nd floor trying to get away after robbing Apple store 😬 pic.twitter.com/pdEjodh1Ka — Crazy Clips (@crazyclipsonly) May 17, 2023 -
రైలు కింద పడి టీచర్ మృతి.. విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం
మెదక్: భర్త మృతిని తట్టుకోలేక భార్య రెండు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల కొత్త కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు రామారావు(40) కుటుంబం నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా సికింద్రాబాద్‌లో రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసున్నాడు. విషయం తెలుసుకున్న భార్య చిన్నఅమ్ములు అద్దెకు ఉండే రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించగా కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరికి ఇద్దరు పిల్లలు దివ్యాన్షు(6), పూజిత (1)ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు ఉపాధ్యాయుడు మృతి చెందగా అతడి భార్య చిన్న అమ్ములు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలియని వారి పసిపిల్లలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడసాగారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. రామారావు విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, ఆకులపేట గ్రామానికి చెందిన నివాసిగా తెలిసింది. అలుముకున్న విషాదం శివ్వంపేట(నర్సాపూర్): మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మృతితో విషాదఛాయ లు అలుముకున్నాయి. చిన్నగొట్టిముక్ల పంచాయతీ కొత్త కాలనీలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఉపాధ్యాయుడిగా నియామకమై మొదటి పోస్టింగ్ మండలంలోని తిమ్మాపూర్ ప్రైమరీ స్కూల్, తర్వాత కొత్త కాలనీలోని పీఎస్ పాఠశాలల్లో విధులు నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ బుచ్చనాయక్ తోటి ఉపాధ్యాయులు ఘటన స్థలానికి చేరుకొని నివాళులర్పించారు. -
కరోనా భయంతో ఆస్పత్రిపై నుంచి దూకాడు..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ జై ప్రకాశ్‌నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తిని కరోనా లక్షణాలతో మార్చి 31న ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శనివారం రాత్రి ఉన్నట్టుండి అతడు ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. ఎత్తు నుంచి పడటం వల్ల అతని కాలు ఫ్రాక్చర్ అయిందని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కాగా, అతడి కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు దేశంలో రోజరోజుకు కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో 3374 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 77 మంది మృతిచెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
ఎయిర్‌హోస్టెస్ మృతి కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: భర్త చేతిలో చిత్రహింసలకు గురైన ఎయిర్‌హోస్టెస్ మృతి దేశరాజధానిలో కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్ వద్ద ఓ అపార్ట్మెంట్ పైనుంచి దూకి అనిస్సియా బత్రా(32) అనే ఎయిర్‌హోస్టెస్ ప్రాణాలు విడిచింది. అయితే ఆమె భర్త మయాంక్ సింఘ్వీ, అతని కుటుంబ సభ్యులే ఆమెను చంపేసి ఉంటారని అన్నిసా బంధువులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం అనిస్సియాకు మయాంక్‌తో వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా మయాంక్ తప్పతాగి వచ్చి అదనపు కట్నం కోసం ఆమెను హింసిస్తున్నాడు. ఈ వ్యవహారంలో అతని తమ్ముళ్లు కూడా సహకరిస్తున్నారు. దీంతో అనిస్సియా తండ్రి ఆర్ఎస్ బత్రా(రిటైర్డ్ ఆర్మీ అధికారి) కొన్నిరోజుల క్రితం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త, మరదులు కొన్నిరోజులుగా ఆమెను టార్చర్ పెడుతున్నారని, ఆమెకేమైనా అయితే వారిదే బాధ్యత అని బత్రా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుకాగా, పోలీసులు ఆమె అత్తమామల్ని, మరుదులను ప్రశ్నించారు కూడా. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆమె బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు... చనిపోయేముందు తన సోదరి తనకు ఫోన్ చేసిందని కరన్ బత్రా చెబుతున్నాడు. ‘నాకు ఫోన్ చేసింది. నన్ను గదిలో పెట్టి హింసిస్తున్నారు, పోలీసులకు సమాచారం అందించండని, రక్షించండని ఏడ్చింది. కాసేపటికే బిల్డింగ్ నుంచి దూకేసిందని, ఆస్పత్రిలో చేర్పించామని మయాంక్ ఫోన్ చేశాడు. తీరా ఆస్పత్రికి వెళ్లేసరికి ఆమె శవమై కనిపించింది. ఖచ్ఛితంగా వాళ్లే చంపేసి ఉంటారు’ అని కరణ్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు పోలీసులు సీజ్ చేసిన గదిని స్పేర్ కీ తో మయాంక్ తెరిచి సాక్ష్యాలను తారుమారు చేశాడని కరణ్ తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. -
చిరుత నుంచి ఎలా తప్పించుకున్నాడో చూడండి
-
కోతుల నుంచి తప్పించుకునేందుకు..దూకేసింది
నెల్లూరు : కోతుల గుంపు నుంచి తప్పించుకునే యత్నంలో ఓ బాలిక భవనంపై నుంచి కింద పడి తీవ్రగాయాలపాలైంది. ఈ సంఘటన బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని పెళ్లకూరులో చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న పల్లవి భవనంపై ఆడుకుంటున్న సమయంలో కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపైకి వచ్చాయి. దీంతో భయపడిన పల్లవి భవనంపై నుంచి కిందకి దూకింది.ఈ ప్రమాదంలో పల్లవి తీవ్రంగా గాయపడింది. తల్లిదండ్రులు వెంటనే స్పందించి... బాలికను నెల్లూరులోని రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తరలించారు.