
జెరోధ ఫౌండర్ 'నిఖిల్ కామత్' పాడ్‌కాస్ట్ సిరీస్ 'పీపుల్ బై డబ్ల్యుటీఎఫ్'లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ 'బిల్‌గేట్స్' కనిపించారు. ఈ కార్యక్రమంలో ఏఐ గురించి, భారతదేశంతో ఉన్న సంబంధం గురించి విషయాలను బిల్‌గేట్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ కార్యక్రమంలో నిఖిల్ కామత్.. గేట్స్‌తో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నప్పుడల్లా తొందరపడుతున్నట్లు కనిపిస్తారని, మీపై మీరు కఠినంగా ఉంటారా అని అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. ఆలా ఉండటం నాకు ఇష్టం. తమను తాము మోసం చేసుకోకుండా కష్టపడి పనిచేయాలనుకుంటే.. చాలా కఠినంగా ఉండాలని బిల్‌గేట్స్ వెల్లడించారు.
ఏఐ గురించి మాట్లాడుతూ.. భవిష్యత్ శ్రామిక శక్తిని ఎలా పునర్నిర్మించగలదో కూడా గేట్స్ ప్రస్తావించారు. ఇరవై సంవత్సరాల తరువాత ఏఐ బ్లూ-కాలర్ కార్మికులుగా పనిచేస్తుందని అన్నారు. ఏఐ అనేది మేధో, శారీరక పనులను ఒకే విధంగా నిర్వహిస్తుందని గేట్స్ వివరించారు.
గేట్స్ తన తొలినాటి తెలివితేటల చాలా సరళంగా ఉండేవని అంగీకరించారు. మీరు లెక్కలు (గణితం) బాగా చేయగలిగితే, ఏదైనా చేయగలరు. మీరు గణితం సరిగ్గా చేయలేకపోతే, ఏమీ చేయలేరని తన అనుభవాలను వెల్లడించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో నా అనుభవం, ఆలోచనను మార్చింది. ఫౌండేషన్ పనికి వివిధ విభాగాలు.. సంస్కృతులలో సహకారం అవసరం. ఇది విభిన్న నైపుణ్యాలు, దృక్పథాల విలువను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడిందని అన్నారు.
ఇదీ చదవండి: తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్‌సీటీసీ క్లారిటీ
భారతదేశాన్ని అనేకమార్లు సందర్శించిన బిల్‌గేట్స్.. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పూరి, జితేంద్ర సింగ్ మొదలైనవారిని కలుసుకున్నారు. గత మార్చిలో కూడా గేట్స్ ఇండియాను సందర్శించారు. భారత్ సందర్శనం చాలా అద్భుతంగా ఉంటుందని గేట్స్ అన్నారు. వచ్చే ఏడాది కూడా మరోసారి భారతదేశంలో పర్యటించే అవకాశం ఉందని సమాచారం.
Full Episode 8, @BillGates Part 2
Live now: https://t.co/M4ha3oFWko pic.twitter.com/buX16cgTZa— Nikhil Kamath (@nikhilkamathcio) April 11, 2025