న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్రావెల్, ఆతిథ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు, టెక్నాలజీలను కలిసి అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడనుంది. హాస్పిటాలిటీ, ట్రావెల్ టెక్నాలజీ పరిశ్రమ కొత్త రూపు సంతరించుకునేలా క్లౌడ్ ఆధారిత ఆవిష్కరణలను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ అజూర్‌ను ఓయో ఉపయోగించనుంది. సెల్ఫ్–చెకిన్, డిజిటల్ రిజిస్టర్, ఐవోటీ ఆధారిత స్మార్ట్ తాళాలు, వర్చువల్ అసిస్టెన్స్ మొదలైన సర్వీసులను గెస్టుల కోసం రూపొందిస్తుంది. చిన్న, మధ్యతరహా హోటళ్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఓయో తెలిపింది. ట్రావెల్, ఆతిథ్య రంగంలో నూతన ఆవిష్కరణలకు ఓయోతో భాగస్వా మ్యం తోడ్పడగలదని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. మైక్రోసాఫ్ట్ సుమారు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 37 కోట్లు) ఓయోలో ఇన్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment