
ప్రతి తల్లీ తన పిల్లల విజయాన్నే కాంక్షిస్తుంది. వారి విజయానికి మించిన గొప్ప బహుమతి మరేది ఉండదామెకు. కానీ రేవతి కామత్‌కు ఆమె కుమారులు జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్, నితిన్ కామత్‌లు అమితమైన ఆనందాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు.
ఖరీదైన సరికొత్త లగ్జరీ మెర్సిడెస్ కారును గిఫ్ట్ ఇచ్చి తల్లికి గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. సంప్రదాయ స్పర్శను జోడించి ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకం చేశారు. గర్వంతో ఉప్పొంగిన తల్లి రేవతి కామత్ తన ఆనందాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. "నా కొడుకులు ఈరోజు నాకు కొత్త కారును బహుమతిగా ఇచ్చారు. తలపాగ, శాలువాతో ఇలా.. కారు తాళాలు అందుకున్నాను" అంటూ ఫొటోలను షేర్ చేశారు.
పేటా (సంప్రదాయ తలపాగా), షాల్ (ఉత్సవ శాలువా)తో సత్కరిస్తుండగా ఆమె కారు తాళాలు అందుకున్న క్షణాలు ఈ ఫొటోల్లో ఉన్నాయి. ఫోటోలలో కన్పిస్తున్న లగ్జరీ వాహనం మెర్సిడెస్ జీఎల్ఎస్. దీని ధర రూ .1.5 కోట్లకు పైగా ఉంటుంది. జీఎల్ఎస్ కారులో విశాలమైన అల్ట్రా-లగ్జరీ క్యాబిన్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్, శక్తివంతమైన ఇంజన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.
వ్యాపార చతురతకు, దాతృత్వానికి పేరుగాంచిన నిఖిల్ కామత్, అలాగే ఆయన సోదరుడు జెరోధా సీఈఓ నితిన్ కామత్‌లు తమకు విలువలు, నైతికతను తీర్చిదిద్దిన ఘనత తమ తల్లిదేనని తరచూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. ఇదిలా ఉండగా నితిన్ కామత్ ఇటీవల ప్రతిష్టాత్మక ఈవై ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (ఈఓవై) 2024 అవార్డును అందుకున్నారు. ఆయన వినూత్న, తక్కువ-మార్జిన్, అధిక-వాల్యూమ్ బ్రోకరేజీ మోడల్ భారతదేశ స్టాక్ ట్రేడింగ్ పరిశ్రమను మార్చివేసింది. స్వయంకృషితో జెరోధాను బాహ్య నిధులు లేకుండానే బిలియన్ డాలర్ల సంస్థగా ఆయన నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment