Crap
-
భారీ వర్షాలు: దెబ్బతిన్ని పంటను పరిశీలించిన ఎమ్మెల్యే
సాక్షి, కరీంనగర్: వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. ప్రాధమిక అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంట వేసిన రైతులకు పెట్టుబడి సైతం రాని పరిస్థితి నెలకొంది. వర్షం వరదలతో చేతికందే దశలో ఉన్న వరి పంట నేలవాలి అక్కరకు రాకుండా పోయింది. ఇప్పటికే కోసి కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చొప్పదండి మండలంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు గురువారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన ఆయన రైతులను ఓదార్చారు. ఆరుకాలాల పాటు శ్రమించే అన్నదాతకు అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం మొలకెత్తడం చూసి అమ్ముకోవడానికి సిద్ధం చేయాలని, రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశం మేరకు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రైతులకు ఏమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. -
ఓయోలో రూ.700 కోట్ల గ్రాబ్ పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఆతిధ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓయో సంస్థలో సింగపూర్ దేశానికి చెందిన రవాణా సేవలందించే సంస్థ, గ్రాబ్ రూ.700 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ వారంలోనే ఈ డీల్ కుదరవచ్చని సమాచారం. గ్రాబ్, ఓయో కంపెనీలు తమ కీలక మార్కెట్లుగా ఇండోనేషియాను, ఆగ్నేయాసియాలను గుర్తించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో కార్యకలాపాలు ప్రారంభించిన ఓయో... విస్తరణలో భాగంగా 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని అప్పుడే వెల్లడించింది. ఇండోనేషియాలో 35 నగరాలకు కార్యకలాపాలు విస్తరించనున్నామని ఓయో వ్యవస్థాపకులు, సీఈఓ కూడా అయిన రితేశ్ అగర్వాల్ గతంలో పేర్కొన్నారు. -
చెత్త ఎత్తేస్తారు..ఇళ్లు దోచేస్తారు..
పెందుర్తి: పగటిపూట చెత్త ఏరుకుంటూ మనుషులు లేని ఇళ్లను కనిపెడతారు. రాత్రయ్యే సరికి ఆ ఇళ్లను గుళ్ల చేస్తారు. ఇలా దొంగతనా లకు పాల్పడుతున్న నేరస్తుల ఆటను పెందుర్తి పోలీసులు కట్టించారు. పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ముగ్గుర్ని శనివారం అరెస్టు చేశారు. దొంగసొత్తును కొనుగోలు చేసిన మరో ముగ్గురు కటకటాలపాలయ్యారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ క్రైం బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సూర్యనారాయణ కేసు వివరాలను వెల్లడించారు. గోపాలపట్నం ఇం దిరానగర్కు చెందిన చలపాక రాజేష్(తునీగా),గాజువాక సమతానగర్‌కు చెందిన పెర్రటి ప్రతాప్, మధురవాడ మారికవలస కాలనీకి చెందిన రంగల రంగరావు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో చలపాక రాజేష్ భుజాన గోనె సంచి తగిలించుకుని జనవాసాల్లో చెత్త ఏరుకుంటున్నట్లు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. అనంతరం ప్రతాప్, రంగా రావులతో కలసి ఆయా ఇళ్లతాళాలు బద్దలు కొట్టి దోచేస్తారు. పెందుర్తి, గోపాలపట్నం పోలీస్స్టేషన్ల పరిధిలో వీరిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వీరిని గోపాలపట్నం ప్రాంతంలో పట్టుకున్నారు. వీరంతా నగరంలో కూడా పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. కొనుగోలు చేసిన వారూ అరెస్ట్ దొంగ బంగారాన్ని టౌన్ కొత్తరోడ్ ప్రాంతానికి చెందిన చెట్టి శ్రీనివాసరావు, 104 ఏరియా ప్రాంతానికి చెందిన కలిశెట్టి రాంబాబు, గోపాలపట్నం కొత్తపాలేనికి చెందిన వేగి రాం బాబులు కొనుగోలు చేశారు. వీరు గతంలో కూడా దొంగసొత్తును కొనుగోలు చేసినట్లు సీఐ వివరించారు. ఆరుగురు నిందితుల నుం చి రూ.1,83,000 విలు వైన 61.06గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇంకా 121.8 గ్రాముల బంగారంతో పాటు, 816 గ్రాముల వెండిసామగ్రి స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. -
ఇదేనా ‘చెత్త’శుద్ధి?
రోడ్డుపై చెత్త వేసిన వైన్స్ నిర్వాహకులు మందలించి.. జరిమానా విధించిన కలెక్టర్ సంగారెడ్డి మున్సిపాలిటీ: చెత్తను రోడ్డుపై పారబోసిన షాపు యజమానికి జిల్లా కలెక్టర్ జరిమానా విధించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న కనకదుర్గ వైన్స్ నిర్వాహకులు చెత్తను రోడ్డుపై వేస్తూ తొలగించడం లేదు. సోమవారం రాత్రి కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఇంటికి వెళ్తూ.. వైన్స్ ఎదుట పోగుపడిన చెత్తను గమనించారు. వెంటనే వాహనాన్ని ఆపించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దుకాణం యజమానిని తీవ్రంగా మందలించడంతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. ఇకపై దుకాణదారులు చెత్తను రోడ్డుపై పారబోస్తే జరిమానా విధిస్తామని, వరుసగా మూడుసార్లు ఇదే తప్పు చేస్తే సదరు దుకాణం లెసైన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.