
ముంబై: దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ప్రయివేట్ పెట్టుబడులు 33 శాతం క్షీణించినట్లు రేటింగ్ ఎజెన్సీ ఇక్రా తాజాగా వెల్లడించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే కనిష్టంకాగా.. లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే అన్‌లిస్టెడ్ సంస్థలు పెట్టుబడుల్లో వెనకడుగు వేసినట్లు నివేదికలో పేర్కొంది.
గత కొన్నేళ్లుగా ప్రభుత్వమే పెట్టుబడులకు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేసింది. ప్రయివేట్ పెట్టుబడులు లేకపోవడం ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు కొన్ని త్రైమాసికాలలో తలెత్తినట్లు వివరించింది. నివేదిక ప్రకారం..
కొత్త సౌకర్యాలపై ఇన్వెస్ట్ చేయడానికి బదులుగా ప్రయివేట్ రంగం రుణ చెల్లింపులకే మిగులు నిధులను వెచి్చంచడంపై దృష్టి పెట్టింది. తద్వారా అధిక సామర్థ్య వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రధానంగా పట్టణాలలో వినియోగం బలహీనపడటం, డిమాండ్ మందగించడం, చైనా నుంచి పెరిగిన చౌక దిగుమతులు తదితర అంశాల కారణంగా దేశీ కార్పొరేట్ల విస్తరణ ప్రణాళికలు పరిమితమైపోయినట్లు ఇక్రా చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కె.రవిచంద్రన్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment