shop owner
-
భార్య ముందు అంకుల్ అన్నందుకు చితక బాదాడు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లో రెండు రోజుల క్రితం విచిత్ర సంఘటన జరిగింది. భార్యకు చీరలు కొనడానికి వెళ్లిన రోహిత్ అనే వ్యక్తి షాపు యజమానిని చితకబాదాడు. ఇంతకీ కారణమేంటంటే భార్యతో కలిసి చీరలు కొంటున్న రోహిత్‌కు షాపు యజమాని విశాల్ చాలా చీరలు చూపించాడు. ఎన్ని చీరలు చూసినా రోహిత్ దంపతులు ఒక్కటీ సెలెక్ట్ చేయలేదు. దీంతో విసుగెత్తిన విశాల్ మీకు వెయ్యి రూపాయల రేంజ్లో చీరలు కావాలా అని అడిగాడు. ‘మేం అంతకంటే ఎక్కువ రేంజ్ చీరలే కొనగలం, మమ్మల్ని తక్కువ అంచనా వేయకు’అని రోహిత్ షాపు యజమాని విశాల్‌పై అగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విశాల్ స్పందిస్తూ ‘అంకుల్ మీకు అన్ని రేంజ్‌ల చీరలు చూపిస్తాను’అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. భార్య ముందు అంకుల్ అనడంతో రోహిత్ కోపం కట్టలు తెంచుకుంది. షాపు నుంచి వెళ్లిపోయి కొద్ది సేపటికి స్నేహితులను వెంటేసుకొచ్చి షాపు యజమాని విశాల్‌ను కర్రలు, బెల్టులతో చితకబాది అక్కడి నుంచి పారిపోయారు. ఇదీ చదవండి: బలవంతంగా ఉమ్మి నాకించారు -
అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్‌గా దొంగను బంధించాడు!
దొంగలు కూడా ఇప్పుడూ సాధారణ వ్యక్తుల మాదిరి షాప్‌లకి వచ్చి తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు. సీసీఫుటేజ్‌లు ఉన్నా కూడా వారి చేతివాటం మందు అవన్నీ దిగదుడుపే అవుతున్నాయి. కానీ ఇక్కడొక షాపు ఓనర్ మాత్రం భలే స్మార్ట్‌గా దొంగను పట్టుకున్నాడు. దొంగ అని అరవకుండా చాలా కూల్‌గా పట్టించాడు. వివరాల్లోకెళ్తే...యూకేలోని ఫోన్ మార్కెట్‌కి ఒక దొంగ కస్టమర్‌లాగా వచ్చాడు. అక్కడ లక్షల ఖరీదు చేసే ఫోన్లను కొనేసేవాడి మాదిరి ఫోన్లను చెక్ చేస్తున్నాడు. ఐతే ఆ షాపు ఓనర్ చాలా తెలివిగా ఫోన్లను చూపిస్తూ..బయట తలుపులను లాక్ చేశాడు. దీన్ని గమనించిన మన దొంగ ఇక ఇదే అవకాశం అనుకుని ఒక రెండు ఫోన్లను పట్టుకుని పరారయ్యేందకు యత్నించాడు. ఐతే డోర్లు ఓపెన్ కాకపోవడంతో చచ్చినట్లు తిరిగొచ్చి షాపు అతనికి ఫోన్లు ఇచ్చి వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించి నవ్వుకోండి. Don’t be an idiot pic.twitter.com/ldoXuFW4QB — UOldGuy🇨🇦 (@UOldguy) December 12, 2022 (చదవండి: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది) -
జీతం అడిగినందుకు ఉద్యోగిపై యజమాని దాడి
అగర్తలా: తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిపై యజమాని విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్టోబర్ నెలకు సంబంధించిన పెండింగ్ సాలరీ ఇవ్వమన్నందుకు ఇనుప రాడ్డు, బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటన త్రిపుర రాజధాని అగర్తలా నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సూరజిత్ త్రిపుర అనే వ్యక్తి మఫ్టీ అనే బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఆ దుకాణం యజమాని సాహా.. గత అక్టోబర్‌కు సంబంధించి సూరజిత్‌కు జీతం ఇవ్వలేదు. ఈ క్రమంలో తనకు పెండింగ్ సాలరీ ఇవ్వాలని సూరజిత్ డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సాహా.. అక్కడే పని చేసే మరో వ్యక్తి సాయంతో సూరజిత్‌పై ఇనుప రాడ్, బెల్టుతో దాడి చేశాడు. చెంపదెబ్బలు కొట్టాడు. బాధితుడు సూరజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు పశ్చిమ అగర్తలా పోలీసులు. ఈ వీడియోను ట్రైబల్ పార్టీ టిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ మానిక్యా ట్విటర్లో షేర్ చేశారు. దుకాణం యజమాని తీరుపై మండిపడ్డారు. యజమానికిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదీ చదవండి: రోడ్డుపై నిలిచిపోయిన బస్సు.. కారు దిగొచ్చి వెనక్కి నెట్టిన కేంద్ర మంత్రి -
సినిమా రేంజ్లో దోపిడి...డబ్బు, బంగారంతో పరార్
లక్నో: సినిమాలో విలన్ మాదిరి దోపిడికి చేసి డబ్బు నగలతో పరార్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బులందష్హర్లో చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు ఒక దుకాణంలోకి చొరబడి యజమానిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడ ఉన్న వారందర్నీ తుపాకితో బెదిరిస్తూ దర్జాగా కౌంటర్ దగ్గరికి వెళ్లి బ్యాగ్ నిండా డబ్బు, నగలు పెట్టుకుని పరారయ్యారు. వెళ్తు వెళ్తూ అక్కడే ఉన్న ఒక మహిళా కస్టమర్ బ్యాగ్‌ని కూడా లాక్కుని పారిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీఫఫుటేజ్లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. (చదవండి: మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ) -
మావోయిస్టుల బెదిరింపు: 3 గంటల్లోగా డబ్బులు ఇవ్వకపోతే..?
రాయగడ (భువనేశ్వర్): జిల్లాలోని చందిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ముకుందపూర్‌లో శుక్రవారం మావోయిస్టుల బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న చందిలి పోలీస్‌స్టేషన్ అధికారి బిజయలక్ష్మి హికాక హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని, ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ లేఖ ఓ మిఠాయి వ్యాపారిని ఉద్దేశించి రాసినదిగా గుర్తించారు. ముకుందపూర్కు దగ్గరలోని హతికుంబ సమీపంలో ఉన్న శివాలయం వద్ద మిఠాయి వ్యాపారికి ఆ లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలలోపు రూ.7 వేలు చెల్లించాలని, లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని లేఖలో హెచ్చరిస్తూ ఉంది. ఇదే లేఖ ప్రతి మరొకటి ఆ వ్యాపారి దుకాణం వద్ద లభించింది. ఈ లేఖలు మావోయిస్టుల నియమగిరి కమిటీ పేరిట వెలువడ్డాయి. అయితే ఇది మావోయిస్టులే విడుదల చేశారా.. లేకపోతే మావోయిస్టుల పేరుతో ఎవరైనా ఆకతాయిలు విడుదల చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ లేఖతో చుట్టుపక్కల గ్రామస్తుల్లో భయాందోళన ఏర్పడింది. చదవండి: తమిళనాడులో ఉగ్రవాదులు.. హై అలర్ట్ -
వీడియో వైరల్: వేలు చూపిస్తూ వార్నింగ్, అంతలోనే తుపాకీతో..
జైపూర్: రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్లో పట్టపగలే బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకులతో ఒక షాపు యజమానిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సదరు షాపు యజమాని తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది. మొత్తం 38 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ముగ్గురు వ్యక్తులు అక్కడున్న మిగతా షాపుల యజమానులకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు. ఈ పరిణామంతో అక్కడున్నవారంతా భయభ్రాంతులకు లోనయ్యి బయటికి వచ్చే దైర్యం చేయలేదు. కాగా కైలాష్ మీనా అనే పండ్ల వ్యాపారిపై దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇదే విషయమై కైలాష్ మీనా స్పందింస్తూ.. '' రెండు బైక్ లపై ఆరుగురు యువకులు వచ్చారు. వారు ఎందుకు తనపై హత్యాయత్నం చేశారో తెలియదు. పండ్లు, కూరగాయల కమిషన్ ఏజెంట్ అయిన నేను కొన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నా. తనకెవరూ శత్రువులు లేరు. అలాంటిది వాళ్ళు నన్ను టార్గెట్ చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలియడం లేదు. అయితే తనపై దాడి చేసేందుకు వచ్చిన దుండగుల్లో ఒక్కరిని కూడా గుర్తుపట్టలేకపోయాను.'' అని చెప్పుకొచ్చాడు. మీనా ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కాగా కైలాష్ మీనా ఈ మండిలో తోటి వ్యాపారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటాడని తెలిసింది. బహుశా అది దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఈ యువకులను ప్రోత్సహించి ఉంటారా అని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: 13 వాహనాలు ధ్వంసం: ఎస్ఐ కుమారుడు సహా ఇద్దరి అరెస్టు దారుణం: కొడుకులపై తండ్రి కాల్పులు.. ఒకరి మృతి #WATCH | Rajasthan: 6 bike-borne men fired bullets at a shop in the fruits & vegetable market in Gumanpura of Kota y'day. Shop's owner was present inside at the time of incident, he's unhurt. Police say, "CCTV footage is being examined & efforts being made to arrest the accused" pic.twitter.com/JsKzhytfC8 — ANI (@ANI) June 15, 2021 -
డబ్బులు ఇవ్వమన్నందుకు సుశీల్ నన్ను చితకబాదాడు
ముంబై: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్ మెడకు మరో కేసు మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే మర్డర్ కేసులో అరెస్టైన సుశీల్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు శనివారం మరో నాలుగు రోజల రిమాండ్ పొడిగించింది. తాజాగా సుశీల్ కుమార్ ఒక కిరాణా షాప్ ఓనర్‌ను బెదిరించడంతో పాటు అతనిపై దాడికి దిగి దౌర్జన్యానికి పాల్పడినట్లు సతీశ్ యాదవ్ ఇండియా టుడే ఇంటర్య్వూలో తెలిపారు. సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. '' నేను 18 సంవత్సరాలుగా ఛత్రసాల్ స్టేడియానికి సరుకులు అందిస్తున్నా. సుశీల్ మామ సత్పాల్ సింగ్ ఛత్రసాల్ స్టేడియంలో కోచ్‌గా ఉన్న సమయంలో నాకు అతనితో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగా తక్కువ ధరకే సరుకులు అందిస్తుండేవాడిని. కాగా గతేడాది లాక్డౌన్ సమయంలో స్డేడియానికి కోచ్‌గా ఉన్న బీరేంద్ర సరుకుల అందించాలని కోరాడు. అతని ఆర్డర్‌పై నేను రేషన్ అందించాను. అయితే బీరేంద్ర ట్రాన్స్ఫర్ కావడం... అతని స్థానంలో కొత్త కోచ్ వచ్చాడు. నాకు రావాల్సిన రూ. 4 లక్షలు ఇవ్వాలని ఛత్రసాల్ కొత్త కోచ్ అశోక్‌ను అడిగాను. ఒకరోజు అశోక్ నన్ను పిలిచి డబ్బు చెల్లిస్తానని బిల్లులు తీసుకున్నాడు. మరునాడు ధర్మ అనే వ్యక్తి వచ్చి సుశీల్ కుమార్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి వెళ్లాడు. డబ్బు ఇస్తారనే ఆశతో అక్కడికి వెళ్లిన నాకు సుశీల్ డబ్బు ఇవ్వనని చెప్పడంతో అతని కాళ్ల మీద పడి మీరు డబ్బు ఇవ్వకపోతే ఇక్కడే చచ్చిపోతా అని అన్నాను. దానికి సుశీల్ ''అవునా.. ఇక్కడే చచ్చిపోతావా.. అయితే చావు'' అంటూ తన అనుచరులను పిలిచి ఇష్టం వచ్చినట్లు కొట్టించి దౌర్జన్యం చేశాడు. మళ్లీ కనిపిస్తే చంపేస్తానని బెదరించడంతో భయంతో ఇంటికి వెళ్లిపోయాను.'' అని చెప్పుకొచ్చాడు. కాగా సతీష్ యాదవ్ తనపై దాడి చేసిన సుశీల్ బృందంపై గత సెప్టెంబర్‌లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. తాజాగా సుశీల్ హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న సతీష్ యాదవ్ తనపై దాడికి దిగిన సుశీల్‌పై మరోసారి ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. చదవండి: రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ రిమాండ్ పొడిగింపు -
టీఆర్ఎస్ నేత వీరంగం: సీసీ టీవీలో దాడి దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: బేగంబజార్‌లో టీఆర్ఎస్ నేత శాంతిదేవి వీరంగం సృష్టించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు షాప్‌లు మూసివేయాలని హంగామా చేశారు. ఫ్లై వుడ్ షాప్ మూసివేయాలంటూ షాప్ ఓనర్‌పై శాంతిదేవి దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన షాప్ ఓనర్‌పై శాంతిదేవి అనుచరులు దాడి చేశారు. శాంతిదేవి అనుచరుల దాడి దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. దాడిపై షాపు ఓనర్... బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, రేపు నోటిఫికేషన్ -
టీఆర్ఎస్ నేత వీరంగం: సీసీ టీవీలో దాడి దృశ్యాలు
-
టీకొట్టు వ్యాపారికి రూ.109 కోట్ల జీఎస్టీ!
భువనేశ్వర్: రెక్కాడితే డొక్కాడని జీవులకు రాష్ట్రంలో ఇటీవల ద్రవ్య సేవా పన్ను(జీఎస్టీ) బకాయి తాఖీదులు జారీ అవుతున్నాయి. తాజాగా టీకొట్టు వ్యాపారికి ఈ తరహాలో నోటీసు జారీ అయ్యింది. ద్రవ్య సేవా పన్ను జీఎస్టీ బకాయి కింద రూ.109 కోట్లు జమ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఉక్కునగరం రౌర్కెలా కోయల్‌నగర్ ప్రాంతంలో టీకొట్టు వ్యాపారి కార్తీక్ కమిల రూ.109 కోట్ల జీఎస్టీ చెల్లించాల్సి ఉన్నట్లు తెలిపారు. వాస్తవానికి కార్తీక్ సంతకం చేయలేని నిరక్షరాశ్యుడు. అయితే బడా షాపింగ్‌మాల్ యజమానిగా జీఎస్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పంద పత్రాల సంతకాలతో భవంతి అద్దెకు నడుపుతున్నట్లు దీనిలో వివరించారు. చదవండి: ఒకే రోజు 12 వేల మందికి జరిమానా సంతకం కూడా రాదు.. కార్తీక్ రౌర్కెలా కోయల్‌నగర్ లింగరాజ్ ట్రేడింగ్ కంపెనీ షాపింగ్‌మాల్ ఆవరణలో టీకొట్టు నడుపుకుంటున్నాడు. అలాగే కూరగాయల చిల్లర వ్యాపారం చేస్తుంటాడు. వీటితో చేతికి అందిన చిరు మొత్తంతో కుటుంబం నడుపుకుంటున్న సాదాసీదా వ్యక్తి. సంతకం చేయడం రాని నిరక్షరాశ్యుడు. ఈ వ్యక్తిని ట్రేడింగ్ కంపెనీ యజమానిగా, భారీ భవంతి అద్దెకు నడుపుతున్నట్లు పేర్కొని, నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. జీఎస్టీ ఎగవేత తాఖీదులో పేర్కొన్న లింగరాజ్ ట్రేడింగ్ కంపెనీ షాపింగుమాల్ ఆవరణలో టీకొట్టు, అక్కడే కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తి కార్తీక్ కమిలగా విచారణలో తేలింది. విచారణలో పలు అంశాలను సమీక్షించడంతో తాఖీదులో వివరాలు బూటకమని స్పష్టమైంది. కార్తీక్ విద్యుత్ బిల్లులు దాఖలు చేసి, ఈ బూటకపు జీఎస్టీ తాఖీదు జారీ చేయించినట్లు భావిస్తున్నారు. గతంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు, విద్యార్థులు, చిరు వ్యాపారులకు జీఎస్టీ చెల్లింపునకు తాఖీదులు జారీచేసిన ఘటనలు లేకపోలేదు. ఇటువంటి సందర్భాలు రాష్ట్రంలో జీఎస్టీ లోలోపల భారీ కుంభకోణాలు పేరుకుపోతున్నట్లు సందిగ్ధత వ్యక్తం అవుతోంది. -
దారుణం : చిన్నారులను గుంజలకు కట్టేసి
కాళేశ్వరం : కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డారంటూ నలుగురు చిన్నారులను దుకాణం యజమాని గుంజలకు కట్టేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లికి చెందిన నలుగురు చిన్నారులు తన దుకాణంలో నగదు చోరీ చేస్తున్నట్లు గుర్తించిన యజమాని మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం తన దుకాణం ముందు పందిరి గుంజలకు చిన్నారులను తాడుతో కట్టేసి, కొద్దిసేపయ్యాక పిల్లల తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి అప్పగించాడు. దీనిని కొందరు స్థానికులు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : నిజాంపేట్‌లో అపార్ట్మెంట్లకు ఏమైంది!) -
‘వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’
చెన్నై: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పి.జయరాజ్, బెనిక్స్లను పోలీసులు జైలు కస్టడీలో హింసించి చంపిన ఘటనను నటుడు, రాజకీయ నేత కమల్‌హాసన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కమల్ హాసన్ స్పందిస్తూ.. మృతి చెందిన తండ్రీకొడుకుల ఘటనలో సీఎం పళనిస్వామి ప్రధాన నిందితుడుని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాద్యత వహించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి పోలీసుల చర్యకు మద్దతు పలకుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వం ఉగ్రవాదానికి అనుమతి ఇస్తోందని విమర్శించారు. అదే విధంగా తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాలంటూ 2018లో నిరసన తెలిపిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఘటనను కమల్ గుర్తు చేశారు.(ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు) ఇప్పడు పి.జయరాజ్, బెనిక్స్‌లపై పోలీసులు దాడి చేశారని ఇది హత్యా నేరం కాదా అని కమల్ తీవ్రంగా ప్రశ్నించారు. కాగా, తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్ (62) జూన్ 19న తన దుకాణాన్ని లాక్డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్ కొడుకు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఇక 21న వీరిద్దరూ పోలీసుల రిమాండ్‌లోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. -
ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు
చెన్నై: తమిళనాడు పోలీసుల రాక్షసత్వంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తండ్రీకొడుకుల్ని హింసించి చంపడంపై జనం మండిపడుతున్నారు. వీరిని ఇండియన్ ‘జార్జ్ ఫ్లాయిడ్’లు అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో వ్యాఖ్యాని స్తున్నారు. తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్ (62) జూన్ 19న తన దుకాణాన్ని లాక్డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్ కొడుకు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వారి బంధువులు 20న స్టేషన్‌కెళ్లారు. అప్పుడే వారిద్దరి నడుము భాగాల కింద తీవ్రంగా రక్తస్రావం అవుతుండడాన్ని గుర్తించారు. 21న వీరిద్దరూ రిమాండ్‌లోనే కన్నుమూశారు. ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారు 19న రాత్రంతా పోలీసులు వీరిద్దరిని తీవ్రంగా హింసించారని ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు చెప్పారు. వారి ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారని తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని విచారించనున్నట్లు తమిళనాడు హైకోర్టు ప్రకటించింది. తమిళనాడు పోలీసుల అమానుషత్వాన్ని అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ఉదంతంతో పోలుస్తూ గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ట్వీట్ చేశారు. -
టీస్టాల్ నిర్వాహకుడిపై కత్తితో దాడి
మాదాపూర్: టీ స్టాల్‌తో పాటు బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అంగోత్ రాములు(35) మాదాపూర్‌లోని చందానాయక్ తండాలో కుటుంబంతో కలిసి ఉంటూ టీస్టాల్ నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి స్వగ్రామానికి వెళ్లింది. రోజు మాదిరిగా రాత్రి టీస్టాల్‌ను మూసివేసి ఉదయం ఇంటి ముందు పడుకొని ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్క్‌లు ధరించి కత్తితో రాములు ఛాతిపై పొడిచి చేతులకు తీవ్రంగా గాయపరిచారు. రాములు అరుపులు విన్న చుట్టుపక్కల వారు రావడంతో దుండగులు పారిపోయారు. స్థలమే కారణం.. బాధితుడు రాములు తెలిపిన వివరాల ప్రకారం గతంలో పర్వత్‌నగర్‌లో కోటి రూపాయాల స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. దానికి రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారన్నారు. మిగిలిన డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుందామనుకుంటే వారు చేయడం లేదని, రకరకాల కారణాలు చెప్పి ఇబ్బంది పెడుతున్నట్టు పోలీసులకు చెప్పాడు. తనపై దాడి చేసింది వాళ్లే అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. అయితే, పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగతనం చేశాడన్న అనుమానంతో..
-
మద్యం మత్తులో యువతుల వీరంగం
బనశంకరి: మద్యం మత్తులో ఉత్తర భారతదేశానికి చెందిన నలుగురు యువతులు, ఓ యువకుడు వీరంగం సృష్టించి ప్లవర్డెకరేటర్ దుకాణం యజమానిపై దాడి చేశారు. ఈఘటన అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సదరు యువతులు ఓ యువకుడితో కలిస మద్యం సేవించారు. సాయంత్రం నాగరబావి సిగ్నల్ సమీపంలో నమ్మూరతిండి హోటల్ వద్ద ఉన్న ప్లవర్డెకరేటర్ దుకాణం వద్దకు వెళ్లారు. బొకేలు కొనుగోలు చేసే విషయంలో దుకాణం యజమానికి యువతుల మద్య వాగ్వాదం చేసుకుంది. దీంతో సదరు యువతులు దుకాణ యజమానిపై దాడి చేశారు. ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న స్థానికులతో గొడవకు దిగారు. అన్నపూర్ణేశ్వరినగరపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతులను, యువకుడిని అరెస్ట్ చేశారు. ఓ యువతి తప్పించుకోవడంతో గాలింపు చేపట్టారు. -
భర్త చోరీ చేశాడు..భార్య తిరిగి అప్పగించింది..
పెనమలూరు : భర్త ఓ దుకాణంలో సెల్‌ఫోన్ చోరీ చేయగా, ఈ విషయం తెలుసుకుని భార్య దుకాణం యజమానురాలికి సమాచారం ఇచ్చి తిరిగి ఫోన్‌ను పోలీసులకు అప్పగించింది. కానూరు మురళీనగర్‌కు చెందిన కె.రామకృష్ణ కొద్ది రోజుల కిందట విజయవాడ గాంధీనగర్ వెళ్లాడు. అక్కడ జనరల్ స్టోర్‌లో వస్తువులు కొన్న సమయంలో దుకాణం యజమానురాలు చెక్కా దుర్గాభవానీ సెల్‌ఫోన్ చోరీ చేశాడు. రామకృష్ణ భార్య శ్యామలాగౌరీకి అనుమానం వచ్చి భర్తను నిలదీసింది. సరైన సమాధానం చెప్పక పోవటంతో ఫోన్లో ఉన్న ఓ నంబన్‌కు ఫోన్ చేయగా దుర్గాభవానీ లైన్లోకి వచ్చింది. ఈ ఫోన్ తనదేనని ఇటీవల చోరీ జరిగిందని తెలిపింది. శ్యామల ఫోన్‌ను పోలీసులకు అప్పగించంది. సీఐ దామోదర్ ఫోన్ యజమానురాలికి అందచేశారు. -
ఇదేనా ‘చెత్త’శుద్ధి?
రోడ్డుపై చెత్త వేసిన వైన్స్ నిర్వాహకులు మందలించి.. జరిమానా విధించిన కలెక్టర్ సంగారెడ్డి మున్సిపాలిటీ: చెత్తను రోడ్డుపై పారబోసిన షాపు యజమానికి జిల్లా కలెక్టర్ జరిమానా విధించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న కనకదుర్గ వైన్స్ నిర్వాహకులు చెత్తను రోడ్డుపై వేస్తూ తొలగించడం లేదు. సోమవారం రాత్రి కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఇంటికి వెళ్తూ.. వైన్స్ ఎదుట పోగుపడిన చెత్తను గమనించారు. వెంటనే వాహనాన్ని ఆపించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దుకాణం యజమానిని తీవ్రంగా మందలించడంతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. ఇకపై దుకాణదారులు చెత్తను రోడ్డుపై పారబోస్తే జరిమానా విధిస్తామని, వరుసగా మూడుసార్లు ఇదే తప్పు చేస్తే సదరు దుకాణం లెసైన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. -
జ్యువెలరీ షాపు యజమాని మృతి
హైదరాబాద్: దోపిడీ దొంగల దాడిలో గాయపడిన జ్యువెలరీ షాపు యజమాని మోహన్ ఆదివారం మృతిచెందాడు. ఈ నెల 2న దొంగలు మోహన్ నోట్లో యాసిడ్ పోసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. గాయపడిన మోహన్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలకు తెగించిన కస్టమర్
-
హోలీ మామూలు కోసం హిజ్రాల దౌర్జన్యం
హైదరాబాద్: హోలీ పండుగను పుర స్కరించుకుని అడిగినంత చందా ఇవ్వలేదని ఆగ్రహించిన హిజ్రాలు...ఓ దుకాణాన్ని ధ్వంసం చేయటంతోపాటు యజమానిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. అడ్డగుట్ట డివిజన్‌కు చెందిన శ్రీనివాస్ తుకారాం గేట్ మీనా హాస్పిటల్ ఎదురుగా మొబైల్ దుకాణం నడుపుతున్నారు. కొంత మంది హిజ్రాలు దుకాణం వద్దకు వచ్చి శ్రీనివాస్‌ను... హోలీ పండుగ చందా ఇవ్వాలని అడిగారు. ఆయన రూ.50 ఇవ్వబోగా రూ.500 డిమాండ్ చేశారు. ఇవ్వలేనని అనడంతో ఆయనను కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కున్నారు. దుకాణంలోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన తుకారాంగేట్ పోలీసులు..దౌర్జన్యానికి పాల్పడ్డ నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు.