దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరువాత మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించిన తరువాత చాలామంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ తరువాత అనుకున్నంత లాభాలు లాలేదు, కానీ ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి. ఇందులో ఒకటి జెరోధా కంపెనీ.
జెరోధా కంపెనీ కో ఫౌండర్ నితిన్ కామత్ ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఈక్విటీ పెట్టుబడిదారులు గత నాలు సంవత్సరాల్లో రూ. 50,000 కోట్ల లాభాలను సాధించారు. రూ. 4,50,000 కోట్ల ఏయూఎంలో రూ. 1,00,000 కోట్ల లాభాలను పొందినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నితిన్ కామత్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 23,264 వద్దకు చేరింది. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 76,456 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.
Equity investors @zerodhaonline have realized a profit of Rs 50,000 crores over the last 4+ years and are sitting on unrealized profits of Rs 1,00,000 crores on an AUM of Rs 4,50,000 crores.
By the way, most of the AUM was added in the last four years. pic.twitter.com/4X981aY2jH— Nithin Kamath (@Nithin0dha) June 11, 2024
Comments
Please login to add a commentAdd a comment