Nithin Kamath
-
ప్రాపర్టీస్ ధరలు తగ్గుతాయి!.. కారణం ఇదే
భారతదేశాన్ని వాయు కాలుష్యం మహమ్మారిలా పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో జెరోధా కో-ఫౌండర్ 'నితిన్ కామత్' రియల్ ఎస్టేట్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.నితిన్ కామత్ తన ఎక్స్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ.. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము. కింద కనిపిస్తున్నది 2019 వరకు డేటా. అయితే గత ఐదేళ్లలో పరిస్థితులు ఎంత దిగజారాయనిధి స్పష్టంగా కనిపిస్తోంది. వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా లెక్కకు మించిన జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అధికం.భూమిని కొనుగోలు చేసే ఎవరైనా గాలి, నీటి నాణ్యతను ఆస్తిగా భావించరు. కానీ గాలి, నీటి నాణ్యత అనేది ఆస్తి రేటును నిర్ణయిస్తుంది. నేను బెంగళూరులోని జేపీ నగర్లో ఆస్తిని కలిగి ఉన్నాను. ఇది ఇతర లేఅవుట్ల కంటే మంచి వాతావరణంలో ఉందని నితిన్ కామత్ పేర్కొన్నారు.దేశ రాజధాని అందరినీ ఆకర్శిస్తున్నప్పటీ.. అక్కడి వాతావరణం చాలా దుర్భర స్థితిలో ఉంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 412 కంటే ఎక్కువ ఉంది. దీన్ని బట్టి చూస్తే.. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమైపోతోంది. అయితే నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉంది.ఇదీ చదవండి: జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు?.. ఇవి తెలుసుకోండిఢిల్లీ మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో కూడా కాలుష్యం కొంత తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వాయు కాలుష్యం అనేది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కాబట్టి దీనికోసం సమిష్టి పరిష్కారాలు అవసరం. లేకుంటే.. రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన నగరాల్లో కూడా భూములు కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపరు. కాబట్టి రియల్ ఎస్టేట్ ధరలను కాలుష్యం నిర్ణయిస్తుందని నితిన్ కామత్ అన్నారు.You have to wonder what it will take for us to take air pollution more seriously. By the way, this data only covers until 2019, and things have only gotten worse in the last five years. Maybe a property price discount for the quality of air and water is the solution. If… pic.twitter.com/QtyzkqoG43— Nithin Kamath (@Nithin0dha) November 24, 2024 -
‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇటీవల భారీగా పడిపోతున్న నేపథ్యంలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ మదుపర్లకు సలహా ఇచ్చారు. సరైన రిస్క్ మేనేజ్‌మెంట్‌తోనే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్ ట్రెండ్‌కు తగిన వ్యూహం అనుసరించని వారు త్వరగా నష్టపోతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్లో కొన్ని అంశాలను పంచుకున్నారు.‘ఈక్విటీ మార్కెట్లో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేనివారు లాభాలు ఆర్జించడం ఇప్పటివరకు చూడలేదు. మార్కెట్ ట్రేండ్‌కు తగిన ప్రణాళిక లేకుండా ట్రేడింగ్ చేసేవారు త్వరగా నష్టాల్లోకి వెళుతారు. మార్కెట్ రిస్క్‌లకు తగిన విధంగా పోర్ట్‌ఫోలియోను నిర్వహించాలి. లేదంటే డబ్బు సంపాదించడం కష్టం. రిస్క్ తక్కువగా తీసుకుంటే రిటర్న్‌లు కూడా అందుకు అనుగుణంగానే తక్కువ ఉంటాయి. అలాగని ఎక్కువ రిస్క్ తీసుకోవడం ప్రమాదం. కొన్నిసార్లు మొత్తం డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రిస్క్ నిర్వహణ చాలా ముఖ్యం. పోర్ట్‌ఫోలియో ఆధారంగా రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇది ట్రేడర్, ఇన్వెస్టర్ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని కామత్ అన్నారు.In the 20+ years in this business, I haven’t seen anyone who has kept profits from trading without good risk management. I know many who've lost quickly. If you don't have a plan to manage risk and size your bets, it's impossible to keep the money you make.Here are a few…— Nithin Kamath (@Nithin0dha) October 23, 2024ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ఎన్నికలు, పెరుగుతున్న ఎఫ్ఐఐ అమ్మకాలు వెరసి స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. దీర్ఘకాలంలో రాబడులు ఆశించే ఇన్వెస్టర్లకు ఇలా మార్కెట్లు నష్టపోతుండడం మంచి అవకాశంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మరిన్ని ఎక్కువ స్టాక్‌లు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. -
భారతీయుల తీరుపై నితిన్ కామత్...
భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరైన జరోధా సీఈఓ 'నితిన్ కామత్' ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లిష్టమైన ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పారు. బెంగళూరు జరిగిన టెక్‌స్పార్క్స్ 2024 ఈవెంట్లో యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ.. భారతీయులు ధనవంతులను ఎందుకు ద్వేషిస్తారు? అని ప్రశ్నించారు.ధనవంతుల విషయంలో భారతీయులకు, అమెరికన్లకు మధ్య వ్యత్యసాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. యుఎస్‌లో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదించి.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తే, అలాంటి విషయాలను న్యూస్ పేపర్ కవర్ పేజీ మీద ముద్రిస్తారు. అక్కడ ఇదంతా సర్వ సాధారణం.కానీ.. భారతదేశంలో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అంటే.. ఏదో తప్పుడు దారిలో డబ్బు సంపాదిస్తున్నారని చాలామంది భావిస్తారు. ఆ తరువాత వాళ్ళను ద్వేషించడం మొదలుపెడతారు. అమెరికా పూర్తిగా పెట్టుబడిదారీ సమాజం, భారత్ మాత్రం పెట్టుబడిదారీ సమాజంగా నటిస్తున్న సోషలిస్టు సమాజం అని అన్నారు. ఇప్పటికీ చాలామంది ప్రజల గుండెల్లో సోషలిస్టు భావాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు పేదరికాన్ని గౌరవ చిహ్నంగా ధరిస్తారని ఒకరు అన్నారు. భారతదేశంలో, ధనికులు తగిన పన్నులు చెల్లించకుండా, మోసాలకు పాల్పడుతున్నారని, పేద.. మధ్యతరగతి వర్గాలను దోపిడీ చేయడం ద్వారా ధనవంతులు అవుతున్నారని మరొకరు అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Shradha Sharma (@shradhasharmayss) -
బడ్జెట్ బూస్ట్, మా ఆదాయం రూ. 2500 కోట్లకు పెరగొచ్చు- నితిన్ కామత్
2024 బడ్జెట్లో సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టిటి) రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో ఎక్స్‌లో స్పందించారు. తాజా కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనతో తమకు రెట్టింపు లాభాలొస్తాయంటూ ట్వీట్ చేశారు.Budget summary for usSTT on options goes up from 0.062% to 0.1%. STT on futures goes up from 0.0125% to 0.02% from October 1st. We collected about Rs 1500 crores of STT last year, @zerodhaonline. If the volumes don't drop, this will increase to about Rs 2500 crores at the new…— Nithin Kamath (@Nithin0dha) July 23, 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కొలువు దీరిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో స్టాక్ మార్కెట్లకు సంబంధించి అనేక మార్పులను ప్రకటించారు. ముఖ్యంగా సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టిటి)ను ప్రస్తుత 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుండి ఇది అమల్లోకి రానుంది. ఈ పెంపు ద్వారా తాము రూ. 2,500 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తెలిపారు. గత ఏడాది ఈ పన్ను ద్వారా 1500కోట్లు వసూలు అయ్యాయి. ఇపుడిక ట్రేడింగ్ వాల్యూమ్‌లు తగ్గకపోతే కొత్త ధరల ప్రకారం రూ. 2,500 కోట్ల వరకు పెరగొచ్చని లెక్కలు చెప్పారు.బడ్జెట్ 2024-మార్కెట్-ప్రతిపాదనలుస్థిరాస్తి విక్రయానికి సంబంధించిన పన్నుల కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని కూడా తొలగించింది. అలాగే ఆస్తి విక్రయంపై మూలధన లాభాల పన్నును ప్రస్తుత 20 శాతం నుండి 12.5 శాతానికి తగ్గించింది.దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10శాతం నుంచి 12.5శాతానికి పెంచారు.స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును 15శాతం నుంచి 20శాతానికి పెంచారు. ఈ రెండూ నేటి నుంచి అమలులోకి రానున్నాయి. -
నాలుగేళ్లలో 50వేల కోట్ల లాభాలు: నితిన్ కామత్ ట్వీట్ వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరువాత మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించిన తరువాత చాలామంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ తరువాత అనుకున్నంత లాభాలు లాలేదు, కానీ ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి. ఇందులో ఒకటి జెరోధా కంపెనీ.జెరోధా కంపెనీ కో ఫౌండర్ నితిన్ కామత్ ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఈక్విటీ పెట్టుబడిదారులు గత నాలు సంవత్సరాల్లో రూ. 50,000 కోట్ల లాభాలను సాధించారు. రూ. 4,50,000 కోట్ల ఏయూఎంలో రూ. 1,00,000 కోట్ల లాభాలను పొందినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నితిన్ కామత్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇక మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 23,264 వద్దకు చేరింది. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 76,456 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.Equity investors @zerodhaonline have realized a profit of Rs 50,000 crores over the last 4+ years and are sitting on unrealized profits of Rs 1,00,000 crores on an AUM of Rs 4,50,000 crores. By the way, most of the AUM was added in the last four years. pic.twitter.com/4X981aY2jH— Nithin Kamath (@Nithin0dha) June 11, 2024 -
‘నన్ను నమ్మండి బ్రో’ ..జెరోదా సీఈఓకి మైల్డ్ స్ట్రోక్‌పై టాటా హాస్పిటల్!
ఆరువారాల క్రితం ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ సంస్థ జెరోదా సీఈఓ నితిన్ కామత్ మైల్డ్ స్ట్రోక్‌కి గురయ్యారు. తన తండ్రి మరణం, తగినంత నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్, ఎక్కువగా పనిచేయడం వంటి కారణాల వల్ల మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. 3 నుంచి 6 నెలల్లో పూర్తిగా కోలుకుంటానంటూ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఈ తరుణంలో మైల్ట్ స్ట్రోక్ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు నితిన్ కామత్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నారు. తాము ఇస్తున్న కొన్ని రకాల వైద్య సంబంధిత సలహాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ సలహాలపై వైద్యులు ఖండిస్తున్నారు. టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ స్పందించారు. ‘‘సోషల్ మీడియా ఎంత ప్రాణహాని కలిగిస్తుందో తెలిపే ఉదంతం ఇంది. దయచేసి 'నన్ను నమ్మండి బ్రో' సైన్స్ సంబంధిత అంశాలపట్ల ఏమాత్రం సంబంధం లేని, అవగాహనలేని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోవద్దని కోరారు. ఆపత్కాలాంలో మన మంచి కోరుతూ అనేక మంది సలహాలు ఇస్తుంటారు. వాళ్లు చెప్పేది మన మంచి కోసమే. కానీ ఏమాత్రం అనుభవం లేకుండా ఇచ్చే కొన్ని సలహాలు మేలు కంటే హానిని కలిగిస్తాయి. జాగ్రత్త!!’ అని డాక్టర్ ప్రమేష్ ట్వీట్ చేశారు. పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇచ్చిన సలహాలపై బెంగళూరులోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి సైతం వ్యతిరేకించారు.ఇన్ఫ్లూయెన్సర్ల ట్వీట్లకు వరుస సమాధానాలిచ్చారు. ఇన్ఫ్లూయెన్సర్లు ఇచ్చే సలహాలకు, వైద్య విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ బదులిచ్చారు. A thread that demonstrates how life threatening social media can be... Please don't follow random "influencers" who don't have true science to back them beyond "Trust me, bro" https://t.co/50OBrlNNjS — Pramesh CS (@cspramesh) February 26, 2024 When I spoke against 72 hour work week sometime ago, there were many people up in arms and called me what all names. But the fact remains that there needs to be work life balance. There needs to be time to relax, unwind and sleep. For all that you need spare time. #MedTwitter… https://t.co/zdMwWu1rgc — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) February 27, 2024 -
‘డ్యూడ్.. కాస్త రెస్ట్ తీసుకోండి’ నితిన్ కామత్‌ను కోరిన వ్యాపారవేత్త
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ ఆస్పత్రి బెడ్‌పై కనిపించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఆరు వారాల కిందటి ఫొటోలని నిర్థారించారు. ఆ ఫొటోలు చూసిన సహచరులు, ఇతర వ్యాపార వేత్తలు సామాజిక మాధ్యమాల్లో తను విరామం తీసుకోవాలని నితిన్‌ను కోరుతూ పలువురు పోస్ట్ చేశారు. సుమారు 6 వారాల క్రితం, నాకు ఉన్నంటుండి తేలికపాటి స్ట్రోక్ వచ్చింది. నాన్న చనిపోవడం, సరిగా నిద్ర లేకపోవడం, అలసట, డీహైడ్రేషన్, హెవీ వర్కవుట్.. వీటిలో ఏవైనా కారణాలు కావచ్చు" అని కామత్ తన ‘ఎక్స్’ (ట్విటర్) పోస్ట్‌లో తెలియజేశారు. విషయం తెలియగానే ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ స్పందించారు. ‘డ్యూడ్.. జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి మీ నాన్న మరణమే మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపినట్లుంది. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాస్త రెస్ట్ తీసుకోండి’ అని సూచించారు. Around 6 weeks ago, I had a mild stroke out of the blue. Dad passing away, poor sleep, exhaustion, dehydration, and overworking out —any of these could be possible reasons. I've gone from having a big droop in the face and not being able to read or write to having a slight droop… pic.twitter.com/aQG4lHmFER — Nithin Kamath (@Nithin0dha) February 26, 2024 -
ఆస్పత్రి బెడ్‌పై జెరోధా సీఈవో.. ఏం జరిగింది?
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ (Nithin Kamath) ఆస్పత్రి బెడ్‌పై కనిపించాడు. ఖంగారు పడకండి. ఇది ఆరు వారాల కిందటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోను నితిన్ కామత్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను సుమారు ఆరు వారాల క్రితం "మైల్డ్ స్ట్రోక్" తో బాధపడ్డాడనని, కారణం స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ, రకరకాల కారకాల కలయిక దీనికి దోహదపడి ఉండవచ్చని పేర్కొన్నారు. "సుమారు 6 వారాల క్రితం, నాకు ఉన్నంటుండి తేలికపాటి స్ట్రోక్ వచ్చింది. నాన్న చనిపోవడం, సరిగా నిద్ర లేకపోవడం, అలసట, డీహైడ్రేషన్, హెవీ వర్కవుట్.. వీటిలో ఏవైనా కారణాలు కావచ్చు" అని కామత్ తన ‘ఎక్స్’ (ట్విటర్) పోస్ట్‌లో తెలియజేశారు. అప్పటి నుంచి చదవడానికి, రాయడానికి కూడా చాలా కష్టపడ్డానని, 3-6 నెలల్లో పూర్తి రికవరీని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఫిట్‌గా ఉండటమే కాకుండా ఫిట్నెస్ ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేసే నితిన్ కామత్‌కు కూడా స్ట్రోక్ రావడంతో తన అలవాట్లు, అభ్యాసాలను మరోసారి సమీక్షించుకోవాల్సిన ఆవశ్యతను ఆయన గుర్తించారు. Around 6 weeks ago, I had a mild stroke out of the blue. Dad passing away, poor sleep, exhaustion, dehydration, and overworking out —any of these could be possible reasons. I've gone from having a big droop in the face and not being able to read or write to having a slight droop… pic.twitter.com/aQG4lHmFER — Nithin Kamath (@Nithin0dha) February 26, 2024 -
జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే..
ఇప్పటికి కూడా చాలా మందికి సొంత ఇంట్లో ఉండాలా? లేక అద్దె ఇంట్లో ఉండాలా? అనే ప్రశ్న, ప్రశ్నగానే ఉంది. కొందరు సొంత ఇల్లు బెస్ట్ అంటే.. మరి కొందరు అద్దె ఇల్లు బెటర్ అని చెబుతున్నారు. అయితే ఈ ప్రశ్నకు జెరోధా సీఈఓ నితిన్ కామత్ తనదైన రీతిలో సమాధానం వెల్లడించారు. జర్నలిస్ట్ సోనియా షెనాయ్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జెరోధా సీఈఓ నితిన్ కామత్ 'రెంట్ vs బై' ప్రశ్నకు సమాధానంగా.. సొంత ఇల్లు కంటే అద్దె ఇంట్లో ఉండటానికే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తన అభిప్రాయం వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నితిన్ కామత్ జవాబుతో కొందరు ఏకీభవిస్తే.. మరికొందరు సొంతంగా ఇల్లు ఉంటేనే బాగుంటుందని వాదిస్తున్నారు. నితిన్ కామత్ మాట్లాడుతూ.. తనకు ఉన్న ఇల్లు తన తల్లిదండ్రులదని, భావోద్వేగాల కారణంగా ఎప్పుడూ ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉండాలని, కాబట్టే కొత్త ఇల్లు కొనేది లేదని వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో లక్షల వ్యూవ్స్ పొందింది. దీనిపైనా నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అతని మాటలు ఎవరూ నమ్మొద్దని, అవన్నీ మూర్ఖపు మాటలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆగస్టు నుంచి 'జీమెయిల్' షట్‌డౌన్! ఇందులో నిజమెంత? View this post on Instagram A post shared by Sonia Shenoy (@_soniashenoy) -
దేశీయ స్టార్టప్‌లపై జెరోధా బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశీయ స్టార్టప్‌ల విజయం విదేశీ పెట్టుబడి దారులకు సొంతం అవుతుందని అన్నారు. కాబట్టే భారత్ సమిష్టి కృషితో అభివృద్ధి చెందుతూ దేశీయంగా సంపదను సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘నేను ఇంతకు ముందే చెప్పాను. భారత్ అభివృద్ధి చెందాలంటే అందరినీ కలుపుకోవాలి. స్థానికంగా సంపదను సృష్టించబడాలి. నేడు, స్వదేశీ స్టార్టప్‌ల విజయంలో ఎక్కువ భాగం భారతదేశం వెలుపల ఉన్న పెట్టుబడిదారులకు వెళుతుంది. తగినంత నిధులు ఉండడం వల్ల విదేశీ పెట్టుబడి దారులపై ఆధారపడడం తగ్గుతుంది. ట్యాక్స్ కూడా అదా చేసుకోవచ్చు అని నితిన్ కామ్ తెలిపారు. I've said this earlier: for India to grow inclusively, wealth has to be created locally. Today, much of the success of homegrown startups goes to investors outside India. Staying in India and incorporating at home also saves the future hassle of paying huge taxes to flip back.… https://t.co/vSFmlKL2zj pic.twitter.com/ErVzldeymH — Nithin Kamath (@Nithin0dha) February 20, 2024 దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌ల కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు నితిన్ కామత్ గత సంవత్సరం నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్లో చేరారు. స్టార్టప్‌ల కోసం భారత్ తన దేశీయ మూలధనాన్ని అన్‌లాక్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తాను కృషి చేస్తానని, స్వదేశంలో స్టార్టప్‌లకు మద్దతుగా భారతీయులను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. ఒక దేశంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే స్టార్టప్‌లు/ఎంఎస్ఎఈల కోసం దేశీయ మూలధనాన్ని అన్‌లాక్ చేయడం, విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, భారతీయ స్టార్టప్‌లకు భారతీయులు మద్దతునివ్వడమేనని అన్నారు. -
ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్స్‌కు ఉద్యోగాలివ్వని జెరోధా.. కారణం చెప్పిన కామత్
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధాలో ఉద్యోగాలపై సంస్థ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థలో ఐఐటీ, ఐఐఎంలో చదివినవారిని ఎందుకు నియమించుకోలేదని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ తోమర్‌తో జరిపిన సంభాషణలో కామత్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. జెరోధా కంపెనీలో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు ఎందుకు లేరనే ప్రశ్నకు స్పందిస్తూ ఐఐటీ, ఐఐఎం విద్యార్థులను నియమించుకోకూడదనే నిబంధనేమీ సంస్థలో లేదని కామత్ స్పష్టం చేశారు. అయితే కంపెనీలో వారిని నియమించుకుని జీతభత్యాలు చెల్లించేంత డబ్బు లేదని తెలిపారు. చదువు అయిపోయాక వారు భారీ జీతాలు ఆశిస్తారని పేర్కొన్నారు. చాలామంది విద్యార్థులు భవిష్యత్తులో ఆర్థికంగా తమ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నట్లు కామత్ చెప్పారు. అయితే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకుని రానున్న రెండేళ్లు, ఐదేళ్లు.. అలా ప్రణాళిక ప్రకారం కష్టపడుతూ వెళ్తే విజయం దానంతటదే వస్తుందని చెప్పారు. ఇదీ చదవండి: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..! డేట్రేడింగ్ చాలా ప్రమాదకరమని కామత్ అన్నారు. దీర్ఘకాల పెట్టుబడితో మంచి రాబడులు పొందవచ్చని చెప్పారు. కంపెనీలు, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్..వంటి మంచి లాభాలు తీసుకొచ్చే ఎన్నోమార్గాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్ కామత్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ముప్పు పొంచి ఉందా.. విస్తృతమవుతున్న డీప్ ఫేక్‌లు బ్యాంకులనూ బురిడీ కొట్టిస్తాయా? అవుననే హెచ్చరిస్తున్నారు ప్రముఖ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బ్యాంకులకు ఎదురుకానున్న సమస్యలను తెలియజేస్తూ ఆయనో వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విస్తృతమైంది. ఈ క్రమంలోనే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఈ టెక్నాలజీని తమ కార్యకలాపాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. అయితే ఏఐ టెక్నాలజీని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. సెలబ్రిటీల డీప్ ఫేక్‌లు సృష్టిస్తున్నారు. ఇది ఇక్కడికే పరిమితం కాదని, పెరుగుతున్న ముప్పును హైలైట్ చేస్తూ నితిన్ కామత్ ‘ఎక్స్’లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. డీప్‌ఫేక్ కస్టమర్ గుర్తింపులను ధ్రువీకరించడంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలియజేశారు. నిజమా.. ఏఐ కల్పితమా? ప్రస్తుతం కస్టమర్లు నేరుగా బ్యాంకులకు, కార్యాలయాలకు వెళ్లడం తగ్గిపోయింది. అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు డిజిలాకర్ లేదా ఆధార్‌ని ఉపయోగించి కస్టమర్ల ఐడీ, అడ్రస్ ప్రూఫ్ డేటాను బ్యాంకులు పొందుతున్నాయి. ఇక ఖాతాను తెరిచే వ్యక్తితో ఈ ఐడీని వెబ్‌క్యామ్ ద్వారా నిర్ధారించుకుంటున్నాయి. అయితే డీప్‌ఫేక్‌లు పెరుగుతున్న కొద్దీ అవతలి వైపు ఉన్న వ్యక్తి నిజమా లేదా ఏఐ కల్పితమా అన్నది ధ్రువీకరించడం కష్టమవుతుందని తాను భావిస్తున్నట్లు నితిన్ కామత్ పేర్కొన్నారు. ఆన్‌బోర్డింగ్ సమయంలో మరింత కఠినమైన నియంత్రణ అవసరాలు ఉన్న బ్యాంకులకు ఈ సమస్య మరింత పెద్దదిగా మారుతుందన్నారు. ఇది కూడా చదవండి: మస్క్ వారి మరమనిషి మరింత కొత్తగా.. టెస్లా రోబో 2.0! ఈ ముప్పును అధిగమించడానికి రానున్న రోజుల్లో ఎలాంటి నిబంధనలు రూపొందిస్తారు.. ఖాతాలు తెరవాలంటే నేరుగా బ్యాంకులకే వెళ్లాల్సిన రోజులు మళ్లీ వస్తాయా అన్నది చూడాలి. వీడియో చివరిలో నితిన్ కామత్ ‘ఇక్కడ ఉన్నది నేను కాదు.. ఇది డీప్ ఫేక్’ అంటూ చమత్కరించారు. The rise of AI technology and deepfakes pose a large risk to the financial services industry. The tipping point for Indian financial services businesses was when onboarding became completely digital, thanks to Aadhaar, etc. For businesses onboarding a new customer, an important… pic.twitter.com/DI9Z1Q3jxY — Nithin Kamath (@Nithin0dha) December 13, 2023 -
జెరోధా : కామత్ సోదరులు తీసుకునే జీతాలెంతో తెలుసా?
భారత్‌లో అతిపెద్ద బ్రోకరేజీ సంస్థ జెరోధా వ్యవస్థాపకులు నితిన్, నిఖిల్ కామత్ సోదరులు ఒక్కొక్కరు దాదాపు రూ.72 కోట్ల వార్షిక వేతనాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం 2022-2023 కాలానికి ఇద్దరూ కలిపి రూ.195.4 కోట్లు తీసుకున్నారని ఎన్‌ట్రాకర్ నివేదిక తెలిపింది. జెరోధా సీఈఓ నితిన్ కామత్ భార్య సీమా పాటిల్ రూ.36 కోట్లు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేణుమాధవ్ రూ.15.4 కోట్లు తీసుకుంటున్నారు. ఇక జెరోధాకు మొత్తం ముగ్గురు డైరక్టర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు కామత్ బ్రదర్స్. కాగా.. డైరక్టర్లు రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవచ్చని 2021లో బోర్డ్ ఆమోదం తెలిపింది. ఇక ఆర్ధిక సంవత్సరం 2023లో జీరోదా ఎంప్లాయీ బెనిఫిట్ 35.7శాతం పెరిగి రూ. 623 కోట్లకు చేరింది. గత ఆర్ధిక సంవత్సరంలో అది రూ. 459 కోట్లుగా ఉండేది. వందల కోట్లలో జీతాలు డైరక్టర్లతో సహా.. ఉద్యోగులకు రూ. 380 కోట్లను జీతాలుగా ఇచ్చింది జీరోదా. ముఖ్యంగా రూ. 623 కోట్లల్లో రూ. 236 కోట్లను ఈఎస్ఓపీ (ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప2 ప్లాన్) కోసం కేటాయించింది. బ్రోకరేజ్ సంస్థగా జెరోధా వాల్యూ 3.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో రూ. 30వేల కోట్లు. 2021లో ఇది 2 బిలియన్ డాలర్లుగా ఉండేది. సంస్థ వాల్యూ అనతికాలంలో ఏకంగా 80శాతం వృద్ది చెందింది. 'గ్రో'తో పోటీ..! ఇటీవలి కాలంలో భారతీయుల్లో ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్‌పై ఆసక్తి, అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తూ, యాక్టివ్‌గా ఉంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. జీరోదా ఆదాయానికి ఇది ఒక కారణమని తెలుస్తోంది. అయితే.. ఈ బ్రోకరేజ్ ఇండస్ట్రీలో పోటీకూడా అదే విధంగా పెరుగుతోంది. జెరోధాకు ‘గ్రో’ అనే మరో స్టాక్‌బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. 2023 సెప్టెంబర్ నెల చివరికి.. జెరోధాలో 6.48 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉండగా.. గ్రో లో 6.63 మిలియన్ మంది యాక్టివ్‌గా ఉన్నారని డేటా చెబుతోంది. -
‘రూ.1.8 లక్షలు చెల్లిస్తే రూ.5 కోట్లు’.. సీఈఓ ఏమన్నారంటే..
డీప్‌ఫేక్ టెక్నాలజీ పుణ్యమా అని మెసేజ్, ఇమేజ్, వీడియో చూసినా అది నమ్మాలో.. వద్దో తెలియని పరిస్థితి దాపరించింది. ఇటీవల సెలబ్రిటీల ఫొటోలను డీప్‌ఫేక్ ద్వారా అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసిన సైబర్ అటాకర్లు.. తాజాగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లపై విజృంభిస్తున్నారు. అనేక మంది ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇన్వెస్టర్లను బురిడీ కొట్టించే పనిలో పడ్డారు. డీప్‌ఫేక్‌లను సాంకేతికత పెద్ద సమస్యగా మారింది. సైబర్ మోసగాళ్లు వీటిని వినియోగించి ఫేక్ ఇమేజెస్, వాయిస్, వీడియోలను తయారు చేస్తున్నారు. ఇవి కొందరికి ఆర్థిక పరమైన, వ్యక్తిగత, వృత్తిపరమైన నష్టాలను కలిగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. వీటిని కేంద్రం సైతం చాలా సీరియస్‌గా తీసుకుంది. మంత్రులు సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ఈ అంశాలపై అవగాహన లేనివారు సైబర్ మోసగాళ్ల చర్యలకు బలైపోతున్నారు. డీప్‌ఫేక్ అంశంపై తాజాగా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈఓ నితిన్‌కామత్ స్పందించారు. ఒక కస్టమర్ రూ.1.80 లక్షల స్కామ్‌ను తృటిలో తప్పించుకున్న సంఘటనను కామత్ తన ఎక్స్ ఖాతాలో వివరించారు. డీప్‌ఫేక్‌లను సృష్టించే యాప్స్ అందుబాటులోకి రావటంతో ఇలాంటి మోసపూరిత దాడులు పెరుగుతున్నాయని కంపెనీ హెచ్చరించారు. జెరోధా కస్టమర్‌కు రూ.1.8లక్షలు చెల్లిస్తే అతడి ఖాతాలో రూ.5 కోట్లు జమ చేస్తామని జెరోధా నుంచి ఒక మెసేజ్ వచ్చినట్లు కామత్ చెప్పారు. పైగా మెసేజ్ పంపించిన వారు తమ అకౌంట్లో రూ.10 కోట్లు ఉన్నట్లు కూడా ఫేక్ ఇమేజ్‌లు చూపించినట్లు తెలిపారు. ఈ తతంగాన్ని వెంటనే సదరు కస్టమర్ జెరోధా కస్టమర్ కేర్ విభాగంతో ధ్రువీకరించుకున్నారు. దాంతో తాను మోసపోకుండా ఉన్నాడని చెప్పారు. జెరోధా ఎవరికి ఇలాంటి మెసేజ్‌లు పంపలేదని, భవిష్యత్తులోనూ పంపదని కామత్ స్పష్టం చేశారు. డీప్‌ఫేక్ ఇమేజ్‌లు, వాయిస్‌లు, ఫొటోలతో స్కామర్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. అలాంటి మెసేజ్‌లు నమ్మకూడదన్నారు. అందుకు సంబంధించి కామత్ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఇదీ చదవండి: సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్! స్కామర్లు స్టాక్ ట్రేడింగ్‌కు సంబంధించిన లాభనష్టాలు, లెడ్జర్లు, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రిపోర్టులను క్లోన్ యాప్స్ ద్వారా నకిలీ తయారు చేస్తున్నారు. వీటిని వినియోగించి వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్ముతున్న కొందరు నష్టాల పాలవుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. Scams involving fake screenshots, P&L reports, ID cards, bank statements, etc., have become a mega nuisance. We just spotted a new one. A scammer created a fake Zerodha employee ID card and met our customer whom he had spotted online and said he had won an award from Zerodha. He… pic.twitter.com/RA3DQoPuhp — Nithin Kamath (@Nithin0dha) November 22, 2023 -
స్మాల్‌కేస్‌తో జిరోధా జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: కొత్తగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)ని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్న బ్రోకరేజీ సంస్థ జిరోధా తాజాగా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ స్మాల్‌కేస్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. దీనికోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ సాధనాలను రూపొందించడంలో స్మాల్కేస్కు 6 ఏళ్ల పైగా అనుభవం ఉందని, ఈ నేపథ్యంలోనే దానితో చేతులు కలిపామని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్లపై భారీ వ్యయాలు భారం లేకుండా మెరుగైన మ్యూచువల్ ఫండ్ పథకాలను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆశిస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఇన్వెస్టర్లకు ఫండ్స్‌ను పరిచయం చేయడానికి ఈ భాగస్వా మ్యం తోడ్పడగలదని స్మాల్‌కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. మ్యుచువల్ ఫండ్ కంపెనీని ప్రారంభించేందుకు జిరోధా 2020 ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకుంది. 2021 సెప్టెంబర్‌లో సెబీ సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తుది అనుమతుల కోసం జిరోధా ఎదురుచూస్తోంది. ప్రస్తు తం 42 మ్యుచువల్ ఫండ్ కంపెనీలు రూ. 40.5 లక్షల కోట్ల పైగా ఆస్తులను నిర్వహిస్తున్నాయి. -
జెరోధా నితిన్ నెల జీతం ఎంతో తెలుసా? ఈ తప్పులు చేయొద్దన్న బిలియనీర్
దేశీయ అతిపెద్ద స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ స్వయం కృషితో ఎదిగిన సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అత్యంత పిన్న వయస్సులోనే సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ బిలియనీర్‌గా నిలిచిన ఘనతను దక్కించుకున్న నితిన్ నెల జీతం, నెట్వర్త్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, పారిశ్రామికవేత్తల ఆదాయం భారీగా ఎగిసింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే జెరోధా సీఈవో నితిన్ కామత్ నికర విలువ బాగా పెరిగింది. 2022లో నితిన్ నికర విలువ 2 బిలియన్ డాలర్లు (అప్పటికి రూ. 15,612 కోట్లు)గా అంచనా వేశారు. 2021లో భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అత్యధిక వేతనం పొందుతున్న సహ వ్యవస్థాపకులుగా నిలిచారు. ఎవరీ నితిన్ కామత్ నితిన్ కామత్ భారతదేశంలోని కర్ణాటకలోని శివమొగ్గలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి బ్యాంకు ఉద్యోగి, అతని తల్లి గృహిణి. బెంగళూరులో ప్రాథమిక, కాలేజీ విద్యను పూర్తి చేసిన నితిన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పట్టభద్రుడయ్యాడు. ఈక్రమంలో 17 సంవత్సరాల వయస్సులో, తండ్రి వ్యాపారాన్ని నిర్వహించడం ప్రారంభించాడు. అలాగే జనవరి 1997 నుండి జనవరి 2004 వరకు ప్రొప్రైటీ ట్రేడర్‌గా పనిచేశారు. 2010లో సోదరుడు నిఖిల్ కామత్ సహ వ్యవస్థాపకుడిగా, భార్య సీమా పాటిల్‌తో కలిసి స్టాక్ బ్రోకరేజ్ సంస్థ 'జెరోధా'ను స్థాపించారు. కేవలం ఐదుగురు టీమ్‌తో మొదలై 1300 మందికి పైగా ఉద్యోగులతో మల్టీ బిలియన్ల కంపెనీగా, కస్టమర్లకు సరికొత్త ఫీచర్లు,అప్డేట్స్తో జెరోధాను సంస్థను పరుగులు పెట్టించి వేల కోట్ల సంస్థగా అభివృద్ధి చేశారు. నితిన్,సీమా దంపతులకు 'కియాన్' అనే కుమారుడు ఉన్నాడు. 2021లోనే 100 కోట్ల వార్షిక వేతనం 2021లోనే నితిన్, నిఖిల్ ఒక్కొక్కరూ 100 కోట్ల వార్షిక జీతం అందుకున్నారట. అప్పటి బోర్డు ఆమోదం ప్రకారం సీమ, నితిన్ ఇద్దరికీ నెలకు రూ. 4.7 కోట్ల బేస్ సాలరీ, బోనస్ , వేరియబుల్ పే ప్రయోజనాలతో ఏడాదికి రూ. 300 కోట్లు చెల్లించే ప్రత్యేక తీర్మానాన్ని జెరోధా బోర్డు ఆమోదించిందట. దీనిపై విమర్శలు రావడంతో నితిన్ కామత్ ట్విటర్లో ఒక వివరణను పోస్ట్ చేశారు. వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది ట్రేడింగ్‌తో సమానమని, ఏ క్షణంలోనైనా నష్టాలు రావచ్చు, లాభాలు రావచ్చు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ లాభాల్లో స్టార్టప్‌లు, ధార్మిక సంస్థలలో తమ వ్యక్తిగత పెట్టుబడులను కొనసాగించడానికి తమ పెట్టుబడుల ప్లానింగ్ బాగా తోడ్పడిందని చెప్పారు. అలాగే తమ టీం ఉద్యోగులకు ఈఎస్ఏపీ (ఉద్యోగి స్టాక్ యాజమాన్య ప్రణాళిక) బైబ్యాక్ ద్వారా డి-రిస్కింగ్ను సులభతరం చేస్తున్నామని, ఈ బైబ్యాక్ కోసం ఏడాదికి దాదాపు రూ.200 కోట్లు (2021లో) కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు కీలక సలహాలు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో పెట్టుబడి విషయానికి వస్తే, జెరోధా ట్రూ బెకన్ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులకంటే ఇతర పెట్టుబడులు ఇంకా మేలని చెప్పారు. మార్కెట్ టాప్‌లో ఉన్నందున, ఈక్విటీతో పోలిస్తే బంగారంపై పెట్టుబడి మేలని భావించారు. అలాగే ఈక్విటీ, స్థిర-ఆదాయం, రుణం, బంగారం, రియల్ ఎస్టేట్ కలయికతో కూడిన తన పోర్ట్‌ఫోలియో వైవిధ్యతను కూడా వివరించడం విశేషం. ఈక్విటీలో దాదాపు 40 శాతం, అప్పులు 45 శాతం, బంగారంలో 10 శాతం, రియల్ ఎస్టేట్, ఇతరాలు 5 శాతంగా ఉన్నాయన్నారు. అయితే పన్ను ప్రయోజనాలున్న ఈక్విటీ ఎక్స్పోజర్ మంచిదని కూడా సలహా ఇచ్చారు. తప్పక నివారించాల్సిన తప్పులనుకూడా కామత్ ప్రస్తావించారు. చిన్న చిన్న కుదుపులకు ఆందోళన చెందకుండా ప్రణాళికా బద్ధంగా పెట్టుబడులు పెట్టడంతెపాటు, పోర్ట్‌ఫోలియోను నిశితంగా పరిశీలించుకోవాలన్నారు. అంతేకానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరు సంపాదించిన దానిలో 99 శాతం తిరిగి పెట్టుబడిగా పెడతారు. అంటే కేవలం 1 శాతం లేదా అంతకంటే తక్కువ మాత్రమే ఖర్చు చేస్తారు. బహుశా ఇదే జెరోధా సక్సెస్ మంత్రా కావచ్చు.