
న్యూఢిల్లీ: ఆతిధ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓయో సంస్థలో సింగపూర్ దేశానికి చెందిన రవాణా సేవలందించే సంస్థ, గ్రాబ్ రూ.700 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ వారంలోనే ఈ డీల్ కుదరవచ్చని సమాచారం. గ్రాబ్, ఓయో కంపెనీలు తమ కీలక మార్కెట్లుగా ఇండోనేషియాను, ఆగ్నేయాసియాలను గుర్తించాయి.
ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో కార్యకలాపాలు ప్రారంభించిన ఓయో... విస్తరణలో భాగంగా 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని అప్పుడే వెల్లడించింది. ఇండోనేషియాలో 35 నగరాలకు కార్యకలాపాలు విస్తరించనున్నామని ఓయో వ్యవస్థాపకులు, సీఈఓ కూడా అయిన రితేశ్ అగర్వాల్ గతంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment