Microsoft To Invest $5 Mn in Oyo | More Details Inside - Sakshi
Sakshi News home page

ఓయోలో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడి

Published Sat, Aug 21 2021 5:24 AM | Last Updated on Sat, Aug 21 2021 11:19 AM

Microsoft to invest in Oyo - Sakshi

న్యూఢిల్లీ: రూములు, హోటళ్ల చైన్‌ నిర్వహించే ఓయోలో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ దాదాపు 5 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 37 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌కింద ఈక్విటీ షేర్లు, తప్పనిసరిగా మార్పిడయ్యే క్యుములేటివ్‌ ప్రిఫరెన్స్‌ షేర్లు రూపంలో పెట్టుబడులు చేపట్టింది. ఇందుకు జూలై 16న జరిగిన అసాధారణ వాటాదారుల సమావేశంలో ఓయో మాతృ సంస్థ ఒరావెల్‌ స్టేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 5 ఈక్విటీ షేర్లను ఓయో తాజాగా జారీ చేసింది. ఇదేవిధంగా రూ. 100 ముఖ విలువగల 80 సీసీసీ ప్రిఫరెన్స్‌ షేర్లను సైతం ఇష్యూ చేసింది. కాగా.. రుణ చెల్లింపులు, ఇతర బిజినెస్‌ పెట్టుబడుల కోసం గ్లోబల్‌ సంస్థల నుంచి 66 కోట్ల డాలర్లను(రూ. 4,920 కోట్లు) సమీకరించనున్నట్లు జూలైలో ఓయో పేర్కొన్న విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement