ఇదేనా ‘చెత్త’శుద్ధి? | district collector fine to shop owner | Sakshi
Sakshi News home page

ఇదేనా ‘చెత్త’శుద్ధి?

Published Tue, Mar 22 2016 4:23 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

district collector fine to shop owner

రోడ్డుపై చెత్త వేసిన వైన్స్ నిర్వాహకులు
మందలించి.. జరిమానా విధించిన కలెక్టర్

సంగారెడ్డి మున్సిపాలిటీ: చెత్తను రోడ్డుపై పారబోసిన షాపు యజమానికి జిల్లా కలెక్టర్ జరిమానా విధించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న కనకదుర్గ వైన్స్ నిర్వాహకులు చెత్తను రోడ్డుపై వేస్తూ తొలగించడం లేదు. సోమవారం రాత్రి కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఇంటికి వెళ్తూ.. వైన్స్ ఎదుట పోగుపడిన చెత్తను గమనించారు. వెంటనే వాహనాన్ని ఆపించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దుకాణం యజమానిని తీవ్రంగా మందలించడంతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. ఇకపై దుకాణదారులు చెత్తను రోడ్డుపై పారబోస్తే జరిమానా విధిస్తామని, వరుసగా మూడుసార్లు ఇదే తప్పు చేస్తే సదరు దుకాణం లెసైన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement