దొంగలు కూడా ఇప్పుడూ సాధారణ వ్యక్తుల మాదిరి షాప్‌లకి వచ్చి తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు. సీసీఫుటేజ్‌లు ఉన్నా కూడా వారి చేతివాటం మందు అవన్నీ దిగదుడుపే అవుతున్నాయి. కానీ ఇక్కడొక షాపు ఓనర్ మాత్రం భలే స్మార్ట్‌గా దొంగను పట్టుకున్నాడు. దొంగ అని అరవకుండా చాలా కూల్‌గా పట్టించాడు.
వివరాల్లోకెళ్తే...యూకేలోని ఫోన్ మార్కెట్‌కి ఒక దొంగ కస్టమర్‌లాగా వచ్చాడు. అక్కడ లక్షల ఖరీదు చేసే ఫోన్‌లను కొనేసేవాడి మాదిరి ఫోన్‌లను చెక్ చేస్తున్నాడు. ఐతే ఆ షాపు ఓనర్ చాలా తెలివిగా ఫోన్‌లను చూపిస్తూ..బయట తలుపులను లాక్ చేశాడు. దీన్ని గమనించిన మన దొంగ ఇక ఇదే అవకాశం అనుకుని ఒక రెండు ఫోన్‌లను పట్టుకుని పరారయ్యేందకు యత్నించాడు.
ఐతే డోర్లు ఓపెన్ కాకపోవడంతో చచ్చినట్లు తిరిగొచ్చి షాపు అతనికి ఫోన్‌లు ఇచ్చి వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించి నవ్వుకోండి.
Don’t be an idiot pic.twitter.com/ldoXuFW4QB
— UOldGuy🇨🇦 (@UOldguy) December 12, 2022
(చదవండి: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది)
Comments
Please login to add a commentAdd a comment